Sunday, March 31, 2024

ADITYAHRDAYAMU-SLOKAMU-31

 


  ఆదిత్యహృదయము-శ్లోకము-31

  ***********************

 ప్రార్థన

 *******

 "జయతుజయతు సూర్యం సప్తలోకైక దీపం

  హిరణసమిత పాప ద్వేషదుఃఖస్యనాశం

  అరుణకిరణ గమ్యం ఆదిమాదిత్యమూర్తిం

  సకలభువనవంద్యం భాస్కరం తం నమామి."


 పూర్వరంగము

 ***********

 పరమాత్మ పన్నెండు నెలలు ఋతుచక్రమునకు అనుకూలముగా తనపరివారమును-తానుసైతము మలచుకుని,ద్వాదశాదిత్యులుగా దర్శనమిస్తున్నాడో,ఏ విధముగా సకలజగములను సకలగ్రహములను సంరక్షించుచున్నాడో,ఏ విధముగా సర్వపాపములను నశింపచేయుచున్నాడో వివరించిన అగస్త్యభగవానుడు,చివరి శ్లోకములో ,

 మహేంద్రః ధనదః కాల యమ గా అలరారుతున్న పరమాత్మ సూర్యభగవానునిగా ప్రకటితమగుచు,రావణాసురునికి అంత్యకాలము సమీపించినదని తెలిపి,రాముని రణోన్ముఖుని చేస్తూ,ఆశీర్వదించి తరలినాడట.

 శ్లోకము

 ******

 "అథ రవిరవదన్నిరీక్ష రామం

  ముదిత మనాః పరమం ప్రహృష్యమాణః

 నిశిచరపతి సంక్షయం విదిత్వా

 సురగణ మధ్య గతో వచస్వరేతః"

   ఇతి శ్రీమద్రామాయణే యుద్ధ్ధకాండే

   ఆదిత్యహృదయ స్తోత్రం సంపూర్ణం."

  ఎంతటి చమత్కారి ఈ అగస్త్యభగవానుడు.రాముడు సూర్యుని ప్రార్థించగానే పరిస్థితిని గ్రహించి,రామునకు జయము-రావణునకు క్షయము కలుగు సమీపమును గ్రహించి,ఆనంద మనస్కుడై రాముని దీవించి,

 సంతుష్టుడై తరలినాడట.

 ఆదిత్యహృదయస్తోత్రము రామునకు ఉపదేశిస్తున్నట్లుగా భావింపచేస్తు ఎంతటిచమత్కారమును చేసినాడో అగస్త్యభగవానుడు.
 మన చేత అటుచూడండి,రాముడు యుధ్ధభూమిలో చింతాశోకముతో నిండియున్నాడు.ఎదురుగా వచ్చిన రావణునిచూశాడు.రామ రామమహాబాహో అంటూ మాటి మాటికి రామనామస్మరనమును మనచే చేయించాడు.
 నిశితముగా పరిశీలిస్తే నామికి-నామమునకు భేదములేదని అర్థమవుతుంది.

Friday, March 29, 2024

ADITYAHRDAYAM-SLOKAM-30

 


 ఆదిత్యహృదయము-శ్లోకము-30

 ***********************

 ప్రార్థన

 *******

" జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం

  హిరణసమిత పాపద్వేష దుఃఖస్యనాశం

  అరుణ కిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం

  సకల భువన వంద్యం  భాస్కరం తం నమామి."


   పూర్వ రంగము.

   ***********


  


 మనముఇప్పటివరకు సూర్యభగవానుని కరుణామృతవర్షమును గురించి తెలుసుకునే ప్రయత్నములో ఒక్కసారి 'పదకవితా పితామహుడైన

తాళ్ళపాక అన్నమాచార్య కీర్తనను ప్రస్తావించుకుందాము.


 " నీవొక్కడివే సర్వాధారము

   నిన్నే ఎరిగిన అన్నియునెరుగుట

  .....

 నీ యందె బ్రహ్మయు రుద్రుడు ఇంద్రుడు

  నీ యందె ఋషులు

 నీయందె గరుడ గంధర్వులు

 నీ వలననె కిన్నెర కింపురుషులు

 నీ వలననె అచ్చరులు ఉరగులు 

  ఎంతటి అద్భుతము

" నీ యందె ద్వాదశాదిత్యులు"

   ఓ పరమాత్మ! ఓ పరంధామ

 నీలోనె అన్నియును

 నిన్నర్చించిన -నిఖిల తృప్తికరము అని ప్రత్యక్ష పరమాత్మ తత్త్వమును ప్రస్తుతించినాడు.

 మరొకమహానుభావుడు,

 నారాయణా! నారాయణా

 నను కావుమో సూర్యనారాయణా అంటూ,

 " ఈ విశ్వమే నీకు రథమగునులే

   ఏకైకచక్రము కాలంబులే

   ఆ  ఏడు రంగులే గుఱ్ఱాలులే

   ఆకాసమే నీకు రహదారులే అని స్తుతిస్తూ,

 వేదపురుషుని చక్షువుగా సూర్యభగవానుని గుర్తించారు.

  ఇక్కడ మనము తెలుసుకోవలసిన రెండు ముఖ్య అంసములు 

1. ఎవరు ఈ ద్వదశాదిత్యులు?పరమాత్మ పన్నెండు నామరూపములతో పాలించుటలోని ఆంతర్యమేమిటి?

2.పరమాత్మ రథ గమన వైశిష్ట్యము ఏమిటి? 

  స్వామి సర్వమంగళములకు మూలము తానై 

 ఏవిధముగా ప్రకాశిస్తున్నాడో తెలుసుకుందాము.


 అసలు ఎవరు ఈద్వదశాదిత్యులు? అన్న ప్రశ్నకు

 మహాభారతము ఈవిధముగా వివరిస్తున్నది.

 సంవత్సరములోని పన్నెండు నెలలకాలములో సూర్యుడూండే స్థితులను బట్టి పరమాత్మ ద్వదశాదిత్యులుగా కీర్తింపబడుతున్నాడు.

 " ధాతామిత్రః అర్యమా శక్రోవరుణస్త్వంశ ఏవచ

  భగో వివస్వాన్ పూషాచ సవితా దశమస్తథా

  ఏకాదశ స్తథా త్వష్టా ద్వాదశోవిష్ణురుచ్యతే

  జఘన్యజస్తు సర్వేషాం ఆదిత్యానా గుణాధికః"


 భాగవతము సైతము స్శౌనక-సూత సంభాషణముగాద్వదశాదిత్యులను ప్రస్తావించినది.ఈపన్నెండుగురు ఆదిత్యులను విష్ణువు యొక్కసూర్యరూప విభూతులుగాకీర్తించినది.

 అంటే కాలస్వరూపమైన ఏకచక్రమున సమస్తలోకములను రథముగా మలచుకొని,ఏడురంగుల ఆశ్వములతో ఏడువిధములైన పరిచర్యలతో సూర్యరథ గమనము జరుగుచున్నదన్నమాట.

  ఏవరు ఆ ఏడువిధములైన పరిచర్యలను చేయువారో ఒక్కసారి ప్రస్తావించుకుందాము.

1.దేవతలు

2,ఋషులు

3.యక్షులు

4,గంధర్వులు

5అప్సరసలు

6.ఉరగులు/నాగులు

7.రాక్షసులు ,

 స్వామికి రథగమనములో పరిచారకులుగా వ్యవహరిస్తారు.

