Sunday, March 5, 2023

ANIRVACHANEEYAM- ADITYAHRDAYAMU(TATOE YUDDHAM)-01

 తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥


  ప్రస్తుత శ్లోకములో మహర్షి అనుగ్రహించిన పదములు,
 
 తత్-ఆ
 యుద్ధము,సమరము,చింత-అగ్ర-దృష్టి,రావణ-స్థితం-సముపస్థితం.పరిశ్రాంతం మొదలగునవి.
 రావణ-అను ఒక్క నామము మాత్రమే చెప్పబడినది.
 సమరము-యుద్ధము-పరిశ్రాంతము-దృష్ట్వా-(చూచెను)స్థితం-సముపస్థితం 
 అను క్రియా పదములు(పనుల) గురించి చెప్పబడెను.
 అగ్రతో-పైకి,పరి-మిక్కిలి,విశేషములను చెప్పబడినవి.
 రావణం చ-అనగా రావణునితో కూడి యున్నది ఆ యుద్ధరంగము అని,చ అను భూతకాలమును అన్వయించుకుంటే ఈ యుద్ధము ఎప్పుడో జరిగినది అని రెండు విధములుగా భావించవచ్చును.కాని రావణునికి ఎవరికి మధ్యన ఈ యుద్ధము జరిగినదో ప్రత్యేకించి చెప్పలేదు.
 సమరే చింతయాస్థితం-అన్నారు మహర్షి.
 యుద్ధమును గ్య్రించిన ఆలోచనలతో నున్నారట.
అంటే ఇరుపక్షములవారా లేక కేవలము రావణుడు మాత్రమేనా అన్న సంసయము కలుగవచ్చును అజ్ఞానమునకు.
 రావణ ప్రసక్తి వచ్చినది కనుక లంకలో యుద్ధము జరిగినదనుకొనుటలో తప్పులేదు.
 కాని నిలకడలేని ఆలోచనలు స్థిరముగా నున్నవట.ఇది ఒక విరుద్ధ విషములను తెలియచేయుటకు/ఒక ప్రత్యేక మానసిక స్థితిని చెప్పుచున్నదే సమరము అనే పదము.మానసిక సంఘరషణలో నిలకడలేని ఆలోచనలు స్థిరముగా ఉండెననుటచే ఆ యుద్ధము ప్రత్యేకమేమో.
 1. ఆ యుద్ధము సామాన్యమైనది కాదు.కనుకనే రామ-రావణ యుద్ధమనలేదు మహర్షి.

  యోధులున్నప్పటికిని యుద్ధములను ప్రోత్సహించనిది అయోధ్య రాజ్యము.అటువంటి అయోధ్యాపతిని సమరమునకు సన్నద్ధముచేసినది తత్ యుద్ధము.
2.  సీతాపహరణ యుద్ధమనలేదు.ఉత్తర-దక్షిణ రాజ్యముల మధ్య యుద్ధమనలేదు.
3. లంకా యుద్ధమనలేదు.రామునకు కావలిసినది లంక కాదు.ధర్మ స్వరూపమైన తన ధర్మపత్ని.

4..ఆజానుబాహుడు-మహాబాహుడైన శ్రీరాముడు యుద్ధము చేయుటకు మనస్కరించని స్థితిని ప్రకటింపచేసిన యుద్ధము.
 యుద్ధనీతి ప్రకారము అలసిన నిస్సహాయుడైన రావణుని విశ్రాంతి తీసుకుని,తిరిగి సన్నద్ధుదై రణభూమికి రమ్మని పంపించివేసినది పూర్వ సందర్భము.ఒక వేళ రావణుడు మనసు మార్చుకొని తిరిగి యుద్ధమునకు రాకున్నచే,శరణాగతుడైనుచో,తన వరము ప్రకారము నరునిగా తన చేతిలో అంతమొంది జయునిగా వైకుంఠమును చేర్చవలసిన బాధ్యత భగవంతునిది గా తనది కదా.దానికి ఆలస్యమయితే?
 5.  మీరు నవ్వుకోవచ్చును.సాక్షాత్తు శ్రీమన్నారాయణునికి ఈ విషయము తెలియదా అని ,కాని స్వామి మానవధర్మములను తాను ఆచరించి,మనలను ఆచరింపచేయుటకు కదా ఈ యుద్ధము.
 కనుక రామ-రావణ యుద్ధమనలేదేమో.
6. రావణుడు ఎప్పుడెప్పుడు  తన స్వామి ద్వారసేవకునిగా తనను కరుణిస్తాడని తరుణమునకై  తహతహలాడుచున్న యుద్ధం.తన జయుని అనుగ్రహించాలని స్వామి తహతహలాడుచున్న యుద్ధము.
7.శాపవిమోచనమునకు జగన్మాత సాక్షాత్తుగా సహకరించిన యుద్ధము.
 క్షాత్రము-క్షమాగుణము కలగలిసినది ఆ యుద్ధభూమి.
8..ఇదమిత్తమని,ఇదే నిమిత్తమని కాని సకలలోక క్షేమమునకై 

 పరిత్రాణాయ సాధూనాం-వినాశాయచ దుకృతాం

 ధర్మ సంస్థాపనకై జరుగుచున్న యుద్ధభూమి అది.
9.మానవ హృదయమే తమోభావములనే నీటితో నిండిన లంక.వాటిలోని అరిషడ్వర్గములే తనను ఎవరు జయించలేమని చేయుచున్న పెద్ద రవము.కనుకనే రావణుడు ఆకాశమార్గమున మాయ యుద్ధముచేయుచుందగా రాముడు తలపైకెత్తి పైకెత్తి చూచుటను "అగ్రతోదృష్ట్వా" అని అనుకొని ఆనందపాడారు.సముపస్థితం-దగ్గరగా వచ్చి ఉన్నది.ఏమిటి?
.సంస్కరించవలసినఉపాధి.పదితలలతోప్రత్యర్థినిపరిమార్చుటకు ప్రయత్నిస్తున్నది.పరమాత్ముని కరుణా వీక్షణమే

ఆ అగ్రతోదృష్ట్వా అని ఆరాధించేవారు ఉన్నారు.
 తద్భావం తద్భవతి-
 తం సూర్యం ప్రణవామ్యహం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...