Monday, September 30, 2024

SARVARTHASADHAKACHAKRAMU

 


  "తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త షితేనవై

   అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి"


     ప్రాణసక్తికి నిలయమయిన వాయువ్యవస్థను వివరించు ఈ చక్రమును గురించి పరమేశ్వరుడు మాత పార్వతీదేవితో,


 " శక్తిః ఏకాదశస్థానే స్థిత్వా సూతై జగత్రయం

   విశ్వయోనిః ఇతిగ్యాతా సా విష్ణు దశరూపకం."


   పరబ్రహ్మము తాను నిశ్చలముగానుండి తననుండి పది అద్భుతశక్తులను స్థితికార్య నిర్వహణకై ఉత్పత్తి చేసినది.వైష్ణవీ శక్తి శ్రీ లలితా రహస్య సహస్ర నామములోచెప్పినట్లు,


 "కరాంగుళి నఖోత్పన్నా  నారాయణదశాకృతి" ని ప్రకటింపచేసినది.

   ఈ ఆవరణములోనికి ప్రవేశించిన సాధకుడు తాను ఐదు ప్రధాన వాయువులు-ఐదు ఉపవాయువుల మధ్యన ఉన్నానని గ్రహించగలుగుతున్నాడు.

  తనతోపాటుగా తన వెంట వశిత్వ సిద్ధిమాత-సర్వోన్మాదిని ముద్రాశక్తి మాత కనిపెట్టుకుని ఉన్నారన్న విషయమును గ్రహించగలుగుతున్నాడు.

   సర్వసిద్ధిప్రదాదేవి

   సర్వసంపత్ప్రదాదేవి

   సర్వప్రియంకరీదేవి

   సర్వమంగళకారిణీదేవి

   సర్వకామప్రదాదేవి

   సర్వ దుఃఖవిమోచనీ దేవి

   సర్వమృత్యుప్రశమనీదేవి

   సర్వవిఘ్ననివారిణీదేవి

   సర్వాంగ సుందరీదేవి

   సర్వ సౌభాగ్యదాయినిదేవి అను గౌణ నామములతో

   ప్రాణ వాయువు

   అపానవాయువు

  వ్యానవాయువు

  ఉదాన వాయువు

  సమాన వాయువు

     అను ప్రధాన వాయువులగాను

  నాగ వాయువు

  కూర్మ వాయువు

  కృకరవాయువు

  దేవదత్త వాయువు

  ధనంజయ వాయువులుగా 

     తనలో చైతన్యమును నుంపుతున్నారన్న సంగతిని గ్రహిస్తున్నాడు.

   ఈ వాయువుల సహాయము వలననే శ్వాస ప్రక్రియ,జీర్ణ ప్రక్రియ,మాట్లాదగలుగుట,కంటి రెప్పను వేయగలుగుట,ఆవలించగలుగుట,తుమ్మగలుగుట,మూత్ర-మల విసర్జనమును చేయకలుగుట తనలో జరుగుచుండుట తెలుసుకొని ఆశ్చర్య పోతున్నాడు.


  అద్భుత శక్తివంతులు కులయోగినులు.అసలు కులము అంటే?

 1.కులమనగా -సదాచారము

 2.కులమనగా పృధ్వీతత్త్వము

 3.కులమనగా-మూలాధార చక్రము

 4.జ్ఞానేంద్రియ+కర్మేంద్రియముల దేహము

 5.కులమనగా-కుండలినీ శక్తి

    దేహమునకు ఆత్మకు భేదము లేదను విషయమును తెలిసికొనుట యోగము.ఆ యోగమును జీవునకు అనుగ్రహించు శక్తి యోగిని.అవి అనేకములుగాఉంటేయోగినులు.

  సాధకుడు చక్రేశ్వరి త్రిపుర శ్రీ ఆశీర్వాదముతో "సర్వరోగహర చక్ర" ప్రవేశమునకు సంసిద్ధుడగుచున్నాడు.


   సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.


   

Sunday, September 29, 2024

SARVA SAUBHAAGYADAAYAKA CHAKRAMU


 


 " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై

   అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి."

  

   అమ్మ కరుణతో సృష్టిచక్రత్రయమును దాటి,సాధకుడు స్థితిచక్రత్రయ మొదటిదైన,"సర్వసౌభాగ్యదాయక " చక్రములోనికి ప్రవేశించబోతున్నాడు.

   16 దళములతో,8 దళములతోవృత్తాకారముగా నున్న చక్ర ఆవరనములను దాటి , 14 కోణములతో వృత్తాకారముగా నున్న మన్వస్త్రము లోనికి ప్రవేశించబోతున్నాడు.కోణములు సూక్ష్మత్వమునకు సంకేతములై,సాధకుని పరబ్రహ్మ తత్త్వమును తెలియచేయుటకు సంసిద్ధమగుచున్నవి.

  పరమేశ్వరుడు గురువై పార్వతీదేవికి (గురుశిష్యసంప్రదాయానుసారముగా ) ఉపదేశిస్తున్నాడు.


 " ఈకారస్తు మహామాయా భువనానిచతుర్దశా

   పాలయంతు పరాతస్మాన్ చక్రకోణం భవేత్ ప్రియే"

      సర్వ సంక్షోభిణీ-సర్వ విద్రావిణీ-సర్వాకర్షిణీ-సర్వాహ్లాదినీ-సర్వ సమ్మోహినీ-సర్వస్తంభినీ-సర్వజృంభిణీ-సర్వవశంకరీ-సర్వరంజనీ-సర్వోన్మాదినీ-సర్వార్థ సాధినీ-సర్వ సంపత్తి పూరిణీ-సర్వ మంత్రమయీ-సర్వ ద్వంద్వక్ష్యంకరీ అను గౌణనామములతో " సంప్రదాయయోగినులుగా కీర్తింపబడుతూ,పదునాలుగు కోణములుగా ప్రకటిమగుచున్నది ఈ ఆవరనము.

 ఈ ఆవరణములో అర్షడ్వర్గములకు తావులేదు.సప్తధాతువులు శుద్ధిచేయబడి ఉన్నాయి.ముద్రాశక్తులు మార్గమును సుగమము చేస్తున్నాయి.భువనేశ్వరి అనుగ్రహప్రాప్తిని పొందుటకుసాధకునితో పాటుగా,సర్వ వశంకరీ ముద్రా మాత-ఈశ్వర భావనను పెంపొదిస్తూ ఈశిత్వసిద్ధి మాత చెరొకచేయి పట్టుకుని నడిపిస్తున్నారు.

   ఇంతకంటె సౌభాగ్యము ఇంకేముంటుంది.


 


 సాధకునికి సర్వసౌభాగ్యచక్ర ప్రవశము ముఖ్యమైనది.శివశక్తులు విడివడి నాలుగు ఊర్థ్వకోనములుగా-ఐదు అథో కోణములుగా స్థావర-జంగమములుగా                సంకేతించబడుతు దర్శనమిస్తాయి.


