దూరీకర్తుం వాంఛసి కిం-మనీష-03




 


 " మనసు ఎగురుతున్నదో

   హాయిని వెతుకుతున్నదో

   బ్రతుకు నైజం ఎరుగ రానిదై

   అల-అల-అల-అల


  ఆ అలలన్నీ కడలికి పైపైనేగా

  లోపల ఉండే చేపను వల చేరలేదుగా

  ఆశలు మొత్తం మనసుకు పైపైనేగా

  గుండెల్లోన  ఆనంద తాండవమేగా

  అది తెలిసిందంటే ఆనందం నీదే (ఇష)


  నిజమునకు ఉపాధులు అన్ని పడిలేచే కెరటములు.దేనినో అందుకోవాలంటూ తనమూలమును గుర్తించక పరుగులు తీస్తుంటాయి.

  అది మనసు స్వభావము.

 పుడుతది చేపలాగ  ఆశ

   ఆ ఆశ

 తిమింగలమవుతుందిర ఈశ

  విచిత్రం

 తిమింగలం  నీ వలలో పడినా

 నువు మళ్ళీ చేపకేసి చూస్తావుర 

    చేప-జన్మ పరంపర

    తిమింగలము-మోక్షము

   పరమాత్మ నీకు మోక్షప్రాప్తి /తురీయమును అందించాలనుకుంటే కూడ ఓ మనసా నీవు జన్మలనే కోరుకుంటుంటావు.

   అలలతో పడిలేచే సముద్రమే అందమైనదని భ్రమపడతావు.అలల రూపమును చూస్తూ మురిసిపోతావు కాని వానిలో దాగియున్న అంతర్యామి జలమును చూడలేవు.

 ఉపాధి భేదములను గమనిస్తూ వానిలోని చైతన్యమును చూడలేక పోతున్నావు.

  " "ప్రజ్ఞానం బ్రహ్మ" అను మహావాక్య విస్తరణమే/వివరణమే మనీష.

 'అవబోధ" అన్నది మూలపదము.అదియే అవగాహనా సామర్థ్యము.

   

 సర్వం  శివమయం జగత్

 ఏక బిల్వం  శివార్పణం.

Comments

Popular posts from this blog

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI