Wednesday, December 13, 2023

IDEYAM TVAAM PASYAAMI/KADAA TVAAM PASYAEYAM-29



 



  ఇదేయం త్వా  పశ్యామి-03

  కదా  త్వాం  పశ్యేయం-29

 **********************


 "జిహ్వ చిత్తశిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం

  నమామి భగవత్పాదం  శంకరంలోక శంకరం."

 

" హరం త్రిపురభంజనం అనంతకృత కంకణం అఖండదయం అంతరహితం

  విరించి సుర సంహతి పురందర విచించిత పదం తరుణచంద్ర మకుటం

   పరం పద విఖండిత యమం భసిత మండిత తనుం మదన వంచన పరం

   చిరంతనమముం ప్రణవ సంచితనిధిం పర చిదంబర నటం  హృది భజ."

  అని పతంజలి చే స్తుతింపబడిన త్రిపురహరుని మనములో త్రికరణ శుద్ధితో నిలుపుకుని, ఈనాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.


  పిల్లలు శంకరయ్య చుట్టుముట్టి,కనకసభకు చేరుకునేలోగా మ0చికథను చెప్పమని అడిగారు.


 ఎవరికథ ఎందుకు? నా కథ చెబుతాను అన్నాడు వారితో.మీకథ చెబుతారా-బాగుంటుందా అని అడిగారు పిల్లలు.

 విన్న తరువాత మీరే చెప్పాలి ఎలావుందో?

 

   ఒకానకొప్పడు శంకరయ్య శివునిమీద చాలా కోపముతో ఉండేవాడు.మోసగాడు అనుకునేవాడు.మనసు-వాక్కు-పని శివునికినమస్కరించమంటే మొరాయించేది.

  ఎందుకు?అమాయకముగా అడిగారు పిల్లలు.

 ఎందుకంటే చెప్పుడు మాటలు విని అవే నిజమనుకుని నమ్మి ...కళ్ళుమూసుకున్నాడు శంకరయ్య.

 అంతే.నా కోపాన్ని కూడా నాతోపాటే పెంచాను.

  నీలాగా ఎవరైన ఇదివరకు చేసారా? కుతూహలముతో అడిగారు శంకరయ్యను పిల్లలు.

  పూర్వము తారకాసురుడను రాక్షసుని ముగ్గురు కొడుకులు నాలాగే కోపమును తమతో పాటుగా పెంచుతూ,తమ సత్తా /బలమును చాటాలనుకున్నారు.వారే తారకాక్షుడు, కమలాక్షుడు,        
  విద్యున్మాలి,.....

 వాళ్ళ నాన్న లాగా వారు చనిపోకూడదనుకున్నారు.అందుకు వరము పొందాలని తెలిసికున్నారు.

 బ్రహ్మదేవుని గురించి తీవ్రమైన తపస్సును చేసారు.

 అప్పుడు,

 ప్రపంచమల్లకల్లోలమయినది.గ్రహగతులు వక్రిస్తున్నాయి.ఇంకతప్పదని వారి ముందు "బ్రహ్మదేవుడు" ప్రత్యక్షమయినాడు..

 ఆనందముతో వారు ముగ్గురు బ్రహ్మదేవుని స్తుతించారు.సంతోషముతో బ్రహ్మ వారిని ఏదైనా వరము కోరుకోమన్నాడు.

 మేము ముగ్గురము ఎవరి చేతిలోను మరణించకూడదు.ఎప్పుడు జీవించి ఉండాలి అన్నరు వారు.

 అది అసంభవము.నేను సైతము ప్రళయకాలములో సమసిపోతాను.కనుక నేను ఆ వరమును ఇవ్వలేను.ఇంకేమైనా కోరుకోండి అన్నాడు బ్రహ్మదేవుడు.

 అప్పుడు వారు బాగా ఆలోచించి,

 ముందు మాకోసము ఒక బంగరము నగరము-ఒక వెండి నగరము-ఒక  ఇనుపనగరమును  నిర్మించాలి అన్నారు. 

 అది సరే మీరు ఏమివరమును కోరుకుంటున్నారో చెప్పండి అన్నారు బ్రహ్మగారు.

 అదే మేము చెప్పబోతున్నాము.

1 మీరు మాకు నిర్మించి  ఇచ్చిన  ఆ మూడు నగర ములు ఆకాశములో ఆగకుండా తిరుగుతుండాలి అన్నారు.

 ఎప్పుడు అంటే కుదరదు కాని పదివేల దివ్య సంవత్సరములకు ఒకసారి సరళరేఖలోకి ఒక్క నిమిషము వస్తాయి.అప్పుడు నా వరము ఫలించదు అన్నడు వారితో.


