Saturday, May 2, 2020

CHAMAKAMU-ANUVAAKAMU-07

  శివుని కరుణ అర్థముకానిది.శివునికరుణ అద్భుతమైనది.

 సోమ గ్రహ ప్రభావ విశిష్టమైన    (శివశక్తులు) ఈ  అనువాకములో మానసిక యాగమునకు కావలిసిన పరికరములను సాధకుడు పరమాత్మను అర్థిస్తూ,అవి ప్రాప్తించుట
 వలన తన యజ్ఞము సమర్థవంతమై శుభపరిణామములను కలిగించు  ఆత్మౌన్నత్యమును పరిపూర్ణముగా పొందగలనని తెలియచేయుచున్నాడు.

  జ్ఞానము మనసునకు బుధ్ధికి సంబంధించినది.చీకటితో నిండియున్న మనసును తేజోవంతము చేయాలంటే వెలుగు కావాలి.అది కూడా నిరంతరము నిండిఉండాలి.ఇట్లా వచ్చి కాసేపుండి వెళ్ళిపోకూడదు.కనుక పరమాత్మను
 అగున్శుశ్చనే-రశ్మిశ్చమే" అంటూ కిరణములు వాటిద్వారా వచ్చే కాంతిని కోరుకుంటున్నాడు.వాటిని ప్రసాదించే వానికి అలసత్వము కూడదని నిరంతరము ప్రసరించే వాడై ఉండాలని కోరుకుంటున్నాడు.అంతే కాదు వాడు అధిపతియై తనను పాలించాలని వేడుకొనుచున్నాడు.

  అంతే కాదు  ఉపాంశు  మార్గమున మంత్రములను చదువు( తనకు మాత్రమే వినబడునట్లు ఉచ్చరించుచు జపము చేయు విధానము)ఉపకరమును ప్రసాదించమంటు, అజ్ఞానమును తొలగించి,అంతర్యామిత్వమునందించగల ఐంద్ర వాయువును,శరీరమునకు కావలిసిన పది వాయువులను అడుగుతున్నాడు.

   వాటితో తాను సత్సంగుడై అంతర్యాగమును ఆర్తితో నిర్వహించి అద్భుత ఆలోచనా శక్తులను పొంది ఆనందాబ్ధిలో ఓలలాడెదనంటున్నాడు.


  ఏవా అద్భుతఫలితములని మనకు సందేహము కలుగవచ్చునని,తానే వాటిని వివరించి చెప్పుచున్నాడు.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...