 అథోముఖముగా విస్తరించిన ఐదు శక్తికోణములు సమసి తిరిగిజనించు పంచభూత ప్రకృతిగాను,ఊర్థ్వముఖముగా నున్న నాలుగు శివ కోణములు శాశ్వతమైన ధర్మ-అర్థ-కామ-మోక్షములు గాను సనాతనము కీర్తిస్తుంది.

 ఇప్పటి వరకు సాధకుడు అవిద్యా స్వరూపముగా నుండి విద్యాస్వరూపములైన యోగినుల-చక్రేశ్వరుల అనుగ్రహముతో తనలోని ఉనికిని గమనించడము ప్రారంభిస్తున్నాడు.బ్రహ్మము గురించి తెలుసుకోవాలనే తపనకు బీజం పడింది.అది చక్రేశ్వరి"త్రిపుర వాశిని" అనుగ్రహము.

 వాసిని అన్న పదమునకు నివసించునది అను అర్థము ఉన్నప్పటికిని,వాసి-ఖడ్గము/గొడ్డలి ని ఆయుధముగా ధరించియున్నది అని విశ్లేషకులు చెబుతారు.అమ్మ అనుగ్రహమనే గొడ్డలి ఒకేదానిని మూడుగా భావించే అజ్ఞానమును ఖండించివేస్తుంది. 


   ఈ చక్రమును విశ్వముతో అన్వయించుకుంటే పరదేవతయొక్క దశేంద్రియములు-మనసు-బుద్ధి-చిత్తము-అహంకారము

   ఈ చక్రములోని పదునాలుగు కోణములను పదనాలుగు భువనములుగా పరిగణిస్తారు.

    

    ఈ చక్రమును ఉపాధి పరముగా అన్వయించుకుంటే హృదయస్థానమయినానాహత చక్రము అంటారు.నాడీ మండలములోని ఇడ-పింఘళ-సుషుమన మొదలగు పదునాలుగు ముఖ్యనాడుల అనుసంధానముతో పోలుస్తారు.(72000 నాడుల ఉపాధి అయినప్పటికిని)

   ఉపాధి ఆరోగ్యపరముగా సమన్వయించుకుంటే ఈ పదునాలు కోణములే రక్తప్రసరణమునకు సహాయపడుతూ,సప్తధాతువులను సమన్వయపరుస్తూ,శరీరములోని శీతోష్ణములను నియంత్ర్స్తూ,వాక్పటిమను కలిగిస్తుంటాయి.

   బ్రహ్మజ్ఞానపిపాసిగా మారిన సాధకుడు చక్రేశ్వరి త్రిపురవాసిని ఆశీర్వచనముతో,యోగినీ మాతల సిద్ధిమాత-ముద్రామాత అండ-దండలతో తరువాతి ప్రాంగణమైన సర్వార్థసాధక చక్ర ప్రవేశమునకు అర్హుడవుతున్నాడు.

   సర్వం  కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు



Friday, September 27, 2024

SARVA SAMKSHOBHANA CHAKRAMU.

 


 "  తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై

    అష్టాదశ  మహాద్వీప0 సమ్రాడ్భోక్తా భవిష్యతి"


  పూర్వభాగ పరిచయము

  ***********************

 


 "లకారః పృథ్వీబీజం తేన భూబింబముచ్యతే

  సకారః చంద్రమా భద్రే కలా షోడశమాత్మకః"


 అంటూ భూపురములో ప్ర్థ్వీ తత్త్వమును.సర్వాసా పరిపూరకములో జలతత్త్వమును సంకేతించిన పరమేశ్వరుడు,మూడవ ఆవరణమైన,

సర్వసంక్షోభణచక్రమును 'హ కార బీజమైన " వ్యోమ తత్తముతో సంకేతిస్తూ పార్వతితో ,తన అష్టమూర్తి తత్త్వమే అష్టదళ పద్మని

అనంగ శక్తులను ప్రస్తావిస్తున్నాడు.

 

 సంక్షోభణము అనగా స్పందనము/కదలిక.స్పందనము ద్వారా /చైతన్య ప్రసరణమును గావించి పరిపాలించుట.త్రిపురసందరి చక్రేశ్వరిగా,ఎనిమిది అతిమహత్తర శక్తిస్వరూపములుగా ,

కుసుమా

ఏఖలా

మదనా

 మదనాతురా

 రేఖా

 వేగినీ

 అంకుశా/కుశా

 మాలినీ అను

    గౌణనామములతో,

 అనంగాను ఉపసర్గను ముందు నిలుపుకుని సాధకునికి సహాయపడుతున్నాయి.

   హ కారబీజపూరితమైన సర్వసంక్షోభణ చక్రములోని అనంగ శబ్దము ఆకాశతత్త్వమునకు ప్రతీకయైనది.

 ఒక విధముగాచూస్తే ఆ అనంత ఆకాశమునుండి ప్రకటింపబడినవి ఏగా వాయు,అగ్ని,జల,భూమి అను మిగిలిన భూతములు.

  అనంగ శక్తులు గుప్తతరముగా చేయుచున్న పనులను గమనిద్దాము.

 1.కుసుమా మాత మనమునిశ్చలముగానున్నదని భ్రమపడే భూమి తిరుగుటకు కారణముగాను,

2.మేఖలా మాత జలము తళుకులీనుచు ప్రవహించుతకు కారనముగాను

3.మదనా మాత అగ్ని ఊర్థ్వముఖముగా జ్వలించుతకు కారనముగాను

4.మదనాతుర మాత వాయువు మందముగాను/తీవ్రముగాను అవసరమును బట్టి వీచుటకు కారనముగాను,

5.రేఖా మాత ఆకాశము వ్యాపకత్వముతో విరాజిల్లుటకు కారనముగాను

6.వేగ మాత సూర్యోదయ-సూర్యాస్తమయములకు కారనముగాను/సూర్యగమన శక్తిగాను

7.కుశా మాతచంద్ర కళల తిథి రూపములకు కారనముగాను

8.మాలిని మాత జీవుల మనోభావముల వైవిధ్యమునకు/చలనమునకు కారణముగాను శక్తిని ప్రసాదిస్తున్నారు.

  గమనిస్తే విశ్వమును/జీవులను స్పందింపచేసే అనుగ్రహ శక్తులే

గుప్తతర యోగినులు.విశ్వపాలనమనగా విశ్వములోని సకల చరాచర పాలనయే కదా.

   వారు ఎవ్వరు గమనించలేన్విధముగా చలన స్వరూప/స్వభావములతో  జీవులు సైతము చక్రభేదనము చేయుటకు,నవావరణమున ప్రవేశించుటకు కారణభూతులగుచున్నారు.

  

 


  త్రైలోక్యమోహనము-సర్వాశా పరిపూరకము-సర్వ సంక్షోభనము అను మూడు ఆవరణములను "సృష్టి త్రయ చక్రములు" అని అంటారు.

