Monday, April 29, 2024

TRILOKAMOHANACHAKRA PARICHAYAMU-02


  

1-

   అమ్మ అనుగ్రహముతో,సిద్ధిదేవతల సహకారముతో,త్రిపురా అనుగ్రహముతో సాధకుడు రెండవ చతురస్త్రాకారములోనికి ప్రవేశించగలుగుతున్నాడు.అష్టసిద్ధులు సాధకునిలోని కొంతవరకు సహాయపడి మరింతసహాయపడు "సప్తమాతృకలకు" అదియును మహాలక్ష్మి సహిత సప్తమాతృకలు పరిచయము చేస్తున్నారు.

 కొందరి భావన ప్రకారము అష్టదిక్కులే అష్టమాతృకలుగా ఆరాధిస్తారు.

 స్థూలలో అష్టదిక్కులు వీరైతే సూక్ష్మములో/మన మనస్సులో చెలరేగే అరిషడ్వర్గములు+పాపపుణ్యములుగాను పరిగణిస్తారు.

 అమ్మతన రూపురేఖలే వీరికి ప్రసాదించినప్పటికిని ,అమ్మ అజ్ఞానుసారముగా వీరు ప్రవర్తిస్తుంటారు.

 చండీసప్శతి శివుని స్వేదము నుండి ఈ ఏడుగురు తల్లులు ఉద్భవించాయని యుద్ధభూమిలో అసురసంహారము చేసి తరించారనికూడా చెబుతారు.

నిశితముగాధ్యానించినమహాయోగులు అష్టసిద్ధుల పరమార్థమే సప్తమాతృక రూపమున సాధకునికి మరింత సహాయపడతారని విశ్వసిస్తారు.

1.బ్రాహ్మీ

2.మహేశి

3.కౌమారి

4.వైష్ణవి

5.వారాహి

6.మాహేంద్రి

7.చాముండా

    మహాలక్ష్మి,

 యుద్ధభూమిలో పరమేశ్వరి అనుగ్రహముతో సహాయకములుగామారి ధన్యతనొందినవైనప్పటికిని,

 ప్రతిమనిషి/ఉపాధి అంతరంగము మంచి-చెడుల యుద్ధభూమిగా అనుకుంటే వాటిలోని చెడును నిర్మొలించుటకు,

1.బ్రహ్మీ శక్తి

   జీవునకు అనేక సత్సంకల్పములను కలిగించుచున్నది.సృష్టి సర్వము బ్రహ్మీశక్తియే.ఆ తల్లి దృశ్యమాన జగతి అశాశ్వతమును సాధకునకు తెలియచేసి,బ్రహ్మానంస్థికి మార్గము చూపుతుంది.

2.మాహేశ్వరి శక్తి

 సంహారిణీ రుద్రరూపా అనికీర్తిస్తుంది లలితా సహస్రనామ స్తోత్రము.

 తల్లి రుద్ర రూపముతో సంహరించేది అజ్ఞానమనే చీకటిని.తల్లిధర్మ స్వరూపిణి.ధర్మమునాశ్రయించిన జ్ఞానమే సత్వగుణ ప్రకాశము.మాయను అల్లునదిమహేశ్వరి దానినితొలగించునదియును మహేశ్వరియే.

3.కౌమారి/కుమారి

కు అనగా దుర్మార్గం.దానిని పూర్తిగా తొలగించునది కౌమారి.యుద్ధభూమిలోశక్తిసేనా నాయకియై అసురత్వమును అంతమొందించినది.

 సాధకుని ఇంద్రియ గతి వక్రముగాకుండా నియంత్రించునది కౌమారిమాత.

4.వైష్ణవి/గరుడవాహిని.

  గరుత్మంతుని/సుపర్ణునీధిష్టించునది.

 సు అనగా మంచివైపునకు మార్గముచూపు పర్ణములు రెక్కలు.

కర్మ-జ్ఞానము అనురెండు మంచి ఆలోచన-ఆచరణ  అను రెండు రెక్కల సహాయముతో,దేహమే ఆత్మ అను భావమును తొలగించిద్వంద్వములనువిడిడిగా చూపు శక్తి.

5 వారాహి

 కల్పపరిమితమైన  కాలమునకు సంకేతముగా  వారాహి శబ్దము ,శ్రేష్టమైన ఆత్మ ను తెలియచేయు వర శబ్ద ప్రాధాన్యముగాను వారాహి మాత కొలువబడుచున్నది.ఈ చైతన్యసక్తిని ఆధారముచేసుకుని సర్వము/సకలము సంభవించుచున్నది.

6.మహేంద్రి 

 "ఈర్" ధాతువునకు గతి/నడక అని అర్థము.

 వారాహి శక్తీంద్రియగమనమునుతెలియచేస్తుంటే/

మాహేంద్రి ఇంద్రియ గమనమును నియంత్రిస్తూ సాధకునికి మనసు చలించకుండాసహకరిస్తుంటుంది.

7.చముండా/చండ-ముండ

  కథనములో రాక్షసులు.వారిని సంహరించిన శక్తి.

మనమనసులోనీఅలోచనలప్రవృతియే చండ-నివృతియే ముండ.ఆలోచనలను నియంత్రించే అద్భుత శక్తియే చాముండా.

8.మహాలక్ష్మి/మూలస్వరూపము.

 శుభప్రదాయిని  మహల  అను అసురుని మర్దించినది.

 ఈ ఆవరనములోని మాతృకానుగ్రహముతో సాధకుడు,తనయొక్క సప్తధాతువులు-మనసు శుద్ధిచెందుటచే పాపరహితుడై,రజోగుణ విహీనమైన ప్రకాసమును పొంది,చక్రేశ్వరి అయిన త్రిపురేశి కి నమస్కరించి,మూడవ చతురస్త్రాకారములోనిప్రవేశించి,ముద్రాశక్తులానుగ్రహమును పొందగలుగుతాడు.


   శ్రీ మాత్రే నమః.



Saturday, April 27, 2024

TRILOKAMOHANCHAKRPARICHAYAMU --01


 

1-


 "విశృంఖలా వివక్తస్థా వీరమాతా వియత్ప్రసుః"

  అని పరమేశ్వరిని ప్రస్తుతిస్తుంది లలితరహస్యసహస్రనామ స్తోత్రము.


  శృంఖలములు /సంకెలలోబంధింపబడియున్నదెవరు.పరమేశ్వరి వాటిని తన అనుగ్రహముతో ఎలా తొలగిస్తున్నది అన్న అవ్యాజకరుణయే దేవీఖద్గమాలా స్తోత్రములోని నవావరణ ప్రాధాన్యము.

 నిరంతరము మనలను అల్లుకుంటున్న మాయతెర మనలో దాగిన శక్తులను నిద్రాణముచేస్తూ,మనము గుర్తించలేని స్థితిలో ఉంచుతుంది.మూలాధారము తమోమయము.దానిలో నుండి ఊర్థ్వపయనము ప్రారంభించనంతవరకు పశుపక్ష్యాదులకు వలెనె మానవులకు సైతము

"ఆహార-నిద్రా-భయ-మైథునస్య" ఏ సమస్తముగా ఉంటుంది.అమ్మ అనుగ్రహముతో ఇది కాదు జీవితపరమార్థము అన్న నిజమును గుర్తించి,దానిని తెలుసుకొనుటకు ఉపక్రమించెదరు.

 మానవ మేథస్సు పరిమితమైనది.అమ్మ తత్త్వము అపరిమితము.కారుణ్యము కరావలంబమవుతుంది.మనము ఏ విధముగా ఒకే స్థలములో నున్న వివిధ గదులను వంటిల్లు,నిదురిల్లు,ముందుగది,పెరడు అను వివిధ నామములతో,ఆప్రదేశములో నున్నప్పుడు వివిధ ప్రవృత్తులతో ఉంటాము.అదేవిధముగాబడి-గుడి-వైద్యశాల-గ్రంధాలయము అంటూ వివిధ పనులకు అనువుగా భవనములను పిలుస్తుంటాము.

 మన ఆలోచనలకు అనుగుణముగా/సులభముగా అర్థము చేసుకునే విధముగా జగన్మాత తాను సైతము ఒకే మూలశక్తి అయినప్పటికిని అనేకానేక శక్తులుగా ప్రకటితమగుతూ,పరిపాలిస్తూ,మనలను చైతన్యవంతులను చేస్తుంది.

  దాని ఉదాహరనమే శ్రీచక్రములోని నవావరణములు.

 సాధకునికి తెలిసిన వాటిని చూపిస్తూనే తనను తాను తెలుసుకునే స్థితిని అనుగ్రహించటమే అమ్మ తత్త్వము.

 చక్రము అంటే యంత్రము అను ఒక అర్థము ఉన్నప్పటికిని,మూలము,హృదయము,కేంద్రము,ప్రియమైనది,అతిరహస్యము అను అర్థములలో కూడా సంభావిస్తారు పెద్దలు.

 మొదటి ఆవరనమును త్రైలోక్య మోహన చక్రము/భూపురము అంటారు.

 ఇక్కడ పరమేశ్వరి మూలాధారైక నిలయా.


 అమ్మ ప్రకృతిస్వరూపిణిగా ప్రకటితమయి మూడులోకములను సమ్మోహపరుస్తున్నది.భూతత్త్వముతో ఒక హద్దును చూపించింది అమ్మ భూపురముద్వారా.

 ప్రతి చక్రము ప్రత్యేకమైనదే.పరమార్థమును అనుగ్రహించునదే.

 స్థూలముగా గమనిస్తే త్రైలోక్యమోహనము అనగా

 గాయత్రీమంత్రములో చెప్పబడినట్లు,

 భుః=భువః-సువః లోకములు.

 మానవ దేహమునకు అన్వయించుకుంటే స్థూల-సూక్ష్మ-కారన దేహములను.

 వీటిని చైతన్యవంతము చేయుటయే మోహనత్వము.

 

   వీటన్నిటిలో దాగిన అమ్మ విభిన్నాకృతులు-విభిన్న తత్త్వములు చేతనులకు వారి స్వస్వరూపమును తెలుసుకొనుటకు మార్గదర్శకమవుతాయి.

 మొదటి ఊహా చతురస్త్రము గురించి తెలిసికొనే ప్రయత్నమును చేద్దాము.

 ఈచతురస్రాకారములో ఎనిమిది సిద్ధిశక్తులు పరిపాలిస్తుంటాయి.సమన్వయముతో కొన్ని ద్వారములదగ్గర సాధకుని మార్గము చూపిస్తుంటే మరికొన్ని దిక్కులదగ్గర వానికి దిక్కుగా మారతాయి.

 ఈ ఆవరణ ప్రవేశము సాధకునిలోని నిరుపయోగ రుగ్మతలను తొలగించి,తేజోవంతునిగా తీర్చిదిద్దితాయి.

  మొదటి చతురస్రాకార రేఖలో,

1.అణిమ సిద్ధి

2,లఘిమసిద్ధి

3.మహిమసిద్ధి

4గరిమసిద్ధి

5.ఈశిత్వసిద్ధి

6వశిత్వసిద్ధి

7.ప్రాకామ్యసిద్ధి

8.ఇచ్ఛాసిద్ధి

9.భుక్తి సిద్ధి

10.సర్వకామసిద్ధి మొదలగు శక్తులుంటాయి.

  కొందరివాదన ప్రకారము,గరిమ+మహిమ ఒకటిగాను,

 భుక్తి+ప్రాకామ్య ఒకటిగాను లెక్కించబడుతుంది.

  వాదించే శక్తిలేని నేను ఈసిద్ధిశక్తుల స్వరూపములో అమ్మ సాధకుని ఎలా సహాయ పడుతూ,అనుగ్రహిస్తుందో గమనిద్దాము.

  

 1.అణిమాసుద్ధి-ఇతరులకు అన్వయిస్తే సూక్ష్మముగా మారుట.

 కాని సాధకునికి అణిమా సిద్ధి,

"అణిమాదిభిరావృతాం అహమిత్యే విభావేత్ భవాని" ఆ జగజ్జనని

 సాధకుని యొక్క స్వీయ ప్రాముఖ్యతను/వ్యక్తీకరణమును తగ్గించివేస్తుంది.ఈ నేను చిన్నదయితోకాని నేను ను గుర్తించలేము.

 2.అణిమ సాధకుని స్వీయప్రవృత్తిని తగ్గించి లఘిమకు పరిచయము చేస్తుంది.నేను-నాది అన్న భావనను తగ్గించుకొనిన మనసు విషయవాసనలను రొంపి నుండివిడివడమంటుంది.నీ మనసులోని భావములను తేలికపరుస్తుంది.నిన్ను స్వతంత్రునిగా మలచుటకు నీకు మహిమసిద్ధిని పరిచయము చేస్తుంది.

 3.ఇప్పుడిప్పుడే నీలో దాగిన చైతన్యము నీకు కొంచముకొంచముగా అర్థమవుతుంటుంది.నా ప్రజ్ఞా పాటవములకు కారణము ఆ చైతన్యమే దానిని ప్రకటించే పరికరమే నాఈ ఉపాధి అన్న తత్త్వము బోధ పడుతున్న సమయములోనిన్ను

 ఈశిత్వ సిద్ధికి పరిచయము చేస్తుంది.

4.నిర్మలమనస్కునిగా సాధకుని మార్చివేసేదిఈశిత్వసిద్ధి.పరమాత్మను గమనించాలంటే కాలుష్యము తొలగవలసినదే కదా.కడిగిన ముత్యము వంటి మనసును చేసి వశిత్వ సిద్ధిని పరిచయము చేస్తుంది ఈశిత్వసిద్ధి.

5.వశిత్వ సిద్ధికనుక సాధకునికి సహాయపడితే ప్రపంచస్వరూప స్వభావాలు పూఎరితా మారిపోతాయి.ప్రతిశబ్దము ఓంకారము.ప్రతి రూపము పరమేశ్వరి.ప్రతికార్యము పారమార్థికమే అన్న భావనతో నున్న సాధకుంకి ప్రాకామ్య సిద్ధిని పరిచయము చేస్తుంది పరాత్పరి.

6ప్రాకామ్యసిద్ధి-పరిపూర్ణ కామ్య సిద్ధి.

 సాధకుడు నిత్య తృప్తుడిగా ఉంటాడు ఇంద్రియములు సైతమువిషయవాసనలను విడిచి పరమార్థము వైపునకు దృష్టిని మరలుస్తాయి.ఆ సమయములో ప్రాకామ్యము పరిపూర్ణాందప్రదాయినిని

7.భుక్తి సిద్ధిగా పరిచయము చేస్తుంది.జీవన పరమార్థమును,తననిజస్వరూపమును,తన లోని చైతన్యము చేయుచున్న అద్భుతములను సాధకుడు అనుభవించుచున్న సమయములో 

8 సర్వకామ సిద్ధే సాధకుని సంకల్పము-కామ్యమును చూపుతూనే,

 ద్వంద్వభావనలతో నిండియున్న సాధకునికి చక్రేశ్వరికి వందనము చేయించి,

 రెండవ చతురస్రాకార గీతలోని సప్తమాతృకలకు పరిచయముచేస్తుంది.

 అష్టసిద్ధి దేవతలకు-సప్తమాతృకలకు ఉన్న అవినాభావ సంబంధమేమిటి? వారు మరింత సహృదయభావముతో సాధకునికి సహాయపడతారా అన్న అంశములను తదుపరి భాగములో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.

  శ్రీ మాత్రే నమః.



Thursday, April 25, 2024

CHAKRESVARI-PARICHAYAMU

 


 " కదంబ వనవాసినీం కనకవల్లకీ ధరిణీం

   మహార్ణమణిహారిణీం ముఖసముల్లస్ద్వారుణీం

   దయా విభవకారిణీం విశదరోచనాచారిణీం

   త్రిలోచచన కుటుంబుణీం త్రిపురసుందరీం ఆశ్రయే."


   శ్రీచక్రములో బిందురూపముగా ఏకాత్మకమైనపరమాత్మ,సృష్టిచేయ సంకల్పించి కామేశుడై,

 మహత్తు-అహంకారము

 శివశక్తులు

 స్థావర-జంగమము

 ప్రకృతి-పురుషులు గా

  ప్రకటింపబడుతూ,

  పంచకృత్యాసక్తులై,


 పురోభవ గా శ్లాఘింపబడు పరమేశ్వరి,

మూడు అవస్థలను-జాగ్రత్-నిద్రా-సుషుప్తులను

మూడు కాలములను-భూత-వర్తమాన-భవిష్యత్తులను


మూడుకూటములను-వాగ్భవ-మధ్య-శక్తి

మూడు కార్యములను-సృష్టి-స్థితి-సంహారములను

మూడు గుణములను-సత్వ-రజో-తమో గుణములను విస్తరించి తాను పర్యవేక్షించుచున్నది.

 ఆ పరాశక్తియే ఒక ఆనందమయ దివ్యరూపమును సంతరించుకున్నది కనుక"త్రిపురసుందరి"గా,సర్వాంగసుందరిగా సంకీర్తింపబదుతుంది.

  సర్వాంగసుందరి నవావరనములలో తన వంటి రూపురేఖా లావణ్యములు కలిగిన త్రిపురలను విస్తరింపచేసి నవమావరనములో తాను మహాత్రిపురసుందరిగా పూజింపబడుతున్నది.

 త్రిపురాను ఉపసర్గనుపొందిన,

 1.త్రిపుర

 2.త్రిపుర+ఈశి

 3.త్రిపుర+సుందరి

 4.త్రిపుర+వాసిని

 5.త్రిపురా+శ్రీ

 6.త్రిపుర+మాలిని

 7.త్రిపుర+సిద్ధే

 8.త్రిపుర+అంబే

      9.మహా త్రిపుర సుందరిగా,

   చక్రేశ్వరులై సాధకుని సహాయపడుతుంటారు.ఆవరననుండి నిష్క్రమించునపుడు చక్రేశ్వరికి నమస్కారముచేసి,మరొక ఆవరనము లోనికి ప్రవేశించుట సంప్రదాయము.

  భూపురమునందు మూడు పురముల ప్రసక్తి వచ్చింది.

  సులభమైన భాషలోసూటిగా చెప్పలంటే "ఆత్మ అనే సుందర చైతన్యము"స్థూల-సూక్ష్మ-కారన సరీరములను మూడింటిని కప్పుకుని యున్నది.

  ఆత్మచైతన్యమే త్రిపుర సుందరి.ఆ చైతన్యము పరిపాలించువేళ త్రిపురేశి,సుందరముగా మలచువేళ త్రిపురసుందరి,అంతర్వాసినియైనవేళ త్రిపురవాసిని,సౌభాగ్యననుగ్రహించువేళ త్రిపురాశ్రీ,సర్వ వ్యాపకమైనవేళ త్రిపురమాలిని,వ్యక్తీకరింపబడుచున్నవేళ త్రిపురసిద్ధే,జగన్మాత కనుక త్రిపురాంబే,

 అమ్మలకన్న అమ్మకనుక "మహాత్రిపురసుందరి"గా

 భావించి,దర్శించి ధన్యులగువారెందరో.

    శ్రీ  మాత్రే నమః


 


Wednesday, April 24, 2024

AMGADEVIS-PARICHAYAMU-02


 


 " హంస హంసాయవిద్మహే

   పరమహంసాయ ధీమహి

   తన్నోహంసః ప్రచోదయాత్"

  హంస మానవ ఉపాధి చేస్తున్న శ్వస ప్రక్రియ.పరమ హంస లోపలి చైతన్యము జ్వలిస్తున్న విశ్వాస ప్రక్రియ.

 పరమేశ్వరి సర్వారుణ-అనవద్యాంగి అనికీర్తిస్తున్నదిలలితా రహస్య సహస్రనామస్తోత్రము.అంటే షడంగ శక్తులూనవద్యములు.లోపరహితములు.శ్రేయోదాయకములు.

