Tuesday, April 26, 2022

UNITY IN DIVERSITY OF TELUGUWORDS.


 telugupadamula kaliviDi
 *******************
 telugupadamulu velugupadamulu.okapadamu tanaku taanu samarthavamtamai bhaavamunu spashTamugaateliyachaestunnappaTikini,marikonni aksharamulanu kalupukoni,kotta arthamugaa maelukalayikai alaraarutumTumdi.tallee nee biDDanai taritimchanee nannu.
 Seershika loeni kaliviDi anae padamuloeni chivari remDu aksharamulu viDi anu kalisilaemu/viDiviDigaa unnaamu anna arthamunu soochistunnappaTikini,kali anae remDu aksharamulanu kalupukoni daaniki virudhdhabhaavamaina aikamatyamunu soochistunnaayi.emtaTi pada chamatkaaramoe.

 తెలుగుపదముల కలివిడి
 *******************
 తెలుగుపదములు వెలుగుపదములు.ఒకపదము తనకు తాను సమర్థవంతమై భావమును స్పష్టముగాతెలియచేస్తున్నప్పటికిని,మరికొన్ని అక్షరములను కలుపుకొని,కొత్త అర్థముగా మేలుకలయికై అలరారుతుంటుంది.తల్లీ నీ బిడ్డనై తరితించనీ నన్ను.
 శీర్షిక లోని కలివిడి అనే పదములోని చివరి రెండు అక్షరములు విడి అను కలిసిలేము/విడివిడిగా ఉన్నాము అన్న అర్థమును సూచిస్తున్నప్పటికిని,కలి అనే రెండు అక్షరములను కలుపుకొని దానికి విరుధ్ధభావమైన ఐకమత్యమును సూచిస్తున్నాయి.ఎంతటి పద చమత్కారమో.

 marikonni padamulanu pariSeeliddaamu.
 *********************
 1.haaram-golusu,maala
   haaram anu padamu vyava anu remDu aksharamulanu tanamumdu chaerchukuni
 vyavahaaramu-chaestunna panigaa maaripoeyimdi.haaram anae padamu tana mumdaTi arthamunu koelpoeyi kotta arthamunu ichchaemduku sidhdhamayimdi.
 2.paalu-mana sampoorNa poeshaka Ahaaramu.
 paalu anna padamu tana mumdu vinna anu remDu aksharamulanu kalupukoni tana arthamunu maarchukonuTaku sidhdhamayimdi.
 vinnapaalu anna kottaSabDamu vinatulu padaepadae aDuguTanu teliyachaesae padamayimdi.
 ippuDu unnapadamu yokka athamunu
** telusukumToo,daaniloe daagina padamunu-daani arthamunu telusukunae prayatnamunu chaeddaamu.
 udadhi-samudramu.
 I padamuloeni modaTi achchu ayina u ni padamunumDi tolagimchi dadhi anna remDaksharamula padamunu grahistae perugu anna kotta arthamunichchae padamu ErpaDutumdi.
2.samdaehamu -anumaanamu
 sam annamodaTi aksharamunu tolagistae,
 daehamu-Sareeramugaa maarutumdi.
3.kimdanunna padamulaloe daagina padamulanu-vaaTi arthamulanu telusukumdaamu.
1.vichakshaNam
2.kaapuram
3.paataaLam.
  renDava padamuloeni pratyaekatanu gamanimchaaraa?
 kaapu-raitu-puram-paTTaNamu
 kaapuramu-kuTumbam
  paadanamaskaaramammaa padapaarijaatamaa.
 marikonnimTini jatachaeyamDi.
 dhanyavaadamulu.

 మరికొన్ని పదములను పరిశీలిద్దాము.
 *********************
 1.హారం-గొలుసు,మాల
   హారం అను పదము వ్యవ అను రెండు అక్షరములను తనముందు చేర్చుకుని
 వ్యవహారము-చేస్తున్న పనిగా మారిపోయింది.హారం అనే పదము తన ముందటి అర్థమును కోల్పోయి కొత్త అర్థమును ఇచ్చేందుకు సిధ్ధమయింది.
 2.పాలు-మన సంపూర్ణ పోషక ఆహారము.
 పాలు అన్న పదము తన ముందు విన్న అను రెండు అక్షరములను కలుపుకొని తన అర్థమును మార్చుకొనుటకు సిధ్ధమయింది.
 విన్నపాలు అన్న కొత్తశబ్డము వినతులు పదేపదే అడుగుటను తెలియచేసే పదమయింది.
 ఇప్పుడు ఉన్నపదము యొక్క అథమును
** తెలుసుకుంటూ,దానిలో దాగిన పదమును-దాని అర్థమును తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.
 ఉదధి-సముద్రము.
 ఈ పదములోని మొదటి అచ్చు అయిన ఉ ని పదమునుండి తొలగించి దధి అన్న రెండక్షరముల పదమును గ్రహిస్తే పెరుగు అన్న కొత్త అర్థమునిచ్చే పదము ఏర్పడుతుంది.
2.సందేహము -అనుమానము
 సం అన్నమొదటి అక్షరమును తొలగిస్తే,
 దేహము-శరీరముగా మారుతుంది.
3.కిందనున్న పదములలో దాగిన పదములను-వాటి అర్థములను తెలుసుకుందాము.
1.విచక్షణం
2.కాపురం
3.పాతాళం.
  రెండవ పదములోని ప్రత్యేకతను గమనించారా?
 కాపు-రైతు-పురం-పట్టణము
 కాపురము-కుటుంబం
  పాదనమస్కారమమ్మా పదపారిజాతమా.
 మరికొన్నింటిని జతచేయండి.
 ధన్యవాదములు.
 
 

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...