Friday, October 30, 2020

MEEDUSHTAMA SIVATAMA-03

 


 మీడుష్టమ శివతమ-03

 *********************


  " న రుద్రో రుద్రమర్చయేత్" రుద్రుడు కాని వాడు రుద్రును భజించలేడు.అని ఆర్యోక్తి. జీవుడు రుద్రుడు ఎలా అవుతాడు?అనే సందేహము మనకు రావచ్చును.సకలము వికలముగా మారుతున్నాప్పుడు విస్తృతరూపమును ప్రకటించుకొనునప్పుడు అందులోని చిన్న శకలమే జీవుడు.ఇది కాదనలేని నిజము .సాధకుడు రుద్రుని అనుగ్రహము వలన అన్నాదులను వాటి ఉపయోగములను తెలుసుకున్నాడు.తృప్తిచెదాడా వాటితో అని అంటేలేదనే చెప్పాలి.చ మే నాకు కావాలి.అది కావాలి-ఇది కావాలి-ఇంకా--ఇంకా అంటూ ఇబ్బంది పడుతున్నాడు.


 ముసిముసి నవ్వులతో ముక్కలను కదిలిస్తున్నాడు ముక్కంటి.మరింక నేను వెళ్ళిరానా అంటూ ముక్తాయింపు పలికాడు.


   ఆగవయ్యా ఆదిదేవా! అన్నీఅడుగు-అన్నీ అడుగు అంటూనే ఆలోచించుకోనీయక్యండా -అడుగనీయకుండా అయిపోయిందా అంటున్నావు.అమ్మో చమత్కారివే.


  ద్రవిణంచమే-యంతాచమే అని కద నీచమకము చెబుతున్నది.నన్ను ఉధ్ధరించగలుగు మంచి గురువును అనుగ్రహించు అన్నాడు సాధకుడు సాగిలపడుతూ.


  సరే అలాగే కానీ.గురువుద్వారా నీవు ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నావు అన్నాడు రుద్రుడు అమాయకముగా.


   సంవిచ్ఛమే శివా అనగానే అంటే,అదిగో మళ్ళీ అదేఅల్లరి అంటూ ఆనందముతో,


    వేదశాస్త్రముల విజ్ఞానమును పొందుతాను.పొందిన దానిని పదిమందికి పంచే శక్తి నాకు కావాలి అందుకే జ్ఞాత్రంచమే అది నువ్వేఇవ్వాలి.అంతే కాదు పదిమందికి చెప్పేందుకే నీతులు అని నేననిపించుకోకూడదు.నేను సత్ప్రవర్తనను కలిగియుండాలి కనుక సుగంచమే.


    ఆ ఆర్ష సంస్కారము చేత ప్రతి సుప్రభాతము సుదినముగా పరిణితిని పొందాలి అన్నాడు సాధకుడు భక్తిపారవశ్యముతో.అంతర్థానమయ్యాడు వాడినెదుట నున్నావాడు.


  అణువణువణువు శివమే-అడుగడుగు శివమే.


   సశేషం.


  సర్వం శివమయం జగం.


    

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...