 ఆదిత్యహృదయస్తోత్రములో,

1. పరమాత్మ తననుండికొన్ని శక్తులను ప్రకటింపచేసి,వానికిసృష్టి-స్థితి-లయమొదలగు కార్యములనునియమించి,బ్రహ్మ-విష్ణు-మహేశులను గౌణనామములనుసంకేతించినది.

 2.ఋషుల విషయమునకు వస్తే మనము ముందూంగుష్టమాత్ర పరిణామముతో సూర్యకిరనములనుఆలంబనము చేసుకొని అనవరతమువర్ద మంత్రములను పఠించు వారిని స్మరించుకోవాలి.

 వాలిహ్యము అంటే అఖండము.వేదవేద్యునికిరనములే వేదమంత్రములు.వీరి నాదమే "ప్రణవముఘా" కూడా భావిస్తారు.

 ప్రతి మాసములో ఒక్కొక్క ఋషి రథగమనమునకు నాందిగా వేదోచ్చారనముతో రథగమనమునునిర్దేశిస్తాడు.

3 యక్షులు వీరూపదేవతలు.వీరు స్వామి రథమునకు అశ్వములను/కిరణములను అనుసంధానము చేస్తారు.

4.ఉరగులు/నాగులు అశ్వలకు-రథమునకు పగ్గాలను అనుసంధానము చేస్తారు.కొందరి భావనప్రకారము వారే పగ్గాలుగా మారతారు.

 5గానం ధారయతి గంధర్వాంటారు.వీరు స్వామి రథగమనమునకు,వృక్షసంపద/భూసంపదకి వృద్ధికరమగు నాదమును చేస్తూ సాగుతంటారు.వీరికి అనుగుణముగా

 6 ఆపో-రసః జలశక్తులు అప్సరస అను గౌణ నామముతో సూర్య రథమును అనుసరిస్తూ ఇరన రూపములో ముందుకు/కిందకు సాగుతారు.

7.రాక్షసులు స్వామి రథమునకు వెనుకనిలబడి దానిగమనమునకు తగిన శక్తినీస్తూ వస్తుంటారు.తమో స్వభావముకల వీరు కిరనరూపములో చీకటిని కలిగించి,చంద్రునికి వెన్నెల.ఔషధములు తయారగుటకు సహాయ పడతారు.

  స్వామి ఋతుకర్త కనుక ప్రతి మాసమునందును ఈఏడు శక్తులను తమ సమీకరనములను మార్చుకుని,తదుపరి నెలకు సహాయ పడుతుంటాయి.

  ఆకిరణ వర్గీకరనమే ఆహారమునకు,ఔషధములను,భూగర్భ సంపదలకు గ్రహ గమనమునకు మూల కారనము.కానిమన చర్మచక్షువులు వృక్ష సంపదను ప్రకృతి మార్పులలో కొంతభాగమును మాత్రమే వీక్షించగలవు.

 ఈ ద్వదశాదిత్యులు తమ పరిజనములులను/కిరణసమొహములను అనుగుణముగా మలచుకుంటూ సమతౌల్యమును పాటించుచుపరిపాలించుటయే శ్లాఘనీయమైన

"సర్వ మంగళ మాంగల్యము.



Tuesday, March 26, 2024

 


 ఏక ఏవహిలోకానాం సూర్య ఆత్మాదికృత్ హరిః-భాగవతపురాణము.

 ప్రంచ స్థితికి పూర్వస్థితిచీకటియే కదా.తమోగుణప్రధానులైన హర్తి-ప్రహేతిమొదలగు రాక్షసులు సూర్యభగవానుని రథమును ముందుకుజరుపుతుంటారు.

 సూర్యభగవానునిప్రతికిరనము నాదమయమే.ధర్మసంకేతము.

 నాదాత్మకమైన సూర్యకిరన శక్తియే గాయత్రీమంత్రము.

 గాతారం ధారయతీతి గంధర్వః.గానధరులు గంధర్వులు.

 చాందగ్యోపనిషత్తు సూర్యపరమాత్మ నుండిజనించు నాదమును ప్రణవముగా కీర్తిస్తుంది.

 వాలిఖ్యాది మునులు సూర్యకిరనములనాశ్రయించుకుని తపోసంపన్నులుగా అలరారు తున్నారు.

వారుసూర్యరథమునకు అనవరతముమంగళాశాసనములనుసమర్పిస్తుంటారు.వాలిఖ్యము నగాఖండము.

ప్రతిసూర్యమాసమునందు ఒక్కొక్క ఋషి రథముకదలబోవు సమయమున దానికి ముందునిలబడి,స్వామి రథగమనమును సంకేతిస్తారట.

 పాతాళలోక సాంరక్షణమునకు స్వామిని సర్పములు స్వామి రథ పగ్గములను సవరించి,పయనమునకు సిద్ధము చేస్తాయట.

 ఋషులు-గంధర్వులు-యక్షులు,నాగులు,రాక్షసులు-అప్సరసలు దేవతలు అను సప్పగనములతో సేవింపబడుతూ స్వామిసర్వమంగళములనూనుగ్రహిస్తాడు.

 యక్షులు వీరూపదేవతలు.వీరు స్వామి రథమునకూశ్వములనూనుసంధానముచేస్తుంటారు.భూగర్భ సంపదలను వృక్ష సంపదలనుకాపాడుతుంటారు.

 


 శ్లోకము

 *******

 " సర్వ మంగళమాంగల్యం సర్వపాప ప్రణాసకం

   చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం."


  ఆదిత్యహృదయ స్తోత్రము సర్వమంగళములకు మూలాధారము.సర్వపాపములను నశింపచేయునది.చింతాశోకనిర్మూలమునకు కారణభూతమైనది.

  

మనము ఆదిత్యహృదయ స్తోత్ర సారమును పదకవితాపితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు ఒక చక్కటికీర్తనతో అర్థమయేలా వివరించారు.

 "నీవొక్కడివే సర్వాధారము

  నిన్నే ఎరిగిన అన్నెయు నెరుగుట

  అంటూనే సర్వము గురించి విశదీకరించారు.

 1.నీ యందె బ్రహ్మయు రుద్రుడుఇంద్రుడు

   ఆదిత్యహృదయము సైతము

  ఏషబ్రహ్మాచ-విష్ణుశ్చ-శివ-స్కంద అంటూ,

  దేవతలప్రసక్తి తెచ్చినది.

  పరబ్రహ్మపరిపాలన నిమిత్తము తననుండి కొన్ని శక్తులను ఆవిర్భవింపచేసి వారిలో/వాటిలో తాను ప్రవేశించి పరిపాలించుచున్నాడు.

 2.నీ యందె మనువులు-వసువులు-ఋషులు 

  సూర్యనారాయణుడు పన్నెండు సౌరమాసములకు అదే మధుమాసము-మాధవమాసము ఇత్యాది పన్నెండు విభాగములకు పన్నెండు స్వరూప-స్వభావములతో,నామరూపములతో సృష్టి-స్థితికార్యములను నిర్వహిస్తున్నాడు.ఆ విషయమునే,

 3.నీ యందె ద్వాదశాదిత్యులు" అనినొక్కి వక్కాణించాడు.

   వారు ఎవరితో/ఏ ఏ శక్తులతో ఏ ఏ విధముగా గ్రహములమధ్యన,భూభ్రమనమునందు ,జలవనరుల,వాతావరనపరిరక్షనమునందు,ఒకరికొకరు సహాయపడుతూ ఋతుచక్రమును సమర్థవంతముచేస్తారో వివరించాడు.

