దూరీకర్తుం వాంఛసికిం-మనీష-04

 


  చీమలో-బ్రహ్మలో శివకేశవాదులలో

  ప్రేమమీర తెలుసుకుంటే--అన్నారు త్యాగరాజు.

  

   ఈ విషయమునే మనీషా పంచకము,

 " యా బ్రహ్మాది పిపీలకాంత తనుషు" అనికీర్తిస్తున్నది.


 ఒకవిధముగా ఈ వివరనము "అహం బ్రహ్మాస్మి"అను మహావాక్య వివరనముగాను భావించవచ్చును.సూక్ష్మ-స్థూల ఉపాధిలో నిక్షిప్తముగా నుండి/సాక్షీభూతముగా నున్న పరమాత్మ ఏ విధముగా 

 అహం నే-నాది-నావలన-నానుండి అను పరిమిత భావనను తొలగించుకొనిన అంతయు బ్రహ్మ+అస్మి= బ్రహ్మమై యుండును.అంతే అపరిమితము నుండి పరిమితమును తొలగించుకొనగలుగుట;

 నేను ఎవరు? అన్న పేశ్నకు

 శరీరము+ మనసు+ఆత్మ సమాధానమనుకొనినప్పుడు దాని నుండి కాలపరిమితమైన-కాలముతో పాటుగా పరిణామములను చెందుచున్న శరీరమును లెక్కించ నప్పుడుమిగిలిన ,మిగిలిన కాలమునకులొంగని/మార్పుచెందని/నామరూపములు లేని చైతన్యమే-"బ్రహ్మము."

  ఉదాహరణమునకు మనము వెలుతురులో మన శరీరమును పూర్తిగా చూసుకొనగలము.కాని చీకటిలో సైతము మన శరీరము అదేవిధముగా ఉంటుంది అన్న భావనను కోల్పోము దానిని మనము సరిగా చూడలేకపోయినప్పటికిని.దానికి కారనము అనుభవ జ్ఞానము.ఆ అనుభవజ్ఞానమే "మనీష"

   అద్వితీయమే చైతన్యము కాని రెందవది లేదు అని తెలుసుకోగలుగుటయే జ్ఞానము.

 దీనినే 

 స ఇవ అహం నేను బ్రహ్మముగా అన్నింటిలో ఉన్నప్పటికిని,

 దృఢప్రజ్ఞాపి-దృశ్యవస్థితి-దృఢమైన/నిశ్చల ప్రజ్ఞ కలవాడు మాత్రమే అనుభవపూర్వకముగా తెలిసికొనగలడు అంటూ,

 ఉపాధికి-ఉనికికికల వ్యత్యాసమును జాగ్రత్-స్వప్న-సుషుప్తి అవస్థలను ఉదాహరనముగాచూపుతూ మూడు అవస్థలలోను నిద్రాణము కాని బ్రహ్మస్వరూపమును వివరిస్తున్నారు శంకరులు.


 1.జాగ్రదావస్థలో చేతనుల మనసు ఉపాధి మెలకువతోఉంటుంది. ఆ సమయములో పరబ్రహ్మ చైతన్యము "విశ్వ" అన్న నామముతో ప్రకాశిస్తుంటూంది.

2.స్వప్నావస్థయందు స్థూలశరీరము స్వల్పకాలికలయములోనున్నప్పుడు మనసు తనాలోచనలకు స్వప్నములను పేరిట రూపకల్పనము(తాత్కాలికముగా)చేస్తుంటుంది.ఆ సమయములో సైతము అంతర్యామి అయిన పరబ్రహ్మము "తైజస" (తేజోరూపము) అను నామముతో ప్రకాశిస్తుంటుంది.

3.మూడవదైన సుషుప్తి అవస్థలో గాఢనిద్రలో చేతనుని శరీరము-మనసు నిద్రాణముగా ఉన్నప్పటికిని (సమాధిస్థితి) పరబ్రహ్మము "విశ్వ/విరాట్" రూపముతో ప్రకాశిస్తూనే ఉంటుంది అని తెలుసుకొనుటయే 'మనీష."

 మూడు అవస్థలలోను అవస్థారహితముగా ప్రకాశించేదే బ్రహ్మము.

 సర్వంశివమయం జగత్

 ఏకబిల్వం శివార్పణం.


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)