Friday, April 15, 2022

DIFFERENCE BETWEEN GHA-JHA,


 gha-jha hallulu
 ************
 ka varga renDava aksharamu gha,cha varga naalgava aksharamaina jha yadhaalaapamugaa choostae okaTigaanae kanipistoo,anipistumTaayi.kaani niSitamugaa pariSeelistae vaaTi nirmaaNamuloenunna remDu vishayamulu vaani Akaaramunu bhaavamunu pratyaekistoo padamulaloe prayoegimpabaDutunnaayi.
1) modaTi vibhinnata gha aksharamupai nunna talakaTTu viDigaa umTumdi.kaani jha aksharamupai nunna talakaTTu sunnanu kalisi/viDigaa kaakunDaa umTumdi.
2) gha aksharamu-jha aksharamu oka chinnageetanu tamakimda kaligiyunnappaTikini gha A geetanu sunna+kommu madhyagaa numDunu.jha sunnanu+kommu madhyanu kaaka remDu kommula madhya  kanabaDutumTumdi.
 roopamuloenae kaadu bhaavamunu telupuTaloenu vaeTikavae mukhyapaatranu poeshistaayi.
 konni gha prathamaaksharamugaa gala padamulanu gamaniddaamu.
 ghanamu,gharmajalamu,ghaTamu,gharshaNa,ghaToetkachuDu,ghanata,aghamu,maaghamu,jaghanamu,Slaaghaneeyamu,ghanaaghanamu,laaghavamu,ghanakaaryamu....
 jhashamu,jhari,jhaNitamu,.....
 veeTi arthamulanu gamistae chadivaeTappuDu,vraasaeTappuDu samdaehamu laekunDaa spaTata kaligiyumTaamu.
  thanks.marikonni padamulau chaerchuTaku prayatnimchanDi.

 ఘ-ఝ హల్లులు
 ************
 క వర్గ రెండవ అక్షరము ఘ,చ వర్గ నాల్గవ అక్షరమైన ఝ యధాలాపముగా చూస్తే ఒకటిగానే కనిపిస్తూ,అనిపిస్తుంటాయి.కాని నిశితముగా పరిశీలిస్తే వాటి నిర్మాణములోనున్న రెండు విషయములు వాని ఆకారమును భావమును ప్రత్యేకిస్తూ పదములలో ప్రయోగింపబడుతున్నాయి.
1) మొదటి విభిన్నత ఘ అక్షరముపై నున్న తలకట్టు విడిగా ఉంటుంది.కాని ఝ అక్షరముపై నున్న తలకట్టు సున్నను కలిసి/విడిగా కాకుండా ఉంటుంది.
2) ఘ అక్షరము-ఝ అక్షరము ఒక చిన్నగీతను తమకింద కలిగియున్నప్పటికిని ఘ ఆ గీతను సున్న+కొమ్ము మధ్యగా నుండును.ఝ సున్నను+కొమ్ము మధ్యను కాక రెండు కొమ్ముల మధ్య  కనబడుతుంటుంది.
 రూపములోనే కాదు భావమును తెలుపుటలోను వేటికవే ముఖ్యపాత్రను పోషిస్తాయి.
 కొన్ని ఘ ప్రథమాక్షరముగా గల పదములను గమనిద్దాము.
 ఘనము,ఘర్మజలము,ఘటము,ఘర్షణ,ఘటోత్కచుడు,ఘనత,అఘము,మాఘము,జఘనము,శ్లాఘనీయము,ఘనాఘనము,లాఘవము,ఘనకార్యము....
 ఝషము,ఝరి,ఝణితము,.....
 వీటి అర్థములను గమిస్తే చదివేటప్పుడు,వ్రాసేటప్పుడు సందేహము లేకుండా స్పటత కలిగియుంటాము.
  థంక్స్.మరికొన్ని పదములౌ చేర్చుటకు ప్రయత్నించండి.

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...