  4. నీ యందె ఉరగులు-యక్ష-రాక్షసులు

  5.నీ వలననేచ్చరలు-కిన్నెర కింపురుషులు

  6.గ్రహములు-నక్షత్రములు

    నీలోనె అన్నియును

    నిన్నర్క్హించిన నిఖిలతృప్తికరము,


   అసలు ఈ దంధర్వులు,మునులు,యక్షులు,నాగులు,కిన్నెరలు,రాక్షసులు,అపసరసలు వీరిప్రసక్తి ఎందుకు వచ్చింది.వీరికి పరమాత్మతో నున్నానుబంధం ఏమిటి? అని ఆలోచిస్తే,

   సూర్య పురానము సైతము సూర్య రథగమనసమయమునవీరందరి ప్రాముఖ్యతన చక్కగా వివరించింది.

Sunday, March 10, 2024

ADITYAHRDAYAM-SLOKAMU-29


  




  ఆదిత్యహృదయం-శ్లోకం-29


  ********************


 ప్రార్థన


 *******




 'జయతుజయతు సూర్యం సప్తలోకైకదీపం


  తిమిర హిరణ పాప  ద్వేష  దుఃఖస్య నాశం


  అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం


  సకలభువన వంద్యం భాస్కరం  తం నమామి."





  పూర్వరంగం


  **********


 ఆదిత్య అనుగ్రహముతో నష్టశోకుడైన రాముడు ప్రియమనస్కుడై కర్తవ్యోన్ముఖుడైనాడు.రావణుని,రాజస-తామసములను నిర్మూలించుట కు,ధర్మ సంస్థాపనమునకై ధనుర్ధారియైనాడు.



 శ్లోకము


 ******


 " రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్


   సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్."




 ఉత్సాహభరిత అంతరంగముతో తనతో యుద్ధముచేయుటకు వచ్చుచున్న రావణుని వధించుట కు రాముడు కృతనిశ్చయుడాయెను అన్నది కథనము.


  దీనిలో దాగిన మర్మము మహాద్భుతము.


 భగవద్గీతలోని గుణత్రయవిభాగమును  మనకథనమునకు అన్వయించుకుంటే మనము సూక్ష్మమును గ్రహించినట్లే.




  ఇది యుద్ధరంగము.లంకాద్వీపములో జరుగుచున్నయుద్ధము.ధర్మ సంరక్షణమునకు జరుపుచున్నయుద్ధము.


 రాముడు-రావణుడు యుద్ధమును చేయుచున్నవారు.


   వీరిద్దరిలోను సమయానుకూలముగా త్రిగుణములు వాటి ప్రభావమును చూపిస్తున్నాయి.


 తమో గుణము-మోహ కారకము.


 రజోగుణము-కార్య కారకము,అంటే,


 మానసికముగా నున్న మోహమును కార్యరూపముగా మలచుటకు సహాయ పడుతుంటుంది.ఈ రెండు గుణములు ఉదృతముగానున్నసమయములో సత్వగుణము సద్దుమణిగి యుంటుంది.

 సత్వ గునము కర్మలను ఆచరిస్తుందికాని ఫలితములను ఆశించదు.ప్రకాశవంతము.స్థిరము.ధర్మావలంబము.


  మనము గమనిస్తే ఈ మూడు గుణములు రాముని-రావణుని అనేక భావావేశములకు గురిచేసాయి.


  కాకపోతే,


 యుద్ధ  ప్రారంభదశలో తమో గుణమోహితుడై,రావణుని ఏ విధముగా ఎదుర్కొనాలో తెలియక తికమకపడేట్లు రాముని చేసినది.తమోగుణము.రామునికి ధర్మస్వరూపమైన సీత మీద వీడలేనిమోహమును కలిగించింది.


  అట్టి స్థితిలో తమోగుణము రజోగుణమునకు చేయూతనిస్తూ రాముని చింతాక్రాంతునిచేసినది.కాని,అగస్త్యభగవానుడు "ఆదిత్యహృదయ స్తోత్రమును ఉపదేశించి,


 రాముని తేజోమయునిగా-ఉత్సాహ భరితునిగా-కార్యదక్షునిగా సత్వగుణముచే ప్రకాశించేసాడు.కనుకనే రాముడు యుద్ధము చేయుటకు ఉత్సాహముతో నున్నాడు.సత్వము తమో రజో గుణములను అణిచివేయగా సంకల్పించుకున్నది.సన్నద్ధమైనది.


 కాని ,రావణుని పరిస్థితి దానికిపూర్తిగాభిన్నము.


 ఒకానొకప్పుడు రావణుడు శివ తాందవ  స్తోత్రములో సత్వగుణశోభితుడైనాడు.సదాశివుని భజిస్తూ,


 1.దృషద్ విచిత్ర తల్పయో


 2.భుజంగ మౌక్తికస్రజో


 3.గరిష్ఠ రత్న లోష్టయో


 4.తృణారవింద చక్షుషో అంటూ.


  కటికనేలను-మెత్తటి పరుపుని,


  పామును-ముత్యాల హారమును


  రత్నమును-రాయిని ఎప్పుడు సమదృష్టితో చూడగలిగి,


 విముక్త దుర్మతి నీకు,


 శిరస్థం అంజలిం  కురు అని వాపోయాడు.


 కాని అది నిలువలేదు.


 లంకకు తిరిగి వచ్చాడు.శూర్పణఖ మాటలు విన్నాడు.అంతే,


 సీత పై మోహముగా తమోగుణము తైతక్కలాడించింది.అంతేకాదు సీతను అపహరించమంటూ రజోగుణాన్ని సైతము ప్రేరేపించింది.ఈ జంట రావణుని కడవరకు వీడలేదు.సత్వమును పైకి రానీయలేదు.ఒకవేళ అలాకనుకజరిగితే సీతమ్మను రామునికి అప్పగించేవాడే రావణుడు.


 రాముడు తమోగుణమును దాటి-రజో గుణమును దాటి-సత్వగుణశోభితుడైనాడు.


 రావణుడు సత్వమును విడిచి తమో-రజో గుణములకు వశుడై కీడు తెచ్చుకున్నాడని అర్థమగుచున్న వేళ,


 తం  సూర్యం  ప్రణమామ్యహం.





Saturday, March 9, 2024

ADITYAHRDAYAM-SLOKAM-28


 


    


  ఆదిత్యహృదయము-శ్లోకము-27


  **********************


 ప్రార్థన


 ******


 "జయతుజయతుసూర్యం సప్తలోకైక దీపం


  తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం


  అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం


  సకలభువనవంద్యం భాస్కరం  తం నమామి.




  పూర్వ రంగము


  ********


 అగస్త్య భగవానుడు ఆదిత్యస్తోత్ర ప్రభావమును ఉపదేశించి,మరలిన తదుపరి రాముని చింతాశోకములు దూరమయి,తనలోని శక్తిని తెలుసుకుని,ప్రియ మనస్కుడై రావణునితో యుద్ధముచేయుటకు సిద్ధమగుతున్నాడు.మనలో దాగిన శక్తి మనకు మార్గదర్శకము కాగలదు గమనిస్తే .


