Thursday, December 31, 2020
ALO REMBAVAY-18
Tuesday, December 29, 2020
ALOREMBAVAY-17
ALO REMBAVAY-16
Sunday, December 27, 2020
ALO REMBAVAY-15
పదిహేనవ పాశురము.
*******************
ఎల్లే! ఇళంగిళియే ఇన్నం ఉరంగుదియో
శెల్లెన్మ్రాళే యే మిన్ నంగవీర్ పోదాగిన్రే
వల్లై ఉన్ కట్టురైగళ్ పండే ఉన్వాయ్ అరిదుం
వల్లీర్గళ్ నీంగళే నానేతాన్ ఆ ఇడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేరుడయై
ఎల్లారుం పోందారో పోందార్ పో ఎణ్ణిక్కుళ్
వల్లానై కొన్రానై మాట్రారై మాట్రళిక్క
వల్లానై మాయనై పాడేలో రెంబావాయ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ.
******************************
ఈ పాశురమును వేదవిదులు" తిరుప్పావాయిలం తిరుప్పావై" గా కీర్తిస్తారు.
గోదమ్మ ఈ పాశురములములో మూడు విషయములను ప్రస్తావిస్తు,మూలతత్త్వమును వివరిస్తు,ముముక్షత్వానికి మార్గము చూపిస్తున్నది.కనుకనే ఈ పాశురమును" పరమాద్భుతమా" అంటు ప్రారంభించినది.
ఎల్లే!- ఎంత ఆశ్చర్యము పరమాద్భుతము అని తన చిలుకను గురించి(మన గోపికను) ప్రస్తావించుచున్నది.
ఇళ్ళంగిళియే-లేత చిలుకా! అంటు మన గోపికను సంబోధించినది.
ఇక్కడ మనమొక సంఘటనను ముచ్చటించుకుందాము.
చిలుక తనంత తానుగా ఏమియును నేర్వలేనిది కాని పరమాత్మచే చక్కని (సాధనమార్గమును) వాక్ అనే ఇంద్రియమును ప్రసాదింపబడినది.
గోదమ్మ తన పెంపుడు చిలుకకు గోవింద-గోవింద అను గోవింద నామమును పలుకుట నేర్పించినది.అదియును అంతే శ్రధ్ధా భక్తులతో నేర్చుకున్నది.అప్పుడు గోదమ్మ దానితో నీవు ఎల్లప్పుడును నిర్విరామముగా-నిశ్చలముగా నామసంకీర్తనమును చేస్తూనే ఉండు.అది నాకెంతో ఇష్టము అని చెప్పినది.చిలుక క్రమమును తప్పక కీర్తిస్తూనే ఉంది.
కాని ఒకనాడు స్వామి విరహవేదనతో అన్యమనస్క్యై చిలుక నామ సంకీర్తనమునకు ఆగ్రహించి దానిని మౌనముగా ఉండమన్నది.కాని అది వినలేదు.తనపాటికి తాను తన్మయముతో గోవింద నామములను కీర్తిస్తూనే ఉంది.ఎందుకంటే దానికి బాహ్య విషయములతో గాని-వాటి ప్రభావములతో గాని సంబంధము లేదు.ఆ దశను ఎప్పుడోఅధిగమించేసినది.
మన గోపిక కూడ అదే స్థితిలో ఆనందిస్తుంటుంది.
మనము చిలుకలమే.కాని సంసారమనే పంజరములో బంధింపబడి ఉన్నాము.అస్వతంత్రులము.కనుకనే అమ్మ,
ఇన్నం ఉరంగుదియో?ఇంకను మేల్కొనలేద?
ప్రతిరాత్రి నిదురించుట-ఉదయమున మేల్కాంచుట-రాత్రి అవగానే తిరిగి నిద్రించుట-అనగా,
జన్మజన్మల పరంపరలను జ్ఞాన ప్రవృత్తి లేక కొనసాగించుచున్నవారలము.కనుక,
మేల్కొని వ్రతమునకు రండి అని పిలుచుచునది.
మాటే మంత్రము అన్న పవిత్రముగా మన వాక్కులను సద్వినియోగ పరచుకోవాలి అను విషయమును,వాదనలను వదిలివేద్దాము అని గోపిక చేత చెప్పకనే చెప్పించుచున్నది.
శెల్లాన్రు-పరుష వాక్యములను/నిందా వాక్యములను
ఆళయేన్-పలుకవద్దు.
