PRAPASYAMTEE MAATA-5

ప్రపశ్యంతీ మాతా-05 ******************* భగత్వ-రమణత్వ-వమనత్వముల మేలు కలయికయే భైరవీమాత.కాంటి భగత్వము-సౌందర్యము రమణత్వము-శక్తివంత చలనము వమనత్వము.ఉదయిస్తున్న అనంత సూర్యుల కాంతి సమూహమును భైరవిగా కీర్తించవచ్చును.భ అనగా కాంతి,ర అనగా శబ్దము.తేజోపూరిత శబ్దమే భైరవి శక్తి.అఖండ మేధా శక్తి.అనంత ప్రాణ శక్తి.విశ్వ పరిణామములను నిర్దేశించే విశేష శక్తి యైన తల్లిని జాగృత కుండలిని అని కూడా అంటారు.కుండలినీ శక్తి తటస్థ స్వభావముతో మూలాధార చక్రములో నిదురిస్తుంటుందంతారు.ఆ నిద్ర మన నిద్ర వంటిది కాదు.పరిసర జ్ఞానమును విస్మరించిన అపరిణత దశ.సస్వరూపమును స్వశక్తిని గుర్తించలేని మందత్వము.ఆ మందత్వమును తోసివేసి తన వేడిచే-వెలుగుచే కుండలిని తన చుట్లు విప్పుకుని,పైపైకి ఎగబాకి పరమాత్మ తో పరిచయము చేసే శక్తి.అంతే కాదు తల్లి దుర్గ అను నామముతో రెండు విధములైన దుర్గములను మనకు చూపిస్తూ,దేనిని మనముండుటకు ఎంచుకోవాలో తెలియచేసే శక్తి.అరిషడ్వర్గమనే ఎత్తైన గోడలు గలిగి మనలను బంధించు దుర్గమునకు దూరముగా ఉండి అవ్యాజ కరుణ-ఆశ్రిత వాత్సల్యము-ఆనందాబ్ధి మొదలగు ఎత్తైన గోడలతో కట్టబడిన అమ్మ దయ అనే దుర్గమును ఆశ్రయించవలెనను విషయమును వివరించు మేథాశక్తి. స్థూలగా గమనిస్తే తల్లి తన తన సక్తిని చలింపచేస్తూ దారులలోని ముళ్ళను-కుళ్ళును తొలగిస్తూ తొలగిస్తూ పంచ తన్మాత్రలను సూక్ష్మ స్థితిలో-పంచభూతములను స్థూల స్థితిలో పరిచయము చేస్తూ,వాటిని కలిపే వంతెనయై ప్రకాశిస్తుంటుంది. నింగి నేలకు నెయ్యమును కలిగించి,మధ్యలో తారసపడు శత్రువులను ఏ ఆయుధములను ఉపయోగించక,తన వెలుగు అనే ఖడ్గము ద్వారా తొలగించివేస్తుంది. సూక్ష్మముగా పరిశీలిస్తే నేను నిదురిస్తున్నప్పుడు తైజసాత్మికగా,మెలకువగా నున్నప్పుడు జాగరిణిగా,స్వప్నావస్థలో నున్నప్పుడు స్వపంతీగా నున్న ప్రాణశక్తివి నీవేకదా తల్లి.నీ శక్తి అందించే వేడివెలుగులతో నా తటస్థతను తోసివేసి,పంచేంద్రియ పాటవమును పెంపొందించి సహస్రా ప్రయానమునకు సన్నద్ధుని చేస్తున్నావు.అంతే కాదు అంతర్-బహిర్ శత్రు నిర్మూలనకు బాహ్యములో నున్న ఆయుధముల అవసరము లేదని,వాక్చాతుర్యము-సమయస్పూర్తి-సాత్త్విక సాధన-సత్ప్రవర్తన అను వివిధ జ్ఞాన ఖడ్గములను మాకొసగి,ఉపాయములనందించుచు,నా ఉపాధిలో నున్న నిన్ను కనుగొని-అనుక్షణము ఆరాధించనీ. ధన్యోస్మి మాతా ధన్యోస్మి.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)