  షడంగదేవతల ప్రస్తావనము అంగన్యాస/కరన్యాసముల పూజాప్రక్రియలో వస్తుంది.

  పరమానందము ఎక్కడో లేదు అది పరమాత్మనివాసమైన మన హృదయము లోనే ఉన్నదను విషయము మన మిథ్యాప్రపంచ వ్యామోహము అడ్డుగా నిలిచి,అర్థము కానీయకున్నది.

  దానినితొలగించుకొనినతరువాత,

 ప్రతిశబ్దము  ఓంకారమే

 ప్రతి దృశ్యము మమకారమే

 పంచభూతములు స్నేహితమే

 పంచకృత్యములు పరమార్థమే.

   క్షణభంగురములకు తావులేదు.

  సర్వమంబామయం జగం.ప్రపంచము-పరమేశ్వరి అవిభ్  సర్వము అనాజ్యములు.అందులో నేనొక భాగము అను ఎరుకకలిగిన నాడు,సాధకుడు,

1.తనహృదయమున ప్రాణశక్తిని గుర్తించగలుగుతాడు.ఆ ప్రాణ శక్తికి తెలియని విషయములేదు.జ్ఞానమే హృదయము.కనుకనే ఆ పరమేశ్వరి

 అరుణాం కరుణా తరంగితాక్షిమని,

 అరుణాం కరుణ అంతరంగిత అక్షిం అని ప్రస్తుతింపబదుతున్నది.

 సర్వమును తెలియునది సర్వజ్ఞ.

 దృశ్య మాన సర్వ ద్రవ్య-గుణ-క్రియాదులు సర్వము అని భావించవచ్చును.జీవులజన్మాంతర పాప-పుణ్య క్రియా ఫలితములకు అనుకూలముగావారిని మలుస్తూ,ప్రపంచరూపమున కాలచక్రముగాకనబడునది.

2. హృదయ ద్వారము ద్వారా తనలో చైతన్య రూపిణిని గుర్తించగలిగిన సాధకుడు,తనశిరద్వారము ద్వారా ఆ చైతన్య స్వభావమును గుర్తించగలుగుతాడు.ఆ శక్తియే

"నిత్యతృప్తా"

 ఆమె బ్రహ్మాండ స్వరూపముగా లౌకిక వాంఛలను తొలగించివేసి,సర్వకాల/సర్వావస్థలయందును

"తృప్తి"అను ఆనందానుభూతిని అనుగ్రహించునది.అంటే కోరికలు లేని స్థితి.శాంతరస తురీయావస్థ యందు చిత్తవృత్తులు ఆత్మస్వరూపమును దర్శించగలుగుతాయి.

3.మూడవ అంగదేవత-శిఖాదేవి సాధకుని పరముగా.అనాదిబోధా అమ్మ అంగరక్షపరముగా.

 జనన-మరణాదులు లేని నిత్య-సత్య స్వరూపము పరమేశ్వరి అన్న విషయము బోధపడుతుంది.ఆ పరాశక్తియే,

 శాశ్వతీ-శాశ్వతైశ్వర్య ప్రదాయిని గా అర్థమగుతుంటుంది సాధకునికి ,

 మనసునకు-వాక్కునకు కారనమైన అనాదియై,వాటికిపూర్వమే ఉండి ,

 పురాతనా-పూజ్యగా  కీర్తింపబడుతున్నది.

4.  నాల్గవ అంగదేవత కవచదేవి సధకుని పరముగా.స్వతంత్రతా శక్తి సర్వేశ్వరి క్రమముగా.

 రక్షించే శక్తియే కవచము.ఆ శక్తికి మరొకరి రక్షణావసరములేదు.సాధకుడు తనను /తనలో ఆవరించియున్న సర్వరక్షాస్వరూపిణి ని దర్శించగలుగుతాడు.

5.ఐదవ అంగదేవత నేత్రదేవి సాధక పరముగా,అలుప్తా అమ్మపరముగా.

 న-లుప్తా-అలుప్తా.లోపించనది.కనుమరుగు కానిది ఈ శక్తి.

 దేశకాల అపరిఛ్చినా అయిన ఆదిపరాసక్తికి అంగదేవత.

6.ఆరవ అంగదేవత అస్త్రదేవి సాధకునిపరముగా,అమతా అమ్మ పరముగా.

 అస్త్రములు సామాన్యమైనవికావు.అవిద్యానాశకరములు.జ్ఞాన సంపన్నములు.

 దేవీ భాగవత భండాసుర సైన్యము గురించి,వధ గురించి లలితారహస్య సహస్రనామ స్తోత్రములో ,

 "భండాసురేంద్రనిర్ముక్త శస్త్ర-ప్రత్యస్త్ర వర్షిణి,

 మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైన్యకా

 కామేశ్వరాస్త్రనిర్దగ్ధ సభండాసుర శూన్యకా:

 అంటూ కీర్తించింది.

 అమ్మత్రినేత్రోజ్జ్వలాం.సాధకుని జ్ఞాన చక్షువును సైతము ఆత్మతత్త్వమును తెలిసికొను అజ్ఞానమును ఖండించు శక్తిగా చేసి అనుగ్రహించు షడంద్గ దేవతలకు సవినయ ప్రణామములతో,

   శ్రీ మాత్రేనమః.

 

    

 

 

 


Saturday, April 20, 2024

AMGADEVIS-PARICHAYAMU-01

 


  సనాతనములో ఉపాసనా విధానములు,

ఉపాధి సహిత-ఉపాధి రహిత అని రెండు విధములుగా చెప్పబడినది.

 ద్వంద్వ భావనతో ఎదురుగా ఒకయంత్రమునో/మూర్తినో/మేరువునో అసీనము చేసి తాను జీవుడనను భావనతో స్తోత్రము చేయుచు ఆ యాస్థలములలో/ఆవరణములలో పుష్పార్చనకాని,హరిద్ర-కుంకుమార్చనము కాని చేయు విధానము.

 ఆపరమేశ్వరి అనుగ్రహము అవ్యాజముగా ప్రసరించినచో ఆ సాధకుడు చేయుచున్న అజపావిధానమే వానిలో తానొక ఉపాధి మాత్రమే కాదని దానిలో దాగిన ఆదిశక్తి చైతన్య స్వరూపుణియై ప్రాణశక్తి తానై అనేకానేక శక్తులుగా పంచేంద్రియములుగా భాసిస్తున్నదని తెలిసికొనిన వేళ తనకుఇన్నాళ్ళు అడ్డుగా నున్న మిథ్యాప్రపంచమును గుర్తించగలిగి,ఏకాగ్రచిత్తముతో పారమార్థికము వైపు పయనించగలుగుతాడు.

 పరిపక్వతనొందిన అర్చన తన లోని షడంగములను అమ్మౌంకిని గుర్తించుటకు-అమ్మ అనుగ్రహమునుపొందుటకు సాధనములుగా మలచుకుంటాడు.

 అమ్మ,

"షదంగ దేవతాయుక్త" అను దివ్యానుభూతికిలోనవుతాడు.

 హంస సోహం/సోహమ్హంసను గుర్తించి,

 దేవిఖద్గమాల స్తోత్రమును పారాయణము చేయునపుడు,

 మమఖడ్గ సిద్ధ్యర్థం మూలమంత్రేణ షడగన్యాసంకుర్యాత్" అంటూ,

"ఐం-క్లీం_సౌ" అను మంత్రమును మూడుసార్లుకాని/ఆరు సార్లుకాని/తొమ్మొది సార్లుకాని జపిస్తుంటాడు.ఇవి మహాశక్తివంతములు.ఎన్నింటికో సంకేతములు.సత్ఫలిత ప్రదాయకములు.

  

 " సర్వజ్ఞతా తృప్తి అనాదిబోధః స్వతంత్రతా 

   నిత్యా అలుప్తశక్తి అనంతతాచైతివిధౌ

   షఢాషు అంగాని మహేశ్వరస్య"

 

  వీరిని సాధకుడు,



 నమో హృదయదేవి-శిరోదేవి-శిఖాదేవి-కవచదేవి-నేత్రదేవి-అస్త్రదేవి అని స్తుతిస్తూ అమ్మనంతట దర్శిస్తారు.

 ఆ విధానమును మరింతవివరణగా ఆ నామమునకుషడంగ దేవతా నామమునకు కలసంబంధ-బాంధవ్యములను అమ్మ దయతో తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.


  శ్రీమాత్రేనమః.


Wednesday, April 17, 2024

NITYA DEVIS-PARICHAYAMU


  

 " ఆద్యాయాం లలితాదేవీ-అన్యాత్ పంచదశాంగనా" 

  లలితా నిత్యరూపేణా అన్నది ఆర్యోక్తి.

 

  పరదేవతా ప్రకాసమే ప్రతిబింబములుగా "బిందు సమన్విట"త్రికోణము చుట్టు ఎనిమిదవ ఆవరణముగా శ్రీచక్రములో అలరారుచున్నది నిత్యామండల సంకేత నామముతో.

 ఉత్పత్తి నాశనము లేనిదినిత్యామండలము.

 ఆత్మచైతన్యము వైపు సాధకుని దృష్టిని శాశ్వతముగానిలుపునదినిత్య మండలము.

 15 మంది నిత్యాశక్తులు అమ్మవారి రూపలావణ్యములతో నున్నప్పటికినివృద్ధి-క్షయ విషయములో వ్యత్యాసము కలదు.

 అమ్మవారు షోడశి నిత్యకళ.

 ఏకం-అనేకం,అనేకం-ఏకము నకు ఉదాహఋఅనముగా ఈపదిహేను శక్తులు శూన్యము నుండి-సంపూర్ణం వరకు,సంపూర్నమ్నుండి శూన్య వరకు పున్నమి-అమావాస్య నామములో కాలశక్తులుగా/జ్ఞానశక్తులుగా ,

 కుండలినీ శక్తిని,నిద్రాణమైనకుండలినీ శక్తిని జాగృతపరచి,సాధకుడు తనౌనికిని కనుగొనుటకు సహాయపడుతుంటాయి.