సాధకులు ఈ మూడు ఆవరణములలో జరుగుచున్న భౌతిక పరిణామములను గమనించే స్థితిలోనే ఉంటారు.నేను-విశ్వము,దేహము-ఆత్మ,జీవుడు-దేవుడు అనే ద్వంద్వభావములనుండి,యోగినీ మాతల సహాయముతో,చక్రేశ్వరుల ఆశీర్వచనములతో,కోణ విలసితములైన (కుశాగ్ర బుద్ధిని అందించు)"సర్వసౌభాగ్యదాయక చక్రా ప్రవేశార్హతను పొంది,నిర్ద్వంద్వ స్థితిని తెలుసుకొనుటకు ప్రయత్నిస్తుంటాడు.


  సర్వంకామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.


SARVAASAA PARIPURAKA CHAKRAMU


 


 "  తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై

    అష్టాదశ  మహాద్వీపాం సమ్రాడ్భోక్తా భవిష్యతి"


  పూర్వభాగ పరిచయము

  ***********************

 " లకారః పృథ్వీ బీజం తేనభూబింబముచ్యతే" 

  ఫ్పార్వతీ ల కారము  ప్ర్ఠ్వీతత్త్వమునకు మూలబీజముగానున్నది.విశ్వములో త్రైలోకమోహన చక్రముగాను,జీవుల ఉపాథులలో  మూలాధారచక్రముగాను అమరియున్నది.

 విద్య-అవిద్యా స్వరూపిణి అయిన జగన్మాత ,

 అవిద్య గా చేతనులలోను,విద్యా స్వరూపిణిగా ప్రకటయోగినులు-చక్రేశ్వరి గా విరాజిల్లుతు సాధకుని తమోగుణమును మాయా మలమును దూరము చేసి గమనమును సుగమము చేస్తున్నది.


  " సర్వాశా పరిపూరక చక్రము"

    *******************

 అమ్మ అనుగ్రహముతో ఒక్క మెట్టు ఎక్కి రెండవ ప్రాంగనములోనికి ప్రవేశించిన సాధకుడు,వికసిస్తున్న పదహారు రేకులతో వృత్తాకారముగా నున్న ఆవరణములోనికి ప్రవేశించాడు.

   విశ్వములో "సర్వాశా పరిపూరక చక్రము"అని ఉపాధిలో "మణిపూరక చక్రము అని పిలుస్తారట.

  "షోడశ కళానిధికి షోడశోపచారములు" అను నాదము నినదిస్తుండగా,పదహారుగురు మాతృమూర్తులు సాధకుని సాదరముగా ఆహ్వానిస్తున్నారు.

   వారిని "గుప్తయోగినులు" అని కీర్తిస్తారు.ఆకర్షణ శక్తులుగా భావిస్తారు.వారినే,

1.షోడశాక్షరీ మంత్రము యొక్క

2.షోడశ జాతకకర్మల యొక్క

3.షోడశ తిథుల యొక్క 

   సంకేతములుగా అర్థము చేసుకుంటారు.

     అప్పటి వరకు చదును నేలపైనడిచిన సాధకుడు వృత్తాకారము చుట్టు అడుగులు వేయుటను అభ్యసిస్తున్నాడు.

   ఇంతకీ  అ ప్రదేశము జలమునకు ప్రాముఖ్యత వహించినది.

 చంద్ర కళల వివరమును తెలుపుచున్న ఆ ప్రదేశమునకు చంద్రుడు ,వరుణుని అధిదేవతగా-శ్రీగౌరిని ప్రత్యధిదేవత గా కలిగిఉన్నాడు.

  చంద్రమా మనసో జాతః అన్నట్లుగానే సాధకుని మనసులో చేరి ఆశ/కోరిక విచారణమును గావిస్తున్నాడు.

 మనో బుద్ధ్యహంకారములు-శబ్ద-రూప-స్పర్శ-రస-గంధములను పంచమాత్రలు,సాధకుని చిత్తములోని అధైర్యమును పోగొట్టి,మనసులోని దేహాత్మ భావమును తొలగిస్తూ,పరబ్రహ్మ తత్త్వము పలుకరించునట్లు చేస్తున్నారు.

 తమోగుణమను నిద్రను విడిచి స్వప్నావస్థలో నున్న సాధకుడు తనకోరికల గురించి ఆలోచిస్తున్నాడు.ఇది సర్వాశా పరిపూరకము.కాని సరియైన ఆశలు మాత్రమే సాఫల్యమును పొందుతాయి.

  అసలు తనకోరికలకు కారణమేమిటి? ఏది కోరుకోవాలి?

 మనసులో ఒక మెర్పు.ఆగామి సంచితములా?

 పూర్వ జన్మలలో చేసిన పాప-పుణ్యములా

    లేక

 తదుపరి జన్మలలోనేననుభవించవలసిన ఫలితములా

    నాలో ప్రవేశించి కోరికలుగా వెలువడునవి

 బీజాకర్షిణి మాత సాధకుని దరిచేరి నా మనసులోని ఆశాపాశములను-దేహభ్రాంతిని తొలగించి వేస్తున్నది.

   నావేఅనిపించే సుఖదుఃఖముల-బరువు బాధ్యతల మూటలు వానిని వీడి గుట్తలుగా పడియున్నాయి శరీరాకర్షిణి చల్లని దీవెనలతో.

 బుద్ధ్యాకర్షిణి మాతనా దరిచేరగానే ఇన్నిరోజులు సాధకుని ఆడించిన ఇంద్రియములు వాని దరిచేరి ఆడించుటకు తడబడుచున్నాయి.మనసు సైతము తన ఒరవడిను మార్చుకుంటున్నది.రజోగుణమయితే చల్లగా జారుకున్నది.

  నాలో గుప్తముగా జరుగుచున్న మార్పులను గమనిస్తూ,ఆ పదహారుగురు తల్లులు సాధకుని చక్రేశ్వరి అయిన "త్రిపురేశి" మాత దగ్గరకు తీసుకుని వెళ్లి పరిచయము చేశారు.ప్రణామములనందుకున్న తల్లి సాధకుని ఆశీర్వదించి,మరొక మెట్టు ఎక్కి,సర్వసంక్షోభణ చక్ర ప్రవేశార్హతను అనుగ్రహించింది.

  కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.


Thursday, September 26, 2024

SREECHAKRADHAARINI-01



  శ్రీచక్రధారిణి-త్రైలోక్య మోహన చక్రము-01
  ****************************
   ప్రార్థన
   ********

   " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై

    అష్టాదశ మహాద్వీపం  సమ్రాడ్భోక్తా  భవిష్యతి"

    తల్లి అనుగ్రహము/ఆరాధనము అనే ఖడ్గము చేతధరించినవారికి వర్తమానములోనే కాకుండాభవిష్యత్తు నందును సామ్రాజ్యాధికారము ఉంటుందట.ఆసామ్రాజ్యము అష్టాదశ మహాద్వీపమట.అంటే మన ఉపాధిలోని దశేంద్రియములు+సప్తధాతువులు+మనస్సు అను మహాద్వీపములు,నారాయణతత్త్వము అను జలముతోచుట్టివేయబడిఉన్నవి.వానిని సన్మార్గములో సంరక్షించుకోగల  అనుగ్రహము/ఖడ్గము అమ్మ కరుణ మాత్రమే.

