Friday, July 3, 2020

OM NAMASIVAYA-103


కాసు లేనివాడవని కానిమాటలన్నాను
బేసి కన్నులను చూసి రోసిపోయి ఉన్నాను

దోసములే నీ పనులని ఈసడించుకున్నాను
వేసమేమిటో అంటుఈసడించుకున్నాను

నీ కొండను ఎత్తినాడు నీ విల్లు ఎత్తలేదు కద
సహకారమునుఈయనిది అతని అహంకారమేగ

దిక్కు నీవు అనగానే  పక్కనేఉంటావు
అహంకారమును వదిలేస్తే అధీనుడివి అవుతావు

స్వల్పకాలిక లయముతో శక్తినీస్తావు
దీర్ఘకాలిక లయముతో ముక్తిని ఇస్తావు

నిన్ను తక్కువన్న నా తెలివి పక్కదారి మళ్ళించి
మొక్కనీయరా భక్తితో  ముక్కంటి శంకరా!


 " రోధస్తోయహృతః శ్రమేణ పథికశ్చాయాం తరోర్వృష్టితో
   భీతః స్వస్థగృహం గృహస్థమతిధిః దీనః ప్రభుం ధార్మికం
   దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా
   చేతః సర్వ భయాపహం వ్రజసుఖం శంభో పదాంభోరుహం

   శివానందలహరి.

  ఓ మనసా! ఏ విధముగా నీటిలో కొట్టుకొనిపోవువాడు ఒడ్డును,అలిసిన బాటసారి చెట్టు నీడను,వర్షభయము కలవాడు ధృఢమైన  ఇంటిని,అతిథి గృహస్థుని,దీనుడు ధార్మికుడైన ప్రభువును,చీకటిలో భయపడువాడు దీపమును,చలిలో వణుకువాడు మంటనుచేరునట్లుగా,సమస్త భయములను పోగొట్టి సుఖమునిచ్చు శివుని పాద పద్మములను ఆశ్రయింపుము.

  ఏక బిల్వం శివార్పణం.














No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...