  ప్రస్తుత శ్లోకము ఆదిత్య ఆరాధనా  విధానము  పరోక్షముగా "రాముడు అర్ఘ్యప్రదానము చేసెను" అని చెబుతూ చేతనులు పరమాత్మకు అందించవలసిన కృతజ్ఞతావిష్కారమును సూచిస్తున్నది.



  ఆచమనము అనగా   భాషా[అరముగా                  ద్రవమును స్వీకరించుట,త్రాగుట.

  సూర్యభగవానునికి స్థూలముగా దోసిలో జలమునునింపుకుని అర్ఘ్యమిచ్చుట,సూక్ష్మముగా ఆచమనమును చేసి  లోపలి పరమాత్మకు జలమును సమర్పించుట మనము చూస్తూనే ఉంటాము.


  సనాతనము సూచించిన ఈనియమము షోడశ పూజా విధానములో/అథాంగ పూజలో,

 "హస్తే ఆచమనీయం సమర్పయామి" అని,

 పరమాత్మ మనకు అందించిన, మనలను పోషించుచున్న పంచభూతములకలోని జలమునకు  కృతజ్ఞతను ఆవిష్కరించుకొనుటయే.


   'శ్రద్ధా వా ఆపః" శ్రద్ధయే జలము.


  "అపో నారాయణః"నారము అనగా నీరు/జలము.నారము నిలయముగాకలవాడు నారాయణుడు/సూర్య నారాయణుడు.


  మలినములు తొలిగిన మనసు మన నిజస్వరూపమును  పరిచయము చేస్తుంది.


 ప్రస్తుత శ్లోకములో రామునికి  అదేజరిగింది.


 'గ్రాహక శక్తికి  మనసే ద్వారము." మనసు వికసించినచో మర్మము తప్పుకుంటుంది.ఈ విషయమునే స్తోత్రము,

 "నమః పద్మః ప్రబోధాయ" అనిచెనుతుంటే మన అజ్ఞానము కొలనులోని పద్మ వికసనమును మాత్రమేస్వీకరిస్తుంది.



  కనుకనే త్యాగరాజ స్వామి,


 అన్ని నీవనుచును అంతరంగమున


 తిన్నగాను వెతికి తెలిసికొంటినయ్యా,


  


  నిన్నేగాని మదిని నెన్నజాలనొరుల అని కీర్తించి తరించినాడు.


 శ్లోకము


 *****


" ఆదిత్యం ప్రేక్ష్య -జప్త్వా యత్వేదం తు పరం హర్షమవాప్తవాన్


  "త్రిరాచమయా శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్."




   వెడలెనుకోదండపాణి -అనుజ సౌమిత్రి గూడి


   వెడలెనుకోదండ పాణి-కడలిమీద కోపముతో


   వెడలెను కోదండపాణి-కడలి నుండి కదనమునకు ఇప్పుడు

.


 పద విభాగమును పరిశీలిస్తే,


 1.రామం-ఆదిత్యం ప్రేక్ష్య-ఆదిత్యుని దర్శించెను/చూసెను.


 2.రామం ఆదిత్యునికి-త్రిః-ఆచమ్యా-మూడు సార్లు ఆచమనీయమును సమర్పించెను.సంధ్యావందనము.మూడు సంధ్యలను గౌరవించతం.



 3.రామం త్రిరాచమ్యా-శుచిః భూత్వా-శుచికల శరీరము కలవాడయ్యెను.


 4.రామం శుచియై -ఆదిత్యం జప్త్వా-ఆదిత్య స్తోత్రము  జపించెను.ఫలితముగా,


 5.


.రామం-హర్షమవాప్తవాన్-పులకాంతరంగుడాయెను.మనసు అనే ద్వారము తెరచుకుని,కర్తవ్యమునుసూచించినది.


   కనుకనే త్యాగరాజు మనసా నీవు సహకరించకుంటే,నేను,


 "మనసాఎటులోర్తునే,

 నా మనవిని చేకొనవే అంటూ,


  ద్రష్టగా  మలచినమనసుతో రాముని దర్శించగలిగాడు.సేవించుకున్నాడు.



 6.రామం-వీర్యవాను-రాముడు వీరుడిగా మారినాడు అని రాముడు ధరించిన,


 7 రామం ధనురాదాయ-ధనువును ధరించినాడు/యుద్ధ సన్నద్ధతను సూచించాడు.


 " కలిలో రాజస-తామస గుణములు కలవారిచెలిమిచేసి


   కలిసి-మెలిసి తిరుగుచు మరికాలము గడుపకనే,


  సులభముగా కడతేరను సూచనలను తెలియచేయు,


  మదిని (త్యాగరాజు/రాముని) మాట,


  వినవదేల "గుణవిహీన"  అని మనసు యొక్కప్రాధాన్యతను తెలుసుకొనుచున్న వేళ,


 "తం  సూర్యం  ప్రణమామ్యహం."









  


Thursday, March 7, 2024

ADITYAHRDAYAM-SLOKAMU-26

 


 ఆదిత్యహృదయం-శ్లోకము-26

 *******************

 ప్రార్థన

 *****

 " జయతు  జయతు సూర్యం  సప్తలోకైక దీపం

   తిమిర  హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం

   అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం

   సకలభువనవంద్యం  భాస్కరం  తం నమామి."


   పూర్వ రంగము

   ********** యుద్ధ భూమిలో,చింతాక్రాంతుడై యున్న రామచండ్రునికి కర్తవ్యమును ఉపదేశించి,ఆత్మశక్తిని ప్రేరేపించి ,విజయమును ఆశీర్వదించి,తిరిగి యథాస్థానమునకు వెళ్ళిపోయినాడు.

 తత్ఫలితముగా రాముని రాముడు నష్టశోకుడై యుద్ధమునకు సన్నధ్ధుడైనాడు.

  సీతమ్మ  ఇంకా రావణాసురుని చెరలోనేఉన్నాది.రావనాసురుడు ఇంకా జీవించియే యున్నాడు. 

  యుద్ధము ఇంకా జరుగవలసియున్నది.అగస్త్య భగవానుడు వెళ్ళిపోయినాడు.

 అయినప్పటికిని రాముని శోకము నశించిపోయినది.

 సమరేచింతయాశ్రితుడైన రాముడు ప్రియమైన మనసును కలిగి,తేజస్సుతో వెలిగిపోతున్నాడట.

   తేజసామపి తేజస్వి గా పూర్వ శ్లోకము  సూర్యభగవానుని కీర్తిస్తే,ప్రస్తుత శ్లోకము రాంచంద్రుని "మహా తేజః"అని విశ్లేషిస్తున్నది.

 శ్లోకము

 *****

 ఏతత్ శృత్వా మహాతేజాః నష్టశోకో భవత్తదా

 ధారయామాస సుప్రీతో రాఘవః ప్రియతాత్నవాన్"

  పరమపావనమైన ఆదిత్యస్తోత్ర జపకారనముగా,

 రాముడు,

1.మనసులోనిచీకటి తొలగి తేజోవంతుడైనాడు.ఆ తేజము సామాన్యమైనదికాదు.మహాతేజము.దానినిమించినతేజస్సులేదు.

2.నష్టశోకో-శోకము నశించిపోయినది.

   తాత్కాలికముగా కాదు.శాశ్వతముగా.

  రాముడుఇంద్రియ బంధవిముక్తుడైనాడు.

   అందువలనే,

3,సుప్రీత-

   ప్రియమైన మనసుకలవాడైనాడు.

