Friday, May 6, 2022

మాతృదేవోభవ మనసా స్మరామి.

 మాతృపూజాదినోత్సవ శుభాకాంక్షలు.

**************************************
మాతృ దేవోభవ-మనసా స్మరామి
***********************************
అమ్మ చల్లని ఒడిలో మొదలైనది నా జన్మ
అనవరతము అమృతము కురిపిస్తుంది అమ్మ.

పెరుగుతు..పెరుగుతు,

బోర్లపడగ ప్రయత్నిస్తే పొట్ట వత్తుకుంటోంది నాకు
పొట్ట వత్తుకుంటోందని అమ్మ మనసు తిట్టుకుంది.

అమ్మ మనసు తిట్టుకుంటోందని బోర్లపడటం ..మానేసా.

పెరుగుతు..పెరుగుతు,

అన్నీ అందుకోవాలని అంబాడాలనుకున్నా
అంబాడగ ప్రయత్నిస్తే అదిరాయి నా మోకాళ్ళు
మోకాళ్ళను చూసి అమ్మ మనసు బెంబేలెత్తేసింది
అమ్మ మనసు బెంబేలెత్తేసిందని పాకటము..మానేసా
.
పెరుగుతు..పెరుగుతు,
మడుగులొత్తించుకుందామని అడుగులేద్దామనుకున్నా
అడుగులేయ ప్రయత్నిస్తే పిచ్చి పిర్ర చుర్రుమంది
పిర్ర చుర్రుమనుట చూసి అమ్మ మనసు నొచ్చుకుంది
అమ్మ మనసు నొచ్చుకుందని.నడక నేను నేర్చుకున్నా.

పెరుగుతు..పెరుగుతు,
చక్కదనము అందీయగ చదువుకోవాలనుకున్నా
చదువుకోగ ప్రయత్నిస్తే అవరోధాలెదురాయె
అవరోధాలను చూసి అమ్మ బాధ పడింది
అమ్మ బాధ పడిందని..అసలు మనిషి నేనయ్యా.

పెరుగుతు..పెరుగుతు,

నా సందేహం పెరిగింది ...అది..
నా బాధతో మమేకమైన ..అమ్మ.
ఒక్కసారి..ఒకే ఒక్కసారి
నేను గట్టిగా ఏడిస్తే..నన్ను చూస్తూ
గమ్మత్తుగా నవ్వింది..ఎందుకో..తెలియదు
మీకైన తెలుసా..ఎప్పుడో..ఎప్పుడంటే
నేను పుట్టినప్పుడు ???????????????

ఎంత పెద్దవాడినైన అద్దమంటి నా మదిలో
ముద్దుగా కూర్చున్న హృద్యమైన ఆ నవ్వును
ఆశీర్వచనమై ఆలంబనగా ఉండనివ్వు...అమ్మా..వందనము

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...