Saturday, October 29, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-22(SIVAANAMDALAHARI)

 శ్లో :  ప్రలోభాద్యైర్-అర్థాహరణ-పర-తంత్రో ధని-గృహే

ప్రవేశోద్యుక్తః-సన్ భ్రమతి బహుధా తస్కర-పతే

ఇమం చేతశ్-చోరం కథమ్-ఇహ సహే శన్కర విభో

తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ 22


ప్రస్తుత శ్లోకములో ఆదిశంకరులు చంచలమైన మనస్సు అరిషడ్వర్గ ప్రభావితమైనపుడు ప్రవర్తించుతీరును మనకు తెలియ చేస్తూ,దానీ నియంత్రించగల వాడు కేవలము స్మరహరుడు మాత్రమే నని మరియొక మారు స్పష్టము చేస్తున్నారు. కామ-క్రోధ-లోభ-మోహములను గురించి ఒకసారి మాట్లాడుకుందాము. కామము/కోరిక తీరకపోతే క్రోధముగా మారుతుంది. ఒకవేల కోరిక కనుక తీరితే పొందిన ఆనందము మీద అభద్రతతో దానిని సంరక్షించుకోవాలనే అనురక్తితో ఎండమావుల వెనుక పరుగులుతీస్తుందన్నమాట. అదేవిధముగా నా మనసు లోభమునకు-నేనే దక్కించుకోవాలన్న అత్యాసతో,అదియును ప్రకృష్టమైన/వదిలివేయలేని లోభము నన్ను వదలక,అర్థమునకు-చోరత్వమునకు సైతము సిద్ధమగుచున్నది.ఇంకా తెలివైనదానిననుచు,ధనముగల ధనవంతుల గృహములలోనికి ప్రవేశించాలని సిద్ధమవుతుంది.భావము నకు బలమునిస్తూ పనులను చేయుటకు సిద్ధమవుతున్నది. ఇందులో ఏమాత్రము నా అపరాధములేదుసుమా.నేను నిన్ను మనస్పూర్తిగా నా హృదయకమలములో నివాసమునకు హ్వానించినప్పటికిని,నా మనసు అర్థమును దాచుకొనుటకై ధనికుల గృహములలో దానిని దోచుకొనుటకు సన్నద్ధమవుతున్నది. పరమేశా! నీ కృపతో దానిని సంస్కరించుము. సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.



NARUDRO RUDRAMARCHAYAET-21(SIVAANAMDALAHARI)

 శ్లో :  ధృతి-స్తంభాధారం దృఢ-గుణ నిబద్ధాం సగమనాం

విచిత్రాం పద్మాఢ్యాం ప్రతి-దివస-సన్మార్గ-ఘటితామ్

స్మరారే మచ్చేతః-స్ఫుట-పట-కుటీం ప్రాప్య విశదాం

జయ స్వామిన్ శక్త్యా సహ శివ గణైః-సేవిత విభో     21


స్వామి దీనావస్థను తొలగించదలచినట్లున్నాడు కనుక ప్రస్తుత శ్లోకములో ఆది శంకరులు మాతాపితరులు ప్రమథగణములు సేవించుచుండగా వచ్చి తన హృదయనివాసము చేస్తూ ఆశీర్వదించమని అభ్యర్థిస్తున్నాడు. హే శివా! సన్మార్గ ఘటితా-సగమనా ఈ దీనుడు సన్మార్గములో నున్న స్థలము వైపునకు సాగిపోవాలనుకుంటున్నాడు.అది జరగాలంటే, హే విభో! గణసేవిత-ప్రమథగణములు నిన్ను నిశ్చలభక్తితో సేవించుచుందగా, శక్త్యాయచ సహ-అమ్మను కూడి వచ్చి, జయ-విరాజిలుము. అందుకు అనుకూలముగా నా మనసును నీ అనుగ్రహము మార్చుచున్నది. నా మనసు ప్రస్తుతము ఎలా ఉన్నదంటే ధైర్యము అనే స్తంభమునునకు సద్గుణములను తాటితో బంధించబడి యున్నది. పద్మాకారములో విస్తరించియున్నది. అంతే కాదు-తెల్లని వస్త్రము.శుధ్ధ సత్వ మను పరిశుభ్రతతో ప్రకాశించుచున్నది. విచిత్రమ్మ్-వివిధ ఉపచారములతో నిన్ను సేవించాలనుకుంటున్నది. స్వామి నీ అనుగ్రహమును గుర్తించలేనివారికి , కరిగిపోవు/పుచ్చిపోవు స్తంభముపై విషయభోగములను తాళ్ళతో కట్టబడి,ఇంద్రియసౌఖ్యములను చిత్ర విచిత్రములచే ఆకరింపబడుతూ,తళుకుబెళుకు వస్త్రమును కప్పుకొని అందమైన గుడారము వలె అనిపించవచ్చును. కాని నా మనసునకు-ఈ గుడారమునకు ఒక పోలిక కలదు.అది ఏమిటంటే దానిని ఆ ప్రదేశము నుండి తొలగించి,సముచిత ప్రదేశములకు తీసుకుని వెళ్ళవచ్చును. కనుక శివా పశ్చాత్తముతో నున్న మరింత అనుగ్రహించి,నా హృదయ పద్మమునందు తల్లి ప్రమధగణములతో సహా నివసిస్తూ,ధన్యతనొందనిమ్ము. పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.




