OM NAMA SIVAAYA-105



   శివ సంకల్పము-105
 నువ్వు తిక్కలోడివని అంది నా మూఢత్వం
 నిన్ను చక్కదిద్దాలనుకుంది నా మూర్ఖత్వం
 నీకేమి తెలియదంది నా అహంకారం
 నీకు తెలియచేయాలనుకుంది నా అంధకారం
 నిన్ను గౌరవించలేనంది నా తాత్సారం
 నీతో గారడి చేయాలనుకుంది నా మాత్సర్యం
 నీకు నాగరికత లేదంది నాలోని ఆటవికం
 నిన్ను నాగరికుడిని చేయాలంది నాలోని ఆధునికం
 నీకు పాఠము చెబుదామనుకుంది నాలోని ఆర్భాటం
 నీకు పరీక్ష పెట్టాలనుకుంది నాలోని ఆరాటం
 సముద్రాన్ని పరీక్షించు ఉప్పుబొమ్మ నేనైతే
 నా తప్పు చెప్పినావురా ఓ గొప్ప శంకరా.


 "ధీయంత్రేణ వచోఘటేన కవితా కుల్యోపకుల్యాక్రమైః
  ఆనీతైశ్చ సదాశివస్య చరితాంభోరాశి దివ్యామృతైః
  హృత్కేదారయుతాశ్చ భక్తి కలమాః సాఫల్యమా తన్యతే
  దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః."


 బుధ్ధి యను యంత్రము ద్వారా వాక్కు అనే కుండతో చిన్న కాలువల వరుసలలో తీసుకురాబడిన సదాశివ చరిత్రమనే దివ్యజలము ద్వారా హృదయమనే పంటచేలలోకి భక్తి అనే పైరులు ఫలవంతముగా పెరుగుచున్నవి.ఇంక నాకు మరొక చింత ఏల? 


 శ్రీశైలేశు భజింతునో యభవుఁ గాంచీనాథు సేవింతునో
   కాశీవల్లభుఁ గొల్వబోదునో మహాకాళేషుఁ బూజింతునో
   నాశీలం బణువైన మేరువనుచున్ రక్షింపవే నీ కృపా
   శ్రీశృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వరా!

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! శ్రీశైలములో నిన్ను భజించమందువా? కాంచీపురమునందా, లేక వారాణసి లోనా లేక ఉజ్జయిని మహాకాలునిగానా? నీవే రూపమున సేవింపమన్న చేసెదను. నన్ను ణీ కృపాకరుణావీక్షణమందహాసములచే రక్షింపు ప్రభో



  








  







Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.