 ఫరవాలేదు పుష్కలావృత మేఘములు అదియును చంద్రుడు పుష్యమి నక్షత్రములో  ఉన్నప్పుడు మేము సరళరేఖలో పయనించుచుందగా మాత్రమే కురియాలి.అదియును, 
మిట్టమధ్యాహ్నము/అభిజిత్ లగ్నములో   అప్పుడు బానముకాని బాణముతో అదియును ఒకేఒక బానమును ప్రయోగించి,మమ్ములను....అన్నారు.ఆ ఒక్క సమయమున తక్క మిమ్ములను ఎవరు జయించలేరు అన్నాడు బ్రహ్మదేవుడు వారితో.

  ఆ తరువాత ఆసక్తిగా వింటున్నారు పిల్లలు.

 ఆలస్యమవుతుందేమో మనము ఆలయమును చేరటానికి అన్నాడు శంకరయ్య.

  మేము చకచకనడుస్తాములెండి.

  వరమును పొందిన తరువాత ఏమి జరిగింది చెప్పండి శంకరయ్యగారు...

 వారు ధర్మమును తప్పితే తప్ప వారిని మహేశుడు సైతము ఎదిరించడు కనుక వారిని ధర్మముగతి తప్పించుటకై ఒక పురుషుని సృష్టించి,చేతిలో కపాలమునుంచి,ధర్మమును భిక్షగా అడగమన్నారు.

 మరొక పురుషుని సృష్టించి అధర్మ ప్రచారమును త్రిపురములలో విస్తరింపచేయమన్నాడు.దానికి వత్తాసుగా నారదునిచే ఆచరించుచున్నట్లుగా వారిచే భావింపచేశాడు.

 పాపం ఆ త్రిపురములలో ధర్మము-ధర్మముతో పాటుగా ఈశ్వరభక్తి లోపించసాగినది.

 యుద్ధమునకు సమయమాసన్నమయినది.సంబారాలు సంసిద్ధమయినాయి. 

  పిల్లలు ముఖమంతా చెవులు చేసుకుని వింటున్నారు.వళ్ళంతా కళ్ళుచేసుకుని శంకరయ్యను చూస్తున్నారు.



 గుడిగంటలు మ్రోగాయి.

 ఇంకా పదినిమిషాలు పడుతుండి తాండవానికి.

 ఆ సంబారాలు ఏవిటో చెప్పండి శంకరయ్యగారు. 

 నవ్వుతూ,అవా...

1. సమస్తమండలముల సారము-రథము

2.సూర్య-చంద్రులు-రథచక్రాలు

3.ద్వాదశాదిత్యులు-రథచక్రములయొక్క ఆకులు

4.ఉత్తర-దక్షిణాయములు-శీలలు

5.ఋతువులు-కమ్ములు

6.ఆకాశము-కప్పు

7.ఆసనము-మందరపర్వతము

8.కొండలు-రథముమొదలు

9.సంవత్సరములు-వేగము

10.పంచభూతములు-బలము

11.పురాణములు-గంటలు

12.సరస్వతి-ముఖ్యగంట.

13.బ్రహ్మ-సారథి

14.ప్రణవము -కొరడా

15,నక్షత్రములు-అలంకారములు

16.నదులు-వింజామరలువీచు స్త్రీలు

17.ఆదిశేషుడు -వింటినారి

18.మేరుపర్వతము-విల్లు

19హరి-బాణము

20.నాలుగు వేదములు-గుఱ్ఱములు

 అమ్మ బాబోయ్.భలేభలె.

  రథము కదిలిందా? వారు చనిపోయారా?

 చెప్పండి శంకరయ్య గారు

  నిట్టూరుస్తూ,
 గుఱ్ఱములు బ్రహ్మ మాట కాదనలేక-తమ ధర్మమును విడువలేక తమ

 మోకాళ్ళపై కూర్చుండిపోయినాయి. ఇంకెక్కడి యుద్ధము?

 శంకరయ్యగారు తలుపులు మూస్తున్నాము.త్వరగా రావాలి అంటూ ఆలయమునుండి హెచ్చరికను విని, 



 " నతిభిః నుతిభిః త్వమీశ పూజా

   విధిభిః ధ్యాన సమాధిభిః న తుష్టః

   ధనుషా ముసలేన చాశ్మభిర్వా

   వదతే ప్రీతికరం  తథా కరోమి." అనుకుంటూ,                 అటుగా కదులుతున్నారు.

  కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.

    'తన్మై మనః శివ సంకల్పమస్తు
     వాచే మమశివపంచాక్షరస్తు
     మనసే మమ శివభావాత్మ మస్తు".
     పాహిమాం  పరమేశ్వరా.
    (ఏక బిల్వం  శివార్పణం)


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...