 ఆదిశంకరవిరచితసౌందర్యలహరిస్తోత్రము ఈపదహారు కళలను "షోడశాక్షరీ" మంత్రముగా భావించి కీర్తిస్తుంది.

 నిత్యాశక్తులు తమకళలను సూర్యునినుండి చంద్రుని వద్దకు చేరుస్తూ ప్రకాశిస్తుంటాయి.

  వైదికులు సూర్యుని ఆత్మస్వరూపముగాను,చంద్రుని సాధకుని మనో భావములుగాను భావిస్తారు.అంటే నిత్యా శక్తులు జీవాత్మకు పరమాత్మను పరిచయము చేయుటలో సహాయపడుతుంటాయి.

  నిత్యాశక్తులలో "త్వరితే " నిత్యకు ప్రత్యేకత ఉంది.లలితా రహస్య సహస్ర నామ స్తోత్రము,

"అష్టమీ చంద్ర విభ్రాజత్ అళికస్థల శోభితా" అని పరదేవతను స్తుతిస్తుంది.



 ఐతిహాసిక కథనము ప్రకారము దేవీ-భండాసుర యుద్ధ సమయమున వానిదుష్ట శక్తులను ఈ పదిహేనుశక్తులేనిర్మూలించినవట.
 భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా".

  ఏదైన విషయమును తెలుసుకోవాలంటే సామాన్య మేథకు ప్రత్యక్ష నిదర్శనములను/ఉపమానములను చూపిస్తూ/చూస్తూ నేర్చుకోవటము సులభము.కనుక,

  మననిత్యా శక్తులను చంద్రకళలతో ,ఏ విధముగాచంద్రుడు రాత్రివేళయందు సూర్యశక్తిని గ్రహిస్తూ పగటివేళ ప్రపంచమునకు పంచుతుంటాడు.నిత్యదేవులు తమకు జగన్మాత అనుగ్రహించిన శక్తిసామర్థ్యములను సాధకుడు అణిమనుండి -బిందువునుచేరుటకు సహాయపడతాయి.
 ఈ పదిహేను శక్తులు,
1.కామేవరి
2.భగమాలిని
3.నిత్యక్లిన్నే
4.భేరుండే
5.వహ్నివాసిని
6.వజ్రేశ్వరి
7.శివదూతే
8* త్వరితే
9కులసుందరి
10.నిత్యే
11.నీలపతాకే
12.విజయే
13.సర్వమంగళే
14.జ్వాలామాలిని
15.చిత్రే,అను గౌణ నామములతో 
 శుక్లపక్షములో పాడ్యమి నుండి అమావాస్య వరకు.కృష్ణ పక్షములో చతుర్దశి నుండి పాడ్యమి వరకు తిథిదేవతలుగా కాలనియామకమును చేస్తుంటాయి.

   సాధకునికి తనస్వస్వరూపమును చూడాలన్నకోరికను కలిగించి,దాని సాఫల్యమునకు సహకరిస్తూ,వస్తున్న అడ్డంకులను తొలగిస్తూ,సాధకుని మానసికముగా సంసిద్ధునిచేస్తూ,గమ్యమైన బిందుస్థానమునకు చేరుస్తాయి.
 అత్యంత ప్రాముఖ్యమైన ఈ శక్తులే కిరనములై బ్రహ్మాంద-పిండాండములందుండి ప్రకాశింపచేస్తున్నాయని శివ-పార్వతి సంవాదము.
  శ్రీమాత్రే నమః.

Tuesday, April 16, 2024

SREERAMANAVAMI-2024


 


" జానక్యా: కమలా మలాంజలి పుటే  యా: పద్మరాగయితా:

   న్యస్తా రాఘవ మస్తకేచ  విలసత్ కుంద  ప్రసునాయితా:

   స్రస్తా: శ్యామల కాయకాంతి  కలితా: యాఇంద్ర నీలాయితా:

   ముక్తాస్థాం శుభదాం భవంతు భవతాం "శ్రీరామ వైవాహికాం"

  రారా మాఇంటి దాక ! సీతారామా

**********************************

స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి   నామ సంవత్సర

చైత్ర శుద్ధ నవమి, బుధ  వారము 177_04-2024,


 ఉదయము గంటలు 11-30 నిమిషాలకు,

 ఆశ్లేష  నక్షత్ర యుక్త 

 మిథున లగ్న పుష్కరాంశ

 సుముహూర్తమున 

 యస్.బి.ఐ కాలనీ - కొత్తపేట్ లో

 భక్తాగ్రేసరులచే 


 లోక కళ్యాణా రార్థము దిగ్విజయముగా /కన్నులపందుగగా జరుగుచున్న,

 

   శ్రీ సీతారామ కళ్యాణములో

**************************

  తరియిస్తున్నాడు భద్రుడు తాను పెళ్ళివేదికగా

  జటాయువు వేస్తున్నది పందిరి ఆకాశమంత

  వసతులు చూస్తున్నాడు స్వయముగా వాల్మీకి

  అతిథులను స్వాగతిస్తున్నాడు ఆదరముతో సుగ్రీవుడు

  కుశలము అడుగుతున్నాడు మర్యాదగ కుబేరుడు

 

    ఇంతలో


    మంగళ హారతినిస్తూ, మంగళ స్నానాలకై

    పదపదమని వారిని పంపింది పరవళ్ళ గోదావరి

    "మగపెళ్ళివారము మేము" అంటూ అహల్య

     పరమ పావనపాదము అనుచు పారాణిని అద్దింది

    రఘువంశ తిలకుడు అని కళ్యాణ తిలకమును దిద్దింది

    రామచంద్రుడీతడని బుగ్గ చుక్క పెట్టింది

    

     అంతలో

      "ఆడ పెళ్ళివారము మేము" అంటూ మొల్ల

       వేదవతి పాదము అని పారాణిని అద్దింది

       పతివ్రతా తిలకము అని కళ్యాణ తిలకమును దిద్దింది

       చక్కని చుక్క సీత అని బుగ్గ చుక్క పెట్టింది.


       ఆహా.... ఏమి మా భాగ్యము

       **********************

"  ఎదురుబొదురు వధూవరులు ముగ్ధ మనోహరము

   తెరసెల్ల మధ్యనుంది చెరొక అర్థ భాగము."


    ప్రవర చదువుతున్నారు వశిన్యాది దేవతలు

    ప్రమదమందుచున్నారు పరమాత్ముని భక్తులు.

    వివాహ వేడుకలను వివరించుచున్నారు విశ్వనాథ

    ఎన్నిసార్లు వినియున్నా తనివితీరని కథ.


    

   " మాంగల్యం తంతు నానేనా-లోక కళ్యాణ హేతునా"

     పట్టరాని సంతోషము మ్రోగించె గట్టిమేళము

     రాముడు కట్టిన సూత్రముతో మెరిసినది సీత గళము


       తలపై పట్టు వస్త్రములతో, ముత్యాల తలంబ్రాలతో

       తరలి వస్తున్నారు తానీషా వారసులు.

       సుమశరుని జనకునకు సుదతి సీతమ్మకు

       శుభాకాంక్షలై కురిసెను సౌగంధిక సుమములు.


       వానతోడు తెచ్చుకున్న హరివిల్లు తళుకులుగా

       హర్షాతిరేకముగా విరబూసెను తలంబ్రాలు.


     "ఒకే మాట, ఒకే బాణం ఒకే పత్ని" రామునకు అని

      మురిసిపోతున్నారు ముందు వరుసలోని వారు.

      ఒడ్డుకు చేర్చు దేవుడని తెడ్డుతో నున్న గుహుడు

      వెంట వెంట కదలాడే బంటురీతి హనుమంతుడు



       నారాయణుడితడంటు నారదునితో విభీషణుడు

       ఆశీర్వచనము చేస్తూ ఆ విశ్వామిత్రుడు

       దండము పెట్టేనురా కోదండపాణి చూడరా అని అండజుడు

       సీతమ్మకు చింతాకు పతకమునిస్తూ రామదాసు

       మా జానకిని చెట్టపట్టగానే మహరాజు వైతివని మేలమాడు 

            త్యాగరాజు.

       సీతా రాముల పెళ్ళంట- అంగరంగ వైభోగంగా

        చూసిన వారికి పుణ్యాలు అంటూ అందరూ

      తమని తాము మరచిపోతుంటే,


     "శ్రీరామ "అను చిలుక సేసలు అందిస్తోంది

     పందిరిలో పరుగిడుతూ సందడిగ బుడత ఉడుత

     అక్షింతలు అందరి తలలపై వేసుకోమంటున్నది.


     పానకమును అందిస్తున్నారు సనక సనందనాది మునులు

     ప్రసాదము అని వడపప్పును పంచిపెడుతున్నారు

     చూడ చక్కని జంట అని చూపు తిప్పుకోలేక పోతున్నామన్న

    మాటలు వినబడి

  " వారికి దిష్టి తగులుతుందేమోనని"

   సూక్ష్మ  బుద్ధితో వెంటనే అదిగో అటు చూడండిరా

        సీతా రాములు

   అలిసిపోయి ఉన్నారని వారికి ఆకలి అవుతున్నదని

   పండ్లను తినిపిస్తున్నది పండు ముసలి ఆ శబరి.

   శబరిలాగ మారి మనము శరణువేడుకొందామా

   ఆ సీతా రాములను,


        "రారా మాఇంటిదాకా"- అని త్రికరణముల   శుద్దిగా.

      

శ్రీ రామరక్ష సర్వజగద్రక్ష




Sunday, April 14, 2024

SVAMINI-YOGINI PARICHAYAMU


  

  చేతనులు ప్రపంచముతో అనుబంధమునేర్పరచుకుంటే మోహము.పరమేశ్వరితో అనుబంధమేర్పరచుకుంటే మోక్షము.కనుకనే,

 "మనసేవ మనుష్యాణాం కారణం బంధ-మోక్షకం" అన్నారు పెద్దలు.

