Saturday, November 30, 2019

MARGALI MALAI-09


  మార్గళి మాలై-09
  **************

  తొమ్మిదవ పాశురం
  ***************

 తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియె
 తూపం,కమళ త్తుయిల్ అణై మేల్ కణ్ వళరుం
 మామాన్! మగళే! మణికదం తాళ్ తిరవాయ్
 మామీర్! అవళై ఎళుప్పీరో! ఉన్ మగళ్ తాన్
 ఊమైయో? అన్రిచ్చెవిడో? అనందలో?
 ఏమన్ పెరున్ తుయిల్ మందిరపట్టాళో?
 "మామయన్-మాదవన్-వైకుందన్" ఎన్రెన్రు
 నామం పలవుం నవిన్రు ఏలోరెంబావాయ్.

 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.

 అత్తరు వాసనల గదిలో మెత్తటి పరుపులమీద
 మొద్దునిద్ర శాపమైన ముద్దుగుమ్మ మేలుకో

 మణిదీపముల మేడలో, మనసున దాచిన వానితో
 మమేకమై మము మరచిన మరదలా మేలుకో

 ఓ అత్తా! నీ కూతురు ఎంతకీ లేవదు సోమరియా??
 చెవిటిదా ? మూగదా ? మంత్ర ప్రభావితమైనదా?

 హరినామ కీర్తనమే అసలైన మందు తనకు
 తల్లి తానె తరలి వచ్చె తానొక గోపికయై

 పాశురములు పాడుతు, పాశములన్నిటిని వదిలి
 నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో! ఓ మామ కూతురా!

 గోదమ్మ ఈపాశురములో మామన్ మగళే-మామీర్ అంటు దేహ బంధుత్వమును మనకు పరిచయము చేస్తు,ప్రస్తావించుచున్నది.

 శరీర దోషములైన,ఇంద్రియ లోపములైన మూగతనము-చెవిటి తనము-గుడ్డితనమును అవి ఏ యే పరిస్థితులలో గుణ-దోషములుగాభావింపబడునో వివరించుచున్నది.

 " మననాత్ త్రాయతే ఇతి మంత్రః"   ద్రష్టత్వపు    గుణ-దోష పరిణామ పరిస్థితులను తెలియచేస్తున్నది.


 ( భగవత్ శ్రీమాన్ రామానుజాచార్యులుగా ఈ గోపిక తత్త్వమును గుర్తించి ఆరాధిస్తారు.ఆండాల్ తల్లి సాక్షాత్తు భూదేవి ఆమెను సోదరిగా భావించి వివాహ సమయమున సారెను పంపి ధన్యుడైన ఆచార్యుడు. ఆచార్యుని అనుగ్రహమును పొంది,తన జ్ఞానచక్షువును మరింత విస్తృతముచేసుకొని అలౌకికానందనుభవములో ఉండుట మామకూతురి నిద్ర.)

 మనకు ఈ పాశురములో రెండు విధములైన గోపికా స్వభావము అవగతమగుతుంది.లోపల
 నిదురిస్తున్న గోపిక  సూర్యుని దగ్గరకు మనము   వెళ్ళగలమా?
-ఆయననే తన కిరణములతో మనలను అనుగ్రహించవలెను కాని అను భావనతో ఉంటుంది.అదేవిధముగా పరమాత్మ మన దగ్గరకు తానే రావలెను గాని సర్వాంతర్యామి అయినస్వామిని ఎక్కడున్నాడని మనము వెతుకుతు పోగలము అను సిధ్ధాంతముతో తన మందిరములోనే ఆలోచిస్తూ ఉంటుంది.ఇది పరగత ఆశ్రయము.శాశ్వత్వము దీని   లక్షణము.


  ఆమెను మేల్కొలుపుచున్న గోపికలు మనమే స్వామిని   వెతుకుతు
 వెళ్లి,సంకీర్తించి,సఫలులము కావలెనన్న సిధ్ధాంతముతో నున్నవారు.వారు స్వగతాశ్రయులు.వీరిది స్వామి నుండి వరములను స్వీకరించవలెనను మానసికస్థితి.సాక్షాత్తు స్వామి తమను అనుగ్రహిస్తానన్నప్పుడు వారు స్వామిని   కోరుకోలేరు
.వీరు పొందుచున్న అనుగ్రహము తాత్కాలికము.

   తాత్కాలిక అనుగ్రహమును మించిన శాశ్వతానుగ్రహమును పొందవలెనన్న మణిమయ తలుగు గడియ వేసి,తలుపును మూసియున్నది. అది తెరుచుటకు ఆచార్య రూపమున ఉన్న ఆ గోపిక బాహ్యస్మృతిని పొంది వారిని సంస్కరించవలెను.

ఈ గోపిక నిదురుస్తున్న భవనము తూ-పరిశుధ్ధమైన మణులతో నిర్మించబడిన మేడ.ఇది వాచ్యార్థము.ఈ మణిమయ భవనమును వస్తురూపముగా భావిస్తే దశేంద్రియ నిర్మిత మానవశరీరము.కర్త పరముగా భావిస్తే పరమాత్ముడు.వెలిగించిన దీపములు వేదములు.పరమాత్మ శుభగుణములు.ఆచార్యులు.వేదాంగములు. సుగంధ పరిమళములను వ్యాపింపచేయు అగరుధూపములు.భగవద్భావము. మేడ-భాగవతులు ప్రకాశించుచున్న మణిదీపములు-వారి అనుగ్రహ సందేశములు సుగంధ ధూపములు.ఇవి పొగను వ్యాపింపచేయని(తమస్సును) జ్ఞాన వాహినులు.

 మన గోపిక ఆచార్యుని అనుగ్రహమును పొందినది కనుక బాహ్యమునవర్ణించిన భోగ్య వస్తువులైన మణిమేడ,అందులో వెలుగున్న మణిదీపములు,సుగంధ పరిమళముల వైపునకు ఆకర్షింప బడుట లేదు.ఆమె వీటిని తోసిబుచ్చి ఆత్మానందమును అనుభవించుచున్నది.మనము సంసారమునందున్నను దీనిని ఒక పరికరముగా మలచుకొని సాయుజ్యము అందిపుచ్చుకొన వలెను


  ఇంద్రియ   లోపములుగా భావింపబడు చెవిటి తనము-మూగతనము-గుడ్ది తనము వాచ్యార్థములు.చెడు అనవద్దు-వినవద్దు-కనవద్దు అని భావిస్తే అవిగుణములు.

  మంత్ర ప్రభావితురాలు కనుకనే చేష్టలుడిగి ,సమాధానమునీయకున్నది.వాచ్యార్థము.ఆచార్యులు ఏ మంత్రమును ఉపదేశము చేసినారో అసలయిన దానిలో (బ్రహ్మములో) రమించుచున్నది.అ ఆనందాను భవమును అందరితో పంచుకొనుటకై బహిర్ముఖియై,వేరొక గోపికను మేల్కొలుపుటకు అమ్మతో నడువసాగినది.


 (ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.)





 







.
.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...