   పరమేశ్వరుడు పరమేశ్వరికి ప్రథమ ఆవరణమును ఈ విధముగా తెలియచేస్తున్నాడు.

 దేవీ!

 " చతురస్రం మాతృకార్ణైః మండితం సిద్ధిహేతవే

   ముక్తా మాణిక్యఘటితం "సమస్థల" విరాజితం

   త్రైలోక్య మోహనం నామ కల్పద్రుమ ఫలప్రదం"



    ఈ ఆవరణము కల్పవృక్షమునకు అనుగ్రహశక్తినిచ్చిన,.కోరినకోరికలను తీర్చేశక్తిని కలిగియున్నది.అంతే కాదు సమతల ప్రదేశముగా , ముత్య మణి-మాణిక్య సహితమై మోహనత్వముతో పాటుగా,త్రితత్త్వములను కలిగి

 "త్రైలోక్య మోహన చక్రముగా" కీర్తింపబడుచున్నది.
   స్తోత్రము
   *******

  
                శ్రీచక్ర ప్రథమావరణదేవతాః
అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ, విరాజితము.

  ఈ ఆవరణము మూడువిభాగములను మూడుగీతలద్వారా ప్రకటింపడియున్నది.నాలుగువైపుల నాలుగు వేదములు ద్వారములుగా ప్రకాశిస్తుంటాయి.

   యోగము అనగా అర్హత.అర్హతను అందించగలిగిన శక్తి యోగిని మాత.

  భూపురచక్రములలో సిద్ధిమాతలు-మాతృకా మాతలు-ముద్రా మాతలు విరాజమానులై చక్రేశ్వరి యైన "త్రిపురను" సేవిస్తుంటారు.చేతనులకు సహాయపడుతుంటారు .

  .త్రిలోకములను సమ్మోహనపరచే శక్తివంతముగా అమ్మ భువనేశ్వరియై విస్తరించినది కావున "త్రైలోక్య మోహన చక్రము" అనికూడా అంటారట.విస్తరణకు హద్దును నిర్ణయించినందుకు "భూపురము" అంటారట.

   తెలుపు-ఎరుపు-పసుపు రంగులతో  
మూడు ఊహా    చతురస్రాకార రేఖలను కలిగియున్నది ఆవరణము.మూడు ప్రాకారములను నాలుగు వేదములు నాలుగు ద్వారములుగా రక్షిస్తుంటాయట.

   "మానవ మేథ పరిమితము.అమ్మ అనుగ్రహము అపరిమితము"

.మాతృవాత్సల్యము అమ్మచేత తన అంశలను అనేకరూపాలుగా ప్రభవింపచేసి,అనేక ఆవరణములయందు నియమించి,వారికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించేటట్లుచేసింది.

    రేఖా విశేషాలను పరిశీలిద్దాము.

 అమ్మ విస్తరణ ప్రకటనమునకు ఆఖరిది-జీవుని పతనమునకు మొదటిది ఈ ఆవరణము.ఆవరణములోని మూడు రేఖలను త్రిగుణములుగా-మూడు అవస్థలుగా-మూడు శరీరములుగా,జీవుని మూలాధారముగా,'ల కార బీజముగా సంకేతిస్తారు.



  మొదటి రేఖ యందు సిద్ధిమాత శక్తులు,రెండవ రేఖ యందు మాతృకా మూడవరేఖ   యందు ముద్రా శక్తులు అవ్యాజానుగ్రహమును అందిస్తుంటాయట.

  సాధకుడు "విశ్వ" నామముతో మొదటిరేఖా      ప్రాంగణ   ప్రవేశము చేసిన తరువాత  అరిషడ్వర్గములు+పాప పుణ్యములు తనలో నిండియున్నాయన్న           విషయమును గ్రహిస్తాడు.వాని అధీనములో తానుండుట వలనే తమోగుణముతో నిండియున్న విషయము అర్థమవుతుంది.దానిని తొలగించుకోగలగాలంటే,అష్టసిద్ధి శక్తుల /మాతల అనుగ్రహము తక్క అన్యము లేదు.ఇక్కద ఎనిమిది శక్తులు విద్య-అవిద్య రూపములతో ఎదురుబొదురుగా నున్నవి.మాయామోహితమైన జీవుని అవిద్యను తొలగించుట సిద్ధిమాతల లక్షణము
.  

  అణిమ-లఘిమ-మహిమ-ఈశిత్వ-వశిత్వ-ప్రాకామ్య-ఇఛ్చా,ప్రాప్తి-అను స్వభావ/గౌణ నామములతో కీర్తింపబడు వీరు,సాధకునికి తన తమోగుణమును విడిచిపెట్టుటకు సహాయపడుతూ,రెండవ రేఖా ప్రాంగణ ప్రవేశార్హతను  కలుగ చేస్తారు.

   రెండవ రేఖా ప్రాంగణములోనికి  ప్రవేశించిన సాధకుని/జీవులను,

 బ్రాహ్మీ-మాహేశి-కౌమారి-వైష్ణవి-వారాహి-మాహేంద్రి-చాముండా-(సప్తమాతృకలు) మహాలక్ష్మీ సమేతముగా ఆశీర్వదిస్తుంటారు.
    

  సాధకుడు తనశరీరములోని సప్తధాతువులకు-మనసునకు వశుడై ఎన్నో ఇబ్బందులను పడుతుంటాదు..వాటిని తొలగించగల శక్తి కేవలము మాతృకానుగ్రహమే.

 సప్తధాతువులు మనసు మాతృకానుగ్రహముతో శుద్ధిపొందిన సాధకుడు అహంకారమును విడనాడి,మూడవరేఖా ప్రాంగణ ప్రవేశార్హతను ( రజోగుణమును వీడి) పొందుతాడు.

   మూడవరేఖా ప్రాంగణములోని ముద్రాశక్తులు సాధకుని తనను తాను తెలుసుకొనుటకు తన శరీరమును ఉపకరణముగా మలచుకునే విధానమును అనుగ్రహిస్తాయి.తన శరీర భంగిమలతో తనలో దాగిన శక్తిని జాగృతము చేసుకొనవచ్చన్న ఉపాయమును చెబుతాయి.(యోగ)

   మూడురేఖలలోని మాతలు తమ  అనుగ్రహమును/సహాయమును ప్రకటితము చేస్తూ,"ప్రకట యోగినులు" గా 

 కీర్తింపబడుతూ,తమ చక్రేశ్వరి అయిన "త్రిపుర" దగ్గరకు తీసుకునివెళ్ళి ,నమస్కరింపచేసి ఆమె ఆశీర్వాదమును పొంది,ఇంకొక మెట్టు ఎక్కి రెండవ చక్రమైన "సర్వాశా పరిపూరక చక్ర"ప్రవేశార్హతను కలిగిస్తారు.



    అర్థము చేసుకోగలిగినవారికి చేసుకున్నంత.