 శ్రీదేవి ఖడ్గమాలలో తొమ్మిది ఆవరనలు ఉన్నాయి.

 అంచలంచలు లేనిమోక్షము చాలా కష్టము కనుక సాధకుడు అణిమ శక్తితో తన పయనమును ప్రారంభించి బిందువునకు చేరవలసి ఉంటుంది.

 ఇది స్థూలము నుండి సూక్ష్మ దిశగా పయనము.

 కారణము,

 బిందువు త్రికోణముగా తన విస్తరణను ప్రారంభించి త్రైలోక్య మోహన చక్రము వరకు విస్తరించి హద్దులను ఏఋపరచినది.

  తొమ్మిది విభాగములు ఒక్కొక్కచక్రేశ్వరి కొంతమంది యోగినులతో/సహాయక శక్తులతో నిండియుంటుంది.

 ఆనిర్ణీత చక్ర ప్రాంతమునకు అధికారిణి పరిపాలిని చక్రేశ్వరి.ఆమెను స్వామిని అనికూడా అంటారు.పరమేశ్వరి అంశయే స్వామిని.భగవతి.

 భగవతి/స్వామిని అధీనములో మరికొన్ని శక్తులు సాధకుని స్వామిని దగ్గరకు చేర్చుటకు సిద్ధముచేసి సహాయపడుతుంటాయి.

  మనకు అర్థమయ్యే విధముగా చెప్పుకోవాలంటే స్వామిని దగ్గరకు /భగవంతుని దగ్గరకు చేర్చగల "గురువులు" ఈ యోగినులు.

 అహం బ్రహ్మాస్మి అన్న విషయము అర్థముకావాలంటే జగమ్మిథ్య అన్నవిషయమును గ్రహించగలగాలి.

 గు కారో అంధకారస్య రు కారో తన్నివారనం.

 యోగినులు గురువులై చక్ర ఆవరనమును చైతన్యపరుస్తూ చక్రేశ్వరిని సైతము మూర్తీభవించిన చైతన్యముగా ప్రకాశింపచేస్తాయి.

1. మొదటి ఆవరనములోని గురువులు ప్రకట యోగినులు.చక్రేశ్వరి త్రైలోక్య మోహన.

 పేరులోనే ఉంది ఈ ఆవరనము స్థూలమునకు-ద్వంద్వములకు సంబంధించినది.సాధకుడు ఎటువంటి ప్రలోభములకు నవరసములకు,అరిషడ్వర్గములకు,మానవ వికారములకు బానిస కాని నాడే రెండవ చక్రములోనికి ప్రవేశించగలడు.

 

 


 2. రెండవ ఆవరనము సర్వ ఆశా పరిపూరకము.జ్ఞాన సంకేతము.పద్మపురేకుల వికసనము సంకేతము.ఇక్కడి గురువులు మానసికస్థితిని తెలియచేస్తూ గుప్త విద్యతో ప్రకాశిస్తుంటారు.చక్రేశ్వరి సర్వాశా పరిపూరక.ఆవిడ అనుమతితోనే సాధకుడు మూడవ ఆవరణములోనికి ప్రవేశించగలడు.

3.మూడవ ఆవరణమును సర్వ సంక్షోభణ చక్రము అంటారు.

 సంక్షోభణము అనగా స్పందన.ఈచక్రములోని యోగినులు/గురువులు సాధకుని మనసులో ద్వంద్వ ప్రకృతి గురించి ఆలోచించేటట్లు చేస్తారు.వారి అనుగ్రహముతోనే సాధకుడు చక్రేశ్వరికి నమస్కరించి నాల్గవ ఆవరనము లోనికి ప్రవేశించగలుతాడు.సర్వ ద్వంద్వక్షయంకరీ నమో నమః

4.ఇప్పటివరకు మనము మూడు ఊహా చరస్రాకార రేఖలు,16 పద్మదళములు,ఎనిమిది పద్మదలములున్న మూడు ప్రాకారములను దాటి,

14 త్రికోణములున్న నాల్గవ ఆవరణములోనికి ప్రవేశిస్తున్నాము.ఇక్కడ నాడీమండలము/ప్రాణసక్తి యైన కుండలిని ఏ విధముగా పనిచేస్తుందో సాధకుడు గురువులైన యోగినుల ద్వారా తెలుసుకుని,తన శరీరమును అనుగుణముగా సంసిద్ధము చేసుకుని చక్రేశ్వరి అనుగ్రహముతో ఐదవ ఆవరనములోనికి ప్రవేశిస్తాడు.

5.ఐదవ ఆవరణములో బయటవైపునకు పది త్రికోణములు పది వాయువులను సూచిస్తూ ఉంటాయి.

 ఐదు ప్రధాన వాయువులు.మరొక ఐదు ఉపవాయువులు.మన శరీరము తన విధులను సవ్యముగా చేసుకోవాలంటే అనగా

 గాలి పీల్చటము,కనురెప్పవేయగలగటము,ఆవులింత,విసర్జనము మొదలగు పనులకు చైతన్యస్వరూపమైన పది శక్తులే ఆధారము.

 6.సాధకుడు ఆరవ ఆవరనము యైన సర్వరక్షాకర చక్రములోని ప్రవేశించి అక్కడనున్న పదిమంది యోగినుల ద్వార అగ్నితత్త్వమును తద్వారా తనలో జరుగుతున్న జీర్ణవ్యవస్థను తెలుసుకోగలుతాడు.

 7 ఏడవ ఆవరనము సర్వరోగహరము.ఇక్కడి శక్తులు ఎనిమిది కోణముల రూపములో సంకేతించబడినారు.వీరినే,

 శీతోష్ణములుగను,సుఖదుఃఖములుగను,త్రిగుణములుగను ఇచ్ఛ గను  భావిస్తారు.

 8.ఇప్పుడు సాధకుడు తన శరీరములోని పాపిట స్థానమును యోగినుల,చక్రేశ్వరి అనుగ్రహముతో చేరుకున్నాడు.ఈ ఎనిమిదవ ఆవరనమును సర్వ సిద్ధిప్రద  చక్రము అంటారు.ఇక్కడ పంచతన్మాత్రలు,మనసు,రాగద్వేషములు ఎనిమిది త్రికోణములుగా సంకేతించబడినవి.ఇక్కడి గురువులైన యోగినులు అతిరహస్యమైన అమ్మ తత్త్వమును సాధకునికి అనుభవములోని తెస్తూ,తొమ్మిదవ ప్రాకారమైన ,

9.బిందు స్వరూపమైన,ఏకాత్మకమైన,అవ్యక్త మహత్తును పరిచయము చేస్తారు.

 ఇంతకంటే కావలిసినది ఏముంది? అక్కడికిచేరాలంటే మనము భవబంధములనే మూటలను విడిచివేయగలగాలి.అరిషడ్వరగములను అల్లంతదూరములో ఉంచాలి.యోగినుల అనుగ్రహమునకు పాత్రులమై,చక్రేశ్వరి,మహా భట్టారికా పాదములను విడువకుండా పట్తుకోగలగాలి.

  శ్రీ మాత్రే నమః.

 


KHADGAMALA-PARICHAYAMU


 


 " తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై

   అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి"


   పరమేశ్వరుడు-పరమేశ్వరికి వివరించినది ఈ "ఖడ్గమాలా స్తోత్రము"

 ఖడ్గము అంటేస్తుతివచనములు.ఖడ్గమాల అంటే బిందు-తికోణములుగా ప్రకటింపబడిన పరమేశ్వ-పరమేశ్వరి ప్రస్తుత వచనముల హారము.

 మరొక అన్వయము ప్రకారము చేతనుని ఆవరించియున్న అమంగళములను/అజ్ఞానమును తొలగించి,స్వస్వరూపమును తెలియచేయు సాధనము.

 ఒకే తత్త్వమును వివరించు రెండు విధములైన అనుగ్రహములు 

1.శ్రీ చక్రము

2.దేవీ ఖడ్గమాల

 ఒకటి రేఖా యంత్రము.రెండవది మాలా మంత్రము.మహా మాలా మంత్రము.

 స్థూలముగామనచుట్తు-సూక్ష్మముగా లోగుట్టు తానే నిండిన చైతన్యమే ఆ దేవీ.

 స్తోత్ర సంకల్పములో "మమఖడ్గ సిద్ధ్యర్థే"అని సాధకుడు తల్లి అనుగ్రహమనే ఆయుధమును సాధనముగా అభ్యర్థిస్తూ,మూలాధారము నుండి బిందువు వరకు ఒక్కొక్క మాయ అనే మూటను విడిచిపెడుతూ తల్లి ఒడిని చేరగలుగుతాడు.

 ఈ పయనములో తొమ్మిది ఆవరణములను దాటవలసి వస్తుంది.

 ప్రతి ఆవరణములోను చక్రేశ్వరి ఇతర సహాయక శక్తులతో సాధకునికి సహాయపడుతుంటుంది.

 మొదటి మూడు చక్రములపయనమునందు సాధకుడు ద్వంద్వభావముతోనే ఉంటాడు.నేను వేరు-నీవు వేరు,

 ఈ ఉపాధియే నేను అని భ్రమపడుతూ,దానిలో దాగిన నిత్యచైతన్యమును విస్మరించి యుంటాడు.

  సాధకునికి కనువిప్పు కలిగించుటకై తల్లి అనుగ్రహముతో మనము ముందు ఈ తొమ్మిది ఆవరనములు మన శరీరములో ఏ విధముగానున్నాయో,మనలను ఏ విధముగా శక్తివంతులను చేస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.

 అణిమాడిభిరావృతాం అహమిత్యేవ విభావయేత్ భవాని

 హ్రీంకారాసన గర్భితానలశిఖగా ప్రజ్వరిల్లుతున్న పరమేశ్వరి తన తేజస్సును వివిధ కిరణములుగా /సహాయక శక్తులుగానిర్ణీత ప్రదేశములలో నుంచి,దిశానిర్దేశముచేయిస్తున్నది.సంకోచ-వ్యాకోచములు రెండును సమయపాలనలే.

