Monday, November 29, 2021
PUGAL CHOLA NAYANAR
పుగల్ చోళ నాయనార్
********************
కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిం బొందరే
వారేరీ సిరిమూటకట్టుకుని బోవంజాలిరే భూమిపై
పేరైనం గలదే శిబి ప్రముఖులుం ప్రీతిన్ యశః కాములై
ఈరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా
పోతనామాత్యుడు
పుగల్ -ప్రభువు/పెంపొందించు స్వభావము కలవాడు.
చోలన్-చోలరాజ్యమ్ను పెంపొందించి/పాలించు స్వభావము కలవాడు.
సమర్థవంత రాజ్యపాలన వృత్తి.
సదాశివార్చన ప్రవృత్తి.
ఎరిపత్త నాయనారు అభిరామి ఆండారును పై దూకి,నెట్టి,కిందపడవేసినందుకు వచ్చి,క్షమాపణలను చెప్పిన రాజుగా భావిస్తారు.
ఉరైయూరును రాజధానిగా చేసుకుని,ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ,పశుపతీశ్వరుని సేవిస్తూ
పరమానందముగా కాలమును గడుపుచున్నవేళ,
తలపున యైనను శివభక్తులకు చెడును తలపెట్టని నాయనారుకు విషమ పరీక్షను పెట్టదలచాడు.
" పరమం పవిత్రం సాంబం విభూతిం
పరమ విచిత్రం లీలా విభూతిం
పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదానం
సాంబం విభూతిం ఇదమాశ్రయామి.
విభూతి అనగా ఐశ్వర్యము/మహిమ/కరుణ అను అర్థమును కనుక మనము భావించుకుంటే,"
వి-విశేషమైన-భూతి/బూది-అనుగ్రహమును ఉపకరనముగా మలచుకున్నాడు.
రుద్రాక్షమాలను జతచేసాడు.
నాయనారులోని రాజ్య విస్తరణ కాంక్షకు మరింత పెంచాడు రాజధర్మము అనుసరణీయము అంటూ.
ఒకరాజుకు కప్పము మీది ఆసక్తి/మరొక రాజుకు కప్పమును కట్టలేని స్థితి.
మెప్పుకోలుగా కప్పము అపరాధమును తప్పించుకోనీయకుండా చేసినది.
సామంతుడైన వాసల్ పై తన సేనను కట్టుదిట్టముగా ముట్టడించమని ఉత్తరువులు జారీచేయించింది.
ఏ మాత్రము అందులోని పరమార్థమును గ్రహించలేని మనసు,
చేతులారంగ శివపూజ చేయడేని
మోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యము లోనుగా తలపడేని,
అనుకుంటూ,పరమేశ్వరార్చనతో పరవశించి పోతున్నాడు.
అదే సమయమని భావించినట్లున్నాడు ఆదిదేవుడు,
జయము జయము మహారాజా,దిగ్విజయము అంటూ లోని ప్రవేశించాడు.
శత్రుశేషము లేకుండా చేసామన్నాడు.
అంతటితో సంభాషణము ఆగితే కథ మరొకలా ఉండేది.
జరుగవలసిన సన్నివేశమునకై జంగమదేవర సన్నధ్ధపడుతున్నాడు,వచ్చినవానిని పెడుతున్నాడు.
మహారాజా! మీకు మేమొక కానుకను సమర్పించదలచాము అంటూ,
ఒక విశాలమైన పళ్ళెములో శత్రుశిరమునుంచి తీసుకుని వచ్చాడు.
పరమ తేజోమయమై నుదుటను విబూది పుండ్రములతో,మెడలో రుద్రాక్ష మాలలతో అతి ప్రశాంతతను దశదిశలా వ్యాప్తిచేస్తున్నది.
శివునకు-శివభక్తునకు భేదము లేదను భావించు మహారాజు మతిపోయినది.
ఏమిటి ఈ విషమ పరీక్ష?
శివపదారాధనము ఒకవైపు
శివ శిరోఖండనము మరొకవైపు
నన్ను చూడు అంటే,నన్ను చూడమని ఒకటే పోరు పెడుతున్నవి.
ఒక వైపు అర్చన/మరొక వైపు దండన
పాపము-పుణ్యము పరిహసించసాగాయి పుగల్చోళను.
ప్రాయశ్చిత్తము కనుమరుగైనది స్వామి ఆనగా.
నిర్ఘాంతపోయాడు.
చేకొనుమాశిరము
నా పాపమును బాపగ గైకొనుమా శిరము
ముల్లును ముల్లుతో తీయునట్లు
శీరమునకు శిరమును అర్పించుటయే
తన పాపమునకు నిష్కృతి అనుకునేలా చేసాదు నాయనారును నీలకంఠుడు.
జాతవేదుని జాణతనము పళ్లెముగా మారినది.
వైశ్వానరుని పరీక్షగా అగ్నికుండము సిధ్ధమైనది సహకరిస్తూ
ఖండించిన శిరమును శిరోధార్యముగా భావిస్తూ,అగ్నికి ఆ శిరముతో జతగా తనశిరమును సమర్పించుటకు సిధ్ధమయి అగ్నికుండమునకు ప్రదక్షిణమును ప్రారంభించాదు.
దాక్షిణ్యపూరితుడు భక్త రక్షణాతత్పరుడు ప్రత్యక్షమయ్యాడు.కైవల్యమును ఇద్దరికి ప్రసాదించాడు.
పుగల్ చోలను కటాక్షించిన సదాశివుడు మనలనందరిని అనిశమురక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment