TANOTU NAH SIVAH SIVAM-23@ SIVATANDAVASTOTRAMU

   

 '  వారె ధన్యులు వారెధన్యులు

    వారె పుణ్యులు ముక్తులు

    వారిచూపులు శివుని చూపులు

    వారిపలుకులు శైవ మంత్రములు

    వారిహృదయమె శివాలయము

    వారెచూప్ర్దరు మార్గము మనకు.(సామవేదం-శివపదం)


   స్తోత్ర ప్రారంభమునకు కారణము కామక్రోధములు.ఆత్మలింగమును పొందవలెననునదికామము.అది లభించలేదని వచ్చినది క్రోధము,ఇంకెవరైన పొందెదరేమో అనునది మాత్సర్యము.ఒకవేళ తాను పొందినప్పటికిని ఎంతకాలము తనదగ్గర ఉండునో లేక వెణ్టనే చేయిజారిపోవునో అనునదిలోభము.భుజబలముతో కైలాసమును ఎత్తి దానినిపొందవలెననునది మదము.విఫలమైన తదుపరి అమ్మను తనతో రమ్మనుట మోహము.అర్షడ్వర్గముల అధీనములో నున్న రావణుడు వాటికి అతీతుడై స్వామిని స్తుతించగలుట అనుగ్రహ విశేషము.

  భక్తి క్రమక్రమముగా పరిణితిచెందుతూ వేదికను,అలంకారములను,అమ్మ అనుగ్రహమును దర్శింపచేస్తూ క్రక్రమముగా ఆమ్ర్యమును సైతము అవగతమొనరించుచున్నది.

  ప్రస్తుత భాగము స్వామి నర్తనమునకు స్వామికి,మద్దెల గతులకు దాని వాయిద్యకారునకు గల నిర్ద్వంద్వమును నివేదించుచున్నది.

 ఇప్పటి వరకునిన్నెప్పుడు భజింతునో  అనుకునుచున్న రావణుని మనసు మరింత పరిపక్వమును పొంది,స్వామి బేను దర్శించుచున్న ఆ అద్వైతము నేనైనిన్నెప్పుడుభజింతునో కద అనిపిస్తున్నది.

  హెచ్చుతగ్గులను తుడిపివేసినది.ఏకం సత్ అన్న సూక్తిని స్పష్టము చేస్తున్నది.

 కదా-ఎప్పుడో భజామ్యహం-నేను నిన్ను అద్వైతములోమునిగి అర్చించగలిగినది అని ఆర్తితో అనగలుగుతున్నది.

   సమప్రవృత్తిని సదాశివుడు మనందరికి అనుగ్రహించును గాక.

    ఏక బిల్వం శివార్పణం.


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI