Wednesday, May 30, 2018

HAPPY BIRTHDAY-BALUGARU

  పుట్టినరోజు జేజేలు
 ***************


  ప్రతిఫలమునకై చూడదు-ప్రజాసేవ వీడదు
  అన్నార్తుల కడుపు నింపు అనురాగపు ఈ కోవెల

   కోవెలను నిర్మించిన "కన్నతల్లి" పాదాలకు వందనం.

 మధుమాసమునకై  ఆగదు-మావిచిగురు  అడుగదు
 కొంగ్రొత్త  స్వరముల  కోటిరాగాల  ఈ కోయిల

   మధురసమును వర్షించిన  "కన్నతండ్రి" పాదములకు వందనం.

 అధికప్రసంగమంటుంది-అద్భుతములు చేస్తుంది
 అభ్యాసముతో కూడిన  అంకితభావపు పదము

   పదప్రవాహమందించిన  "గురువులకు" వందనం.

   అందుకే గద

 పండితారాధ్యుని  ప్రతిపాట నడక  పూదారి
 ఆడంబరమసలెరుగని  సప్తస్వర  పూజారి

  వీనులవిందు చేయుచున్న  "విద్వత్తుకు"  వందనం.

 ఆర్యుల ఆశీర్వచనము-ఆత్మీయుల అభిమానము
 స్వయంకృషి సంస్కారము త్రివేణి సంగమమై

   "శ్రీరామ రక్ష" చుడుతుంటే, మీకు

 "శతమానం భవతి"  బాలు గారు.

.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...