Tuesday, April 26, 2022

WHERE IS SCHOOL?


 Edi naa baDi?
 ***********
 buDugu seegaanapasoonaamba okasaari ilaa maaTlaaDukumTunnaaraTa.
 nannu baDiki pampistaamamTunnaaru.asalu baDi amtae EmiToe akkaDaku emduku pampistaamamTunnaaroe kanukkoevaali anukunnaadaTa buDugu.
 seegaana navvutoo naaku chaalaa baDula paerlu telusu.vinukoe annadaTa.
1.monna raamayya naannatoe vyaapaarampai raabaDilaedu annaaDaTa.
 amTae raamayya veLLina choeTa baDilaedannamaaTa annaaDu buDugu.
  naenu vinnaanu bheemuDu raakshasuDu talabaDinaaraTa abagaamae
 kaani vaaLLu porabaDinaaraemoe baDi daari.emdukoe kusteepaDutunnaaru annadi seegaana tana chakraallaamTi kaLLani tipputoo.
 vaari bomma kanabaDinadi.arupu vinabaDinadi A roeju.
 avunu avunu anukumTumDagaanae chorabaDi vachchaaDu buDugu snaehituDu.meeraa evaroe anukuni porabaDinaanu amToo.mugguru eguruchunna koetipillanu choostoo pagalabaDi navvukumTunnaaru.imtaloe amma piluvagaanae taDabaDi vatunnaamamToo veLLipoeyaaru.ammapraematoe muDipaDiyunna vaari Anamdamu ammakathalu vaari vijnaanapu peTTubaDigaa vijayapathamutoe muDipaDina mahaneeyamaina manabaDivaipunaku padapadamannaayi.
  baadhyatalanu teliyachaedi-bhavitanu teerchididdukunaedi baDi.
 avunamTaaraa/kaadamTaaraa
   dhanyavaadamulu. 

 ఏది నా బడి?
 ***********
 బుడుగు సీగానపసూనాంబ ఒకసారి ఇలా మాట్లాడుకుంటున్నారట.
 నన్ను బడికి పంపిస్తామంటున్నారు.అసలు బడి అంతే ఏమిటో అక్కడకు ఎందుకు పంపిస్తామంటున్నారో కనుక్కోవాలి అనుకున్నాదట బుడుగు.
 సీగాన నవ్వుతూ నాకు చాలా బడుల పేర్లు తెలుసు.వినుకో అన్నదట.
1.మొన్న రామయ్య నాన్నతో వ్యాపారంపై రాబడిలేదు అన్నాడట.
 అంటే రామయ్య వెళ్ళిన చోట బడిలేదన్నమాట అన్నాడు బుడుగు.
  నేను విన్నాను భీముడు రాక్షసుడు తలబడినారట అబగామే
 కాని వాళ్ళు పొరబడినారేమో బడి దారి.ఎందుకో కుస్తీపడుతున్నారు అన్నది సీగాన తన చక్రాల్లాంటి కళ్ళని తిప్పుతూ.
 వారి బొమ్మ కనబడినది.అరుపు వినబడినది ఆ రోజు.
 అవును అవును అనుకుంటుండగానే చొరబడి వచ్చాడు బుడుగు స్నేహితుడు.మీరా ఎవరో అనుకుని పొరబడినాను అంటూ.ముగ్గురు ఎగురుచున్న కోతిపిల్లను చూస్తూ పగలబడి నవ్వుకుంటున్నారు.ఇంతలో అమ్మ పిలువగానే తడబడి వతున్నామంటూ వెళ్ళిపోయారు.అమ్మప్రేమతో ముడిపడియున్న వారి ఆనందము అమ్మకథలు వారి విజ్ఞానపు పెట్టుబడిగా విజయపథముతో ముడిపడిన మహనీయమైన మనబడివైపునకు పదపదమన్నాయి.
  బాధ్యతలను తెలియచేది-భవితను తీర్చిదిద్దుకునేది బడి.
 అవునంటారా/కాదంటారా
   ధన్యవాదములు. 

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...