Thursday, October 13, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-06(SIVAANAMDALAHARI)

  

 ఘటోవా మృత్పిండోప్యణురపిచ ధూమోగ్నిరచలః

 పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం

 వృధా కంఠక్షోభం వహసి తరసి తర్కవచసా

 పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః


 శ్రీ జగద్గురువులు ఐదవశ్లోకములో స్వస్వరూపమును తెలియచయలేని ,కేవలము రాజాశ్రితములగు అనేకానేకళలను ప్రస్తావిస్తూ,ప్రస్తుత శ్లోకములో తర్కశాస్త్రమునాధారము చసుకొని ,ప్రత్యక్షప్రమాణమనియు,అనుభవప్రమాణమనుచు వాదించుకొనుచు,ఏదో సాధించామనుకొని ఆనందపడుట ఎంతటి అమాయకత్వమో ఎందుకంటే ఆ వాదనలు రాబోవుచున్న ఘోరశమనమును /మృత్యుకోరలను ఆపివేసి ముక్తిని ప్రసాదించలేనివి కదా.

ఓ శంకరా!

ముగ్గురు తర్కవేత్తలు ఒకే వస్తువును చూపుతూ మూడు విధములుగా ప్రకటించినారు.

 మొదటి వారు దానిని కుండ అని సంబోధించగానే,

 రెండవ వారు అది కుండ కాదు,మట్టిముద్ద అని నిర్వచించారు.

 మూడవవారు తాను సంఖ్యాశాస్త్ర ప్రకారము చెబుతానని నేకానేక మట్టి అణువుల సమూహము అని చెప్పి మహదానందమును పొందిన భ్రాంతిలోనున్నారు.(ప్రత్యక్ష ప్రమానము) 

  మరికొందరు పట-వస్త్రమును చూపితూ దాని పేక-బడుగులు సంఖ్యలు చెబుతుంటే అది వృధాకంఠశోషకదా.

 మరికొందరు తాము చూసిన అనుభవించిన దానిని ప్రమాణము చేసి,కొంద మీద నుండి పొగ వ్యాపించుచున్నది కనుక నిప్పు కొండవెనుక జ్వలించుచున్నదనిన,మరికొందరు కాదు కాదు నిప్పు ప్రజ్జ్వలించుటకు ముండు సూచనగా పొగను వ్యాపింపచేసినదని వాదించుకొందురు.

 ఈ ప్రమాణములు ఒక పదార్థము యొక్క అనేకానేక అవస్థలను కనుక నిజముగా తెలియచేయగలిగితే,వాటిలో వాటికి మూలమైన నిన్ను దర్శింపచేయు శక్తిని ప్రసాదించునవి.నీ పాదపద్మభజనమునకు నీ మనస్సును మరలించును కదా అని ఇంద్రియ సదుపయోగమునకు సూచనచేయుచున్నారు.

 తరసా-వెంటనే

 పరమసౌభ్యం వ్రజ-పరమానందమును పొందుదుము.

 సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు. 



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...