Wednesday, December 15, 2021
TIRU VEMBAVAY INTRODUCTION
[08:24, 15/12/2021] Vimala: భగవత్ బంధువులారా!
మన శరీరము పంచేంద్రియములకు ప్రతీక."ధనుస్సు" అనే పదమునకు శరీరము అనే అర్థమును కూడ పెద్దలు నిర్వచించారు కదా.మన మనస్సు శరముతో పోల్చబడినది."పరమాత్మ అనుగ్రహము" అను గురి చూస్తు,మన శరీరమును ధనువులా సారించి,మనసు అనే బాణముతో,సర్వస్య శరణాగతి అను విలు విద్యను ఉపయోగించి,పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులమగుటయే "ధనుర్మాసము" అని ఆర్యోక్తి.
ధన్యతనందించే ధనుర్మాస వైభవమును మనసా,వచసా,కర్మణా స్తుతించి,ఆచరించి,దర్శించి కృతకృత్యులైన మహాను భావులు ఎందరో
.
" అందరికి వందనములు."
మంద బుద్ధినైన నాపై అమ్మ కృపాకటాక్షము ప్రసరించినదేమో తెలియదు కాని,పదిమందితో పంచుకోవాలనే పరమార్థ తత్వమును, "నా" అనబడే ఈ జీవిలో ప్రవేశింప చేసి,
" నీ పాదము పట్టి నిల్చెదను
పక్కనె నీవు ప్రస్తుతి వ్రాయుమా" అనిప్రార్థించగానే తానే పలికినది.
తిరు ఎం పావై
*****
తిరు-శ్రీకరము-శుభకరము-పవిత్రము-ప్రపన్న ప్రసన్నము-పరమార్థ ప్రదాయకము ఇలా ఎన్నెన్నో అర్థములను పెద్దలు సమన్వయపరిచినారు.
పావై -పాహిమాం-వ్రతము-అనుసరణీయము-అవ్యాజ అనుగ్రహము-అసమాన అదృష్టము-పరమము-పరమార్థము ఇలా ఎన్నెన్నో విధములుగా పెద్దలు సమన్వయపరిచినారు.
అయితే మనకు ఇక్కడ ఒక చిన్న సందేహము వస్తుంది.ఈ పావై/వ్రతములో ఆరాధ్యనీయమైనది ఏది? అది సాకారమా? నిరాకారమా? సగుణమా? నిర్గుణమా? నామ రూప సాధ్యమా? అసాధ్యమా? కాల పరిమితి కలదా?లేనిదా? ఆ చిత్-శక్తి స్తోత్రములు పరిమితములా? అపరిమితములా? అంటూ ఎన్నెన్నో సందేహములు మన మనసులో తారాడుతుంటాయి.
తిరుమాణిక్య వాచగరు చే ఆలాపింపబడి-ఆదిదేవునిచే వ్రాయబడిన తమిళవేదమైన "తిరు వాచగము" తిరు శివ పావై అని గాని /తిరు శంకర పావై అని గాని/తిరు సాంబ పావై అని గాని పేరు పెట్టవచ్చును.కాని ఎం అని ప్రశంసించేటట్లు ఎం అను చిద్రూప సామీప్య-సాంగత్య-సారూప-సాయుజ్యమునందుటకు ఏక హృదయమైన అనేక నామరూపములు ఒక చోట చేరి,ఒక్కటే ఒక్కటైన బృహత్తును సంకీర్తనమార్గములో స్వానుభవముతో సాక్షాత్కరింపచేస్తున్నది.
తిరు పావైలోని గోపికలను
కాని,తిరు ఎంబావైలోని కన్యలని గాని మనము సామాన్యముగా భావించే స్త్రీమూర్తులుగా భావించి,ఈ వ్రతము ఏవలము స్త్రీలకు మాత్రమే సంబంధించినదనుకుంటే మనము పొరబడినట్లే.
పరమాత్మ యొక్కడే పురుషుడు తక్కిన జీవులన్నియును పరమాత్మచే రక్షింపబడుచున్న స్త్రీమూర్తులే.ఇదే విషయమును మనకు మణిద్వీప ప్రవేశము చేసిన వెంటనే త్రిమూర్తులు స్త్రీమూర్తులుగా మార్పుచెందిన విషయము స్పష్టము చేస్తుంది.
