Wednesday, December 4, 2024

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17  

  *******************

 " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

   జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"


     మహాదేవుని కరుణను మరింత స్పష్టము చేస్తూ నీలపంకజకాంతులు  ముచ్చతగొలుపుతున్నాయి తమ చల్లదనముతో.అంటే స్వామి గళమున నల్లగా అమరియున్నది కాలకూట విషమనుకున్న రావణుడు ఇప్పుడు ఆ నల్లతనమును చల్లదనమునందించుచున్న నల్లకలువల మాలగా దర్శించగలుగుతున్నాడు.


 " ఇప్పటి దాకా నీ-నా సంబంధము

   ఎప్పటిదో చెప్పలేనుగానీ"

     ఓ పరమేశ్వరా! నీ కరుణను

 " కప్పిన అజ్ఞానంబున కాంచలేనిదిది(ఈ ఉపాధి)

   ఇప్పటికైనను ఎరుకను ఈయరాద ఏమి?"

     అని అడిగిన రావణుని భాగ్యమే భాగ్యము.


  స్వామి అనుగ్రహము నిత్యానిత్య వివేకమును కలిగిస్తున్నది విశ్వదర్శనమును చేయిస్తున్నది ఒక నాటక రంగస్థలమై.

 1. ఆ జీవితనాటక రంగస్థలము నందు ప్రారంభముగా వచ్చాడు . స్మరుడు(మన్మథుడు).తన పంచబాణ ప్రయోగముతో ప్రపంచమనే వేదికను సృష్టించాడు.వసంత ఋతువు మామిడి చిగుల్లతో-కోకిలారవములతో,పచ్చదనముతో పరవశింపచేస్తున్నది ప్రాణులను..మావి చిగురులు మనోహరముగా కోకిలలను పిలుస్తున్నాయి.పిల్లతెమ్మెరలు అల్లరులు చేస్తున్నాయి.పువ్వులలోని తేనియలు తుమ్మెదలను స్వాగతిస్తున్నాయి. తమవంతుగా సృష్టి వికసనమును విస్తరింపచేస్తూ.

2.ఆహా!

 అత్యద్భుతము.మన్మథలీల మూడు శరీరముల ఉపాధుల ఉద్భవమునకు కారణమైనది.త్రిపురాసురులను త్రిగుణములతో స్థూల-సూక్ష్మ-కారణశరీరములతో-జాగ్రత్-స్వప్న-సుషుప్తి అను మూడు అవస్థలతో ఎన్నో జీవులు సృజియించబడి పాత్రధారులై ఆ రంగస్థలిని చేరుకున్నాయి స్వామి ఆడించినట్లు ఆడటానికి.

3.ఇంకేముంది వాటికి పదహారు సంస్కారములు జరుగుతూ సంసారమనే కూపములో(సాగరములో) పడి మునకలు వేస్తున్నవి.

4.ఆ సంసారము సారహీనమైనదని, ఎరుకలేని, గ్రహించే శక్తిని కలిగియుండలేక వారు అనుభవిస్తున్న ప్రతి సుఖమునకు కారణము తమ సామర్థయే (దక్షతయే) అన్న అహంభావమును పెంపొందించుకున్నాయి.పూజలు-పునస్కార  


ములు-యజ్ఞములు-యాగములు తమ ప్రతిభను చెప్పుకొనుటకే కాని ఈశ్వరానుగ్రహమునకు కాదు కనుక నిరీశ్వర సిద్ధాంతమును బలపరచుకొని-తదనుగుణముగా ప్రవర్తించసాగాయి.

5.కన్ను-మిన్ను గానని మదముతో చేయకూడని పనులను చేస్తూ అరిషడ్వర్గములకు దాసోహమైనవి.యుక్తాయుక్త విచక్షణము తన స్థానమును కానరాక అంతర్ధానమయినదా అన్నట్లు.

6.కన్నులోని లోదృష్టి (అంతర్ముఖము)




 కనుమరుగైనది.పరమాత్మకనిపించని,.ప్రకాశమును గుర్తించలేని గుడ్డితనమది.అంధకత్వమునకు అసలైన చిరునామా.ఆదిదేవుని ఊహ సైతము అనుభవములోనికి రానీయనిది


.

