Tuesday, February 9, 2021

tiruvembavay-03

    తిరువెంబాయ్-003

  ***************

 ముత్తన వెణ్ణకయ్యుం మున్వన్ దెదిర్
 అత్తనానందన్ అముదెన్రూరి

 తిత్తక్కన్ వేశువాయ్ వందు కడై తిరవాయ్
 వత్తుడి ఈర్ ఈశన్ వళవడియర్ పాంగుడయీ

 పుత్తడియోం ఉన్మైతీర్థు ఆట్కాండార్ పొల్లాదో
 ఎత్తోనిన్ అంబుడైమై ఎల్లోం అరియోమోం

 చిత్తం మళకియార్ పాడారో నం శివనే
 ఇత్తనయుం వేండుం ఎమక్కేలో రెంబావాయ్.


  ఓ సఖి,
 వెణ్-తెల్లని
 నకయ-పలువరుస కలిగినదాన
   ఎంతటి తెల్లదనము?
ముత్తన-ముత్యముల వంటి తెల్లని పలువరుస కలిగిన చెలి,నీవు,
 మున్-పూర్వమే/నిన్ననే
 వందు-వచ్చి,ఎదరెడియ-పరిహాసముగా
 మహాదేవుని గురించి,
 అత్తనన్-నా బంధువు,
 ఆనందన్-నా ఆనందము
 అముదము-నా జీవన అమృతము అంటు
 తిత్తిక్కన్-ఉత్తిత్తి మాతలను
  పేశవాయ్- చెప్పావు.
 కాని ఇంకా మేల్కాంచక నిద్రించుచున్నావు
 వందు-లేచి వచ్చి
 కడై-తలుపు గడియ
 తిరవాయ్-తెరువవమ్మా.
  ఆనగానే చమత్కారియై వారితో,
 నాన్ పుదుసు సివ భక్త,
 శివమహిమ తెరియాదు,కాని మీరు
 ఎత్తోనిన్-ఎప్పటినుండియో
 పాంగుడయా-స్వామి లీలా విశేషములను తెలిసినవారు
 ఎల్లోం-ఎన్నో/అన్ని స్వామి లీలలను 
 అరియామో-తెలిసినవారు
 కొండార్ పొల్లాదో-నన్ను మీతో కలుపుకొని శివనోమునకు తీసుకుని వెళ్లంది
 చిత్తం-మనస్సు
 అళకియార్-ఆహ్లాదమునొందగా
 శివనామమును-నం శివనే
 పాడారో-కీర్తిద్దాము
 ఇత్తనయుం-ఇప్పుడైన /ఇప్పుడే 
 వందు-వస్తున్నాను నోమునకు మీతో.

    
 
 



 ఓం ప్రణవాయ పోట్రి
 *********************
తిరు మాణిక్యవాచగర్ ఈ పాశురములో శుధ్ధసత్వగుణశోభితమైన తెల్లని ముత్యములవంటి పలువరుసతో ప్రకాశిస్తూ,నిరంతరము నీలకంఠుని పంచాక్షరి ప్రణవమును జపిస్తూ,అంతర్ముఖియైన ఒక పడుచు తన తోటి వారితో ముందుగానే మునుపటి రోజున తాను వేకువనే మేల్కాంచి,నోమునకు వారిని కూడుటకు సిధ్ధముగా ఉంటానని మాట ఇచ్చినది కాని దానిని లెక్కచేయక ఇంకా నిద్రించుచునే యున్నది.


 వారి మాటలు విని పొరబాటయినది.నేను ఇప్పుడేఇప్పుడే స్వామికి సమర్పణభావనమును పొందుచున్నదానినికద.

 మీ భాగ్యవశమున దశ సుగుణ సమన్వతిలైన మీరు ఎప్పటి నుండియో పరమేశ్వర కైంకర్య భావనలో మునిగియున్నావారు.నన్ను మందలించి,మహదేవుని నోమునకు మీతో కలుపుకొనగలవారు.

 ఇదిగో ఇప్పుడే వస్తున్నా నోమునకు అంటు వారిని అనుసరించినది.

అంబే శివ తిరువడిగలే శరణం.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...