Sunday, March 5, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(AGASTYOE BHAGAVAAN RISHI)-03


 



 కొండను నియంత్రించినవాడు అగస్త్యుడు.అగము/నగము అంటే కొండ.కొండను ఎత్తుగా పెరగవద్దని నియంత్రించిన మహా తపోశక్తి సంపన్నుడు.ఇది వాచ్యార్థము.

 అగము అను శబ్దమునకు ఇంద్రియము అనునది మరొక భావము.అవి కొండల్లా ఎదిగి మనస్సును  ఆవరించి కదలనీయవు.ఒక్క కొండను దాటుటయే ఎంతకష్టమో.అటువంటిది ఆరు ఇంద్రియములు ఆరు కొండలుగా మనసును చుట్టుముట్టి,పొరపాటున కదిలి వెళ్ళిపోదామనుకుంటే కదలక వాటి మధ్యలో నున్న లోయలలో పడవేస్తుంటాయి.

 రావణాసురునిది అదే దయనీయమైన స్థితి.కామము అనే ఇంద్రియము కొండలా ఎదిగి కదలక నిలిచి సీతమ్మను అపహరించునట్లు చేసినది.ఎక్కడ  తప్పించుకుంటాడో అని క్రోధము వానిచే సీతమ్మను నిర్బంధింపచేసి తనను వివాహమాడమనుట, అను రెండు విషయములతో కామము-క్రోధము రెండువైపులా పెద్ద కొండల్లా  కమ్ముకున్నాయి.వెనువెంటనే తనకే దక్కాలన్న మోహము,ఆమె రామధర్మపత్ని అన్న మాత్సర్యము మరింత పెద్దకొండలై రావణుని బంధించాయి.ఎటు కదలలేడు.కదిలినా ఉండేది లోయలోనే తప్ప వాటిని దాటలేడు.వానిని ఆ కొండలనుండి బయటకు తెప్పించగలవాడు,వాని అవస్థను తప్పించగలవాడును అగస్త్యుడనే పాత్రధారుడే సుమా.అంతేకాదు.


 రఘువంశ కులదైవము సూర్యభగవానుడు.

 రాఘవునకు ఉపదేశము చేయబడినది ఆదిత్యహృదయము.

 శ్రీ రామునకు ఉపదేశించినది సూర్యతనయుడు అగస్త్యమహాముని.

  .అంతకు మించిన సన్నివేశమేముంటుంది.

 సూర్య భగవానునికి-ఊర్వశికి భావనలో జనించి,కుండలో పెరిగి ప్రకటితమైన మహాముని అగస్త్యుడు/కుంభముని.

   రాజగురువు వశిష్టుడుకదా ఆయన బదులు అగస్త్యుడు యుద్ధభూమిలో శ్రీరామునకు గుహ్యముగా ఆదుత్యహృదయము ఉపదేశించుట అన్న సందేహము కలుగవచ్చును.

 వశిస్టుడు -అగస్త్యుడును ఒకే కుండలో ఊర్వశీ పుత్రులుగా పెరిగి మైత్రావరుణులుగా ప్రకటింపబడినారు.కనుక వరుస ప్రకారము గురుతుల్యులే.

 ఆ విశిష్టమైన యుద్ధమును దర్శించుటకు దేవతలతో పాటుగా అగస్త్య్డుడును వచ్చినాడట.చింతాక్రాంతుడిగా నున శ్రీరామునికి గుహ్యమైన/సనాతనమైన ఆదిత్యహృదయ స్తోత్రమును ఉపదేశించి యథాగతం/తిరిగి స్వస్థలమునకు వెళ్ళి సూర్యునితో పాటుగా యుద్ధకార్యోన్ముఖుడైన రాముని యుద్ధమును చూచుటకు సన్నద్ధుడైనాడట.

  రావణుడు వరప్రభావముచే శత్రాస్త్రములచే మరణముపొందనివాడు.రాముడు ధర్మయుద్ధమును మాత్రమే ఆచరించువాడు.అలిసిన రావణునితో యుద్ధముచేయుటకు మనసొప్పక ఇంటికి పంపించివేసిన ధర్మశాలి.


కథనం ప్రకారములో లంకలో సీత భగవంతుని ఆశ్రయించి యుద్ధరహితస్థలికి చీకటితో నిండిన లంకను వీడి చేరాలనుకుంటున్నది.రావణుడు ఉపాధిసక్తిని చైతన్యశక్తిగా భావించక పోరాడి ధర్మమును జయించాలనుకుంటున్నాడు.అదియును మూర్తీభవించిన ధర్మముతో.

 రామచంద్రమూర్తి రావణుని బ్రహ్మాస్త్రముతో తుదముట్తించడు.ఎందుకంటే దాని ప్రభావము అమాయక జీవులకు సైతము ఆవరించివేస్తుంది.దివ్యాస్త్రములను ప్రయోగించడు.ఎందుకంటే మానవధర్మమును సమస్తలోకాలకు చాటిచెప్పలనుకున్నాడు.

 రావణుని శాపవిముక్తుని చేయవలసిన బాధ్యత నిర్వర్తించాలంటే ధర్మయుద్ధము చేయవలసినదే.దానికి రావణుడు సహకరించవలసినదే.

కనుక రాముడు సమరే చింతయాస్థితుడుగా ఉన్నాడు.

రావణుడు సైతము నిస్సహాయుదై యున్నవేళ సారథి రథమార్గమును మరల్చి,సేదతీరే అవకాశము ఇచ్చాడు.తెలివి వచ్చిన తరువాత రావణునకు అది అవమానముగా అనిపించినది.కనక తతో యుద్ధములో విపరీతముగా అలిసిపోయానని-పరిశ్రాంతం,చింతయాస్థితిలో నున్నాడు.

 ఇట్తి ధర్మ సంకతమును తొలగించగల వాడు సాక్షాత్తు సూర్య పుత్రుడైన అగస్త్యుడు మాత్రమే.రామునిది సూర్యవంశము.చేయవలసిన కర్తవ్యము సూర్యోపదేశము.

 అంతే కాకుండా విజ్ఞుల కథనము ప్రకారము కోసలదేశ పాదాతి దళమునకు సంరక్షకుడిగా అగస్త్యుడు,నౌకాదళమునకు గుహుడు,ఆకాశ దలమునకు జటాయువు నియమింపబడ్డారని చెబుతారు.అదే కనుక నిజమయితే అది రాజ్య రక్షాధర్మము.

 అగ్రతో దృష్ట్వా అనునది మరొక విశేషము.

 అగ్రతో సమీపములో చూసి అని ఒక భావన.

 సాహిత్య పరముగా అన్వయించుకుంటే,

"నానృషి కురుతే కావ్యం"

 మూర్తీభవించిన జ్ఞానము ఋషి.అందులోను తన జ్ఞానమును సరజన శ్రేయస్సుకై అందించువాడు.కనుకనే అగస్త్యుడు సమస్తలోకములకు సమ్మంగళాశాసనముగా ఆదిత్య హృదయస్తోత్రమును అందించెను.

 తం సూర్యం ప్రణమామ్యహం  

 



 


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...