Friday, October 28, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-20

 శ్లో :  సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచ-గిరౌ

నటత్య్-ఆశా-శాఖా:-వటతి  ఝడితి  స్వైరమ్-అభితః

కపాలిన్ భిక్షో  మే హృదయ-కపిమ్-అత్యంత-చపలం

దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో    20


ప్రస్తుత శ్లోకములో ఆదిశంకరులు రెండు విభిన్న స్వభావములగురించి దాని పరిణామములగురించి తెలియచేస్తున్నారు. మొదటిది చంచలత్వము-దీనత్వమునకు కారణమగుచున్నది. రెండవది ధృఢత్వము-దైవత్వమునకు సంకేతమైనది. చంచలత్వము సత్యాసత్యములను గమనించలేని అసమర్థతతో ఎన్నెన్నో పనులను చేస్తుంది. అబద్ధమును నిజమనుకుంటుంది.సత్యమును గుర్తించలేక అసత్యమునే సత్యమనుకుంటుంది. అడవి గమనశక్యముకానిది.అందులోను సామాన్యమైనదికాదు.మోహమనే భ్రాంతితో నిండినది. చంచలత్వము అక్కడకు వెళ్ళాలనుకుంటున్నది.పోనీ వెళ్ళీన తరువాత నైన స్థిరముగా ఉండాలనుకోదు.అందులో అత్యంత ఆకరషణీయముగా నున్న ఎత్తైన కొండలపై నెక్కి నర్తించాలనుకుంటుంది.ఆ రంగస్థలము జవసత్వములు తగ్గగనే కిందికి నర్తకుని పడవేయునది. పటుత్వములేని దురాశ అనెడి కొమ్మలపై గంతులేస్తుంది. దాని వరుస మార్చలేని నన్ను బ్రహ్మ యొక్క దురాలోచనలను తుంచివేసిన ఓ మహాదేవ! నీపై భక్తి యను గట్టి పాశముతో బంధించివేయుము.తిరిగి మారకుండా నా చంచలత్వమును నేను సమర్పించు భిక్షగా స్వీకరింపుము.నన్ను మోహము బారి నుండి విముక్తుని చేయమని ప్రార్థించుచున్నారు. సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.




Thursday, October 27, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-19(SIVAANAMDALAHARI)

 శ్లో :  దురాశా- భూయిష్టే  దురధిప-గృహ-ద్వార-ఘటకే

దురంతే సంసారే దురిత-నిలయే దుఃఖ జనకే

మదాయాసమ్ కిం వ్యపనయసి క స్యోపకృతయే

వదేయం ప్రీతి:-చేత్ తవ శివ కృతార్థాః ఖలు వయమ్    19

హే శివా! కిం న వ్యపనయసి-న-మాయొక్క వ్యపనము-దుఖమును కిం-ఎందుకు యసి-తొలగించుటలేదు అసలే నా మనసు దురాశా భూయిష్ఠే-దుఃఖమును కలిగించు కోరికలతో నిండియున్నది. వాటిని తీర్చుకొనుటకు అది దీనముగా దురధిపతి-దుఃఖమును కలుగచేయు ప్రభువుల యొక్క గృహద్వార ఘటికే-ద్వారములవద్ద వేచి చూచు చున్నది అవి తీరలేదన్న విచారముతో దు@ఖజనకములగు దురంతములను-చేయరాని పనులను మరిన్నింటిని చేస్తున్నది. పోనీ ఆ విచారము తాత్కాలికమైనదనుకుందామా అంటే దుః అంతే-చివరివరకు దుఃఖమును కలిగించునవే. నా విచారమును బ్రహ్మ నిర్ణయించినది కనుక మార్చలేనిదనుకోమంటావేమో. కిం-ఎందులకు కస్య-బ్రహ్మ లిపినిచే కృతార్థఖలు-సంతసించమని ఎందుకు న ఉపకృతయే-సహాయము/ఉపకారము చేయకున్నావు? కశ్యోపకృతయే-బ్రహ్మకు ఉపకారము చేద్దామనుకుంటునావా నా తలరాతను తుడిచివేయకుండా అయితే కృతార్థ ఖలు వయం? నేనెట్లు నీ చరణసేవను పొంది నా దుఃఖమును తొలగించుకొనగలను? అని ప్రశ్నిస్తున్నాడు స్వామిని చనువుతో. సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.



NA RUDRO RUDRAMARCHAYAET-18(SIVAANAMDALAHARI)

 శ్లో :  త్వమ్-ఏకో లోకానాం పరమ-ఫలదో దివ్య-పదవీం

వహంతస్-త్వన్మూలాం పునర్-అపి భజంతే హరి-ముఖాః

కియద్-వా దాక్షిణ్యం తవ శివ మదాశా కియతీ

కదా వా మద్- రక్షామ్   వహసి కరుణా-పూరిత-దృశా     18



 సాధకుడు క్రిందటి విరించి బ్రహ్మాయుః శ్లోకములో స్వామి నీ పాదారవింద దర్శనముచే విధివ్రాతను జయించి నీ అనుగ్రహమును పొందుదామనుకున్నాను కాని దేవతల వంగిన శిరముల కిరీటములు నాకు పాదదర్శనము లభింపచేయుటకు ఆతంకము అగుచున్నవి.అయినను నీ క్రీగంటి చూపు నామీద ప్రసరించినంతనే నా పాపములు పరిహరింపగలవు అని నేను ప్రస్తుతము దేవతలు చేయుచున్న స్తుతుల ద్వారా తెలుసుకున్నాను.
 హే శివా!
తవ్మ్-లోకానాం పరమఫలదం-అన్నిలోకములలో నున్న చరాచరములన్నింటికి పరమపదమును/ముక్తిని అందీయగలవు.
 ఎందుకంటే
 త్వం మూలం-అన్నింటికి/అందరికి నీవే మూలము.
 అని నీయొక్క దయా ప్రాశస్త్యమును 
 తిరిగి తిరిగి హరిముఖాదులు-ఇంద్రాది దేవతలు స్తుతిస్తున్నారు కృతజ్ఞతాభావముతో.
 నిజమునకు వారందరును అతి సామాన్యులే.నీ చే అనుగ్రహింపబడినవారు కనుక స్వర్గాధిపతులుగా విరాజిల్లుచున్నారు.అయినను సంతృప్తిని చెందక నీ పాదసంసేవనాసక్తులై నీ సన్నిధానమును కోరి నిన్ను స్త్తుతించుచున్నారు.
 వారిని అనవరతము అనుగ్రహించుచున్న నీ దయ నా చిన్ని ఓరికను అదే,
మద్రక్షా కియతి చ మదాశా-నన్ను రక్షించని కోరుచున్నది అదియును 
 కేవలము నీ
కరుణాపూరిత దృశా-నీ కరుణామృత దృక్కులతో.
 ఓ శివా నన్ను సైతము నీ పాదసేవనములో మునిగి.కీర్తించే దాసునిగా అనుగ్రహింపుము.
 సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.

