Saturday, May 2, 2020

CHAMAKAMU-ANUVAAKAMU-10

 శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.

  అంతర్-బహిర్యాగములను నిర్వహిస్తీ యజ్ఞ సిధ్ధిని పొందిన సాధకుడు ఈ అనువాకములో పాడి-పంటలను సమృధ్ధము గావించుటకు ప్రార్థిస్తూ,తన అభ్యర్థనములను లోపరహితము గావించి పరిపూర్ణముచేయుచున్నాడు. గోవిశిష్టత పాడికి సంకేతముగా భావిస్తే-వృషభ విశిష్టతను పంటలకు సంకేతముగా భావించవచ్చును.సత్యమును గోమాతగా పూజిస్తే-ధర్మమును వృషభముగా కీర్తింపవచ్చును.


    సాధకుడు తల్లిగర్భమున నున్న శిశువు నుండి వృధ్ధాప్యము వరకు వాటిని సమర్థవంతములుగా అందించమని అర్థిస్తున్నాడు.

   గోమాత విషయమునకు వస్తే ఒకటిన్నర సంవత్సరపు వయసు గల త్ర్యవీని,రెండు సంవత్సరముల వయసు గల దిత్యౌహీని,రెండున్నర సంవత్సరముల వయసు గల పంచావీని,మూడు సంవత్సరముల వయసుగల త్రివత్సాని,మూడున్నర సంవత్సరముల వయసు గల తుర్యౌహీని,నాలుగు సంవత్సరముల వయసుగల షషటాహీని,

   కొత్తగా ఈనిన ధేనువును,గొడ్డుటావు అయిన వశాను,దూడను కోల్పోయినదైన వేహత్ను,అమృతత్తమునకు ప్రతిరూపమైన కామధేనువును సమర్థవంతమైనవి ప్రసాదించమని వేడుకొనుచున్నాడు.

   ఇవన్నీ మన ఆలోచనలకు,పాప పుణ్యములకు,వాటి ప్రయాణములకు సంకేతములు.

    పంట విషమునకు వస్తే ఒకటిన్నర సంవత్సరముల వయసున్న త్ర్య్విని,రెండు సంవత్సరముల వయసున్న దిత్యవాట్ని,రెండున్నర సంవత్సరముల వయసున్న పంచాతిహిని,మూడు సంవత్సరముల వయసున్న త్రివత్సని,మూడున్నర సంవత్సరముల వయసున్న తుర్యవాట్ని,నాలుగు సంవత్సరముల వయసున్న షష్ఠవాట్ని,వీటితో బాటు సంతానమును కలుగచేయు మగదూడ యైన ఉక్షాని,బండిని లాగు శక్తి కల అనడ్వాన్ ని, ఉక్ష కన్న వయసులో పెద్దదైన ఋషభమును సమర్థవంతములుగా చేసి ప్రసాదించమని సాధకుడు పరమాత్మను అభ్యర్థిస్తునాడు.ఇందులో అతని స్వలాభాపేక్ష ఏమాత్రము లేదు.వాని సమర్థతను లోక విదితము చేసి,వానిని పూజనీయములు చేయుటయే.మన కర్మా చరమునకు సంకేతములైన ఈ జీవ గణము,వాని తెగ కొనసాగింపు శుభసూచకములు.అంతే కాదు వాని నుండి లభించు యజ్ఞ ద్రవ్యములతో సంపూర్నతనొంతుంది హవిస్సు.సంతృప్తిని అందించకలుగుతుంది.

  సాధకుడు మరింత వివేకముతో నాదోపాసనను గౌరవిస్తూ,వేదమంత్రములు సమర్థవంతములై తాను చేయుచున్న యజ్ఞేన-ముందుముందు చేయబోవు యజ్ఞః సఫలీకృతముకావించునట్లు అనుగ్రహించమని వేడుకొనుచున్నాడు.

   అంతే కాదు తన ఇంద్రియములైన కన్ని-ముక్కు-చెవి-వాక్కు సమర్థవంతములై సాధకుడు సదా సత్కర్మనిష్ఠాగరిష్టుదగుటకు సహకరించునట్లు చేయమని వేడుకొను చమకముతో మమేకమైన వేళ సర్వం శివమయం జగం.

  ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...