Wednesday, December 13, 2023

POST-28


  ఇదేయం  త్వాం  పశ్యామి-02
  కదా  త్వాంపశ్యేయం-28
 ****************************

 " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం

   నమామి భగవత్ పాదం శంకరం లోకశంకరం"

 " నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే

   నమస్తే నమస్తే చిదానంద మూర్తే

   నమస్తే నమస్తే తపోయోగ గమ్య

   నమస్తే నమస్తే శ్రుతి జ్ఞానగమ్య"

    అంటు సదాశివునకు నమస్కరించుకుంటూ,శంకరయ్యతో పాటుగా మనము ఈనాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.

  " మన ఏవ మనుష్యాణాం-కారణం బంధ-మోక్షయోః"

 ఎంతటి అమృత వాక్యమిది.

 మనుషులకు జగత్తులో బంధానికైనా/ముక్తికైనా మనసే కారణం కదా.

 అతిచంచలమైన మనసు-అజ్ఞానముతో జతకలిపి "సత్-చిత్పదార్థముబు" అన్యపదార్థముగా భావింపచేస్తూ భంగపడుతుంటుంది.

 ఆ మోసగానిని పట్టుకోవాలని బయలుదేరిన నేను ఆ ఆటవికుని దర్శనముచే ,కొత్త అనుభూతికి లోనగుచున్నాను.

 కదలమంటున్న శివుడు-కదలలేనంటున్న జీవుని,

 తస్యైవాహం/ తస్య ఏవ అహం, అను విషయమును తెలియచేసి,దానినుండి,

  మమ ఏవ అసౌ అను దారికి మళ్ళించి,క్రమముగా

 స ఏవ అహం అను గమ్యమునకు చేరుస్తోంది.

  శంకరయ్య మనసు క్రమక్రమముగా,

 1శివా! నేను నీకు చెందినవాడను  అన్న స్థితిని దాటి-కాదు-కాదు

  2.నువ్వు నాకు చెందినవాదవు అనిపించింది. 

 అంతటితో తృప్తిని చెందక,

 అసలు నువ్వు-నేను అంటూ ఇద్దరు ఎక్కడ ఉన్నారు?

 నువ్వే నేను-నేనే నువ్వు అని నమ్మకం కలిగిస్తున్నాడు ,ఆ శివుడు శంకరయ్యకు.

 " సంధ్యాఘర్మ దినాత్యయో హరికరాఘాత ప్రభూతానక

  ధ్వానో వారిద గర్జితం దివిషదాం దృష్టి ఛ్చటా చంచలా

  భక్తానాం పరితోష భాష్ప వితతిః వృష్టిః మయూరీశివా

  యస్మిన్నుజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే."

 అమ్మా! జగదంబ! నీవు నల్లని మబ్బువై స్వామి తాండవము వీక్షించుటకు రాగానే మా నీలగ్రీవుడు పురివిప్పిన నెమలివలె పులకరించి , ఉజ్జ్వల తాండవతున్నాడు.అదిగో హరి తనకరములతో మద్దెల వాయిద్యమును మహదానందముగా వినిపించుచున్నాడు.కాని విచిత్రము అవి మా   హర్షవర్షములో ఉరుములవలె గర్జించుచున్నవి.అదిగో ఆ పులకాంకిత దేవతా దృష్టులు మెరుపులవలె భాసించుచున్నవి.భృంగీ-నంది-పతంజలి-వ్యాఘ్రపాదాది,
భక్తాగ్రేసరుల ఆనంద భాష్పములు "మయూరీశివా తాండవ-లాస్యముల" మేలుకలయికయై మమ్ములను ఆశీర్వదించుచున్నది.అని మైమరచి పోతుండగా, శంకరయ్యగారు,

  మనము కాసేపు శివ-(శివాలాస్య) తాందవమును గురించి సరదాగా అవునంటే-కాదనిలే/కాదంటే అవుననిలే అనిముచ్చటించుకుందాము.సరేనా అని అనగానే,నేనా? మీతోనా? ...

 సందేహించవద్దు శంకరయ్యగారు .మీరందుకు సమర్థులే.మూడేమూడు ఆవృత్తములు.అంతే అన్నారు.

 " నటనం ఆడెనే

   భవ తిమిరహంశుడా పరమశివుడు

   నటకావతంశుడై  తకదిమి తకయని

   నటనం ఆడెనే"


  శ్రావ్యముగా వినిపిస్తోంది  ప్రారంభించమన్నట్లుగా అక్కద.
  మొదటి అంశము,

 1.శివుడు శ్మశానములో నర్తిస్తుంటాడు.

  శంకరయ్యగారు అవునా/కాదా.

  జవాబు చెప్పండి శంకరయ్యగారు.

  శంకరయ్య గొంతును సవరించుకుని,

 అవును మహేశుడు శ్మశానములో నర్తిస్తుంటాడు.కాని అది ఉపాధి చివరకు చేరు వల్లకాడు కాదు అన్నాడు గంభీరముగా.

