Monday, November 22, 2021

VIRALMINDA NAYANAR

నాలోన శివుడు గలడు-నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకంబులేల గలడు కోరితే శోకంబు బాపగలడు." చిదానందరూపా- విరాల్మిండ నాయనారు ************************************** "బాల్యే దుఃఖాతిరేకో మలలులితవపుః స్తన్యపానే పిపాసా నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి నానారోగాదిదుఃఖాద్రుదనపరవశః శంకరం న స్మరామి క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో" చిదానందరూపా-విరాల్మిండు నాయనారు ************************************ కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా అతియారులు అతిశయ ఆరాధ్యులనుచు కొలుచును విరాల్మిండు శివభక్తుల సేవయే శివార్చన అనుచు ఆనందించుచు నుండు కూరిమి సేవింప శివుని తిరువారూరుకి తీర్థయాత్ర వెడలె నేరుగ చను సుందరారు తీరుకు కోపించి పలికె శివభక్తుల చేరనీక సుందరు చేసినది శివాపరాధమనె దానిని మన్నించిన ఆ శివుడు కూడ దోషి అని నిందించె తిరువూరారుకు రానని తీర్మానించుకొనియె,త్యాగరాజును తరుముచు తిరిగి ప్రవేశించెనాయె, మహేశుని పొందుటకు మాట తప్పుట కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక . నేను-నాది అను భావాలను అధిగమించిన (వాడు ) విరాల్ మిండ నాయనారు భగవంతుని సేవకన్న భక్తుల సేవకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవాడు.శివభక్తులకు గౌరవములేనిచోట క్షణకాలమైనను ఉండుటకు ఇష్టపడడు ఏ విధముగా శ్రీరామునికన్నా రామనామమహిమ గొప్పతనము శ్రీ రామాంజనేయ యుద్ధము ద్వారా ప్రకటింపబడినది కదా! ,విరాల్మిండ భక్తిలో సాత్వికతను దాచివేసి రౌద్రము తన ముద్రతో రుద్రుని మెప్పించింది.శివ భక్తులను సాక్షాత్ శివ స్వరూపముగా భావించి,వారిని గౌరవించుటలో చిన్న నిర్లక్ష్యమును కూడ సహించలేని విలక్షణుడు విరాల్మిండ నాయనారు.శివుని వ్యహారములు పాప పరిహారములో-పావన తారకములో తెలియాలంతే చర్మచక్షువులతో కథలుగా కాక,మనసులోతునుంచి వాని తత్త్వమును అర్థముచేసుకొనుటకు మనము ప్రయత్నించాలి కదా!సుందరారు తేవారములను సుమధురములుగా మనకు అందించాలనుకొన్నాడు ఆ సుందరేశ్వరుడు.నేరుగా అడిగేకన్నా,నేర్పుగా అందించాలని పరీక్షగా.. ఒకనాడు సుందరారు, శివభక్తులను నిర్లక్ష్యము చేసి( తిరివారూరులోని) సరాసరి శివ దర్శనమును చేసుకొనునట్లు చేసి,అదిచూసి ఇసుమంతయు తాళలేని విరాల్మిండ అతనిని దూషించి, శివ భక్తుల పట్ల చేసిన అపరాధము (వారిని గౌరవించక-ప్రథమ దర్శనము చేయనీయక,శంకరుని చదరంగపు [పావుయైన సుందరారు)భక్తునితోపాటు భగవంతుని కూడా వెలివేస్తున్నానన్నాడు. "ఆట కదరా శివా! ఆట కద నీకిది అమ్మ తోడు".పావులు కదిలాయి.పావన తేవారములు ప్రకటింపబడినాయి. తప్పు తెలిసికొనిన సుందరారు తాను శివభక్తుల సేవకుడనని "తేవారముల"తో కీర్తించి విరాల్ నాయనారును శాంతపరిచాడు.శివ సంకల్పముచే తన ప్రతినను మరచి,తప్పుచేసిన వారిని తరుముతు తిరిగి ప్రవేశించిన విరాల్మిండ నాయనారును రక్షించినట్లు ఆ పరమేశ్వరుడు మనలను రక్షించును గాక. ( ఏక బిల్వం శివార్పణం.)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...