 బంధ మోహనం -ఉపాధి

 బంధ నాశనము-దానిలో దాగిన పరమాత్మ.

   కనుక రామునికి కలిగినప్రియము ధారయామాస అనవరత లక్షణము కలది.

   రాముడు సుఖ-దుఃఖములు అను ద్వంద్వములను వీడినాడు.

  యుద్ధమునకు కారనము-యుద్ధమును చేయుచున్నదు-యుద్ధ ఫలితమును అనుభవించునది నానా రూపములలో నున్న ఒకేఒక ఈశ్వర చైతన్యమని గ్రహించిన తత్క్షణమే,యుద్ధమునకు ఉపక్రమిస్తున్నాడు.

   రాముడు కథనము. చేతనులు మథనము.ఉపాధికి/ఇంద్రియములకు కట్టుబడి యున్నంతకాలము చింతాశోకములు వీడవు.

  అందుకేనేమో త్యాగరాజు,

 ఓ మరకత అంగ-ఓ నీలమేఘశ్యామ

 ఓ మాన రక్షక-ఓ ధర్మ రక్షక,


   నా మనసులోని మర్మమును తెలుసుకో అని ఆలపించాడు.

 మునుపు ప్రేమగలదొరవై సదా నేలుట గొప్పకాదయ్యా అని దెప్పిపొడుస్తున్నట్లుగా అంటూనే,

 ఓ ఇంకులాప్త నీవే కాని వేరేవరు లేరు,

   కనికరంబు తో నా కరముపట్టి,

  మనసులోని మర్మమును తెలుసుకో మంటున్న సమయమున,

    తం సూర్యం   ప్రణమామ్యహం.

  


Wednesday, March 6, 2024

ADITYAHRDAYAM-SLOKAM-25




   

 



  ఆదిత్యహృదయము-శ్లోకము-25

  *********************

 ప్రార్థన

 ****

 " జయతు జయతు సూర్యం సప్త లోకైక దీపం

   తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం

   అరుణకిరణ గమ్యం ఆదిం  ఆదిత్యమూర్తిం

   సకలభువన వంద్యం భాస్కరం  తం నమామి."



 పూర్వరంగము

 *********

 శరీర దృఢత్వమునకు ఆచరించే వ్యాయామమును తపముగా పద్మాసనమువేసికొని,సకలంభువనం-చకలము-బుకలము,ఒంటికాలిపైనిలబడి,ఆహారమును స్వల్పముగా తీసుకుంటూ చేసేవిధానమును అదియును అభీష్టసిద్దికై తపము అనుకుంటే,

 ఏ అభీష్టము లేకుండా,బాహ్యముతో సంబంధము లేకుండా,సర్వకాల సర్వావస్థల యందును సత్తు-చిత్తు రెండును తానైన  పరమాత్మను ధ్యానించుమానసిక వ్యాయామము జపము.దానికి సంఖ్యా నియమము లేదు అభీష్టము కానరాదు.

 ఒక విధముగా చెప్పాలంటే, తమో-రజో గుణములు తాకని శుద్ధ సత్వముతో  ఉపాధి నిరపేక్ష అనుసంధానము.

  ప్రాణి చేస్తే జపము.పరమాత్మ చేస్తే అజపా విధానము.శ్వాసప్రక్రియ.

 ప్రస్తుత శ్లోకములో,అగస్త్య భగవానుడు ,రావణుని నీవు సూర్యనారాయణుని అనుగ్రహముతో వధిస్తావని రామునితో    చెప్పి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడని కథనము.


 శ్లోకము
 ******
" అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యతి
  ఏవం "ఉక్తా" తత్ అగస్త్యో "జగామ" చ "యథాగతం"

  మహాపరాక్రమ వంతుడైన "రామం నిశాచర పతిం"కి  రావణ వధ అత్యంత సమీపములోనే ఉన్నదనిచెప్పి/దీవించి,తాను ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళి పోయాడట అహస్త్యభగవానుడు.
.అది ఒక లీల.రాక-పోకల రామణీయకతే రామాయణము.స్థూల-సూక్ష్మ సంఘర్షణములే రామాయణము.ధర్మాధర్మముల ద్వంద్వ విధానములే రామాయణము.
 పరమాత్మ నరునిగా జన్మించుట-దైవముగా ధర్మము తో పాటుగా ఎదుగుట రామాయణము.

 ఐహికము అను చుట్టు జలమయమైన ద్వీపములో,       
 ప్రపంచములో,లంకా ద్వీపములో చైతన్యమను సీత ఉండి కథను నడిపించునదే రామాయణము.

  అగస్త్యుడు అసలు ఎందుకు వచ్చాడు? 
 యుద్ధము పూర్తి కాకుండానే ఎందుకు వెళ్ళిపోయాడు?
 అగస్త్యుడు రామునికి స్తోత్ర ఉపదేశము చేస్తున్న సేపు రణరంగపు 
  పరిస్థితి  ఏమిటి?
 అన్న సందేహములకు,
 రణ రంగమును కించిత్ సమయము సమ్మోహనముచేసి,లిప్త మాత్ర కాలమున రామునికి స్తోత్రమును ఉపదేశించి,ఉపాగమ్య అయిన అగస్త్యుడు జగామ వెళ్ళిపోయాడు అని పెద్దలు చెబుతారు.
  మరొక అన్వయము ప్రకారము మనకు మరింత అర్థమగుటకు పాత్రలు కల్పితము/సంకేతము .ప్రాధాన్యత పరమార్థము కనుక,
 సూర్య భగవానుడు ఋతుకర్తయై శిశిర ఋతువును ప్రవేశింపచేశాడు.చెట్లాకులు రాలిపోయి పచ్చదనము వెలవెలబోయింది.కాని రెండు నెలలు కాగానే అదే సూర్యభగవానుడు తన కిరణముల స్వభావమునుస్వరూపమును మార్చివేశాడు.పచ్చదనమే-పచ్చదనమే.పూలు-సౌరభాలు-కోకిల కూజితములు.

 అదే భూమి-అదే నీరు-అదేగాలి-......రెంనెలలఓరిమి నిండు దనమును తెచ్చింది.
 కనుక ఓ మనసా! కానికాలమును ఎదుర్కొనగల శక్తి ఓరిమితో కూడిన కూరిమి.
  శుభపరిణామములకు సంకేతముగా/ సందర్భముగా/ సహాయకారిగా సమస్యలు ఉద్భవిస్తాయి.వానిని న గ కదిలించలేని అగస్త్య నామ ఆలోచనా విధానముతో,సహనముతో,నిర్మూలించుకో అనిచెప్పి.అంతరాత్మగా భావించే "అగస్త్య పరమాత్మ" రామునిలోని /చేతనులలోని అంతఃశక్తిని జాగృతం చేసి అంతర్ధానమయినాడు అని తెలుసుకొనుచున్న వేళ,


  తం  సూర్యం  ప్రణమామ్యహం.


   


Tuesday, March 5, 2024

ADITYAHRDAYAM-SLOKAM-24


 


 




 ఆదిత్యహృదయము-శ్లోకము-24


 **********************


  ప్రార్థన


  ********


 " జయతు జయతు సూర్యం  సప్తలోకైక దీపం


   హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం


   అరుణకిరణ  గమ్యం  ఆదిం  ఆదిత్యమూర్తిం


   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి"




  పూర్వరంగము


  **********



  సూర్య ఆరాధనము వలన ఏ విధముగా స్థితప్రజ్ఞత అనుగ్రహింపబడుతుందో వివరించిన తదుపరి,ఆరాధనము ఏవిధమైన లక్షణములను కలిగియుండాలి అన్న అంశములను వివరిస్తున్నారు.పరమాత్మ "దేవదేవుడు.జగత్పతి.

