Tuesday, February 9, 2021

TIRUVEMBAVAY-04


 


తిరువెంబావాయ్-04

 *****************


 ఒణ్ణిత్తల నగయాం ఇన్నం పులదిండ్రో

 వణ్ణిన్ కిళి మొళియార్ ఎల్లోరం వందారో


 ఎన్నికోం ఉళ్ళవా చుళ్ళుకోం అవ్వళున్

 కన్నై తుయిన్ రవమేకాలత్తైనపోక్కాదే


 విణ్ణుకొరు మరుందై వేదవిదు పొరుళై

 కణ్ణుక్ కినియానై పాడి కసిం ఊళ్ళం

 

 ఉళ్ళెక్రు నిన్రుగ యామాట్టోం నీయే వందు

 ఎన్ని కురైయిల్ తుయిలేరో ఎంబావాయ్


   ఓం వేదవేద్యాయ పోట్రి

   ***********************


 వేదవేద్యాయ పోట్రి

 ***************


  ఈ పాశురములో తిరుమాణీక్యవాచగరు అంతర్ముఖి యైన రమణిని బహిర్ముఖియై తమకు పంచేంద్రియ స్పర్శ సౌభాగ్యమును అందించమని ప్రార్థిస్తున్నారు.ఇది ఆంతర్యము.


 బాహ్యములో ఆమె నిదురను ఆక్షేపిస్తున్నారు.చెలి నీవు,

 

ఒణ్ణిత్తల నగయా-అపురూప సద్గుణ ఆభరములు ధరించినదానివి.మా అందరికి ఆదిదేవుని అనుగ్రహమును అందించకలదానివి.


అటివంటి నీవు 

ఇన్నం-ఇటువంటి

పులదిండ్రో-జాప్యము (వ్రతమునకు పోవుటకు) అనగానే లోపలనున్న చెలి

 కన్నులు తెరువకుండానే(బహిర్ముఖము కాకుండానే)


 కణ్నితుయిన్రు-కన్నులు మూసుకొనియే అడుగువ్హున్నది./ప్రశ్నించుచున్నది.ఏమని?

ఎల్లోరం వందారో? మీరందరు వచ్చారా?


 వస్తే కనుక మీరే మీ గురించి చెబితే నేను లోపల నుండి లెక్కబqడతాను అనగానే చొళ్ళుక్కో అవ్వరుళన్-మీ గురించి చెప్పుతుండండి.నేను లెక్కబెడతాను అనగానే,


 ఆ కొంచము సేపు అంతర్ముఖత్వమును ఆస్వాదించాలనుకోవటము ఆంతర్యము.కొంచము నిద్రించవలెననుకోవటము బాహ్యము.


 బాహ్యమునున్న వారిని వణ్ణిక్కిళై అని సంబోధించినది.


 వారు బాహ్యమునకు మాత్రమే పంచవన్నెల చిలుకలా? కాదు కాదు.

పంచేంద్రియములను పరమార్థమును అర్థముచేసుకొనుచున్న వారు.లోపల నున్న చూపు(కరుణ) పలుకు (అనుగ్రహము) స్పర్శ (పునీతము) కావలెనని ఆశతో నున్నవారు.

అమ్మా! 

తుయిలేరో-ఏమిటమ్మ ఈ వింత నిద్ర చాలించి,

నీయే వందు-నీవే బయటకు వచ్చి,

మెలకువతో (బహిర్ముఖియై) మమ్ములను లెక్కించవమ్మా.అప్పుడు అందరము కలిసి వేదవిదుని ఆర్ద్రత నిండిన హృదయముతో (కసి ఉళ్లం) సంకీర్తించుదాము.


   పరమాత్మ మన చేయిని తాను పట్టుకోవాలికాని మనము ఆయన అనుమతిలేక పొందలేము.కనుక చెలి,

 నీయే వందు-నీవే వచ్చి,మా అందరికి నీ పంచేంద్రి స్పర్శ సౌభాగ్యమును అనుగ్రహించి శివానుగ్రపాత్రులుగా సివనోమునకు రావమా.


 అంబే శివే తిరువడిగళే శరణం.



 



    

 

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...