   (సామవేదం వారి శిపదం)

 " నడుమ వచ్చిన-వచ్చి వంచించిన

   నానా లౌల్యములలో పడిన నన్ను

   ఇడుములువచ్చి ఇంకా వంచించిన వేళ"

    కాలకంఠునికరుణ కలువమాలగా కనపడి,

  ఆదిదేవుని అర్థింపచేస్తున్నది ఆ నాటకములో పాత్రధారులనే జీవులను పశ్చాత్తాప ప్రాయశ్చిత్తులుగా మారుస్తూ.

  ప్రేక్షకులు పరవశులై కాదుకాదు  పరమేశ్వరానుగ్రహవశులై చూస్తున్నారు.కన్నీరు కారుస్తున్నారు.పాత్రధారులతో పాటుగా తాము సైతము,

 " శివ నామమా! నీకు చేతులారామొక్కి

   సరనంటినో తల్లీ! వరకల్పవల్లీ"

     అంటూ నామికి-నామమునకు అభేదమును చాటుతున్నారు.

 చేతులారాశివుని పూజిస్తున్నారు.

   నోరు నొవ్వంగ  అహ 

   రంగస్థలమే కాదు-ప్రాంగణమంతా

       అహ

   ప్రాంగణమంతానే కాదు-ప్రపంచమతా

       శరనుఘోషగా 

 " నా కంఠ ఘంటిక్


అను నదియించు శబ్దమా

   నా నాల్కపై దివ్య నర్తనల వాగ్దేవి"

     అదో అనిర్వచనీయమైన దివ్యానుభూతి.

  ఎన్నో జీవుల కాలము చెల్లిందంటూ-వారిని తన పాశముతో బంధించాలని వచ్చిన అంతకుడు(యముడు) చేసేదిలేక వెనుదిరినాడు.

  

  తెరలను జరుపుతున్నాడు భక్తవశంకరుడు

  మదనాంతకుడు మనల మరుజన్మహరుడు

    కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ

      

  భజ శివమేవ నిరంతరం.

     ఏక బిల్వం  శివార్పణం..

   


Sunday, November 17, 2024

TANOTU NAH SIVAH SIVAM-17


 


    తనోతు నః శివః శివం-17

    ******************

 ' వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

   జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం"


    మహాదేవ! తం భజేహం.

  స్వామి,

 " ఇప్పటిదా సామీ నీ-నా సంబంధము

   ఎప్పటిదో చెప్పలేను గానీ

   కప్పిన అజ్ఞానంబున కాంచలేనిదిది

   ఇప్పటికైనను ఎరుకను ఈయరాద ఏమి?"

 స్వామి నీకథరము నవీనమేఘమండలిగా భావించిన నాపై అనుగ్రహ వర్షము కురిపించినది.ఆ నల్లదనము కాలకూట విషమునదని కొందరి అభిప్రాయము.భగభగమని మండుతూ సకలమును దహించివేస్తుందట.నీ మూడో కన్నుతో పాటుగా,నీ కంఠమున నల్లగా నున్న గరళము సైతము 

   నడుమ వచ్చి వంచించిన నానా లౌల్యములను ఖండించుటకు మాత్రమే అనుమతినిస్తున్నావా ఓకృపాసింధు!

 శివుని కరుణ అర్థముకానిదైనప్పటికిని అద్భుతమైనది కనుకనే అప్పుడే వికసిస్తున్న నల్లకలువల మాలయై చల్లదనమును వెదజల్లుతున్నది సర్వేశ్వరా.సదా భజామి.

TANOTU NAH SIVAH SIVAM-16


 


   తనొతు నః శివః శివం-16

    *****************

 "వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థా ప్రతిపత్తయే

  జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"


    స్వామి అగ్నితత్త్వమును మనందరిచే దర్శింపచేసిన రావణుడు ప్రస్తుత శ్లోకములో స్వామి జలతత్త్వమును సంకీర్తించుతతో పాటుగా స్వామి అగ్నిసోమాత్మకమును హర్షాతిరేకముతో అందిపుచ్చుకుంటున్నాడు.

