TIRUMANGAI ALWARU

 సంభవామి యుగే యుగే సాక్ష్యములు హరి ఆయుధములు
 ధర్మ సంస్థాపనయే లక్ష్యమైన మన ఆళ్వారులు

 తిరుక్కరయులూరులో  తిరువాలి దంపతులకు
 నీలుడుగా ప్రకటితమైనది శ్రీహరి శార్ఙము

 శత్రువులకు  కాలుడుగా శౌర్యము వెలువరచుచు
 పరకాలుడు అను పేరుతో ప్రసిద్ధుడైనాడు

 అప్సరస కుముదవతిని అర్థాంగిగా కోరిన
 అద్భుత పంచ సంస్కారములతో పునీతుడై

 అతివమీది  ప్రేమతో ఆచరించుచున్న వ్రతము
 పెట్టిన పరీక్షలే భక్తికి పెట్టని గోడలాయె

 నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొను
 పరమార్థము చాటిన తిరుమంగై ఆళ్వారు పూజనీయుడాయెగ .


  శ్రీహరి శారంగముతిరుకురైయలుర్ లో నీలం అను చోలరాజ్య సైన్యాధికారికి పుత్రునిగ అవతరించెను.తల్లితండ్రులు కలియన్ అను నామమును పెట్టిరి.సర్వసమర్థుడైన కలియన్ చోళరాజుని మెప్పించి,బహుమతిగా ఒక చిన్నరాజ్యముతో పాటుగా,పరకాల-కాలాతీతుడు అను బిరుదును పొందెను.ఆయనకు లభించిన రాజ్యపు రాజధాని తిరుమంగై.తిరుమంగై రాజధానిగా రాచకార్యములు సమర్థతతో నిర్వహించు కలియన్ తిరుమంగై గా కొత్తనామముతో ప్రసిధ్ధిపొందెను.

  "నారాయణ నీ లీల నవరసభరితం" అను సూక్తిని నిజముచేస్తు వీరరసాలంకృతుని మదిని కుముదవల్లి అను వైష్ణవ స్త్రీ దోచుకున్నది.లోకకళ్యాణమునకు నాందిగా హరి వీరికళ్యాణమును తలపెట్టినాడు.దారిమార్చగల నారిగా కుముదవల్లి తిరుమంగై ను వివాహమాడవలెనన్న ఒక నియమమును (షరతు) పెట్టినది.ఒక సంవత్సరకాలము నిత్య  నిరతాన్నదానమును నిష్కామముగా నిర్వహించిన ఎడల తాను కళ్యాణమునకు సిధ్ధమే అని చెప్పినది.కాంతా వ్యామోహము ఆసాంత పరివర్తనకు ఆయుధమైనది.కాని లోపల దాగిన నైజము భోజనములకు దొంగతనములను,దౌర్జన్యములను చేయించసాగినది.సంస్కరించుటకు
 సమయమాసన్నమైనదేమో,స్వామి పెండ్లికొడుకై కదిలాడు ఊరేగింపుతో.సన్నాహాలు.సంపదలు.సంబరాలు పోటీపడుతుదోపిడి ఆటకు సిధ్ధమగుచున్నవి.అందరికి అభయమిచ్చు చేయి ఆడుచున్న సుందరమైన ఆటలో సర్వము దోచుకోబడినవి పెండ్లికొడుకు కాలికి ధరించిన ఆభరణము తక్క.దానికై బ్రహ్మకడిగిన పాదమును పట్టుకుని విడువలేని తిరుమంగై ను బ్రహ్మజ్ఞానము స్పర్శించి,తిరుమంగై ఆళ్వారుగా తీర్చిదిద్దినది.

   జై శ్రీమన్నారాయణ.



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)