తనోతు నః శివః శివం-17
******************
' వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం"
మహాదేవ! తం భజేహం.
స్వామి,
" ఇప్పటిదా సామీ నీ-నా సంబంధము
ఎప్పటిదో చెప్పలేను గానీ
కప్పిన అజ్ఞానంబున కాంచలేనిదిది
ఇప్పటికైనను ఎరుకను ఈయరాద ఏమి?"
స్వామి నీకథరము నవీనమేఘమండలిగా భావించిన నాపై అనుగ్రహ వర్షము కురిపించినది.ఆ నల్లదనము కాలకూట విషమునదని కొందరి అభిప్రాయము.భగభగమని మండుతూ సకలమును దహించివేస్తుందట.నీ మూడో కన్నుతో పాటుగా,నీ కంఠమున నల్లగా నున్న గరళము సైతము
నడుమ వచ్చి వంచించిన నానా లౌల్యములను ఖండించుటకు మాత్రమే అనుమతినిస్తున్నావా ఓకృపాసింధు!
శివుని కరుణ అర్థముకానిదైనప్పటికిని అద్భుతమైనది కనుకనే అప్పుడే వికసిస్తున్న నల్లకలువల మాలయై చల్లదనమును వెదజల్లుతున్నది సర్వేశ్వరా.సదా భజామి.
No comments:
Post a Comment