   చరణము

   *******

 " 


 " నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్

   "కుహు నిశీధినీ" తమః ప్రబంధ బంధుశేఖరః

   నిలింప నిర్ఝరీధరః తనోతు కృత్తి సింధురః

   కళానిధాన బంధురః శ్రియం జగత్ దురంధరః"


   మహాదేవుని మహిమలను మరింత భక్తితో సంకీర్తిస్తున్నాడు రావణ బ్రహ్మ.

 స్వామి తనోతు శ్రియం-స్వామి క్షేమములను విస్తరింపచేయును గాక.

 స్వామి తనోతు శ్రియం జగత్-జగములన్నింటి యందు స్వామి క్షేమములను విస్తరింపచేయును గాక.   

   పరమేవ్శ్వరుడు రెండు తమోగుణ సంకేతములచే తనను తాను బంధించుకొని యున్నాడు.(అలంకారములుగా )

 

 1.స్థిరరేఖను సైతము కనబడనీయని కొత్తగా ప్రకటించుకొనుచునంబ నల్లని మేఘములు

 అదియును ఒకటికాదు-రెండు కాదు-మూడు కాదు

  మండలిని-లెక్కించలేనన్ని సమూహమును

  కంథరః-కంఠసీమకు

  ప్రబంధ-విడివడలేనంత గట్టిగా

  బంధు-బంధించుకొని యున్నాడు.

  తమః-చీకట్లను బంధు కంథరః-చీకట్లను కంఠమునకు గట్టిగా బంధించుకొని యున్నాడట.

 2.ప్రబంధ బంధు కృత్తి సింధురః

      కృత్తి-చర్మమును-సింధురః -ఏనుగు యొక్క 

   ఆ ఏనుగు తెల్లని ఐరావతము కాదు.

 తమః కృత్తి-అజ్ఞానముతో కూడిన అహంకారముతో ప్రకాశమును గుర్తించలేనంత నల్లదనమును/చీకటిని కలిగియున్నది.

   మహాదేవుని కంఠము నల్లమేఘముల సమూహముతో నిండియున్నది.పోనీ

   వక్షస్థలమునైనా దర్శించుకుందామంటే దానిని సైతము

  తమోగుణ సంకేతమైన ఏనుగు  చర్మము ఉత్తరీయమై కప్పివేసియున్నది.

   నాల్గవ చరణములో

 మదాంధసింధుర త్వగుత్తరీయమును ప్రస్తావించిన రావణుడు ప్రస్తుత చరనములో

 " పటికంపు చాయ మా సామి శంకరుడు '(సామవేదం వారి రచన) అంటున్నాడు."

 " తొలుత తానే వెలిగి -ఆ తొలివెలుగు పలుకులనే నలువకు కైసేసిన తండ్రికి జోత" అంటూ 

   అగ్నిస్తంభముగా ప్రకటింపబడిన స్వామి-తన ప్రకాశ సక్తి అంసను బ్రహ్మకు అనుగ్రహింపగా ఈ నలుపు-తెలుపుల కలయిగా జగములు వెలుగుచున్నవంటున్నాడు.

   తమో గునమును తుడిచివేయుటకు స్వామి మరో రెండింటిని అలంకారముగా గ్రహించాడు .అవే,

 1.నిలింప నిర్ఝరీ-జీవనదియైన/అతిపవిత్రమైన గంగానది.ఆ గంగమ్మ తన అభిషేకముతో కాలకంఠుని గరలమును చల్లబరుస్తున్నది.

2.కలా నిధానము-చంద్రశేఖరతత్త్వము సుధావృష్టిని కురిపిస్తూ 

 త్మోగుణములను తరిమివేయును గాక.

 " శివా అన్నంతనే చమరించు కనుదోయి

   పొంగిపోవును ఎడద-పులకరించును ఎడద."

 విశేషములు

 *********

1.  హరిహరాత్మకమొకటే అన్న భావన,

  ఆండాళ్ తల్లి తిరుప్పావైలో 4 వ పాశురములో

 "ఆళిమళై కణ్ణా! ఉలగనిల్ పెయిదిడాయ్" అంటూ నల్లని మేఘమువై వర్షించమని ప్రార్ర్థిస్తుంది.