 అది భ్రమలతో నిండిన బంజరుభూమి.అక్కడ కాలుతున్నవి అజ్ఞానమనే-అహంకారమనే శవాలు.దాని నుండి ఆవిర్భవించేది జ్ఞానమనే ప్రకాశము .ఆ ప్రకాశమును దిగ్దిగంతముల వ్యాపింపచేయు విన్యాసమే తాండవము.


 ఇది నేను,

 సత్సంగేన భవతి శ్రవణం అని పక్షుల ద్వారా నేర్చుకున్నాను అన్నాడు.

 2.శివుడు సంధ్యా తాండవమును జరుపుతాడు.

   నిజమా/కాదా ?

  అవును మహాదేవుడు సంధ్యా తాండవమును జరుపుతాడు.కాని అది మనమనుకునే సాయంకాలము ఏమాత్రమును కాదు.ప్రదోష సమయ తాండవము.చతుర్దశిని ప్రదోషము అనికూడా అంటారు.

 ప్రతి జీవి తన జాగ్రదావస్థలో తెలిసి/తెలియక ఎన్నో దుష్కర్మలను చేస్తుంటాడు.చీకటిపడే సమయమునకు ముందుగా వాటిని పశ్చాత్తాపముతో ప్రాయశ్చిత్తము చేసికొనమని సూచించుటకే ఆ ప్రదోష తాండవము.

 ఈ విషయమును నేను స్కూలుపిల్లల నాటకములో చూసి తెలుసుకున్నాను.

  3.శివుడు చిదంబరములోని కనక సభలో 

 "నమో నమో నటరాజ నమో

  హర జటాజూటధర శంభో"

 అని స్తుతిస్తుండగా తాందవమాదతాడు.

  నిజమా/కాదా.

 అవును .నిజమే.అది చిదంబరమే .కాని కేవలము థిల్లైవనమున్న పుణ్యక్షేత్రము మాత్రమేకాదు..

 చిత్-మన మనసు-అంబరము-ఆకాశము,

 ఆకాశమునే శూన్యముగాను భావింపవచ్చును/పూర్ణము గాను భావింపవచ్చును.

 పంచభూతములను తనలో విలీనముచేసికొనినప్పుడు పూర్ణము .తన  నుండి విడివిడిగా ప్రకటించినపుడు శూన్యము.


 "ఎప్పుదైతే మన మనసులోని  విషయవాసనలు విడివడి,నిష్కల్మషముగా/నిశ్చితముగా/నిశితముగా పరమాద్భుతమును చూడగలుగుతామో అప్పుడు సకలము సంకోచించి-సూక్షమై ,సూక్ష్మతరమై-సూక్ష్మతమమై-సింధువు-బిందువై-బ్రహ్మాండము-పరమాణువై మనలోనే ఒదిగిఉందన్న సత్యమును గ్రహిస్తాము."

 అప్పుడు మన ప0చేంద్రియములు-బుద్ధి-మనసు ఒకటై ఒప్పటమే ఆ విశ్వేశ్వరుని విశ్వతాండవము.

 అంతే శివ-శివానీల హేలవైభవము కైలాసములోను జరుగుతుంది.చిదంబరములోను జరుగుతుంది.చిత్తములోను జరుగుతుంది నిరంతరంగా.మీకొక సందేహము కౌగవచ్చును
  మరి బాహ్యములో తాండవము ఎందుకు అని?
  మన దృష్టి సంకుచితమగుటచే మనము సూక్ష్మమును గ్రహించలేము.కనుక విస్తరించి,నర్తించి,మన అంతరంగమును/అంతఃదృష్టిని విస్తరింపచేస్తుంది.
  దృష్టి విస్తరిస్తే-దృశ్యము సూక్ష్మముగా మారుతుంది.ఇదంతా  మనము పరమాత్మ తత్త్వమును అర్థముచేసికొనుటకు మాత్రమే.

 మన దృష్టి ని అంతర్ముఖము చేయుటకు వారు బహిర్ముఖులుగా బ్రహ్మ-విష్ణు-సరస్వతి-లక్ష్మి-ఇంద్రాదుల విన్యాసములతో కనపడుతుంటారు.దృష్టిని నిశితము చేస్తూ వారు సైతము నాద-బిందు-కళాత్మకమగుతారు,

 అన్నింటిని ప్రణవముగా క్రోడీకరంచి మన ప్రణ తులను-ప్రణుతులను అందుకుంటూ-ఆశీర్వదిస్తుంటారు అంటుందగా ,

 పదండి-పదండి పరమేశ్వర తాందవము ప్రారంభము కాబోతున్నదని శంకరయ్యను తీసుకుని వెళుతున్నారు.

 ఇంకనుండి శంకరయ్యదృష్టికి ప్రతిదీ ప్రత్యేకమే.పరమేశ్వరమే.  

కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.
    'తన్మై మనః శివ సంకల్పమస్తు
     వాచే మమశివపంచాక్షరస్తు
     మనసే మమ శివభావాత్మ మస్తు".
     పాహిమాం  పరమేశ్వరా.
    (ఏక బిల్వం  శివార్పణం)


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...