Wednesday, October 19, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-17( SIVAANAMDALAHARI)



 ఫలాద్యాం పుణ్యానాం మయి కరుణ యావా త్వయి విభో
 ప్రసన్నేపి స్వామిన్ భవదమల పాదాబ్జ యుగళం
 కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం
 నిలింపానాం శ్రేణిః నిజకనక మాణిక్య మకుటైః


 ఆది శంకరు అక్కడక్కడ నవవిధ భక్తి ప్రస్తావనము గుర్తుచేస్తున్నారు.అందులోని పాద సంసేవనమునకు సంకేతముగా లక్ష్మిదేవి నారాయణుని పాదములను సేవిస్తు మనకు దర్శనమిస్తుంటుంది.దేవాలయములలో సైతము అర్చకులు మనకు పాదుకలు/శఠారి తో స్వామి కటాక్షమును అనుగ్రహిస్తుంటారు.
 ఆది శంకరులు ఇదే విధముగా అమ్మవారిని కూడ విరించికిరీటము పక్కన పెట్టి తలవంచి నమస్కరించుచున్నాడు,భర్తను స్వాగతించువేళ కొంచము నెమ్మదిగా చూసుకుని నడువమని చెలికత్తెలు సూచిస్తూ,జయజయధ్వానములను వినిపించారన్నారు.
 ప్రస్తుత శ్లోకములో ఆదిశంకరులు స్వామి పాదసేవనమును ప్రస్తావిస్తూనే,
స్వామిన్,భవత్,అమల,పాదాబ్జ యుగళం అని ప్రస్తుతిస్తున్నారు.

Monday, October 17, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-16 (SIVAANAMDALAHARI)

 


 విరించి దీర్ఘాయుః భవతు భవతాం తత్పర శిరః

 చతుష్కం సంరక్షం స ఖలు భువి దైన్యం లిఖితవాన్

 విచారః కోవా మం విశద కృపయా పాతి శివతే

 కటాక్ష వ్యాపారః స్వయ మపిచ దీనావన పరః


 విధిలిపిం కిం న హరసి అని వేదనలో స్వామి అశక్తుదనో.ఉపేక్షచేయుచున్నాడనిన శంకరులు,భక్తునకు దిశానిర్దేశము చేస్తూ,కఠినముగా కనిపిస్తున్న పరిస్థితులే కారుణ్యప్రదములుగా ఏ విధముగా స్వామిచే స్పురింపచేయగలవో ప్రస్తుత శ్లోకములో వివరిస్తున్నారు.

 మనసు అతిచంచలము.అప్పుడప్పుడు కాచేవారినే నిందిస్తుంది తరువాత నిజమును గ్రహిస్తుంది.

 హే విభో-జగద్రక్షకా

 తే కటాక్షవ్యాపార-నీకృపాకటాక్ష ప్రసరణముచే

 మాం-నన్ను

 పాతుం-రక్షించుము.

 నేను పాహి పాహి అని ప్రర్థిస్తాను.నీవు పాతుం పాతుం అంటు రక్షిస్తాఉ.

 శివా,నన్నే కాదు,నా నుదుటను దీనావస్థను లిఖించిన ఆ బ్రహ్మను సైతము రక్షించుము.కినికి తలలను తీసివేయకుము.

శిరః చతుష్టం సమ్రక్యం-నాలుగు తలలను వాటి పనులను చేసుకోనిమ్ము.

 నేను ఆయన వ్రాతను నిందించానని ఆయనపై ఆగ్రహించకుము.

 బహిశా స్వార్థము తనరూపును మార్చుకుని పరమార్థమును చేరే ప్రయత్నమేమో.

 దీర్ఘాయుం భవతు భవతా

 నీ అనుగ్రహముతో దీర్ఘాయువుగా బ్రహ్మ విరాజిల్లునుగాక.

 నేనిన్నాళ్ళు దురవస్థగా భావించిన ఆ విధిలిపి యేగా కదా నీ పాదసేవ సౌభాగ్యమునకు కారణమైనది.కఠినముగా కనిపించినప్పటికిని కరుణను వర్షిస్తున్నది.

 నీ కనుసన్నలలో నున్న నాకు 

 విచారం కోవ? విచారమెందులకు అని తనను తాను సమాధానపరచుకున్నారు సంతృప్తితో శంకరులు.

 సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.