2.రుద్రనమక 7 వ అనువాకము మహాదేవుని,

 నమో మేఘ్యాయచ-విద్యుత్యాయచా 

 వర్షాయచ-అవర్షాయచ " స్వామికి నమస్కరిస్తుంది.

    కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ

     భజ శివమేవ నిరంతరం.

    ఏక బిల్వం  శివార్పణం.

     

Friday, November 15, 2024

TANOTU NAH SIVAH SIVAM-15




  

 

 

  

      




  తనోతు నః శివః శివం-15


  ****************


 " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే


   జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"




  మహాదేవా!


 " నీ దయామయ దృష్టి దురితమ్ములార


   వరసుధాదృష్టి నా వాంఛలీడేరా


   ...


  నియమాన నీ దివ్య నామసంస్మరణా


  యేమరక చేయుదును భవతాపహరణా"(శ్రీ సముద్రాల రాఘవాచార్య)





  పంచకృత్యములను చేయుచున్న మహాదేవుడు పరమదయాళువు..తన జటాజూట దర్శనమును మనందరికి అనుగ్రహించిన స్వామి తన కంథర దర్శనమును అనుగ్రహించబోతున్నాడు.


   స్వామి నీలకంథరుడు కనుకనే


 నీలకంథరా దేవా-దీనబాంధవా రారా


   నన్ను కావరా అని ఆహ్వానించగలిగాడు రావణుడు.


     స్వామి కంథసీమ అప్పుడే వర్షించుటకు సిద్ధముగా నున్న నల్లని మేఘముల సమూహము వలెనున్నదట.


   ఆ నల్లదనము కుహు నిశీధిని తలపిస్తున్నదట.


  చాంద్రమానము ప్రకారము కృష్ణపక్షములోని పదిహేనవ రోజు అమావాస్య తిథి.


  న-మా తిథి చంద్రుడు కనుపించనిరోజు అమావాస్య అని ఒక సిద్ధాంతము.


  చంద్రుడు-భూమి-సూర్యుడు ఒకే సరళరేఖపై నున్న /ఎదురుబొదురుగా సూర్య-చంద్రుల నివాసము అమావాస్య అని వైజ్ఞానిక సిద్ధాంతము.


  ఒక విధముగా సూర్యేందు పరస్పర అవలోకనము.


 చంద్రుడు షోడశకళానిధిగా కీర్తింపబడుతున్నాడు వేదజ్ఞులచే.


  చంద్రునికి 16 కళలున్నప్పుడు పదిహేను తిథులలో మాత్రమే చంద్రకళలలో హెచ్చు-తగ్గులు మనము చూడగలుగుతాము.


   ఆ పదహారవ కళయే నిత్యకళ.స్థిరకళ.


  అమరకోశము అమావాస్యలను రెండు విధములుగా వర్గీకరించినది.


 " సా దృష్టేందుః సినీవాలీ-సా నష్టేందు కళాః కుహుః" అని.


     అంటే,


 సన్నని చంద్రకళ/నిత్యకల కనిపించే అమావాస్య సినీవాలీ అమావాస్య.


    వృద్ధి-క్షయములు చంద్రకళలకే కాని చంద్రునికికాదు.


  ఏ ఒక్కచంద్రకళ కానరాని అమావాస్య " కుహు అమావాస్య."


  స్వామి కంఠము ఏ మాత్రము చంద్రరేఖ కానరాని కారుచీకటి వర్ణముతో నున్నదట.


    సంస్కృత సంప్రదాయములో,


 అమా అనగా కలిసి,వాస్య అనగా జీవించడం.సూర్య-చంద్రులు కలిసి జీవించే తిథి అమావాస్య.


  యాజ్ఞికుల అభిప్రాయము ప్రకారము తిథి పూర్వార్థమును కుహు సమయముగాను -ఉత్తరార్థమును సినీవాలి సమయము గాను భావిస్తారు.


 సినము అంటే అన్నము-వాలీ అంతే ప్రశస్తమైన( అన్నము.)