 1.మొదటి చక్రము స్థూలజగత్తులోని చర్మచక్షువులు గమనించగల అష్టసిద్ధులు-సప్త మాతృకలు-ముద్రా శక్తులను కూడి ఉంటుంది.

  హద్దును సూచించు విధముగా చతురస్రాకారములో ఉంటుంది.అవియే మనలో దాగిన నవరసములు,అరిషడ్వర్గములు చక్రములు.

 2.మొదటి ఆవరణములోని శక్తులు సాధకుడు రెండవ ఆవరణము లోనికి ప్రవేశించుటకు సహాయపడతాయి.ఇక్కడ పంచభూతములు-పంచేంద్రియములు-మనస్సును పనిచేస్తుంటాయి.

3.మూడవ ఆవరనములో మన మాట-నడక-విసర్జనశక్తి-ఆదానము-ప్రదానము,ఆనందము,ఉపేక్షతో కర్మేంద్రియములు పనిచేస్తుంతాయి

4 నాల్గవ ఆవరనములో ప్రాణసక్తి యైన కుండలిని ఉంటుంది.నాడీ వ్యవస్థను వివరిస్తుంది 

5.ఐదవ ఆవరనము పదివాయువుల ప్రాధాన్యమును వివరిస్తుంది.ఈ పదివాయువులు పనిచేయకుంటే జీవ వ్యవస్థ శూన్యమై పోతుంది.

6.ఆరవ ఆవరనము వివిధ అగ్నులతో నిండి జీర్ణప్రక్రియను నిర్వహిస్తుంటుంది.

7 .ఏడవ ఆవరనము శీతోష్ణ సుఖదుఃఖములతో పాటుగా త్రిగుణాత్మకమై ఉంటుంది.

8.ఎనిమిదవ ఆవరణము పంచతన్మాత్ర-రాగద్వేషములను కలిగియుంటుంది.

9.అవ్యక్తము-మహత్తుతో నిండి యుంటుంది.

 ఈ 

 

Saturday, April 13, 2024

SREE CHAKRAPARICHAYAMU

 


 "శ్రీ యన గౌరి నా బరగు" అన్న సూక్తి ప్రకారము మహాభట్టారికయైన యైన పరమేశ్వరి శ్రీ శబ్దముతో బహువిధములుగాప్రస్తుతింపబడుతున్నది.


1శ్రీయతే ఇతి " శ్రీః"

 చేతనులు ఆశ్రయించే పరాత్పరి "శ్రీ."

2.శ్రేయతే ఇతి "శ్రీః"

  ఆశ్రయించబడిన చేతనులకు పురుషకారత్వము/సహాయరూపముగా మారునది "శ్రీ"

3.శ్రుణోతి ఇతి "శ్రీః"

  శరణార్తుల మొరలను ఆలకించునది "శ్రీ"

4.శ్రావయతి ఇతి "శ్రీః"

  శరణార్తులమొరలను స్వామికి హృద్యముగా విన్నవించేది "శ్రీ".

5.శృణాతి ఇతి "శ్రీః"


  పాపాలను నశింపచేయగల శక్తిస్వరూపిణి "శ్రీ"

6.శ్రీణాతితి ఇతి "శ్రీః"

  కారుణ్యాది గుణములచే జగమంతా వ్యాపించి యుండి భక్తులకు కైంకర్యభాగ్యమును అనుగ్రహించే తల్లి "శ్రీ"

  ఆ మహాకామేశ్వర కామేశ్వరి "యంత్ర " రూపముగా సాధకుని అనుగ్రహించు విధానమే చక్రము.

 శ్రీచక్రము అంటే సులభతరముగాసాధకుడు తనమనోఫలకమున  అమ్మ తత్తమును ఆకారములుగా ఊహిస్తూ అర్చించే విధానము.

 శ్రీచక్రము లోని వివిధ ఆకారములలో దాగిన స్వరూప-స్వభావములను సంకేతించిన ,

ప్రమాణములను-పరిమాణములను-పరిణామములను తెలియచేయునదే "దేవిఖడ్గమాల స్తోత్రము."ఈ స్తోత్రము వామకేశ్వర తంత్రములో పంకజము వలె ప్రకాశిస్తున్నది.

 అసలు చేతనులు శ్రీచక్రము గురించి-దాని లో దాగిన రహస్యములను గురించి తెలుసుకోవలసిన అవసరమున్నదా?

   అంటే ,

 మూల ప్రకృతి అయిన మాయ/మహామాయ జగత్తునంతా వ్యాపించి మోహింప చేస్తుంది.జీవుని/చేతనుని జ్ఞానానంద 

స్వరూపమునకు అడ్డుగానిలుస్తుంది.భగవత్ కైంకర్య ధ్యాసను తప్పించి వేస్తుంది.దేహమే నేను అన్న భ్రాంతిలో ముంచేస్తుంది.మనలో దాగిన "ఈశ్వర చైతన్య" ప్రసక్తిని మరిపింపచేస్తుంది.ద్వంద్వములలో మునకలు వేయిస్తుంటుంది.

  స్వస్వరూపము తెలియాలంటే,సర్వద్వంద్వక్షయంకరి కృపాకటాక్షము మనపై ప్రసరింపవలసినదే.ఆమె చేతిని పట్తుకుని మనము "అణిమ" నుండి "బిందువు" వరకు మనప్రయాణమును చేయవలసినదే.

 మనకు అర్థమగుటకై,ఒకసారి పరమేశ్వరి పరమేశ్వరుని,

 స్వామి! శ్రీచక్రం అంతే ఏమిటి? అని వినయముగా ప్రశ్నించినదట.

 అప్పుడు పరమేశ్వరుడు దేవీ!

"శ్రీచక్రం త్రిపురసుందర్యా బ్రహ్మాండాకరమీశ్వరీ"అని సెలవిచ్చినాడట.

 "పంచభూతాత్మకంచైవ -తన్మాత్రాత్మకమేవచ" అంటూ,

 పంచభూతములు-పంచతన్మాత్రలు,కర్మేంద్రియములు-జ్ఞానేంద్రియములు-మనసు.

 ఇవికాక

 మాయ-శుద్ధవిద్య-మహేశ్వరుడు-సదాశివుడు 

   అను 21 అంశలతోనిండి సృష్టి విధులను నిర్వహిస్తున్నది ఆ పరాశక్తి.

 ఇంకొక ముఖ్యవిషయము 

 ఏకేశ్వర రూపములో నున్న పరమాత్మ సృష్టిచేయు సంకల్పముతో తనను తాను 

ప్రకాశ-విమర్శ రూపములుగావిభజించుకుని,

 "శ్రీ చక్రము"లో,

 శివశక్తులుగా

 పార్వతి-పరమేశ్వరులుగా

 బింబ-ప్రతి బింబములుగా

 ప్రకృతి-పురుషులుగా,

 తొమ్మిది కోణములుగా,

 విరాజిల్లుతున్నారు.


ఇందులో వారిరువురి మధ్య ఎక్కువ-తక్కువ ప్రసక్తి కాని,గోచర-అగోచర భావము కాని,స్థావర-జంగమ ప్రాధాన్యము కానిలేనేలేదు.

 పరబ్రహ్మమునకు రూపకల్పనము జరిగితే "పరాభట్టారిక" గా ప్రకటితమవుతుంది.పాలిస్తుంది.

 శ్రీ మాత్రే నమః.



Monday, April 8, 2024

UGADI GREETINGS-KRODHI

 ఉగాది శుభాకాంక్షలు.

 *****************

 కామ-క్రోధ-లోభ-మోహ-మదమాత్సర్యాలలో 

 క్రోధిని నేనేనంటూ,అరవై వత్సరముల తరువాత,

 అరుదెంచుచున్నావా   "ఆత్మీయ స్వాగతము."

 ప్రకట క్రోధమెప్పుడును పరమాత్మ అనుగ్రహమే

 స్థితప్రజ్ఞతనందించే పరిణామపు అనుభవమే

  అసలు,


అతిమెల్లగ కదులుటచే ముప్పది సంవత్సరాల

సమయము పట్టుతుంది శనికి చుట్టడానికి

పన్నెండు రాశుల చక్రాన్ని.

మెల్లగ కదులుటచే పన్నెండు సంవత్సరాల

సమయము పట్టుతుంది గురువు చుట్టడానికి

పన్నెండు రాశుల చక్రాన్ని

30:12 సంవత్సరాల కనిష్ఠ సామాన్య గుణిజమే 60

అందుకే తెలుగు సంవత్సరాలు అరవై.

  ఓరుపు నేర్పిస్తాయి నేరుపుగ ఈ గ్రహములు,

 , అరవై సంవత్సరములు,



  జాబిలి కూతురులో లేదా నారద కుమారులో

  వాటిపేర్లు ప్రభవ నుండి అక్షయ అని

  వరాహమిహిరుడు అన్నాడు భృగుసంహితలో

  వారించబడక కొనసాగుతున్నాయి కాల గతిలో

  గురువు-శని తమ  గమనములో ప్రతికూలమో/అనుకూలమో

 కదులుతూనే ఉన్నారుగా.


  గుణ-దోష భూఇష్ఠముల వాటిగమన  పరిణామములే

  ప్రతి ఒక్కరి ముందునున్న పంచాంగ ప్రమాణాలు.


  ఏది ఆదాయమో/ ఏది రాజ పూజ్యమో

  వ్యయము వ్యవహారమేమో/ అసలేది అవమానమో

  అతిగా ఆలోచించారా( గురువు-శని)

  సమయమెక్కువవుతుందని సగములో ఆపరు కదా

  సతమతమగు నడక యని సహనము కోల్పోవరు కదా

     నిజమే

  ఆరు శత్రువుల కట్టడియే ఆరు రుచుల పచ్చడి

    క్రోధమేమి చేయగలదు సహనమే సహాయమైన వేళ,

   నేరిమి-కూరిమి-ఓరిమి కంచుకోట యైన వేళ


  శుభకామానలందిస్తూ, అభయము తానౌతుంది.








