ASYA ASTI ITI KASI @ KASIPAMCHAKAM-04
కాశ్యాహి కాశ్యత కాశీ సర్వప్రకాశికా
సా కాశీ విదితాయేన తేన ప్రాప్తాహి కాశికా".
పదవిభజన
అహికాశ్యా-అహి కాశ్యతా-అహి సర్వప్రకాశికా
కాశ్యత కాశి స్వభావము.కాశి కాశ్యత నామము
తేన-ఈవిషయమును యేన-ఎవరు
విదిత-గ్రహింతురో వారికి
కాశిగా నేను/ప్రకాశముగా నేను ప్రాప్తిస్తాను/లభిస్తాను.
కాశి కాశి నామముతో క్షేత్రముగాను,ప్రకాశ అంతర్యామిగా జీవునిలోను సాఉన్నది ప్రకాశముగా.అటువంటి కాశి స్వరూప స్వభావములను తెలుసుకొనినవాడు కాశిగా మారును.
చేతనుడు కాశిని చూడవలెనన్న తెలుసుకొనవలెనన్న ,
'కర్మణ్యోపి బోద్ధవ్యం
బోద్ధవ్యంచ వికర్మణః
అకర్మణశ్చ బోధవ్యం
గహనా కర్మణో గతిః"
కర్మయందు అకర్మను,అకర్మయందుకర్మను దర్శించు స్థితికి రావలెను.
ఎందుకంటే కర్మలు
1.కామ సంబంధములు
2.జ్ఞాన సంబంధములుగా భావిస్తే
ఇంద్రియ ప్రేరితమైన కామసంబంధ కర్మలు బంధములను అందిస్తేర్,ఇంద్రియ ప్రేపితములు కాని జ్ఞాన సంబంధ కర్మలు ప్రకాశమును దర్శింపచేస్తాయి.ప్రకాశముతో మమేకము చేస్తాయి.
సర్వం శివమయం జగత్
ఏక బిల్వం శివార్పణం.
Comments
Post a Comment