   అనగా హవిస్సులను అర్పించకముందు కుహు తత్త్వముతో నున్న పరమేశ్వర తత్త్వము హవిస్సులను స్వీకరించి(అగ్నిముఖమై) నిత్యకళను ప్రకటింపచేస్తుంది/సినీవాలీగా మారుతుంది..


   స్వామి కంథరము తానే కుహుగా-తానే సినీవాలిగా (ప్రచండ-ప్రసన్న తాండవములతో) విశ్వపరిపాలనమును చేస్తున్నది.ఇది కాలభ్రమణ సంకేతము.మహాదేవుడు

 కాలాయ-కాలాంతక మర్దనాయ-నమోనమః.


   స్వామికి నలుపు-తెలుపు వర్ణములపై గల మక్కువను తనకంఠము యొక్క రంగుల పరిణామములతో,తాను ధరించిన గజచర్మము నల్లదనమును-చంద్రరేఖ వెన్నెలల తెల్లదనముతో మేళవించి తాండవిస్తున్నాడు అర్థనారీశ్వరముగా.


   అంతేకాదు,


 తనది కర్పూరగౌరార్థ  వర్ణము-తల్లిది అసిత వర్ణము


    వారిరువురి తాందవ-లాస్యములు


  జగములకు క్షేమమును కలిగించును గాక.


   కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ

   మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ

   ఆనంద భూమి వరదాయ తమోమయాయ

   దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ.


     కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ


       శివ భజమేవ నిరంతరం


     ఏక బిల్వం శివార్పణం.



  






  


 


 


  


     



Thursday, November 14, 2024

TANOTU NAH SIVAH SIVAM-14


  




   తనోతు నః శివః శివం-14


   ********************


 " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే


   జగతః పితరం వందే పారవతీ పరమేశ్వరౌ"




   అత్యద్భుతమైనది ప్రస్తుత చరణము.స్తోత్రకర్త సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహమను పంచకృత్యములను గౌరీప్రియునిగా నిర్వహిస్తున్న తాండవము.కీర్తిస్తున్నాడు.




 " చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ


   భాలేక్షణాయ మణికుండల మండితాయ


   మంజీరపాద యుగళాయ జటాధరాయ


   "దారిద్ర్య దుఃఖ దహనాయ" నమశ్శివాయ.




    చరణము


    ********


 కరాళభాళ పట్టికా ధగద్ధగ ద్ధగ జ్వల


 ధనంజయ హుతీకృత ప్రంచండ  పంచసాయకే


 ధరాధరేంద్ర "నందినీ" కుచాగ్రచిత్ర పత్రక


 ప్రకల్పనైక శిల్పిని "త్రిలోచనే" రతిర్మమ.


    1  స్వామి  సూర్యచంద్రులుగా ప్రకాశిస్తున్న  జగదంబ  కుచాగ్రములపై ఆహారములను-ఔషధములను సృష్టిస్తున్నాడు చిత్ర పత్రకమను పేరుతో


  2. ఆ రచనమునకు కారణం స్థితి కార్యము.


  3.సృష్టి స్థితులలకు అడ్దముగా నిలిచిన అజ్ఞానమును/అహంకారమును (మన్మథ బాణములను )   ధనంజయుడై  హుతీకృతమొనరించినాడు.


   అప్పటికిని మన్మథునికి దేవాంగనలు 


 కానిపని మదనా ఇది నీపని కాని పని మదనా


 అహంకరింతువో-హరుని జయింతువో ఇక నీ పని సరి


   నీ విరిశరముల పని సరి అని చెప్పకనే చెప్పారు కామశర దహనము గురించి.


 4. స్వామి మన్మథుని ఫాలభాగములో దాచివేశాడు.దానిని తన విశాలమైన ఫాలభాగమునకు పట్టికగా అమర్చుకున్నాడు జగత్చక్షు  తిరోధానముగా.


  5. రతీదేవి ప్రార్థించగా అమ్మ కోరికగా తిరిగి అనంగునిగా అనుగ్రహించాడు.స్తోత్ర కర్త 


 అమ్మ సర్వమృతునివారిణి కనుక తన స్వామిని


 " ఓం మృత్యుంజయ మహాదేవ త్రాహిమాం శరణాగతం


   జన్మమృత్యు జరావ్యాధి పీడితం కర్మ బంధనై"


   అని అఖిల జగములు సంకీర్తింపచేస్తున్నది.


          తల్లి సదాశివ పతివ్రత-


 ఈ వాక్యమును మనము రెండు విధములుగా సమన్వయించుకోవచ్చును.


    సదా-ఎల్లప్పుడు/అన్నివేళలలో శుభములను అనుగ్రహించే ప్రతిన కలది/వ్రతముగా కలదు.

 

           సదాశివుని వ్రతముచేసి పతిగా పొందినది.


 " భూమౌస్ఖలిత పాదానాం భూమిరేవావలంబికాం


   త్వయీజాత పరాధానాం త్వమేవ శరణం 

 శివే"


     అంటున్నది ప్రార్థనా శ్లోకము.


   మన అజ్ఞానము భూమిని అశుభ్రముగా ఉంచేందుకు సహకరిస్తుంది.మన అహంకారము

 భూమిని తొక్కుతూ,బరువులను విసిరేస్తూ/తవ్వుతూ నొప్పిని కలిగిస్తుంటుంది..హుంకరించి గంతులేసి ఒక్కోసారి నేలపై జారిపడిపోతుంటాము.అయినప్పటికిని

        కు మాతా/కు పితా  న భవతి అన్నట్లుగా ఆ భూమాత


 అయ్యో పడ్డావా నాయనా కాస్త నీ చేతిని నాపై ఊతగా నిలుపుకుని పైకిలే అంటుంది పరమ కరుణాంతరంగముతో/సహనముతో.


   పరమాత్మచే ప్రకటింపబడిన భూమి సహాయమే అతి ఉత్కృష్టమైనది అయినప్పుడు అర్థనారీశ్వర అనుగ్రహమును ఏమని వర్ణించగలను?


   మన్మథుని సంస్కరించిన మహాదేవుడు మంగళగౌరి సమేతుడై మనలను అనుగ్రహించును గాక.




   కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ.


    భజ శివమేవ నిరంతరం.


       ఏక బిల్వం శివార్పణం.


 