Sunday, April 7, 2024

DEVIKHADGAMALA-YOGINULU

    దేవిఖడ్గమాల-యోగినులు

   ****************

 "అణిమాదిభిరావృతామ్మయూఖైః అహమిత్యేవ విభావయేత్ భవాని"


 "యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా' అనికీర్త్స్తున్నది లలితా రహస్య సహస్ర నామ స్తోత్రము ఆ జగజ్జననిని.

  హ్రీంకారాసనల గర్భితానల శిఖ నుండి అనేకానేకములుగా ప్రకాశవంతముగా ప్రసరింపబడే కిరణములే యోగినులు.వీరిని "పరివార దేవతలు/శక్తులు"అనికూడా అంటారు.

  నిరాకార-నిరంజన-నిర్గుణ మూలశక్తిని అర్థము చేసికొనుటకు సహాయపడు శక్తులు ఇవి.

 ఒక విధముగా చేతనులకు యోగమునుకలిగించు శక్తులు.సాధకుడు ద్వంద్వమును వీడి తనలోని చైతన్యమునుగుర్తించుటకు ఆలంబనముగా ఈ సక్తుల సహాయమును తీసుకుంటాడు.

 "దేహములో?ఉపాధిలో సూక్ష్మముగా దాగి దానినిచైతన్యవంతము చేయుచున్న మహాద్భుత శక్తిని తెలిసికొనుటయే "యోగము"

  శ్రీదేవి ఖడ్గమాల అమ్మవారి యంత్ర స్వరూపమునకు సాకారమును దర్శింపచేయు స్తోత్రము.

 ఈ యోగినులు ఒక్కొక్క ఆవరనములో నిర్దేశింపబడిన విధులను నిర్వర్తిస్తూ సాధకుని తరువాతి చక్రమును చేరుటకు సహాయపడుతుంటాయి.

 నిర్దిష్ట పద్ధతిలో విస్తరించిన పరివార దేవతలు కొన్ని గుప్తముగాను,ఇంకొన్ని బాహాటముగాను,కొన్ని దయచూపుతుంటే,మరికొన్ని దండిస్తూ,కొన్ని శరీర వ్యవస్థలను నియంత్రిస్తుంటే,మరికొన్నిమానసిక స్థిరత్వమును కలిగిస్తూ,అణిమాసిద్ధి నుండి బిందువు వరకు సాధకునకు తోడుగా ఉంటాయి.నాలో నున్న నన్ను మధ్యలో దాగిన ప్రపంచమనే మాయ తెరను ఒకే వేదిక మీద చూపిస్తుంటాయి.

  వీరివి గౌణ నామములు.

1.ప్రకట యోగినులు

2.గుప్త యోగినులు

3.గుప్తతర యోగినులు

4.సంప్రదాయ యోగినులు

5.కులోత్తెర్ణ యోగినులు

6.నిగర్భయోగినులు

7.రహస్య యోగినులు

8.అతి రహస్య యోగినులు

9.పరాపర రహస్య యోగిని గా,

  కీర్తింపబడుచున్నారు.


  శ్రీ మాత్రే నమః.


Friday, April 5, 2024

DEVIKHADGAMALA INTRODUCTION-03


 


 దేవిఖడ్గమాల-ఉపోద్ఘాతము-03

 *********************

 మహా మహిమాన్వితమైన దేవిఖడ్గమాలస్తోత్రము/శుద్ధసక్తి మాలా మహామంత్రముసనాతన సంప్రదాయమునూనుసరిస్తూ,

1.స్తోత్ర నామము

2.స్తోత్రమునూ అనుగ్రహించినఋషి

3.స్తోత్రములో నిక్షిప్తమైన దేవత/స్వభావము

4.స్తోత్రములో ప్రయోగించబడిన ఛందస్సు

5.స్తోత్ర సూక్ష్మరూపమైనబీజము

6.స్తోత్ర  బీజములో దాగిన శక్తి

7.స్తోత్ర మహాత్మ్యమును తెలియచేయు కీలకము/ఉపాయము

8.స్తోత్ర పారాయనమునుచేయూఅవశ్యకత/లక్ష్యము

9.మూలశక్తీనుగ్రహము అను తొమ్మిదీంసములతోనవనవ లావణ్య నిధి నవనవోన్మేషముగా విరాజిల్లుచున్నది అన్నమాట నిర్వివాదము.

 కొంచము విశదముగా తెలుసుకునే ప్రయత్నముచేద్దాము.


 శ్తోత్రము పేరు/స్తోత్రములో దాగిన మంత్రము పేరు,

 "అస్య-శ్రీ-శుద్ధ-శక్తి-మాలా-మహామంత్రస్యా అని చెప్పబడినది.

  స్తోత్రమునకు-పరమాత్మకు భేదములేదు.

అస్య-ఈ పరమాద్భుత స్తోత్రము మూడు శుభలక్షనములను కలిగియున్నది.అవి,

శ్రీ-శుభప్రదమైనది

శుద్ధ-అతిపవిత్రమైనది.

శక్తి-శక్తివంతమైనది.

అమ్మతో పాటుగా తొమ్మిది  ఆవరనములలోనున్న పరివారదేవతా శక్తులను సైతము గుర్తించి,అర్చి,ంచే మంత్రముల సమూహముకనుక ఇది మాలామంత్రము.

 మనము పరమాత్మను ఏ రూపముతో/ఏ స్తోత్రముతో ఆరాధిస్తామో అది మహామంత్రము.

 కనుక దేవీ ఖడ్గమాలా స్తోత్రము మహామంత్ర మాల.

 మహిమాన్విత నాదమే మంత్రము.

 మననాత్ త్రాయతే ఇతి మంత్రః.

 మననముచేసేవారిని రక్షించేదిమంత్రము.


2.రెండవ అంశమైన స్తోత్రకర్తను తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.


 దేవీఖడ్గమాలా స్తోత్రము"వామకేశ్వర తంత్రములోని"ఉమామహేశ్వర సంవాదముగా ప్రసిద్ధికెక్కినది.

 దీనినిమనకందించిన వార వరుణాదిత్య ఋషి.

వరుణ అనగా జలతత్త్వము-ఆదిత్య అగ్నితత్త్వము.ఒకవిధముగా అగ్నిసోమాత్మకము అని చెప్పుకోవచ్చును.

 అదే స్థావర-జంగమాతమకముగా కూడా అన్వయించుకోవచ్చును.

 ద్రష్టలైనఋషులకు ఆతత్త్వముప్రకృతి-పురుషులైన జగతం పార్వతీ-పరమేశ్వర తత్త్వముగా కూడాభావించుకోవచ్చును.

 ర్షి ధ్యానము మనైంద్రియములను సన్మార్గము వైపునకు మళ్ళించి స్వస్వరూపమును-నాలోని నన్ను/నేను ని గుర్తించటానికి  సహాయపదతాడు.

 కనుక ఆ ఋషిని,

ఉపస్థేయ-నన్ను నీ సమీపమునందు కూర్చుండపెట్టుకుని స్తోత్రపఠనము/ప్రకాశమును దర్శింపచేయమని,సర్వస్య శరణాగతితో ప్రార్థించుట ఆచరణనీయము.

3.స్తోత్రములో నిక్షిప్తమైన దేవతా స్వరూపమును తెలుసుకోగలుట తదుపరి విధానము.

దేవీఖడ్గమాల స్తోత్రములో,

 "సాత్త్విక కకార భట్టారిక పీఠస్థిత

  కామేశ్వరాంకనిలయాం

  మహా కామేశ్వరీ

  శ్రీ లలితా భట్టారికా దేవతా"

 అని చెప్పబడినది.వారు అవిభాజ్యులు.ఒకరికొకరు ఆలంబనగా నుండి సర్వజగములను రక్షించుచున్నవారు.

 ఆ తల్లి దేవదేవుని దివ్యమహిషి.మహా పతివ్రత.

 ఆ కామేశ్వరుడు స్తావరముగా  తానుంటూ,ఆ తల్లి ద్వారా తన శక్తిని ప్రకటింప చేస్తూ జంగమాత్మక మగుచున్నాడు.

 ఇంకొకవిధమైన అన్వయము ఎవరు దేనిని చూస్తుంటారో వారు కామేశ్వరులు.

 ఏది యైతే చూడబడుతోందో అదికామేశ్వరి.

  అనుగ్రహించువాడు కామేశ్వరుడు.దానిని సకల చరాచరములకు అందించు శక్తి కామేశ్వరి.

4.స్తోత్ర ఛందస్సు దేవీ గాయత్రీ .

 ఋషులు జ్ఞానులు మహానుభావులు తమ మానవాతీత శక్తులతో మూలపదార్థమును(నిరాకార/నిర్గుణ/నిరంజనమును)దర్శించి సేవించుకోకలుగుతారు.కానిసామాన్యచేతనులకు అసాధ్యము కనుకవారు మనపైదయతో ఆ అపరిమిత శక్తికిఒక స్వరూపమును-శబ్దములను సంక్షిప్తీకరించి  శబ్దమే శక్తిగా,నిధిధ్యాసము చేసికొనుటకు  గాయత్రీ మాతగా/మంత్రముగా మనకు అందించారు.

 స్తోత్రమునకు 

 ఐం-బీజముగా,క్లీం శక్తిగా-సౌ-కీలముగా చెప్పబడినవి

 భువనేశ్వరి దేవిబీజము-అవ్యాజ అనుగ్రహము బీజములో నిక్షిప్త పరచబడిన శక్తి.

 మనలో దాగిన చైతన్యమును-మనచుట్టు నిండిన చైతన్యమును/స్థూలమునకు-సూక్ష్మమునకు గల అవినాభావ సంబంధమును తెలిసికొనుటకు మనలోనీజ్ఞానమనే-అహంకారమనే-అలసత్వమనే అడ్దంకులులనుఖండించే అమ్మానుగ్రహమే ఖడ్గసిద్ధిప్రాఒతికి చేతనులు స్తోత్ర ప్రాశస్త్యమును తెలిసికొని-పారాయన చేసినచో అమ్మక్షిప్రప్రసాదిని.మనమూద్ధరింపబడతాము.