మీరు,(బయటనున్న గోపికలు)
నీంగళ్ వల్లీర్గళ్-వాక్చాతుర్యమును
పొందినవారు-వాచక అర్థము.
సర్వ సర్వజ్ఞులు-సమస్తమును తెలుసుకున్నవారు-అంతరార్థము.కనుక,
నాపై నిందలను మోపకండి అని అన్నది.
లోపల నున్న గోపిక అలా ఎందుకన్నది? అంటే అంతకు ముందు ఆమె వారితో ఏదో చెప్పబోతుందగా,చాలు-చాలు,
వల్లై-ఓ చమత్కార గోపిక,
నీవు చెప్పే,
కట్టురైకల్-కట్టుకథలు,
ఆరిదుం-మాకు తెలుసు.మేము మునుపు ఎన్నో విన్నాము అన్నారు..ఇది బాహ్యమునకు కనిపించు అభియోగము.
నిజమునకు తల్లీ నీవు వినిపించు కట్టుకథలు అనగా కృష్ణుని లీలలు మాకెంతో ఆనంద దాయకములు అనుచున్నారు.ఇది అభిమానము.
అంతే కాదు అని వాదించలేదు గోపిక.అవును మీరే సరిగా చెప్పుచున్నరు.నేనే మీ దగ్గర ఓడిపోయాను అని అంటున్నది.
నేనేదాన్-నేనే,ఆ ఇడుగ-ఓడిపోయాను అని అంటున్నది.వారు అంతకు ముందు ఆమెను నోముకు కూడ రాలేనంత పనులు నీకేమున్నాయి? అని దెప్పిపొడిచారు.ఒకవేళ ఉన్నా అవి విషయ సంబంధములే గద అని ఎత్తిపొడిచారు.
ఉనక్కెన్న వేరుడయై-ఇంకేమి పనులున్నాయి నీకు?
అయినను మన గోపిక వాదనకు దిగక,అందరు వచ్చేశార? ఒక్కసారి చూడండి అన్నది.దానికి వారు,
ఎల్లారం పోందారో-అందరము వచ్చేసాము.
పోందార్పో-వచ్చి నిలబడియున్నాము.
మా మాటమీద నమ్మకము లేకపోతే వచ్చి,నీ వేలితో మమ్ములను తాకుతు,
ఎణ్ణిక్కుళ్-లెక్కించు అన్నారు.( ఆచార్య స్పర్శానుగ్రహమును కోరుచున్నవారు)
ఒల్లె-త్వరగా,
నీ పోదాయ్-నీవు రమ్ము అని అంటుండగానే ఆమె బయటకు వచ్చి,ఈ రోజు స్వామి లీలలో దేనిని కీర్తిస్తు వెళదాము అంటే,
వల్ల-పరక్రమవంతమైన
అలనై-ఏనుగును
వల్లానై మాయనై-అంటు ప్రారంభించినది.
మొదటిది-మదించిన ఏనుగు.
రెండవసారి అన్నప్పుడు మదించిన మన ఇంద్రియములు.
.
ఎల్లే!-ఎంతటి పరమాద్భుతమాలీల.
అదే కువలయ పీడనము.
స్వామి కువలయమనే పరాక్రమమైన ఏనుగును వధించి,దాని బాధను గోకులమునకు పోగొట్టినాడట.ఇది కథ.
కాని కు-చెడు,వలయములు-ఆలోచనలు.
చెడు ఆలోచనలను కలిగించునవి ఇంద్రియములు.నిజమునకు మన ఇంద్రియములు సర్వసమర్థవంతములు కావు.వాటికి నిర్దేశింపబడిన పరిమిత శక్తివంతములు.నిజమునకు కన్ను వినలేదు-చెవి చూడలేదు.అయినప్పటికిని అవి మహ బలపరాక్రమవంతములని భ్రమలో నుండి వాదనలను యుధ్ధములను గెలుపు తమదే నన్న నమ్మకముతో చేస్తూనే ఉంటాయి.
ఏ విధముగా కువలయము యొక్క దంతమే దాని అంతమునకు కారణమైనదో,అదే విధముగా భగవత్ప్రసాదములైన ఇంద్రియ దుర్వినియోగమే వినాశ హేతువు.దాని నియంత్రణయే ధ్యానము అను చక్కని సందేశమునిచ్చి,పది ఇంద్రియములను జయింపచేసిన స్థితిలో నున్న గోపికలతో నోమునకు వెళ్ళుచున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మనము మన అడుగులను కదుపుదాము.