Sunday, October 16, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-5 ( SIVAANAMDALAHARI)

 శ్లో : ఉపేక్షా నో చేత్ కిం న హరసి భవద్-ధ్యాన-విముఖాం

దురాశా- భూయిష్ఠామ్ విధి-లిపిమ్-అశక్తో యది భవాన్

శిరస్-తద్-వదిధాత్రం న నఖలు సువృత్తం పశు-పతే

కథం వా నిర్-యత్నం కర-నఖ-ముఖేనైవ లులితమ్


 కృపణులను రక్షించే కృపాళువుగా ప్రార్థించిన భక్తుడు స్వామి తనను రక్షించుతలో ఉపేక్షతో నున్నాడన్న తలపును ప్రస్తుతశ్లోకములో వివరించుచున్నారు.

 ఓ శివా!

 కిం -ఎందుకు

 న హరసి-తొలగించుకున్నావు?

   వేనిని అనగా

 విధిలిపిం-బ్రహ్మ నా నుదుట వ్రాసిన వ్రాతను.

 అంతేకాదు నన్ను అనుగ్రహించుటలో నీ జాప్యమునకు కారణము,

1.నీయొక్క ధ్యాన విముఖత్వము

2.దురాశాభూయిష్టము అను రెండు విషయములు కావచ్చును.కాని

 నేనలా ఉండుటకు బ్రహ్మ నా నుదుటవ్రాసిన పాపకర్మల ఫలితము తక్క మరొకటికాదు.

 నా ప్రవర్తనకాదు.శివా నీవు నాతో దానికి అశక్తము మమ-నేను అసక్తుడను కనుక ఉపేక్షించుచున్నాను అందువేమో,

 కాని,అందులకు విరుద్ధమైన నీ పరాక్రం

 సువృత్తములను నేను వినియుంటిని.

 శంభో! నీవు నిః యత్నం-ప్రయత్నించకుండగనే

కర-చేతుల-నఖ-గోర్ల ముఖ-చివరలతో



 కొనగోటితో,

లులితం-ఖండించితివి 

 ఖండించినది సామాన్యమైనదికాదు

 సాక్షాత్తుగా నా నుదుటివ్రాతను రాసిన

 శిరస్తావైధాత్రం-బ్రహ్మయొక్క ఐదవతలను.

 బ్రహ్మ తలను కొనగోటితో తుంచివేసిన అదియును అప్రయత్నముగా నీ శౌర్యమునకు దానిని వ్రాసిన నా నుదుటివ్రాతను మార్చుట కష్టమా నీవు తలచుకుంటే.

 కనుక ఉపేక్షించక దీనుని ఉద్ధరింపుము అని వేడుకుంటున్నాడు.

 సర్వం పార్వతీ పరమేశ్వర పాదారవిందార్పణమస్తు. 



Saturday, October 15, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-14(SIVAANAMDALAHARI)

 శ్లో : ప్రభు స్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశు-పతే

ప్రముఖ్యో(అ)హం తేషామ్-అపి కిమ్-ఉత బంధుత్వమ్-అనయోః

త్వయైవ క్షంతవ్యాహ్ శివ మద్-అపరాధాశ్-చ సకలాః

ప్రయత్నాత్-కర్తవ్యం మద్-అవనమ్-ఇయం బంధు-సరణిః


 అ సంబంధమును మరింత స్పష్టము చేయుచు,పరమబంధు అని స్వామిని సంబోధిస్తూ,బంధు సరణి అని బంధువులను రక్షించే విధానము అని గుర్తుచేస్తూ,బంధుత్వం అనయో-మనమధ్యన నున్న బంధుత్వము

కిముత-మళ్ళీ మళ్లీ గుర్తుచేయవలసివస్తుంది.ఎందుకంటే,

ఆకలి-ఆహారము

దప్పిక-జలం

చీకటి-వెలుతురు

జీవము-దైవము

 పరస్పరాశ్రితములో అదేవిధమైన సంబంధమొకటి మన మధ్యన కలదు.అది ఏమిటంటే,

త్వయేవ క్షంతవ్య-స్వామి నీయొక్క క్షమాగుణము

మత్-నన్ను

అనవదం-రక్షించునునని

సకలాః ప్రయత్నాత్-ఏ విధముగా నైన 

హే పశుపతీ!