Wednesday, November 13, 2024

TANOTU NAH SIVAH SIVAM-13



. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ." మహాదేవుడు మన్మథ పంచబాణములను దహించివేసి వాని సౌశీల్య సౌందర్యమును అలంకారముగా మలచుకుని,తన విశాలఫాలభాగనందు అలంకరించుకుని "కామేశ్వరుడై" కన్నులపండుగ చేస్తున్నాడు. స్వామి లలాటము యజ్ఞవేదికగా ప్రజ్వలిస్తున్నదికదా.దానిని కొనసాగిస్తూ (చమకము) ఋత్విక్కులు , ఇధ్మశ్చమే-బర్హిశ్చమే-వేదిశ్చమే-ధిష్టియాశ్చమే- అంటూ యజ్ఞ నిర్వహణకై మా అందరికి సమిధలు-దర్భలు-ద్రోణకలశములు-సుక్కులు-స్రవములు మొదలగునవి సంవృద్ధిగా అందీయమని అర్థిస్తున్నారు. మరొకవైపు పామరజనులు పయశ్చమే-రసశ్చమే-ఘృతంచమే-మధుచమే అంటూ అభిషేకమునకు కావలిసిన పాలు-పండ్లరసములు-నేయి-తేనె మొదలగు వాటిని అర్థిస్తున్నారు. మరికొందరు తిలాశ్చమే-ముద్గాశ్చమే-గోధూమాశ్చమే అంటుండగా మరికొందరు కృష్ట పచ్యంచమే-అకృష్టపచ్యంచమే దున్నినదైనా లేక దున్ననిదైనా సరే భూమిని అడుగుతున్నారు. కొందరు పశువులను-,మరి కొందరు సంతతిని అభ్యర్థిస్తున్నారు. స్వామి తాను నేరుగా ప్రసాదించుట రివాజు కాదుకనుక శక్తివైపు చూశాడట. ఆ జగదంబ నిత్యాన్నదానేశ్వరి-నిత్యానందకరి. అంతేకాదు లీలా నాటక సూత్ర ఖేలనకరీ. కనుకనే దృశ్యాదృశ్య విభూతి పాలనకరి అయినప్పటికిని వాటిని చిత్రించి మురిసిపోయే వినోదమును తన స్వామికి అందించినది. స్వామిది సామాన్యకల్పనము కాదు-ప్రకృష్టమైన కల్పనమునకు శిల్పిని చేసి మురిసిపోతున్నది. స్వామి అమ్మ వారి కుచములనెడి పర్వతములపై చిత్రపత్రకములనుంచుతున్నాడు (తామర ఆకులపై-తాటి ఆకులపై మొసలినోటి మొన వంటి మొనౌన్న కాడలతో పుష్పరసములతో వ్రాయు సంప్రదాయమును ప్రారంభించాడు జగత్కుటుంబమునకు జగత్పితయై.) సాధారణముగా శిల్పి శిలలోని అనవసర శేషములను తొలచివేసి అందమైన శిల్పమును మలుస్తాడు. ఈ ఏకైక శిల్పి విశ్వములోని తారకాసురమను అనవసరమును తీసివేసి విశ్వసౌభాగ్యశిల్పమును మలచుటకు ఉపక్రమించబోతున్నాడు.( కుమార సంభవమునకు నాంది అనుకొనవచ్చును) మహాదేవుడను మహాశిల్పి అమ్మ వక్షస్థలమను పర్వతభాగముపై కొన్ని అవశేషములను తీసివేస్తూ, క్షేత్రములు-తీర్థములు-అరణ్యములు=పొలములు-జలపాతములు-సూర్యుడు-చంద్రుడు-నదులు-సముద్రములు-గుట్టలు-లోయలు-అంటూ నైసర్గికస్వరూపమునకు రూపుదిద్దుతూ వాటి సమన్వయముతో సమృద్ధిగా సస్యములను అందిస్తున్నాడు. స్వామి అన్నానాం పతయే నమః-అమ్మ అన్నపూర్ణేశ్వర్యై నమః. రెండవ చరణములో "కిశోరచంద్రశేఖరే "రతి ప్రతిక్షణం మమ" అన్నాడు రావణుడు. మరింత అనుగ్రహము వర్షించిన తరువాత ప్రస్తుతము "రతి ప్రతిక్షణం" అంటున్నాడు.ఇప్పుడు కేవలము చంద్రశేఖరునిగా మాత్రమే కాదు. అగ్నినేత్ర దర్శనము తరువాత "త్రిలోచనుని" తో క్రీడించాలనుకుంటున్నాడు. సూర్య-చంద్ర-అగ్ని లోచనునితో మమేకమయి క్రీడించవలెనన్న దాటవలసిన స్థితులు ఎన్నో. ఆదిశంకరుల సౌందర్యలహరి స్తోత్రములో స్వామి స్థాణువు-అమ్మ చైతన్యము.శివతాందవ స్తోత్రములో అమ్మ స్థాణువు.స్వామిచైతన్యము.ఒకరికొకరు ఒద్దికగా స్థావర-జంగమాత్మకమగుటయే కదా అర్థనారీశ్వరము.అత్యంత మనోహరము. "ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయై జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయైచ నమః శివాయ." ద్విపంచాక్షరీ. కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ భజ శివమేవ నిరంతరం ఏక బిల్వం శివార్పణం.

