Friday, July 3, 2020

OM NAMA SIVAAYA-100


 నీ సుతుడగు గణపయ్య అడ్డంకులు తొక్కాడు
 నీవాహనమగు బసవయ్య పుష్టిని అందించాడు

 నీకంఠాభరణము పొత్తముగా మారింది
 నీ సగభాగపు గౌరమ్మ ఘంటము తానయింది

 నీ సిగపూవగు గంగమ్మ గలగలా సాగింది
 నీపరివారపు స్వచ్చంద సహకారములేగ

 నీవే స్పురింపచేసిన నిందాస్తుతుల హేల
 వికల్పములు పారద్రోలు శివ సంకల్పపు లీల

 నా దిక్కైన శంకరుడు  నాలోనే ఉన్నాదని
 లెక్కలేని నా  తిక్కను మక్కువతో నీకు ఇచ్చి

 నీ అక్కరే  లేనివైన ఈ చక్కెర పలుకులను
 నేనెక్కడ వ్రాసానురా? దిక్కైన శంకరా!







No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...