Friday, February 17, 2023

SIVATANDAVASTOTRAMU-PRATIPADAARTHAMU-BHAAVAMU.


 


  శివతాండవ స్తోత్రము-రావణకృతము

  **************************

1.జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే

గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం

చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||


 శివతాండవము జరుగు పవిత్రస్థలమును గురించి చెప్పబడినది మొదటి భాగము.

 జటాటవి- అడవి వలె జటలున్న ప్రదేశమునుండి,

 గలజ్జల- పవిత్రమైన జలము,

 ప్రవహించి_ ప్రవాహ

 పావిత-పవిత్రమొనరించిన,స్థలే-స్థలము అది.శివజటాజూటమునుండి గంగాజలము సంప్రోక్షించబడి పునీతమైన ప్రదేశములో తాండవము  ప్రారంభమగునట.అదియె వికార రహితమైన మన హృదయసీమ.

గలేవ లంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం.

  స్థలమును గంగ పవిత్రమొనరించినది.వెంటనే, భుజంగములు గళమున మాలుకలుగా తమను తాము అలంకరించుకొని తరించినవి.

 .డమడ్దమ నినాదవడ్దమర్వయం,

 గంగమ్మను,వాసుకిని అనుసరిస్తు,డమరుకం డమడమ నినాదముతో స్వామి చేతిని అలంకరించి,అర్వయం -ప్రకాశించుచున్నది.

చకార చండతాండవం తనోతు నః శివః శివమ్-అనుగ్రహమును అర్థించు చమకమునకు ఫలముగా స్వామి తన తాండవముతో మనలను అనుగ్రహించుగాక.ఓం నమః శివాయ.


2.జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-

-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |

ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే

కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2 ||

  జటాకటాహ సంభ్రమభ్రమ న్నిలింప నిర్ఝరీ

 కటాహము-విశాలమైన పాత్ర.జటా కటాహము-శివుని జటాజూటము విశలమైన పాత్ర వలె నున్నది. అందులోనున్న

 నిలింప నిర్ఝరీ- దేవ ప్రవాహమైనగంగమ్మ.విష్ణు పాదములనుండి ఆవిర్భవించి,శివ జటాజూటము చేరిన గంగ,

 సంభ్రమ-భయముతో కూడిన ఆశ్చర్యముతో తడబడునదై భ్రమ-భ్రమణము-తిరుగుచున్నది.

  శివ తాండవ ప్రారంభమున విశాలమైన పాత్రవలె నున్నశివుని జటాజూటములోని గంగమ్మ,సంభ్రమముతో తడబడుతు సుడులు తిరుగుచున్నది

 విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్థని.

 విలోల-సుడులు తిరుగుచున్న,వీచి-తరంగముల వల్లరీ-కాంతులు మూర్థని-శివుని నుదుటిని,విరాజమాన-ప్రకాశింపచేయుచు నాలో సందర్శనాభిలాషను కలిగించుచున్నవి.

 సుడులు తిరుగుచున్న గంగా తరంగముల నుండి వెలువడుచున్న కాంతులు,శివుని నుదుటిని ప్రతిబింబించి ప్రకాశవంతము చేయుచు, తరించుచున్నవి.

 ధగధ్ధగ ధ్ధగ జ్జ్వల ల్లలాట పట్ట పావకే

 పట్టపావకే-ఎర్రటి పట్టు వస్త్రమును (చుట్టుకొన్నట్లు)

 ధగధగత్ జ్వలత్-ధగధగలతో ప్రకాశించుచున్నది

 లలాటము-శివుని నుదురు అగ్ని నేత్ర జ్వలనముతో ఎర్రటి వస్త్రమును ధరించెనా అనునట్లు ప్రకాశించుచున్నది.

 గంగమ్మ సుడులు తిరుగుతు తన తరంగ కాంతులతో శివుని నుదుటిని సేవించుచున్నది.త్రినేత్రము తన ప్రకాశముతో (అగ్ని) శివుని నుదుటను చేరి సేవించుచున్నది.

) కిశోర చంద్ర శేఖరే రతి ప్రతిక్షణం మమ

 మమ-నాయొక్క రతి-కోరిక,ఆశ,క్రీడ

 చంద్రశేఖరుడు-చంద్రుని శిరమునధరించిన వాడు,ఆ చంద్రుడు ఎటువంటివాడు అనగా కిశోరము-చిన్న లేత అనగా సన్నని చంద్రరేఖ.