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ." మహాదేవుడు మన్మథ పంచబాణములను దహించివేసి వాని సౌశీల్య సౌందర్యమును అలంకారముగా మలచుకుని,తన విశాలఫాలభాగనందు అలంకరించుకుని "కామేశ్వరుడై" కన్నులపండుగ చేస్తున్నాడు. స్వామి లలాటము యజ్ఞవేదికగా ప్రజ్వలిస్తున్నదికదా.దానిని కొనసాగిస్తూ (చమకము) ర్త్విక్కులు,స్వామిని, ఇధ్మశ్చమే-బర్హిశ్చమే-వేదిశ్చమే-ధిష్టియాశ్చమే- అంటూ యజ్ఞ నిర్వణకై మా అందరికి సమిధలు-దర్భలు-ద్రోణకలశములు-సుక్కులు-స్రవములు మొదలగునవి సంవృద్ధిగా అందీయమని అర్థిస్తున్నారు. మరొకవైపు పామరజనులు పయశ్చమే-రసశ్చమే-ఘృతంచమే-మధుచమే అంటూ అభిషేకమునకు కావలిసిన పాలు-పండ్లరసములు-నేయి-తేనె మొదలగు వాటిని అర్థిస్తున్నారు. మరికొందరు తిలాశ్చమే-ముద్గాశ్చమే-గోధూమాశ్చమే అంటుండగా మరికొందరు కృష్ట పచ్యంచమే-అకృష్టపచ్యంచమే దున్నినదైనా లేక దున్ననిదైనా సరే భూమిని అడుగుతున్నారు. కొందరు పశువులను-మరికొందరు ,మరి కొందరు సంతతిని అభ్యర్థిస్తున్నారు. స్వామి తాను నేరుగా ప్రసాదించలేనని శక్తివైపు చూశాడట. ఆజగదంబ నిత్యాన్నదానేశ్వరి-నిత్యానందకరి. అంతేకాదు లీలా నాటక సూత్ర ఖేలనకరీ. కనుకనే దృశ్యాదృశ్య విభూతి పాలనకరి అయినప్పటికిని వాటిని చిత్రించి మురిసిపోయే వినోదమును తన స్వామికి అందించినది. స్వామిది సామాన్యకల్పనము కాదు-ప్రకృష్టమైన కల్పనమునకు శిల్పిని చేసి మురిసిపోతున్నది. స్వామి అమ్మ వారి కుచములనెడి పర్వతములపై చిత్రపత్రకములనుంచుతున్నాడు జగత్పితయై. సాధారణముగా శిల్పి శిలలోని అనవసర శేషములను తొలచివేసి అందమైన శిల్పమును మలుస్తాడు. ఈ ఏకైక శిల్పి విశ్వములోని తారకాసురమను అనవసరమును తీసివేసి విశ్వశాత శిల్పమును మలచుటకు ఉపక్రమించబోతున్నాడు.( కుమార సంభవమునకు నాంది అనుకొనవచ్చును) మహాదేవుడను మహాశిల్పి అమ్మ వక్షస్థలమను పర్వతభాగముపై కొన్ని అవశేషములను తీసివేస్తూ, క్షేత్రములు-తీర్థములు-అరణ్యములు=పొలములు-జలపాతములు-సూర్యుడు-చంద్రుడు-నదులు-సముద్రములు-గుట్టలు-లోయలు-అంటూ నైసర్గికస్వరూపమునకు రూపుదిద్దుతూ వాటి సమన్వయముతో సమృద్ధిగా సస్యములను అందిస్తున్నాడు. స్వామి అన్నానాం పతయే నమః-అమ్మ అన్నపూర్ణేశ్వర్యై నమః. రెండవ చరణములో "కిశోరచంద్రశేఖరే "రతి ప్రతిక్షణం మమ" అన్నా డు రావణుడు. మరింత అనుగ్రహము వర్షించిన తరువాత ప్రస్తుతము "రతి ప్రతిక్షణం" అంటున్నాడు.ఇప్పుడు కేవలము చంద్రశేఖరునిగా మాత్రమే కాదు. అగ్నినేత్ర దర్శనము తరువాత "త్రిలోచనుని" తో క్రీడించాలనుకుంటున్నాడు. సూర్య-చంద్ర-అగ్ని లోచనునితో మమేకమయి క్రీడించవలెనన్న దాటవలసిన స్థితులు ఎన్నో. ఆదిశంకరుల సౌందర్యలహరి స్తోత్రములో స్వామి స్థాణువు-అమ్మ చైతన్యము.శివతాందవ స్తోత్రములో అమ్మ స్థాణువు.స్వామిచైతన్యము.ఒకరికొకరు ఒద్దికగా స్థావర-జంగమాత్మకమగుటయే కదా అర్థనారీశ్వరము.అత్యంత మనోహరము. "ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాందవాయై జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయైచ నమః శివాయ." కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ భజ శివమేవ నిరంతరం ఏక బిల్వం శివార్పణం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...