    అని పరమాత్మను కీర్తిస్తూ,


 త్రిగుణితం-అన్న పదమునకు మూడుసార్లు అని సంఖ్యాపరముగాను,


 మూడు గుణములతో అని స్వభావ పరముగాను


మూడు శభ్దమును "అనంత పరముగా 'విశ్లేషిస్తారు.


 కనుకనే సహజకవిపోతన,


 ముగురమ్మల మూలపుటమ్మగా -పరాశక్తిని ప్రస్తుతించారు.


 అదే విషయమును అగస్త్య భగవానుడు సైతము ప్రస్తుత స్తోత్రములో,


 " ఏషబ్రహ్మాచ-విష్ణుశ్చ-సివ-స్కంద-ప్రజాపతి-మహేంద్రో-ధనదః-కాలః-యమః-సూర్యః" అంటూ తెలియచేసారు.


  త్రిగుణితము అన్న పదమునకు అనంతత్త్వమును అనుసంధానించుకుంటూ,శ్లోకములోనికి ప్రవేశిద్దాము.

   శ్లోకము

    *****

" పూజయస్వైంచం ఏకాగ్రో దేవదేవం జగత్పతిం


  ఏతత్ త్రిగుణితం జప్త్యా యుద్ధేషు విజయిష్యతి."


 ప్రస్తుత శ్లోకము లో,



 1.పరమాత్మ


 2.ప్రార్థన


 3.ఫలితము 


 అన్న మూడు అంశములను వివరిస్తున్నది.


 పరమాత్మ పతి

.


 పతి అంటే పడిపోకుండా రక్షించువాడు/రక్షించు పరాశక్తి.


 స్త్రీ మూర్తిగా భావించుకుంటూ మనము,


 సామాంపాతు సరస్వతీ భగవతీ అని స్తుతిస్తాము.


 తండ్రిగా  ,


 నీవే నా పతియు-గతియు నిజముగ కృష్ణా.అని ప్రార్థిస్తాము.



 పతతి-అనగా పడిపోవటం.మనలను మనము ఉద్ధరించుకోలేని వాస్తవము.


 వస్తు ప్రపంచములో జరిగే విధానము వాస్తవము.


  వస్తుస్థితిని దాటి జరిగేది-శాశ్వతముగాఉండేది సత్యము.


 ప్రపంచము-వాస్తవము(తాత్కాలికము)


 పరమాత్మ-సత్యము(నిత్యము)


   శాశ్వతమైన  శక్తి కరుణయే "పతి" శబ్దముగా చెప్పబడినది.


 తమిళములో సైతము "ఉంపార్వై" అంటూ భగవంతుని దయను గుర్తిస్తారు.


 అంటే సూర్యనారాయణుడు " జగత్పతి"


  జగము యొక్క పతి.


 జగము అంటే,


 జాయతే-పుడుతుంది-గచ్ఛతే-నశిస్తుంది.ఇతి జగతి.


 జగత్పతి శబ్దము పంచకృట్యముల సంకేతము.


  దేవ శబ్దము ఆ కృత్యములు  నిర్వహించు మహాద్భుత శక్తి.



  పూర్వ శ్లోకములలో జ్యోతిర్గణాంపతి-దినాధిపతి-జ్యోతిషాం పతి అని సంబోధించిన  మహర్షి అవి మాత్రమే కాదు సర్వమునకు-సకలమునకు పతి అని స్పష్టము చేస్తున్నారు.


  సర్వదేవాత్మకో హ్యేష అని ముందు చెప్పి,


 ఆదిదేవం నమస్తుభ్యం "ప్రసీద మమ "భాస్కరునిగా,దేవదేవత్వమును వివరించారు.



 ఇంకొక ముఖ్యమైనవిషయము ఏంటంటే,


 తేన అరీ సర్వాన్ సమరేవిజయిష్యతీ అని ప్రారంభదశలో రాముని మానసిక చింతనము కలిగించిన చిత్తవృత్తులను ప్రస్తావించిన మహర్షి,అవి తొలిగిన సమయమున,


 " జప్యాం యుద్ధేషు విజయిష్యతి" అని  బాహ్య యుద్ధవిజయమును ఆశీర్వదించారు.


  పరోక్షముగా మన చిత్తవృత్తులప్రభావమును(సమరమును) అధిగమించిన తరువాతనే సంసారమనే యుద్ధములో ,త్రిగుణముల గమనమును మరల్చుకుని,గమ్యమును,మానవ జన్మ సార్థకతను పొందగలమని ఉపదేశించున్న సమయమున,


 తం  సూర్యం  ప్రణమామ్యహం.





Monday, March 4, 2024

ADITYAHRDAYAM-SLOKAM-23

 


  ఆదిత్యహృదయము-శ్లోకము-23

  **********************

 ప్రార్థన

 *****

" జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం

  హిరణ సమిత పాప ద్వేష  దు@ఖస్య నాశం

  అరుణకిరణ గమ్యం  ఆదిం  ఆదిత్యమూర్తిం

  సకలభువన వంద్యం భాస్కరం తం  నమామి."


  పూర్వరంగము

  **********

 ఆదిత్యుని విశ్వాత్మకునిగా-విశ్వరక్షకునిగా-

 అగ్నిహోత్రునిగా-అగ్నికార్యమైన క్రతువుగా సంభావించిన అగస్త్య భగవానుడు ,పూర్వ శ్లోకములలోని ప్రతిపదము ఫలశృతియే యైనప్పటికిని,ప్రస్తుత శ్లోకము నుండి తదుపరి శ్లోకములను "ఫలశృతిగా/ఫలసిద్ధిగా"పరిగణిస్తారు దైవజ్ఞులు.

 ఇంకొక విశేషమేమిటంటే అగస్త్య భగవానుడు,

"రామ రామమహాబాహో" అన్న శ్లోకములో రామచంద్రుని సంబోధనము తరువాత గుహ్యముగా చెప్పవలసినది పూర్తిచేసి,రాఘవ శబ్ద ప్రయోగముతో ప్రియతాత్మజ అని యుద్ధోన్ముఖుని చేసి యుద్ధరంగమును నిష్క్రమించినాడు.

 పరమాత్మను విష్ణుస్వరూపునిగా భావించి,కొలిచేవారు,

 "ఆర్తా విషణ్ణా-శిధిలాశ్చ భీతా

  ఘోరేషుచ వ్యాధిషు వర్తమానా

  సంకీర్త నారాయణ శబ్ద మాత్రం

  విముక్త దుఃఖః సుఖినో భవంతు"

 అని ఫలసిద్ధిని నొక్కి వక్కాణిస్తుంటే,

  పరమాత్మను స్త్రీమూర్తిగా/అమ్మగాభావించి,స్తుతించేవారు,

 " అనేన సదృశం స్తోత్రం న భూతం  న భవిష్త్యతి

   సర్వరోగ ప్రశమనం సర్వ సంపత్ ప్రవర్ధనం"

 అని అమ్మ అనుగ్రహమును చాటుతోంది.

