Friday, October 30, 2020

AKALILEKUNDA

 


 మీడుష్టమ శివతమ-05

 **********************


 ఈశ్వరా నా ఈ ఆకలి నన్ను వివశుణ్ణిచేస్తున్నది.అడిగే లోపే అంతర్ధానమవుతావు.అన్నీ ఇచ్చాగా అంటావు.కనికరించు-కనిపించు వేడుకుంటున్నాడు సాధకుడు.వేదనను తీర్చకుండా ఉండగలడా వేదమయుడు.వచ్చేశాడు వరములను ఇచ్చేయాలని.


   స్వామి అక్షుతిశ్చమే-నాలోని ఆకలి లేకుండా పోవాలి.అది పోవాలంటే ,


 అక్షితిశ్చమే-కూయవాశ్చమే--- తరిగిపోని ధాన్యరాశులు నాకు కావాలి.అలాగా.అంటే ?అర్థము కానట్లు నటించడం-సాధకుని విజ్ఞతను పరీక్షించడము అదొక ఆట .


    నాకు ధాన్యము కావాలి.ఉండు-ఉండు ముందుగా నాకు ఏయే-ఏయే ధాన్యములు కావాలో చెబుతాను.వాటిని ప్రసాదించు అన్నాడు ఆర్తితో.అనుగ్రహిస్తానన్నాడు పరమాత్మ మనస్పూర్తితో.


  ఆకలిని తీర్చు వడ్లు-యవలు-మినుములు-శనగలు-పెసలు-నువ్వులు-గోధుమలు-నీవరి ధాన్యములు కావాలీనగానే చిరునవ్వు నవ్వాడు రుద్రుడు అందుకేగా నేనున్నది అంటూ.


   అంతలోనే ఆదుర్దా ఆ సాధకునికి.ఇదిగో నన్ను పూర్తిగా అడగనీ.తికమక పెట్టకు.ఇస్తానన్నా కదా అని అంతో-ఇంతో ఇచ్చి ఇచ్చేసాను అంటావేమో.నేను ససేమిరా ఒప్పుకోను.నేను ఎంతెంత కావాలో కూడా చెబుతాను అన్నాడు చాకచక్యముతో.


   సరే చెప్పు అన్నడు రుద్రుడు చనువుగా.


    విభుచమే-ప్రభుచమే-బహుచమే-పూర్ణంచమే-పూర్ణతరంచమే అంటూ నొక్కిచెబుతున్నాడు మక్కువతో.


   అధికమైనవిగా-కాదుకాదు అధికమంటే అధికము మాత్రమే కాదు-కొంచము అధికము-కాదుకాదు కొంచము అధికము మాత్రమేకాదు-మిక్కిలి అధికముగా.


  పరిణామమే ప్రమాణమా అన్నాడు పరమాత్మ ప్రసన్నముగా.ఆలోచనలో పడ్డాడు సాధకుడు.అసలీ అధికములు ఏమిటి? దానికి అంతమెక్కడ? అదిగో నన్ను అడుగుటకు సందేహములు-సంకోచములు ఎందుకు? ఇచ్చేందుకు నేను సిధ్ధముగానే ఉన్నాను కదా అంటూ సుతిమెత్తని స్వరము సూచనలను అందిస్తున్నది.


    అదే అదే ఈ సారి వివరముగా అడుగుతాను.పూర్ణముగా-పూర్ణ తరముగా లోటు అనేది అసలు లేకుండా అనుగ్రహించు. ఆ అనుగ్రహమే ఆకలిని తరిమివేస్తుంది అన్నాడు సాధకుడు డగ్గుత్తికతో కనులు మూసుకుంటూ.కదిలాడు కాలకాలుడు సాధకుని కరుణిస్తూ.


  కదిలేవికథలు-కదిలించేది కరుణ.


     సశేషము.


   సర్వం శివమయం జగం.


   ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...