 నీవు ధర్మ నిరతిని వివరించినప్పటికిని,నేను సంసారభ్రాంతిలో సర్వమును మరిచి,అపరాధములను ఒకటి కాదు/రెండు కాదు/లెక్కలేనన్ని చేసితిని.అయినప్పటికిని

 అతిదీనత్వముతో నున్నవాదను నేను

 అతి దయాళువు నీవు

 అపరాధిని నేను

 అపరాధక్షమయే నీవు

 లోక బాంధవా,

మన మధ్య సంబంధము దేహమునది కాకపోవచ్చును.అయినప్పటికిని జగత్పితా నీవు సృష్టించిన చరాచరములలోని చిన్ని భాగమైన నా దోషములను క్షమించి,నన్ను సంస్కరించి

 అనయహే-మనమధ్యనున్న 

 దీనానాం పరమబంధుః

అన్న సూక్తిని మరొకసారి జగములు పొగడనీ.

 సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.

 

 


 



 ప్రస్తుత శ్లోకములో శంకరులు"త్వమేవ మాతా-పితా త్వమేవా-త్వమేవ బంధుః సకలం త్వమేవ"అన్న సూక్తిలోని బంధుత్వమును గురించి ప్రస్తావనను సంభాషణగా(భక్తునికి-భగవంతునికి) చమత్కరించారు.

 


Friday, October 14, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-13(SIVAANAMDALAHARI)

 శ్లో :  అసారే సంసారే నిజ-భజన-దూరే జడ ధియా

భ్రమన్తం  మామ్-అంధం పరమ-కృపయా పాతుమ్ ఉచితమ్

మత్-అన్యః కో దీన:-తవ కృపణ- రక్షాతి - నిపుణః 

త్వత్-అన్యః కో వా మే త్రి-జగతి శరణ్యః పశు-పతే     13


ఆదిశంకరులు అసార సంసారమును గురించి, "పునరపి జననం-పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుఃఖారే " అని ఏవిధముగా నిస్సారమో తెలియచేసారు. ప్రస్తుత శ్లోకములో ఆదిశంకరులు అవలక్షనములను చెబుతూనే వాటిని అర్హతలుగా భాసింపచేస్తున్నారు. ఇక్కడ రెండు పూర్తి విరుద్ధ భావములు ఒకటి ప్రకాశకత్వమునకు-మరొకటి అంధకారత్వమునకు ప్రతీకలుగా చెబుతున్నారు. భక్టుడు ఈ విధముగా తన అసమర్థలను చెబుతూ,దానిని నివారించగలిగిన శక్తి పరమేశ్వరునకు తక్క వేరెవరికి లేదని విన్నవించుకొనుచున్నారు. భక్టుడు-చైతన్యరహితుడు కాని భగవంతుడు -అజడుడు-సంపూర్ణ చైతన్యము. భక్తుడు-కృపణుడు-తన స్వస్వరూపమును తెలిసికొనలేని స్థితిలో నున్నవాడు-భగవంతుడు సమస్తము స్వస్వరూపముగా కలవాడు. భగవంతుడు కృపయ ధియ-కృపతో రక్షించు సుమనస్కుడు భక్తుడు కృపణుడు-భగవంతుడు కృపయనిపుణుడు. భక్తుడు పశువు-అనగా పశ్యంతీ తవ పశుః-చూడగలినశక్తి మాత్రమే కలవాడు.కాని చూసినదానిలో దాగిన మర్మమును గ్రహించలేనివాడు. భగవంతుడు పశుపతి-చూసినదానిలోని మర్మమును తెలియచేయువాడు. అంతేకాదు త్రిభువన/త్రిజగః మత్ అన్యః శరణ్య-నిన్ను శరణుకోరువారిలో దీనుడులేడు. నా దీనత్వమును నిర్మూలించగలిగిన, తవ్త్-అన్యః నిన్ను మించిన శరణాగతరక్షకుడును లేడు. కనుక ఓ పరమేశా!అసారమైన సంసారము నుండి విముక్తిని ప్రసాదించి,భవపాదాబ్జసేవనాసక్తిని అనుగ్రహించుము అంటున్నారు శంకరులు. సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.




TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...