   అదే విధముగా ప్రత్యక్ష నారాయణుని స్తుతి,

 ప్రస్తుత శ్లోకములో,


  శ్లోకము

  ******


 " 

  

  


 " ఏనమాపత్ సుకృత్యేషు కాంతారేషు భయేషుచ

   కీర్తన్ పురుషః కశ్చిన్ "నావసీదతి" రాఘవ."




 ఏ తత్ స్తోత్రము మనము ఆపాదలలో నున్నను,స్థిమితముగానున్నను,స్వగృహములోనున్నను-భయంకర అరణ్యములో నున్నను పఠన ఫలితముగా మనలో "సమస్థితిని" కలిగించి స్థితప్రజ్ఞులుగా మారుస్తుంది.

   "ఫలశృతి" చేతనులకు విష్ణు సహస్రనామములో చెప్పబడినట్లు ఉద్ధరణమునకై చెప్పబడుతుందికదా కాని సాక్షాత్ దశావతారములలో ఒకటియైన రామచంద్రమూర్తికి చెప్పిన శ్లోకములో ఉన్నదేమిటి? అన్న సందేహము కలుగ వచ్చును.

  రామావతారము నరునిగా జన్మించి మెట్టు మెట్టు ఎదుగుతూ ధర్మనియమ పాలనతో దేవత్వమును పొందినది కనుక ఫలశృతి సమంజసమే అని కొందరు సనాతనులు,

 అంతేకాక,

 ఆదిత్యహృదయ స్తోత్రము రామునికి ప్రత్యక్ష  ఉపదేశము చేస్తున్నట్లుగా అనిపించే ప్రపంచోద్ధరణమునకు పరోక్ష ఉపదేశము.

 అందుకే ఆ యుద్ధమునకు సాటి ఆ యుద్ధమే.

 ప్రస్తుత శ్లోకము ఆపదలో నున్నప్పుడు-భయములో నున్నప్పుడు,అని రెండు పదములను ప్రస్తావించినది.

 ఒక సిద్ధాంతము ప్రకారము ఆపద వస్తుందేమోనన్న చిత్తవృత్తి భయము.

 మరొక సిద్ధాంతము ప్రకారము భయము వ్యక్తిగతము.

 విధ్యార్థికి పరీక్షాఫలితములు,రోగికి ఆరోగ్య నివేదికలు,రాజకీయ నాయకులకు పదవీ కాంక్షలు ఇలా అనేక విధములుగా ఒక్కొక్కరిలో ఆందోళనమును-భయమును కలిగించును.కాని అందరి భయము ఒకటి కాదు.

 ఆపద విషయమునకు వస్తే అది తెలిసి రావచ్చును లేక అకస్మాత్తుగాకూడా రావచ్చును.అదిఒక నిర్ణీత ప్రదేశమును (వరదలు-భూకంపములు-క్షామములు మొదలగునవి) గురిచేయవచ్చును లేదా సమస్తమును (కరోనా) వణికించవచ్చును.

 మరొక ముఖ్యమైన విషయము ఆదిత్యహృదయ స్తోత్రము రెండు పదములతో చెప్పవలసిన సూక్ష్మమును చెబుతున్నది.

 అవి

1 నాశయత్యేష వైభూతం

2.నావసీదతి.

  ప్రపంచ విషయాసక్తతను నశింపచేస్తుంది.

      తత్ఫలితముగా 

 నావసీదతి అంటే మనలను బంధవిముక్తులను చేస్తుంది అని సకలౌపాధులకు కనువిప్పు కలిగించు తరుణమున,

 "తం  సూర్యం  ప్రణమామ్యహం."


  

  

Saturday, March 2, 2024

ADITYAHRDAYAM-SLOKAM-22


 


   ఆదిత్యహృదయము-శ్లోకము-22

   *******************

 ప్రార్థన

 *****

 "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం

  తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం

  అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం

  సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."


   పూర్వరంగము

   ***********

 ఏషచైవాగ్ని హోత్రంచ-ఫలంచావైగ్నిహోత్రిణాం"

 అంటూ,స్థూలము నిద్రాస్థితిలో నున్న వేళ సైతము తాను జాగరూకతతో నుండి,తన అగ్ని అను శక్తిచే సర్వ దోషములను /మలినములను శుద్ధిపరుస్తూ,ప్రకృతిని-ప్రజలను చైత్న్య వంతము చేస్తున్న సూర్యభగవానునకు నమస్కారములు.

  ప్రకృతిలోని పంచభూతములలోను,ప్రజలలోని పంచేంద్రియములను నిరతరము దాగియున్న చైతన్యశక్తియే అగ్నిహోత్రము.

  ప్రకృతిలో అదిలోపించనచేభూమండలము గడ్డకట్టి స్తంభించిపోతుంది.

  మనలో అదిలోపించినచో మనుగడ స్తంభించిపోతుంది.

 కనుకనే రుద్ర చమకము ప్రథమ అనువాక ప్రథమ శ్లోకము,

 " ఓం అగ్నా విష్ణుం సజోషసేమా వర్థంతు.,"

 అంటు మీరిద్దరు నా పట్ల సద్భావనను కలిగి యుండండి అని అర్థిస్తున్నది,

 స్థితికార్యమునకు అగ్ని శక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తున్నది.

 అగ్ని ప్రస్తావనమును చేసిన అగస్త్య భగవానుడు,ప్రస్తుత శ్లోకములో అగ్నికార్య విధానమైన"క్రతువు" మనకు పరిచయము చేస్తున్నారు.లోకపరిపాలనమును ఒక మహాక్రతువుగా కనుక మనము భావిస్తే సూర్యభగవానుడు తానే క్రతువుగాను-క్రతుఫలముగాను ఎలా విరాజిల్లుతున్నాడో వివరిస్తున్నారు.


 

 


  శ్లోకము

  ******

 " వేదాశ్చ క్రతువశ్చైవ క్రతూనాం ఫలమేవచ

   యాని కృత్యానిలోకేషు సర్వ ఏష పరమ/రవిః ప్రభుః"


  స్వామినీవులోకానికృత్యేషు క్రతువుగా-క్రతు ఫలముగా నిర్వహిస్తున్నావు.

 బేదాశ్చా వేదములగురించి,

 ఋగ్యజు సామపారగః అని పూర్వపు శ్లోకములలోనే సూర్య భగవానుడు త్రిసంధ్యలో వర్దత్రయ స్వరూపములో,సంకీర్తనములలో ప్రకాశిస్తుంటాడని చెప్పిన అగస్త్యభగవానుడు ప్రస్తుత శ్లోకములో దానిని కార్యాచరణము గావిస్తూ మరింత విశ్లేషిస్తున్నారు.

  

 1 క్రతువు అన్న సబ్దమునవ బ్రహ్మలలో ఒకరి నామధేయము.

 2.క్రతు శబ్దమును కొన్నియాగములసాముహిక ప్రక్రియ గాను భావిస్తారు.

 సాపేక్ష పూర్వక అగ్నికార్యము యాగము.పుత్రకామేష్టి,రాజ సూయము,మొదలగునవి.

 దేవతోద్దేశ్య ద్రవ్య సమర్పనము యాగము.స్వాహా మంత్ర పూరితము.అనేక యాగములు,విస్తార సమయములో నిర్వహించుతను "క్రతువు" అని అలంకారికులు భావిస్తారు.

 3.'క్రియతేన ఇతిక్రతుః."

 కార్యశీలతయే క్రతువు అంటుంది సాహిత్యము.