 శ్రీ మాత్రే నమః. 


Thursday, April 4, 2024

DEVIKHADGAMALA-INTRODUCTION-02

 


 దేవిఖద్గమాల-02

 ******************


దేవిఖడ్గమాలా స్తోత్రమునే "శ్రీ శుద్ధశక్తి మహా మాలా మంత్రము"అనికూడా కీర్తిస్తారు.

 మహిమాన్విత నాదమే మంత్రము.అంతే కాదు,

"మననాత్ త్రాయతే మంత్రః" ఎవరు మననము చేస్తారో/మనసులోనిధిధ్యాసము చేసుకుంటారో వారిని రక్షించేది "మంత్రము"

  మనము ఏ దేవతను/మూలశక్తిని సాకారముగాభావించి ఆ శక్తికిసంబంధించిన మంత్రమును మననము చేస్తామో అదిమహామంత్రము.

  ఆ మూలశక్తి తో పాటుగా అనేక పరివార శక్తులను సైతము ఆరాధించగలిగితే అది"మాలా మహా మంత్రము."

  దేవి ఖడ్గమాలా/శుద్ధశక్తి మాలా మహా మంత్రము,

ప్రతి స్తోత్రము ,

1 దేవత

2.ఋషి

3.ఛందస్సు

4.బీజము

5.శక్తి

6,కీలకమును

 కలిగియుంటాయి.

  దేవిఖడ్గమాలా మహా మత్రము,

1 మహా త్రిపుర సుందరి దేవతగా

2.వరుణ్-ఆదిత్యులను ఋషులుగా

3.దేవీ గాయత్రీ ఛందముగా

4,ఐం-బీజముగా

5.క్లీం-శక్తిగా

6.సౌః-కీలకముగా,

  సర్వాభీష్ట సిద్ధిప్రదముగావిరాజిల్లుతున్నవి.

 వీటి గురించి తదుపరి భాగములో వివరముగా తెలుసుకునే ప్రయత్నమునుచేద్దాము.

  శ్రీ మాత్రే నమః.


Tuesday, April 2, 2024

DEVIKHADGAMAALA-INTRODUCTION



     శ్రీ మాత్రే నమః
     గం గణపతియే నమః
    ****************
 అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ దయతో,
 'దేవు ఖడ్గమాల స్తోత్రము" శుద్ధసక్తి మహామాల" అంటే ఏమిటి?తెలుసుకోవాలనే జిజ్ఞాసను నాలో అంకురింపచేసిన ఆ అమ్మయే"అమ్మ దయ ఉంటేఅన్నె ఉన్నట్లే" అన్న నానుడిని మరొకసారినిరూపిస్తూ,నాచేతిని పట్టుకుని,నన్నొకకలముగా మలచుకొని తన దివ్యమహిమానుభవములను తానే తెలియచేస్తుందన్న ప్రగాఢ విశ్వాసముతో అమ్మను ప్రార్థిస్తూ,అడుగులను కదుపుదాము.
"Yఆదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
 నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః"
  ఖడ్గమాల అంటే ఏమిటి?
 ఖండించగలిగే శక్తికల ఆయుధము ఖడ్గము.అజ్ఞానమును-అధర్మమును-అయోమయమును ఖండించకలిగేది.అదే అమ్మానుగ్రహము.అమ్మ అనుగ్రహమును వివరముగా తెలియచేయు స్తోత్రము
" దేవిఖడ్గమాలస్తోత్రము.
 మూలశక్తితో పాటుగా నున్న పరివారశక్తులను తెలిసికుని,వారిప్రాముఖ్యమును సైతము గుర్తించి,ఆరాధించు అర్చనావిధానమును తెలియచేయు స్తోత్రము"దేవిఖడ్గమాల స్తోత్రము."
  మనము చర్మచక్షువులతో నేరుగా చూసి తెలిసికోలేని అపరిమిత అనుగ్రహ శక్తులను తెలిసికొనుటకు మార్గదర్శకము "దేవిఖడ్గమాలా స్తోత్రము."
 బిందువు ద్వారా సింధువు తత్త్వమును గ్రహించునట్లు మన శరీరములోని శక్తులద్వారా సూక్ష్మ సక్తులద్వారా స్థూలజగతిని పరిచయము చేయించునది"దేవి ఖడ్గమాలాస్తోత్రము."
 బురదలో వికసించిన పద్మము వలె తంత్రశాస్త్ర ప్రధానమైన "వామకేశ్వర తంత్రములో"ప్రకాశించుచున్న మహామంత్రము"దేవిఖడ్గమాలా స్తోత్రము."
 తొమ్మిది ఆవరనములతో ప్రకాశిస్తున్న మహాకామేశ్వరి/మహా త్రిపుర సుందరి నిత్య నివాసమును నిస్తుల వైభవమును వివరించునది
 "దేవి ఖడ్గమాల స్తోత్రము.
   ప్రతి స్తోత్రమునకు దేవత  దానిని ఆవిష్కరించిన ఋషి,ఛందస్సు,బీజము,శక్తి,కీలకము ఉంటాయి.
  

 

Monday, April 1, 2024

 



  జై శ్రీరాం

 **********

 ఎంతటి చమత్కారి అగస్త్యభగవానుడు.రామచంద్రునకు 'తతో యుధ్ధమునా చింతా శోకములను తొలగించుటకై రాముని సమీపించి,స్తోత్రమును ఉపదేశించి నిజస్థానమునకు తరలినాడట.ఇంకాచమత్కారము రామచంద్రుడు భక్తి-శ్రధ్ధలతో ప్రార్థించగానే సూర్యనారయణుడు సంతుష్టుడై రామునిసమీపించి,రావణునికి మరనము ఆసన్నమైనదని కాల స్వరూపునిగా/యమునిగానిర్దేశించి,రాముని దీవించి,సంతసముతోనిజస్థానమునకు చేరినాడట.

 అంటే అతి పవిత్రమైన ఆదిత్యహృదయస్తోత్రము కేవలము రామునికిసంబంధించినదా/లేక సకల చేతనులనూద్దేశించి,వెలుగు మార్గమును చూపించుటకు పరోక్షముగా ప్రసాదించినదా అన్న ఒక్కఆలోచన  

 మనకు నామికి-నామమునకు భేదము లేదని,సకలములో అంతర్యామిగా దాగిన పరమాత్మ తానొక మానవ ధర్మమును అనుసరిస్తూ,ధర్మసంస్థాపనమును ఏ విధముగా నిలిపినాడో విశదపరుస్తుంది.

  నారాయణుడే రామచంద్రుడు/సూర్యనారాయణుడు/అగస్త్యభవ్గవానుడు,ఆంజనేయుడు/విభీషణుడు/యుధ్ధభూమి,సీతమ్మ,సర్వము/సకలము పరమాత్మే.

 అయినప్పటికిని,

" గోచరంబగు జగములోపలగోప్యమైనది రామనామము."

 తాను గోప్యముగా ఉండి మనందరిచే,రాముడు యుధ్ధభూమిలో ఉన్నాడు/రాముడు చింతా-శోకముతోనున్నాడు,రాముడు తన ఎదురుగా వచ్చినిలిచిన రావణునిచూశాడూంటూ,రామకథను చెబుతున్నట్లుగా మనచే భావింపచేస్తూ,రామనామమును పలికించినాడు.

 మనము ముందు చెప్పుకున్నాట్లుగా ఇది రామ-రావణ యుధ్ధముకాదు.

 తత్ అనగా ఇది వీరిది అనినిర్వచించలేనిది-మంగళకరమైన యుధ్ధము.ప్రతిఉపాధికి సంధించినది.ప్రతిచోట ఉన్నది.ప్రతిక్షనము జరుగుచున్నది.

  దీనిని సృష్టించినది ఎవరు?చేయించుచున్నదిఎవరు?ముగింపు పలికేదిఎవరు?

 అన్న ప్రశ్నలకు సమాధానమె,

 "సృష్టి-స్థితి-లయకారణంబగు సూక్ష్మరూపము రామనామము అని మనకు తెలుస్తూనే ఉంది.

  పరమాత్మ ఆయుధ్ధమును ఏ విధముగా ప్రకటింపచేస్తున్నాడు?అనుకుంటే దానికిసమాధానము,

" సకలజీవులలోన వెలిసిన సాక్షిభూతము రామనామమూఅని సమాధానము దొరుకుతుంది.

 రావణుని ఇంద్రియములు అరిషడ్వర్గములకు అందగా నిలిచినవి.అధర్మమును ప్రోత్సహించినవి.అవివేకమునకు ఆలవాలము చేసినవి.సమయము వచ్చినప్పుడు మాత్రమే అవి

" తుంటరి కామాదులను మంతగలుపును రామనామము" అనునది సమాధానము.

అంతటి శక్తిగల రాముడు చింతాశోకములను తనను ఎందుకు ఆశ్రయము కల్పించినాడు.అది మానవధర్మము కనుక.అప్పుడు కావలిసినది ఏమిటో కూడా ఆదిత్యహృదయ స్తోత్రము సోదాహరనముగా వివరించుచున్నది.

"విజ్ఞుడగు గురునాశ్రయించిన విదితమగునది రామనామము" అదియే కదా అగస్త్య భగవానుడు రామునకు స్తోత్రమునూపదేశించి తరలిపోవుట.

మానవ ధర్మమును పాటిస్తున్న రామునకు తగిన సమయములో చక్కటిపరిష్కారము లభించినది.సాధన చేయించినది.సత్ఫలితములను అనుగ్రహించినది.

 ఇంకొక విచిత్రము,

రాముడు ఉదయాద్రిపై రశ్మిమతుని-సముద్యంతుని స్తుతించినాడట.


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...