   మనముచ్చట

 **********

 మనము ఉపయోగించే ఫోనులొ మాట్లాడకుండ/   చాటింగ్ /  👍సంభాషణము చేస్తుంటాము.పెద్ద పెద్ద వాక్యములకు బదులుగా చిన్నచిన్న గుర్తులను పెడుతుంటాము.బొమ్మలను పెడుతుంటాము         😂ఈ విధానము కొత్తదేమి కాదు.

  ఇక్కడ Q వరుస మూడు వరుసలుగా ఉంది.

 మనము మనుషులము.మనలో దాగిన ఆశ,కోపము,పిసినారితనం మొదలగు 
లోపలి శత్రువులు     మనతో ఆడుకుంటాయి,వాని ఆటలను ఆపేందుకే అష్టసిద్ధులు అనే శక్తులు సహాయముచేస్తుంటాయి(.మొదటి వరుస దాటుట.)

  మనము మనుషులము కనుక మనశరీరములో రక్తము-ఎముకలు-మాంసము అంటు ఏడు పదార్థములు ఎక్కువ తక్కువ క్రమములోనికి మారుతూ మన       ఆరోగ్యమును        కలవరపరుస్తుంటాయి.వాటిని నియంత్రించుకొనుటకు సహాయ పడే వి             మాతృకా శక్తులు అంటారు.వారి సహాయముతో (రెండవ వరుస దాటుట).

  మనము శారీరక-మానసికముగా ఆరోగ్యముగా ఉండాలంటే యోగా చేయాలంటాము కదా.ఆ యోగా విధానమునకు సహాయపడు శక్తి మాతలనే ముద్రాశక్తులు అంటారు. 

  ఇక్కడ సమస్య-పరిష్కారము ఎదురు-బొదురుగా ఉన్నాయి.

 సమస్యలున్నాయంటే చీకటి ఉన్నట్లే.అదే తమోగుణము.
       ఆ చీకటి మనచే అనేక   

పనులను చేయిస్తూ-వాటి ఫలితములను అనుభవింపచేస్తుంది.గత జన్మలవి ఇప్పుడు-ఇప్పటివి మరుజన్మలలో.
  వాటిని పూర్తిగా పోగొట్టుకోవాలంటే శరీరము అవసరము దానిని సాధనముగా మలచుకొని తరించే ఉపాయమును చూపే,
"తమసోమా జ్యోతిర్గమయా-దేవీ ఖడ్గమాల స్తోత్రము."

  భువనేశ్వరి విలాస నిర్మితమైన త్రైలోక మోహన చక్రము ప్రకట యోగినుల పరిపాలినిగా/చక్రేశ్వరిగా "త్రిపురా దేవిని కలిగి యున్నది.సాధకుడు చక్రేశ్వరికి నమస్కరించి,ఆమె ఆశీర్వాద అనుగ్రహముతో మరొక మెట్టు ఎక్కే అర్హతను పొందుతాడు.

  ఓం పృథ్వీ తత్త్వాత్మికాయై  గంధం పరికల్పయామి.

   సర్వం  కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.



Wednesday, September 25, 2024

SREECHAKRADHAARINI-INTRO


 


   "  దేవీ ఖడ్గమాల స్తోత్రము"

      ******************


 " తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై

   అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి"-



 

 ఆదిశంకరులు భావించినట్లు,

 

 " శివ ఏవ గురు సాక్షాత్-గురుః ఏవ శివః స్వయం" అన్న సూక్తికి ఊఅహరనముగా సక్షాత్ పరమేశ్వరుడు గురువై "శ్రీచక్రధారిణి" యైన అమ్మ యొక్క ప్రకటిత మేరుస్వరూపము యొక్క స్వరూప-స్వభావములను పార్వతీదేవికి అనుగ్రహించిన స్తోత్రమే ,

 " శ్రీ శుద్ధ శక్తి మహామాలా స్తోత్రము " అను దేవీ ఖడమాలా స్తోత్రము.

  ఖడ్గము అంటే స్తుతి.స్తుతిమాల.పరివారదేవతా సమేత స్తుతి మహా మాల.శక్తివంతమైనది కనుక శక్తి మహా మంత్ర మాల.సత్-చిత్ స్వరూపము కనుక

 శుద్ధశక్తి మాల మహామంత్రము.

 శుభప్రదమైనది కనుక 

   శ్రీ శుద్ధశక్తి మహా మాల మంత్రము.

    శాక్తేయ సంప్రదాయానుసారముగా దేవీ అర్చనావిధానము,

మంత్ర-యంత్ర-తంత్ర విధానములలో కొనసాగుతున్నది.

  శక్తివంతమైన శబ్దము మంత్రమైతే-దానిని ఒకచోట నిలుపగలిగేది యంత్రము.ఇక తంత్రము,

 ఒక అద్భుతమైన అల్లిక/నేత.ఆత్మ-పరమాత్మలు ఒకదానితో మరొకటి విడి విడిగా కనపడినప్పటికిని,అవి నిత్యము ఒకదానినొకటి అల్లుకునే ఉంటాయి.

   శక్తివంతమైన మంత్రహార సమూహమును 'మాలామంత్రము" అంటారు.మహా మాలా మంత్రము.

  శుభము-పవిత్రత-శక్తి అను మూడు నదుల త్రివేణి సంగమము,

 "శ్రీ శుద్ధ మాలా మహామంత్రము."

   ఈ పవిత్రస్తోత్రము,

1.నామము

2ఋషి

3.నిక్షిప్త దేవత

4.ఛందస్సు

5.బీజము

6.శక్తి

7.కీలకము అను శుభలక్షణ శోభితము.

    

    "అస్య శ్రీ శుద్ధశక్తి మాలా మహా మంత్రస్య" అని నామము ప్రథమముగా కీర్తింపబడుచున్నది.

    స్తోత్ర "ఋషి" అయిన వరుణాదిత్యుని సాధకుడు తన సమీపమున నిలిచి మార్గదర్శకము చేయమని "ఉపస్థేంద్రియాధిష్ఠాయీ" అని అర్థిస్తాడు.

     నిక్షిప్తదేవత అయిన"మహా కామేశ్వరీ శ్రీ లలితా భట్టారికను దర్శించగలుగు జ్ఞానమును కోరుతుంటాడు.

     ఆ తల్లి కామేశ్వరాంకనిలయ.కామేశ్వరుని ఒడిలో కూర్చుని యుంది.కామేశ్వరుడు కకారపీఠస్థితుడు.కకారపీఠము సత్వశోభితమై వారిరువురు అధిష్టించుటచే ప్రకాశిస్తున్నది.

   గాయత్రీ ఛందము శబ్దమై శ్రవణానందమును అందిస్తున్నది.

       ఇప్పుడు మనము బీజము-శక్తి-కీలకము అను మూడు విషయములను తెలుసుకుందాము.

  అక్షరమునకు పూర్ణానుస్వారము చేరి(0) దానిని బీజాక్షరముగా మారుస్తుంది.ఉదాహరణకు,

 ఓ అను అచ్చుకు సున్న చేరి "ఓం కారమను "బీజాక్షరమును చేస్తుంది.అదేవిధముగా "ఐం-హ్రీం-శ్రీం.

   మనభాషలో బీజము అంటే విత్తనము.స్థూలమును తనలో దాచుకొనిన సూక్షమము.

  స్తోత్రమునకు బీజము" ఐం".దీనినే భువనేశ్వరి శక్తి అని కూడా అంటారు.

   ఐం అను బీజములో నిక్షిప్తముగా దాగిన శక్తిని "క్లీం" అను బీజాక్షరముతో సంకేతిస్తారు.

   ఇప్పుడు మనకు శక్తి బీజరూపములో దాగి ఉన్నది.అంతే,

   నిధి ఉన్నది కాని మనము దానిని చేరలేము.అది తాళము వేయబడియున్నది.తాళమును తొలగిస్తే కాని లోపలికి వెళ్ళలేము.

తాళమును తొలగించగలిగేది కేవలము తాళపుచెవి మాత్రమే.ఆ తాళపు చెవియే "సౌ" అను కీలక శబ్దము.

   ఆ తాలపు చెవి మనకు లభించాలంటే,తల్లి స్తోత్రజపము-తత్త్వ అవగాహనము అను ఒకేఒక మార్గము ఉన్నది.

  అదియే "వామకేశ్వర తంత్ర "గ్రహీతమైన

   దేవీ ఖడ్గమాలా స్తోత్రము 


 

    సర్వం  కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.

     

Monday, September 9, 2024

SREESUKTAM-12-AAPAHA SRUJAMTU SNIGDHAANI

 


 శ్లోకము


 "ఆపసృజంతు స్నిగ్ధానీచిక్లీత వసతు మే గృహే

 నిచదేవీం మాతరం శ్రియం వాసయ మేకులే"


SREE SUKTAM-11-KARDAMAEVA PRAJAABHUTA


  శ్లోకము

 "కర్దమేవ ప్రజాభూత మయి సంభవ కర్దమ

  శ్రియః వాసర మే కులే మాతరం పద్మ మాలినీం."

 

  శ్లోకము

 "కర్దమేవ ప్రజాభూత మయి సంభవ కర్దమ
  శ్రియః వాసర మే కులే మాతరం పద్మ మాలినీం."
  

 'మనస@కామమాకూతిం" శ్లోకములో ధాన్యలక్ష్మి-విద్యాలక్ష్మి స్వరూపముగా మహా లక్ష్మి(అనుగ్రహము)తన దగ్గరకు చేర్చి,తనను సత్యవంతునిగా అనుగ్రహించమనిన సాధకుడు,ప్రస్తుత శ్లోకములో సృష్టి రచనను అనేక పర్యాయములు అవిచ్ఛిన్నముగా నిర్వహిస్తున్న "సంతాన లక్ష్మి" ని 
 విశ్వరచనలు అన్న పద్మములను ఈం అనుగ్రహిస్తున్న మహాలక్ష్మి అనుగ్రహమునకు సహాయపడమని జాతవేదుని ప్రార్థిస్తున్నాడు.
   తల్లి పద్మమాలను ధరించి ప్రకాశిస్తున్నది.ఏవిధముగా మహాలక్ష్మి జగమంతా అంతర్యామిగా నిండియున్నప్పటికిని ప్రపంచమాయను తాకనిదై వెలుగొందుచున్నదో మనము గ్రహించుటకు ,నీటినుండి బురదతో నిండిన ప్రదేశములో నుండి పుట్టినప్పటికిని ఆ నీటిని తన ఆకుపై కాని,పుష్పముపై కాని ఏ మాత్రము నిలువనీయని 
 శుద్ధ సత్వ చైతన్య మూర్తికి సంకేతమైనది.
  అతువంటి వైరాగ్యమును తరతరములకు అందీయకలిగినది పద్మమాలిని అయిన మహాలక్ష్మి.
  అమ్మ  ఆది/మూలమైన  జల స్వరూపముగా ప్రస్తుతుంపబడుచున్నది.
   
   సాంఖ్య పురాణము ప్రకారము అవ్యక్తము వ్యక్తముగా ప్రకటింపబడుతూ చేయుచున్న విశ్వరచనా విన్యాసము పద్మమాలినీ స్వభావము.
  పద్మమాలిని మాతరం శ్రియం-శుభములను కలిగించును గాక అనిఒక భావము.
 మాతరం-మంత్రం ఒకే పదము యొక్క రెండు నాదములుగా భావిస్తే,
 మంత్ర స్వరూపిణి అయిన మహాలక్ష్మి శుభములనుచేకూర్చును గాక.
 పరబ్రహ్మిణి -ప్రజాభూత -జగములను సంతతిని జీవులను సృచించినది.
  ఇంకొక మధుర భావన ఆ తల్లి మాతయే కాదు.
 ప్రజా- మానస పుత్రిక గా/సంతతిగా భూత--జనించి అనుగ్రహించినది
    మంత్రస్వరూపిణి-పద్మమాలిని-శ్రేయోదాయిని అయిన ఓజగజ్జనని నీవు కేవలము నన్ను మాత్రమే "కులే"నా షట్చక్ర నివాసము చేస్తూ అనుగ్రహించుతయే కాదు,నా "కులే"నా వంశమును కూడా 
 కేదముని అనుగ్రహించినట్లు నా సంతతిని/కులమును/వంశమును అనుగ్రహించు.
  ప్రస్తుత శ్లోకములో కర్దమ-ఇవ.కర్దమ అని కర్దమ శబ్దము రెండు సార్లు ఆవృత్తమవుతుంది.
  ఒకటి-కర్దమ ప్రజాపతిని సంకేతిస్తు
  రెండవది జలమునుండి ప్రకటింపబడిన జాతవేద
  నీవు కనుకనీ తల్లిని తోడ్కొని వచ్చి,నన్ను సంరక్షిస్తుంటే
    మయి-సం-భవ-నన్ను కూడి ఉండినట్లయితే,
  వాసర మే శ్రియం-శుభములు శాశ్వత నివాసం చేస్తాయి
   కర్దమ అన్న పదమునకు బురద/ఒండ్రెఉ అన్న అర్థమును స్వీకరిస్తే ,విష్ణుపురాణకథనము ప్రకారము,
  బ్రహ్మపదార్థము నుండి ప్రకటింపబడిన బ్రహ్మ మానస పుత్రుని అనుగ్రహించిన మహాలక్ష్మి నన్ను సైతము అదే వాత్సల్యముతో అనుగ్రహించుటకు రమ్ము.
 హిరణ్మయీంలక్ష్మీం  శిరసాం  వదామి..
  
  

Friday, September 6, 2024

GAM GAM GANESHA-2024


 మహా గణపతిం మనసా స్మరామి

********************************
నలుగురి మేలును కోరి,నలుగు ముద్దతో గౌరి,
పరమ శివుని స్మరియిస్తూ,"వరపుత్రుని" చేసినది.

సమరమైన చేయగలుగు సామర్థ్యపు కాపరి,
కర్తవ్యము శుభకర " కరివదనుని" చేసినది.

తల్లిని,తండ్రిని భక్తితో చుట్టిన బాలుని వైఖరి,
అగణిత వాత్సల్యముతో "గణనాథుని" చేసినది.

అహంకరించు అసురునిపై మోగించిన యుద్ధభేరి,
"ఏకదంతుని," "మూషిక వాహనుని" చేసింది.

మేరు పలకపై దంతపు ఘంటపు వ్రాత
మహా కావ్య నాటకాది ప్రియునిగా కీర్తించినది

పార్వతీ పరమేశ్వర పరిపూర్ణత్వము
విఘ్నములను తొలగించు వినాయకుని చేసినది.

అపహాస్యము చేసిన ఆ చంద్రుని తిక్క కుదిరి,
"భాద్రపద శుద్ధ చవితి" బహుళ ప్రాచుర్యము పొందినది.
.................
మట్టి ముద్దలో దప్పిక తీర్చు జలము,
జలములో దాగినది జ్వలనము అగు అనలము,
అనలమునకు సహాయము అనువైన అనిలము,
అనిలముపై ఆధారము సకల ప్రాణి జీవనము,
అలలతో ఆడునది ఆ పున్నమి ఆకాశము,
స్థూల,సూక్ష్మ తత్వముతో-భక్త సులభ వశత్వముతో,
పంచ భూతాత్మకముగా మా మంచిని కోరుచున్న,
మట్టి ముద్దతో ముద్దుగా మమేకమైనది నీ రూపు నేడు.
........................

ప్రణవ స్వరూపుడా ప్రణామములు మా అయ్యా,
పత్రిపూజలు అందుకొని పచ్చదనమును ఈయవయ్యా,

ఆవిరికుడుము ఆరగించి ఆరోగ్యమును ఈయవయ్యా,
బిడ్డలగు మా దరిచేరు అడ్డంకులు తొక్కవయ్యా,

మూషిక వాహనుడవై సామూహిక పూజలు అందుకోవయ్యా,
" ఓంకార మూర్తి " మంచికి "శ్రీకారము " చుట్టవయ్యా.

ఉత్సవాలు ప్రోత్సహించు-ఉత్త పూజలైనా సహించు,
కాని పనులు క్షమించు-కానుకలు అనుగ్రహించు,
వినతులు స్వీకరించు- వినుతులు స్వీకరించు,
పదిదినములు అందముగ పందిళ్ళలో పరవశించు,
పదికాలాలు నిండుగా ప్రతివారిని దీవించు.

పంపిచేస్తామయ్యా కనుల సొంపైన వేడుకగా,
మళ్ళీ మళ్లీ రమ్మంటూ కన్నీళ్ళ వీడ్కోలుగా,
మనసులోనే పూజిస్తూ-మళ్లీ సంవత్సరానికై,
మజ్జారే అనిపించే నిమజ్జనాలతో

అంతదాక,

దురాశకు ప్రతిరూపమన్న నీలాపనిందను
" దూరముచేసి",
చింత లేని చిన్ని ఎలుకగా మారి నేను
" గం గణపతయే నమ:" అంటు నీ చెంతనే ఉండనీ.

వినాయక చవితి శుభాకాంక్షలు

Wednesday, September 4, 2024

TEACHERS DAY-2024

  ఏకములో  అనేకమే గురువు-పూజిద్దాము.

 ***************************************

శ్రీ గురుభ్యో నమ:

**************

భావి సౌభాగ్యమనే బలమైన సౌధమునకు

కీలకమైన మూలధనము మీరు

ఊపిరి అందిస్తున్న ఉపాధ్యాయులారా

ప్రవాసాంధ్ర ప్రకాశిత ప్రాభవ జ్యోతుల్లారా

వందనము- అభివందనము.

 అసతోమా సర్గమయా.

-------------------------

దేశాభివృద్ధి " నాది " అను బాధ్యత "పునాది" పై

ఆటు పోటు తట్టుకునే దీటుతనపు " ఇటుకలను" పేర్చి

ఈసు ఇసుమంతయు గానరాని ఇంగితపు "ఇసుక" చేర్చి

ఐకమత్యమే బలము అను సెంటిమెంటు " సిమెంటు " తో

వీడలేని దేశభక్తి" గోడలను" కట్టిస్తున్న

శాస్త్రములు అందిస్తున్న " మహనీయ మేస్త్రీలు"

వందనము- అభివందనము

 తమసోమా .జ్యోతిర్గమయా

-------------------------

కలకాలము కలపాలి అను భావపు "కలప"తో

మంచి తలపులనే తలుపులను,కిటుకులనే కిటికీలను

చెక్కు చెదరని ధైర్యమనే చెక్క పనిముట్లను

కుసంస్కారపు" చెద" చేరకూడదనే తలపుతో

చెక్క చక్కదనానికి చిత్రీలు పట్టిస్తున్న

చాకచక్యము అందించే " వదాన్యపు వడ్రంగులు "

వందనము-అభివందనము.

-మృత్యోర్మా  అమృతంగమయా.---------------------

ఆపాత మధురముగా పూజ్యభావము" కప్పు" కొనగా

లలిత కళా తోరణములను,సన్మానపు శాలువలను

లేతవైన మెదడులను, "జాతీయ పతాకను "

మాయా మర్మములు ఎరుగని" మానవతా-తాను" ను

" చిమటలు" కొట్టనీయకుండ చేతలు అనే దారముతో

నేతలను నేస్తున్న " చేనేత కళాకారులు " మీరు.

వందనం-అభివందనం.

-- నమోనమః శ్రీ గురుపాదుకాభ్యాం.-----------------

పసిమనసుల పసిడిని పుటము వేయు" కంసాలులు "

కాసేపు" కుమ్మరులు,"కాసేపు" కమ్మరులు", ,

అన్నీ మీరేనుభిన్నత్వపు బాటలలో " ఏకత్వము " చాటుతారు

ఏక కాల బోధనలో " అనేకము " సాధించగలరు


" ప్రతిభ " అభ్యున్నతి చెందిన ప్రతి ఒక "ఇతివృత్తములో "

     ప్రకాశిస్తుంటాడు " ప్రత్యక్షముగా గురువు "

    గురుపాదములపై లగ్నముచేయని మనసా!

     ఇప్పటికైనా మార్చుకో నీ పద్ధతి.

    

మనస్సే నలగ్నం గురోరంఘ్రిపద్మే-తత: కిం తత: కిం తత: కిం తత: కిం ????

********************************************************************

( శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి నివాళి.)


Monday, September 2, 2024

SREESUKTAM-10-MANASAH KAAMA VAAKUTI.


  శ్లోకము

 "మనసః కామం ఆకూతిం వాచః సత్యం  అసీమహి
  పశూనాం రూపం అన్నస్య మయి శ్రీ శ్రయతాం యశః"
  
 క్షుప్తిపాసాం మలా జ్యేష్ఠాం  అలక్ష్మీ నాశయ అని ప్రార్థించిన సాధకుడు ప్రస్తుత శ్లోకములో పాడి-పంటలను అనుగ్రహించే "ధాన్యలక్ష్మి"ని తన దగ్గర స్థిరముగా ఉండునట్లు అహ్వానించమని జాతవేదుని  ప్రార్థించుచున్నాడు.

  ఓ జాతవేద-శ్రియం అసీమహి.
 శ్రేయోదాయకమైన  మహాలక్ష్మిని  నా దగ్గరకు చేర్చుం.ఆ తల్లి అనుగ్రహముతో,
 నా త్రికరణములు సత్యమార్గమునూనుసరించగలుగుతాయి.
  అదియే నా -ఆకూతి-సంకల్పము.
 నామనసః-మనస్సు-వాచః-పలుకులు-తద్వారా నేను కోరుకునే కోరికలు/కామం సత్యసంపూర్ణములై సన్మార్గమును అవలంబిస్తాయి.
   తద్వారా ,
 అకూతిం-సంకల్పము సిద్ధించి  నేను సంతృప్తిని పొందుతాను.దృఢసంకల్పము నన్ను అమ్మ అనుగ్రహముతో సిద్ధిని పొందేటళుగా చేస్తుంది.
   తత్ఫలితముగా ,
పాశూనాం-రూపం-అన్నస్య మయి  అసీమహి.
  పశువుల ద్వారా పాడి,పంటలద్వారా అన్నము లభిస్తాయి.ఇదిఒక భావన.
  ఇంతకుముందరి శ్లోకములో "కరీషిణీం" గోమయమును ప్రసాదించే తల్లి అనికీర్తించారు.
  ప్రస్తుత శ్లోకములో వాచః-వాకులను సత్యసంపూర్ణము చేసి వేదవాజ్మయమును ఆకళింపు చేసుకొని,ఆచరించే అనుగ్రహమును 
  ఆకూతిం  సంకల్పమును-సిద్ధిని అనుగ్రహించునట్లు చేయుము.
  ఆ మహాలక్ష్మి ధాన్యలక్ష్మియే కాదు విద్యాలక్ష్మి కూడ.
 పశూనాం రూపం శ్రేయతాం మమ.
 అన్నస్య రూపం  శ్రేయతాం మమ
 సత్యస్య రూపం  శ్రేయతాం మమ
 కామస్య రూపం శ్రేయతాం మమ
 మనసః నాం శ్రేయతాం మమ.
  ఓ జాతవేద నీకు పరబ్రహ్మమునకు భేదములేదు.నీవు మా ఇద్దరికి అనుసంధానకుడవు.
బిల్వమంగళుడు కీర్తించినట్లు,
 "జిహ్వే రసజ్ఞే మథుర ప్రియత్వం
  సత్యం  హితం  త్వాం పరమం వదామి"
      నేను సత్యవాక్పరిపాలకునిగా మారాలంటే.
  నా మనసులో జనించే కోరికలు ధర్మబద్ధమైనవిగా ఉండాలి.
      ఎందుకంటే
 "మనసేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షకం."
    కనుక నా వాక్కును నా మనసు సన్మార్గమున నడింపచగలిగినదై ఉండాలి.
 పశూనాం అనగా ఇంద్రియములు అన్న అర్థమును స్వీకరిస్తే అవి సత్యము తన రూపుగా /ప్రకటనముగా కలిగియుండాలి.
   మా మయ-నాయందు-యశ స్రీ-కీర్తి అనే సంపద .లక్ష్మీప్రద స్వభావము శాశ్వతముగా నుండి
 మయ ఆకూతిం-నన్ను సంతోషముతో నుండునట్లు దీవించును గాక.
     హిరణ్యమయీం  లక్ష్మీం  సదా భజామి.
 
 

SREESUKTAM-09-GAMDHADVAARAAM


  
  శ్లోకము

 " గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం
   ఈశ్వరీగ్0 సర్వభూతానాం తాం ఇహ ఉపహ్వయే  శ్రియం."

     క్షుప్తి పాసా మలాం అన్న సమస్యకు పరిష్కారము ప్రస్తుత శ్లోకము.
   శ్రేయమును కలిగించుటకు మహాలక్ష్మికి నాప్రార్థనను వినిపించు ఓ జాతవేద!
   శ్రేయ స్వరూపిణీయిన మహాలక్ష్మిని,తన పరిమళము ద్వారా భూలక్ష్మిగా ప్రకటింపబడుతున్న భూలక్ష్మికి నేను తనను నా దగ్గరగా వచ్చి నిలిచియుండమని ప్రార్థించుచున్నానని చెప్పు.
    ఆతల్లి,
   ప్రథ్వీ తత్త్వముతో పచ్చిలకులుగా,సౌగంధికవనములుగా ,పండ్లతోటలుగా,పంట పొలములుగా,కొండ చరియలుగా వివిధ రూపములతో తన సుగంధమును  వెదజల్లుతూ మనకు దర్శనమిస్తున్నది.
   ఆ భూలక్ష్మియే తన అనుగ్రహమును పాడి-పంటల రూపముతో ప్రకటింపచేయుచు "ధాన్యలక్ష్మి" గా  దర్శనమిస్తూ ధన్యతను అనుగ్రహిస్తున్నది.
   ఆకలితో పాటు దప్పికను తీర్చుటకై ఆ భూలక్ష్మియే నదీమతల్లిగా మారి జలలక్ష్మిగా కీర్తింపబడుతున్నది.
  ఆ మహాశక్తియే గోవులను తన ప్రతిరూపముగా సృష్టించి పుష్టిని ఇస్తున్నది.
  ఆ గోమాత/గోలక్ష్మి తన గోమయముతో పాడిపంటలను పుష్కలము చేస్తూ,అభూతిని-అసమృద్ధి పూర్తిగా తరిమివేస్తున్నది.
  ఆ గోమాతయే వాక్రూపమై సమస్తమును శుభప్రదము చేస్తున్నది వేదమాతగా/వేద వాగ్మయముగా.
   కనుక,
1. గంధద్వారాం-పరిమళము ద్వారా ప్రకటింపబడుచున్నదియు అగు భూదేవిని,
2.దురాధర్షాం-ఎవ్వరు తొలగించుటకు సాధ్యము కానిదియు,
3.నిత్యపుష్టాం-శాశ్వతముగా పుష్టిని అనుగ్రహించగలదియును,
4.కరీషిణీం-విశేషముగా గోమయమును అనుగ్రహించగలదియు,ఆకర్షణ గా మారి శుభములనొసగునదియును,వేదవాజ్మయ విభవమైనదియును
5.ఈశ్వరీం సర్వభూతాని-సమస్త చరాచర జీవులకు సామ్రాజ్ఞి అయిన దానిని 
6.శ్రియం-శ్రీలక్ష్మీ దేవిని
  ఇప్పిడు 
తాం నీవు, ఇహ-ఇక్కడకి ,ఉపహ్వయే-అహ్వానించుచున్నానన్న(త్రికరముల సాక్షిగా నా శ్వాసలో స్వాసగా/అత్యంత సమీపముగా ఉండి అనుగ్రహించుటకు,ప్రార్థించుచున్నానని చెప్పి,లక్ష్మీ అనుగ్రహమును అందింపుము.

   ప్రథ్వీమయీం  లక్ష్మీం  సదాభజామి.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...