 కాని లాక్షణికులు,వ్యూప స్తంభనిర్మితముతో చేయు అగ్నికార్యమును క్రతువు అంటారని చెబుతారు.

  బలీచ్చుతకు అనుకూలముగానిర్మింపబడునది వ్యూపస్తంభము.అంటే ఆ క్రతువులో నిస్సందేహముగా ...ఉదాహరనమునకు "అశ్వమేధ యాగము."

  సుమేథజో మథజ ధన్యఃఅని స్తుతింపబడుచున్న పరమాత్మ హింసని కోరుకుంటాడా?  అదిజంతు బలికాదు.

 మనమనస్సులోని ఆలోచనలు కళ్ళకు గంతలు కట్టుకుని యుక్తాయుక్త విచక్షణ లేక పరుగులు తీస్తుంతాయి.వాటిని తొలగించతమే అశ్వమేథనము.ఆ పరిస్థితియే/నిలకడగా మనసును చిత్తునందు నిమగ్నము చేయు శక్తియే"వ్యూపస్తంభము.దాని సహాయముతో జీవులు ఉద్ధరింపబడతాయి.

 పరమాత్మ "స్వధృత్ "-స్రవధృత్"


   పరమాత్మ తనకు తానే అవసరమైన-అనుగుణమైన ఉపాధిని,అవసరము మేరకు స్వీకరించగలడు కనుక "స్వధృత్" కనుక అగ్ని స్వరూపుడై క్ర్తువుగా తాను మారి-క్రతుఫలమును సైతము స్వీకరిస్తున్నాడు.


 అంటు,

 కర్మము-కర్మాచరణము-కర్మఫలితము తానైన 

, "తం సూర్యం ప్రణమామ్యహం."


Friday, March 1, 2024

ADITYAHRDAYAM-SLOKAM-21

 


      ఆదిత్యహృదయం-శ్లోకము-21

      *********************

 ప్రార్థన


 ******

 "జయతు జయతు సూర్యం  సప్త లోకైక దీపం

  తిమిరహిరణ పాప ద్వేషదుఃఖస్య నాసం

  అరుణకిరన గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం

  సకలభువన వంద్యం భాస్కరం  తం నమామి."

 

  పూర్వ రంగము

  ***********

 పరమాత్మ నాశయత్వేవ  వైభూతం

 తదేవ సృజతి అంటూ ప్రలయము తదుపరి సృష్టి,సృష్టి తదుపరి ప్రళయనిర్వహణమును ఏ విధముగా జరిపిస్తారో వివరించిన అగస్త్య భగవానుడు,ప్రస్తుత శ్లోకములో రెండు ముఖ్య అనుగ్రహములను 

 1.సుషుప్తావస్థ నందు పరమాత్మ చైతన్యమును గురించి,అగ్నిహోత్రునిగా -అగ్నిహోత్ర ఫలముగా స్వామి ఉనికిని సంస్తుతిస్తున్నారు.

 

 శ్లోకము

 ******

 "ఏష సుప్తేషు జాగ్రత్తి భూతేషు పరినిష్ఠతః

  ఏష ఏవాగ్నిహోత్రంచ ఫలంచ ఏవాగ్ని హోత్రిణాం."

  అగస్త్యభగవానుడు సుషుప్తి-జాగ్రుతి అన్న రెండు అవస్థలను సూచిస్తున్నారు.

  ఎవరు సుషుప్తిదశలో నున్నది?ఏది సుషుప్తి దశలోనున్న స్థూలములో జాగృతముగా సూక్షముగా నున్నది అన్నది ప్రస్తుతము.

 ఈ విషయమును అర్థము చేసుకోవాలంటే మనము,

పరమాత్మ-ప్రపంచము అన్న రెండింటి మధ్యనున్న,

 స్థూల శరీరము- సూక్ష్మశరీరము-కారణ శరీరము-మహాకారణ శరీరముల గురించి తెలుసుకునే ప్రయత్నమునుచేద్దాము.

 1.పంచభూతములకలయికచే ఏర్పడినది స్థూలశరీరము.ఇది దృశ్య పదార్థములను చూస్తూ ఆనందిస్తుంటుంది.కాని అలిసినది అను నెపముతో పరినిష్టుడైన/అంతర్యామి యైన పరమాత్మను  తాత్కాలికముగా  విస్మరించి/విడివడి నిద్రిస్తుంటుంది 

 ఆ సమయములో అంతర్యామి యైనపరమాత్మ సైతము నిదురిస్తే ఉపాధి చేతనత్వమును కోల్పోతుంది.ఉపాధి తాను నిదురిస్తున్నప్పటికిని,దానిలో అగ్నిహోత్రముగా ప్రకాశిస్తున్న చైతన్యము 

" వైశ్వానరము" జాగృతముగానే ఉంటుంది.

 అదే ,

 స్థూల శరీరములోని వైశ్వానరమనే అగ్ని-దాని ఫలితమైన మనమునిదురలేచి,యధావిధిగా పూర్వస్థితిని కలిగి,మనజీవనమును కొనసాగించటము.


 

 పంచ ప్రాణములు-ఐదు జ్ఞానేంద్రియములు-ఐదు కర్మేంద్రియములు-బుద్ధి-అహంకారము కలిగియుండి కంటికికానరానిది సూక్ష్మశరీరము.ఇందులో అగ్నిహోత్ర రూపముగానున్న పరమాత్మను "తైజసుడు"అని పిలుస్తారు.స్థూలశరీరమునిద్రావస్థలో నున్నప్పటికిని,సూక్ష్మ శరీరము జాగృతమైయుంటు,మనకు అనేకానేక అనుభూతులను అందిస్తుంటుంది.అవియే స్వప్నములు.మెలకువ రాగానే అవి నిజము కాదని తెలిసికును లక్షణమే అగ్నిహోత్ర ఫలము/ఫలితము.


  తరువాత మరింత సూక్ష్ముముగా కారణ శరీరము,దానిని అధిగమించి మహాకారణము పరమాత్మ అంతర్యామి తత్త్వమును-దాని ఫలితమును మనకు వివరిస్తుంటాయి.


 మనలోని అల్పత్వ జ్ఞానము మనలోనున్న పరమాత్మ,మనకు భిన్నముగా ఎంతో దూరముగా నున్నాడన్న భావనలో మనలను ఉంచుతుంది.


 కాని పరిశోధిస్తూ-పరిశీలిస్తుంటే,ఆ దూరము దగ్గరగా మారుతూ మనలోపలనే పరమాత్మనివాసము అన్న తత్త్వమసి ని స్పష్టముచేస్తుంది.


 అగ్నిహోత్ర పదము సైతము స్థూలములోనిప్పుగాను,సూక్ష్మములోఉపాసన గాను భావింపబడుతున్నది.

అదియే "ఉపనిష్ఠిత" అన్న పదము.మన సమీపముగానున్న అంతర్యామిని పోల్చుకోగలుగుట ఫలితము.

 కర్మము-కర్మాచరణము-కర్మఫలితము పరమాత్మయే అన్న విషయమును,


 "కఠోపనిషత్తులోని నచికేత-యమధర్మరాజ సంవాదము" సైతములో నీవు  నిదురిస్తున్నప్పుడు-నీలో ఏది  మెలకువతో ఉంటుందో  అదియే పరమాత్మ అన్న సత్యము అవగతమగుచున్నవేళ,

  తం సూర్యం  ప్రణమామ్యహం.

 


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...