తిరు వ్రతములలో గల ఇంకొక ప్రత్యేకత సామూహిక సంకీర్తన తనతో పాటుగా తనచుట్టు ఉన్నవారిని కూడా తరింపచేస్తుంది.
సామాన్యులకు అవగాహన కల్పించుటకై సంకేతములను సామాన్య స్త్రీరూపములుగా మలచి,వారి ప్రవర్తనము/సంభాషణములద్వారా ఒక్కొక్క స్థాయిని దాటి,మనము ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చే సోపానములుగా మనకు అందిస్తున్నది.
నిజమునకు ఈ వ్రతము ప్రాముఖ్యతను వారిద్వారా మనకు తెలియచేసే ఉద్దేశము మనలను భవసాగరము నుండి ఉధ్ధరించుటయే తక్క అన్యము కాదు..ఇందులో మనము ప్రేక్షకులము కాదు/శ్రోతలము అంతకన్నా కాదు.ఇందులోని ప్రతి సందేశము మనలను సంస్కరించుటకు,మలకు సాలోక్య-సాయుజ్యము ప్రసాదించుటకు సహాయకారులు.
తమిళవేదమైన "తిరువాచగము"లోని ఏడవప్రకరణములోని 20 పాశురములు మరియును "తిరుపళ్ళి ఎళుచ్చి" లోని పది పరమాద్భుత స్తోత్రములు మహదేవుని అనుగ్రహప్రదమైన మార్గళి వ్రతమును సుసంపన్నము చేయుచున్నవి.మునుపు ఎందరో ఆచరించినారు.ప్రస్తుతము ఆచరిస్తున్నారు.భవిష్యత్తులో కూడ ఆచరిస్తారు.
దీనిలో వ్రతముచేయుచున్నవారును పరమహంసలే.మన కొరకు తాము పరస్పర సంభాషణములను చేస్తు-పరమాత్మ పరమదయతో ప్రకటితమైన పలురూపములను ప్రస్తుతిస్తు-ఒక ప్రదేశములో మెట్ల స్వరూపముగావేరొక చోట లింగ స్వరూపముగా-మరొక చోట ఆకాశ/నాట్య స్వరూపముగా ,నామ రూపములు మాత్రమే కాదు/నానా రూపములు
వేద స్వరూపము
జ్యోతి స్వరూపము
లింగ స్వరూపము
శూలి స్వరూపము
కొలను స్వరూపము
కమల స్వరూపము
కలువ స్వరూపము
భ్రమర స్వరూపము ఇలా తెలియచేస్తు, అంతర్ముఖులై కొందరు,ఆరాధనములతో కొందరు,సంకీర్తనముతో మరికొందరు,సాహచర్యములో ఇంకొందరు, ఒకరినొకరు మేలుకొలుకుంటూ,తమతో కలుపుకుని,వ్రతమునకు ఉద్య్క్య్తులగుట బాహ్యము.
కాని కొంచము నిశితముగా ఆలోచిస్తే మనలో నున్న అజ్ఞానము కూడా బహుముఖములుగా బట్తబయలవుతుంటుంది.
అది భావన కావచ్చును,భాష కావచ్చును,హావభావములు కావచ్చును ఇలా ఎన్నెన్నో విధములుగా కమ్ముకునియున్న తమో నిద్రను తరిమివేసే తరుణోపాయము,
తిరుమాణిక్యవాచగరు అందించిన తిరువెంబావాయ్ అను నావలో కూర్చుని,స్వామి అనుగ్రహమనే కొలనులో పుక్కి/మునకలు వేస్తూ,అందరము తరించుదాము.తరలి రండి..
.
సభక్తిపూర్వక వణక్కంగళ్/నమస్కారములతో.
తిరు చిట్రంబలం పోట్రి
మిత్రులారా! ు,స్వామి అనుగ్రహముగా అల్లబడుచున్న ఈ పాశురముల మాలలో నా అహంకారము ఎన్నో ముళ్ళను చేర్చుటకు ప్రయత్నిస్తూనే ఉంటుంది.దానికి తోడు తమిళము నా తాయ్ మొళి/మాతృభాష కాకపోవుటచే నా అజ్ఞానము కూడా అహంకారమునకు తనవంతు సహాయము చేస్తూనే ఉంటుంది.కనుక పెద్ద మనసుతో నా ఈ దుస్సాహసమును మన్నించి,మాలను సవరించి,నన్ను ఆశీర్వదించగలరు.
సవినయ నమస్కారములు.
🙇♀️
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment