Sunday, November 17, 2024

TANOTU NAH SIVAH SIVAM-16


 


   తనొతు నః శివః శివం-16

    *****************

 "వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థా ప్రతిపత్తయే

  జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"


    స్వామి అగ్నితత్త్వమును మనందరిచే దర్శింపచేసిన రావణుడు ప్రస్తుత శ్లోకములో స్వామి జలతత్త్వమును సంకీర్తించుతతో పాటుగా స్వామి అగ్నిసోమాత్మకమును హర్షాతిరేకముతో అందిపుచ్చుకుంటున్నాడు.

   చరణము

   *******

 " 


 " నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్

   "కుహు నిశీధినీ" తమః ప్రబంధ బంధుశేఖరః

   నిలింప నిర్ఝరీధరః తనోతు కృత్తి సింధురః

   కళానిధాన బంధురః శ్రియం జగత్ దురంధరః"


   మహాదేవుని మహిమలను మరింత భక్తితో సంకీర్తిస్తున్నాడు రావణ బ్రహ్మ.

 స్వామి తనోతు శ్రియం-స్వామి క్షేమములను విస్తరింపచేయును గాక.

 స్వామి తనోతు శ్రియం జగత్-జగములన్నింటి యందు స్వామి క్షేమములను విస్తరింపచేయును గాక.   

   పరమేవ్శ్వరుడు రెండు తమోగుణ సంకేతములచే తనను తాను బంధించుకొని యున్నాడు.(అలంకారములుగా )

 

 1.స్థిరరేఖను సైతము కనబడనీయని కొత్తగా ప్రకటించుకొనుచునంబ నల్లని మేఘములు

 అదియును ఒకటికాదు-రెండు కాదు-మూడు కాదు

  మండలిని-లెక్కించలేనన్ని సమూహమును

  కంథరః-కంఠసీమకు

  ప్రబంధ-విడివడలేనంత గట్టిగా

  బంధు-బంధించుకొని యున్నాడు.

  తమః-చీకట్లను బంధు కంథరః-చీకట్లను కంఠమునకు గట్టిగా బంధించుకొని యున్నాడట.

 2.ప్రబంధ బంధు కృత్తి సింధురః

      కృత్తి-చర్మమును-సింధురః -ఏనుగు యొక్క 

   ఆ ఏనుగు తెల్లని ఐరావతము కాదు.

 తమః కృత్తి-అజ్ఞానముతో కూడిన అహంకారముతో ప్రకాశమును గుర్తించలేనంత నల్లదనమును/చీకటిని కలిగియున్నది.

   మహాదేవుని కంఠము నల్లమేఘముల సమూహముతో నిండియున్నది.పోనీ

   వక్షస్థలమునైనా దర్శించుకుందామంటే దానిని సైతము

  తమోగుణ సంకేతమైన ఏనుగు  చర్మము ఉత్తరీయమై కప్పివేసియున్నది.

   నాల్గవ చరణములో

 మదాంధసింధుర త్వగుత్తరీయమును ప్రస్తావించిన రావణుడు ప్రస్తుత చరనములో

 " పటికంపు చాయ మా సామి శంకరుడు '(సామవేదం వారి రచన) అంటున్నాడు."

 " తొలుత తానే వెలిగి -ఆ తొలివెలుగు పలుకులనే నలువకు కైసేసిన తండ్రికి జోత" అంటూ 

   అగ్నిస్తంభముగా ప్రకటింపబడిన స్వామి-తన ప్రకాశ సక్తి అంసను బ్రహ్మకు అనుగ్రహింపగా ఈ నలుపు-తెలుపుల కలయిగా జగములు వెలుగుచున్నవంటున్నాడు.

   తమో గునమును తుడిచివేయుటకు స్వామి మరో రెండింటిని అలంకారముగా గ్రహించాడు .అవే,

 1.నిలింప నిర్ఝరీ-జీవనదియైన/అతిపవిత్రమైన గంగానది.ఆ గంగమ్మ తన అభిషేకముతో కాలకంఠుని గరలమును చల్లబరుస్తున్నది.

2.కలా నిధానము-చంద్రశేఖరతత్త్వము సుధావృష్టిని కురిపిస్తూ 

 త్మోగుణములను తరిమివేయును గాక.

 " శివా అన్నంతనే చమరించు కనుదోయి

   పొంగిపోవును ఎడద-పులకరించును ఎడద."

 విశేషములు

 *********

1.  హరిహరాత్మకమొకటే అన్న భావన,

  ఆండాళ్ తల్లి తిరుప్పావైలో 4 వ పాశురములో

 "ఆళిమళై కణ్ణా! ఉలగనిల్ పెయిదిడాయ్" అంటూ నల్లని మేఘమువై వర్షించమని ప్రార్ర్థిస్తుంది.

2.రుద్రనమక 7 వ అనువాకము మహాదేవుని,

 నమో మేఘ్యాయచ-విద్యుత్యాయచా 

 వర్షాయచ-అవర్షాయచ " స్వామికి నమస్కరిస్తుంది.

    కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ

     భజ శివమేవ నిరంతరం.

    ఏక బిల్వం  శివార్పణం.

     

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...