ASYA ASTI ITI KASI @KASIPAMCHAKAM TATVABODHA-03

 


  "విశ్వేశేయం తురీయః

   సకలజన  మనస్సాక్షి భూతోంతరాత్మ"


    భూతము  అనగా ఉన్నది/కనులకు కనబడుతున్నది.నింగి-నేల-నీరు-నిప్పు-గాలి అనుపంచభూతములుగా  విశ్వములో/జీవునిలో నిండియున్నవి.నిజమునకు అవిచేతములుగా  అనిపించే అచేతనములు.వానిలో దాగిన చిత్శక్తి వాటిని చైతన్యవంతముచేస్తుంది.కాని కొంతకాలము మాత్రమే.ఆ కొంతకాలములో  జీవిస్తున్న శరీరములు కోశములు అను నామముతో ఐదు విభాగములుగా /తొడుగులుగా  ఉండి  జీవులచే ఐదు తప్పులను/ఒప్పులుగా  భావింపచేస్తుంటాయి.


   కానివిచిత్రము వానిలో పరిమితముగా-పరిమిత కాలము సంచరిస్తున్నప్పటికిని వాని ప్రభావమునకు లోనుగాక సత్+చిత్ శక్తివాటిచర్యలను గమనిస్తున్నప్పటికిని వాటి కర్మలను-కర్మఫలితములను పట్టించుకోదు.కనుకనే  సాక్షీభూతము అని కీర్తింపబడుచున్నది.

 

    " ఆట కదద్వైతంబు-ఆట  అద్వైతంబు

      ఒకటి-రెండు ఒకటే-ఆటనీకు.(తనికెళ్ళ భరణిగారు)



  పంచకోశములుగా నిర్మితమైన ఐదు తొడుగులు చీకటిలో  నుండి తమను చేతనులుగా భావింపచేస్తున్న చిత్ప్రకాశమును కాంచలేవు.


1.మొదటిదైన అన్నమయకోశము,

"దేహమే నేను" అన్న సిద్ధాంతముతో దాని తెరుతెన్నులను,

 పొడుగు-పొట్టి,నలుపు-తెలుపు,లావు-సన్నము,అంటూఅనేకత్వములను ఆపాదించుకుంటూ,"నిత్య-సత్యప్రకాశ్వము(కాశి)యొక్క  ఏకత్వమును గుర్తించలేదు.


2.రెండవదైన   ప్రాణమయ కోశము 

"శక్తియే నేను" అన్న  సిద్ధాంతముతో శ్వాస ప్రక్రియ తన శక్తియే అనినమ్ముతూ,అదేకనుక నిజమయితే ఎందరో,

విడిచిన ఊపిరినితిరిగిపొందలేక,పీల్చిన ఊపిరిని తిరిగి విడువలేక  "మరణమునకు" గురియగుచున్నారన్న (కాశిని) గుర్తించకుండా  ఉంటుంది.

3.మూడవదైన మనోమయకోశము,

  " ఆలోచనలే నేను" అన్నసిద్ధాంతముతో అవి నడిపించినట్లు నడుస్తూ కష్ట-సుఖములను అనుభవిస్తుంటుంది.మనసు ఇంద్రియాధీనమై వ్యవహరిస్తుంటుంది కనుక  అది  ఇంద్రియప్రభావములకు గురికాని(కాశిని/ప్రకాశమును)  గుర్తించలేదు.

4.నాల్గవదైన విజ్ఞానకోశము

 "బుద్ధియే నేను  " అన్న సిద్ధాంతముతో సంసారబంధములలో చిక్కుకుని తనదేహమైన/గేహమైన శాశ్వతముకాదన్న  సత్యమును (కాశిని) దర్శించలేదు.భ-పుట్టుక  పుట్టుక  కలిగియున్నది భవాని.ప్రకృతి.భవానిలో దాగియున్నదిభవుడు.జీవుడు  ప్రకృతిని  చూస్తూ  అంతర్లీనముగా  నున్న శక్తిని(పురుషుని)దర్శించలేడు.

గృహము అమ్మాయితే  దానిలో నివసిస్తున్నది భవుడు.ఆ  నివాసము పంచకృత్యములు  ముగియువరకే .

5.ఆనందమయకోశము  సర్వప్రకాశము.సర్వ ప్రజ్ఞామయము.

  ఇక్కడ ఇంద్రియముల ప్రసక్తిలేదు.ద్వైతములేదు.కర్త-భోక వేరుగా   ఉండరు.

జీవుడు ముముక్షువై  పరమాత్మాత్లో    ఏకమై అధిరాజమానమైన కాశిగా మారతాడు.భవామి-భవునిలో ఏకత్వమునుపొందుతుంది.అదియే ఆనందసిద్ధి.పరమావధి.


 దేహములోబుద్ధితత్త్వముగానున్న   భవానీ   అధిరాజమానతత్త్వములోనికి జీవుని ప్రవేశింపచేస్తుంది.


 "జ్ఞాన  విజ్ఞాన  తృప్తాత్మా కూటస్థా

  "విజితేంద్రునిగా  " 

   పరివర్తన చెందుటకు   అంతర్యామి యైన   కాశి కరుణయే  కారణమవుతుంది.


  సర్వం  శివమయం   జగత్

 ఏక  బిల్వం   శివార్పణం.



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)