 చంద్రరేఖను సిగపూవుగా ధరించిన వాడు,అగ్ని మూడవకన్నుగా కలిగి గంగతరంగ కాంతులతో ప్రకాశించు నుదురుగల మహాదేవునితో నా మనసు ఎల్లప్పుడు క్రీడించుటను కోరుకొనుచున్నది.ఓం నమః శివాయ.


3.ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర

స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |

కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది

క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || 3 ||

 ధర-భూమి,ధరాధరము-భూమి మోయుచున్న,ధరించినది పర్వతము.ధరాధరేంద్రుడు-పర్వతరాజు-హిమవంతుడు.

 ధరాధరేంద్ర నందిని-పర్వతరాజ కుమార్తె-పార్వతి.

ఆమె ఎలాఉన్నదంటే, విలాస-వేడుకగా-శుభముగా,బంధు-అలంకారములతో,ఆభరణములతో,బంధుర-నిండినది.

అమ్మ సౌభాగ్యకరమైన అలంకారముతో,దర్శనముతో నాట్యవేదికను సమీపించినది.ఆమ్మ నగల కాంతులు దిక్కులను మరింత ప్రకాశవంతము చేయుచున్నవి.శివుని నాట్యము,నిరుద్ధ-భరించలేని,దుర్ధరా-ఆపదలను,అవధి-నిర్మూలిస్తున్నాయి .ఆ మూర్తి ఇది అని చెప్పలేని వస్తువు,అనిర్వచనీయమైనది.క్వచిత్-ఆ పరమాత్మ యందు నా మనసు ఆనంద వినోదమును పొంద కోరుచున్నది.ఓం నమః శివాయ.

4.జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా

కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |

మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే

మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||

భర్తరి-భరించేవాడు,కాపాడేవాడు, భూత-సకలజీవులను, ఆ భర్త ఎటులున్నాడంటే జటా-జడలలో భుజంగ పాములను ధరించాడు.శరీరమునిండా పాములను ధరించాడు.ఆ పాముల పడగల మీది మణులు పింగళ(ఎరుపుతోకూడిన పసుపు రంగు) కాంతులను వెదజల్లుచున్నవి.ఆ కాంతులు దిక్కులనెడి స్త్రీ చెక్కిళ్లపై కదంబకుసుమ రసమును (కుంకుమ రంగును) అలదినట్లు శోభిల్లుచున్నవి.శివుడు ఒక అందమైన ఉత్తరీయమును తన భుజముపై వేసుకొన్నాడు.ఆ ఉత్తరీయము గర్వముతో మద-గర్వముతో,గుడ్డిదై,మంచి-చెడులు మరచి స్వామిని తన ఉదరమున నివసించమని వరమును కోరిన,సింధుర-ఏనుగు యొక్క చర్మము,కరి దేహత్యాగముతో అజ్ఞానమును వీడి,త్వక్-పూజనీయ,ఉత్తరీయ-ఉత్తరీయముగా మారినది.చీకటులను తొలగించి,పాపులను పావనులుగా మలచిన స్వామి యందు నా మనసు అద్భుతముగా క్రీడించుచున్నదిఓం నమః శివాయ.



.5.సహస్రలోచన ప్రభా అశేష లేఖ శేఖర,ప్రసూన ధూళిధోరణీ విధూసరాంఘ్రి పీఠభూః,భుజంగరాజ మాలయా,నిబధ్ధ జాటజూతకః,శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః.

  చంద్రుడు చకోరములకు మిత్రుడు.హంస వలె చకోర పక్షి మెడ క్రిందనున్న కన్నము ద్వారా మెడను వంచి,వెన్నెలను తాగుతుందని అంటారు.చకోరమిత్రుడైన చంద్రుని శివుడు చిరాయ-కలకాలము,శ్రియై-స్-శుభములనొసగు గాక.మరియు ఇందు స్వామి పాదపీఠము వర్ణించబడినది.అది ఎట్లా ఉన్నదంటే సుగంధము పుష్పముల పుప్పొడులతో నిండి పరిమళించుచున్నది. అక్కడికి పుప్పొడి ఎలా వచ్చిందంతే,వేయి కన్నులుగల -సహస్రలోచనుడు ఇంద్రుడు,ఇంద్రుడు ఎవరు అంటే న శేష-ఒక్కరినైన వదలక.లేఖ-దేవతల,లేఖ శేఖరుడు-దేవతలకు రాజ,సురాధిపతి,తన పరివారముతో శివపాదనమస్కారమునకు తలలు వంచిరి.వారు వివిధ పరిమళ పూలహారములను అలంకరించుకొన్నారు.దేవతల పూలమాలలు వారికన్న త్వరగా ధన్యతనొందుటకు తమ పుప్పొడులచే శివపాదములను అభిషేకించినవా అన్నట్లుగా శివపాద పీఠముచేరి జడలలో పాములను పేరిచి పెట్టుకొన్న స్వామిదయను పొందినవి.అట్టి స్వామి శ్రియై-శుభములను,చిరాయ-చిరకాలము ప్రసాదించుగాక.ఓం నమః శివాయ.


లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-

-నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ |

సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం

మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః || 6 ||

 లలాట-శివుని నుదురు ఎలా ఉన్నదంటే,చత్వర-యజ్ఞ వేదిక అయ్యింది.అందులో ధనంజయుడు-అగ్నిదేవుడు జ్వలిస్తున్నాడు.ఆ జ్వలనమునకు కారణము ఆయన అప్పుడే మన్మథుని-పంచశరుని నిపీత-తాగెనులేదా భుజించెను.అట్టి ధనంజయుడు భయంకరమైన స్పులింగ-జ్వాలలతో,నిలింపనాయకం-బయట అగ్నిని హరింపచేసాడు.శివుడు తనలో బ్రహ్మాండములను దాచుకొనినట్లు,శివ త్రినేత్రము తన విస్పుట జ్వాలలతో బయట అగ్నిని హరించివేసినది.శివునిచేతిలో బ్రహ్మ పుర్రె ధన్యతనొందుచున్నది.అమృత కిరణాలు-సుధా-మయూఖములు గల లేఖయా -దేవతలచే శివుడు,విరాజమాన శేఖరం-శివుడు కొలువబడుచున్నాడు.చెడుగా ఆలోచించినందులకు నరికి,తిరిగి క్షమించి,తన భిక్షాపాత్రను చేసి,చేత ధరించిన శివుడు -శిరోజటాల,శిరమునజటలున్న శివుడు,సంపదే-సంపదలను అస్తునః-వర్షించును గాక.ఓం నమః శివాయ.

కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-

ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే |

ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-

-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || 7 ||

 మమ-నా యొక్క మనసు,రతిర్మమ-కోరుకొనుచున్నది. నా మనసు ఏమి కోరుకొనుచున్నది? శివుని యందు క్రీడించ,శివుని ధ్యానించి,దర్శించి,తరించ కోరుకొనుచున్నది.ఇందులో శివుడు మాత్రమే చేయగలుగు రెండు పనులను స్తుతిస్తున్నాడు రావణుడు.వాటిని గురించి తెలుసుకోవాలంటే మనము మానవ నైజమును విడిచిపెట్టాలి..ఎందుకంటే అవి దైవకార్యములు.వాటిని తెలియచేసినది దేవభాష,అమ్మతనమును మాత్రమే దర్శించాలి కాని ఆడతనమును కాదు.

  శివుడు తన మూడవకన్నుతో మన్మథుని దహించాడు.ఆ మన్మథుడు ఏ స్థితిలో నున్నాడంటే తన ఐదు సహాయకములతో(వసంత ఋతువు,పూల రథము,చెరకు విల్లు,పూలబాణములు,సమ్మోహనపరచు శక్తి) వీటి బలముతో ప్రచండడుడై ,శివునిపై దండెత్తాడు.అహంభావితుడైన మన్మథుని,శివుడు తన నుదుటను పట్టికగా ధరించిన ధనంజయునితో(అగ్నితో) కరాళ జ్వాలలతో,అగ్నిశిఖలతో,హుతీకృత-భస్మముగా మార్చినాడు.

 శివుడు మాత్రమే ఏకైక అద్భుత శిల్పి.మకరికాపత్ర లేఖకుడు.(బాహుబలి పచ్చబొట్టు )సూర్యుడు ఆహార ప్రదాత.చంద్రుడు ఔషధ ప్రదాత.వారి పోషకత్వ సంకేతమే అమ్మ కుచములు.స్వామి తనశిల్పరచనతో సూర్య-చంద్రులను పుష్టివంతులను చేస్తున్నాడు.

 అదియే ధరాధరేంద్ర నందినికుచాగ్రచిత్రపత్రకము  -పార్వతీదేవి, స్తనములకు సొబగులు దిద్దుపవిత్రకార్యము. ముక్కంటి యందు నా మనసు లగ్నమగు గాక.ఓం నమః శివాయ.

నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-

కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |

నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః

కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || 8 ||




.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...