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
ALO REMBAVAY-14
Saturday, December 26, 2020
ALO REMBAVAAY-13
పదమూడవ పాశురం
****************
పుళ్ళిన్వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావై క్కళం పుక్కార్
వెళ్ళి ఎళుందు వ్యాళంఉరంగిట్రు
పుళ్ళుం శిలంబినకాణ్! పోదరికణ్ణినాయ్!
కుళ్లక్కుళిర క్కుడైందే నీరాడాదే
పళ్ళికిడత్తియో? పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరందు కలందేలో రెంబావాయ్.
ఓం నమో భగవయే వాసుదేవాయ నమః.
****************************
ఈ పాశురములో గోదమ్మ మనకు నాలుగు విషయములను ప్రస్తావిస్తూ,వాటి ప్రాముఖ్యతను వివరిస్తున్నది.
మొదటిది-ఇంద్రియ దుర్వినియోగము-దాని ఫలితములు
రెండవది-ఉషోదయ ప్రాముఖ్యత.
మూడవది-భూమానందము.
నాల్గవది-శబరి గొప్పతనము.
తల్లి బకాసురవధను కీర్తిస్తున్నట్లుగా పాశురమును ప్రారంభిస్తోంది.
పిళ్లైగళై-గోపికలందరు,
(సంతోషముగా)
పొల్లా-మాయావి యైన,
అరక్కన్-అసురుని,అందున పక్షిరూపముగా తన కామరూప శక్తితో వచ్చిన వానిని,
పుళ్ళన్-కొంగరూపముతో,అదియును అందమైన తెల్లని కొంగరూపముతో ఖదిరి వనమున ప్రవేశించిన వానిని,
కీండానై-వాడి నోటిని/ముక్కును విభజించి/చీల్చి,
కళందునె-సంహరించిన వానిని,
కీర్తిస్తూ,
పిళ్ళైగళుం-పిల్లలందరు గుంపుగా/గోపికలందరును కలిసి,
పావైక్కళం-నోము జరుపుకొనుచున్న ప్రదేశమునకు,
పొక్కుర్-ప్రవేశించిరి అని గోపికతో(మనతో) చెప్పుచున్నది.
ఈ సన్నివేశము స్వామి దుష్ట శిక్షణ-శిష్ట రక్షణకు ఒక చక్కని ఉదాహరణము.
భావ మాలిన్యముతో నిండిన బాహ్య సౌందర్యముతో అసురుడు అక్కడికి ప్రవేశించినాడు.గోపబాలురు ఆ అందమైన కొంగను చూచుటకు వచ్చి,దానిని చూస్తూ ఆనందిస్తున్నారు.
కాని ఆ కొంగ తనకు ఎరగా బాలకృష్ణుని నిర్ణయించుకొని,వానికై ఎదురుచూస్తున్నది.ఇది దాని జిహ్వ చాపల్యమునకు-ఇంద్రియ దుర్వినియోగమునకు సంకేతము.
స్వామి దాని జిహ్వేంద్రియమును సంస్కరించాలనుకొన్నాడు.దాని కోరికను తీరుస్తూ ఎరగా దాని నోటిలోనికి ప్రవేశించాడు.దానిని పవిత్రము చేశాడు.సమీపించాడు.సంహరించాడు.ధర్మ సంరక్షకునిగా సంకీర్తింపబడుతున్నాడు.
రెండవ సంకేతమును గురు-శుక్ర గ్రహ గమనములతో సంకేతించినది తల్లి.అదియే,
వ్యాళం ఉరంగిట్రు-రేచుక్క అస్తమించినది.చీకటి అనే అజ్ఞానము తొలగి పోయినది.
దానికి కారణము,
వెళ్ళం ఎళుంది-పగటి చుక్క ఉదయించిగానేఉషోదయము కాగానే దాని ధాటికి తట్టుకొనలేక చీకటి/అజ్ఞానము కనుమరుగైనది.
నాస్తికత్వమును తొలగించి పరమాత్మ తత్త్వమును ప్రజ్వలింపచేసినది.
మూడవది ఈ గోపిక నేత్రముల ప్రత్యేకతను మూడు విశేషణములతో వివరించినది తల్లి.అవి
" పోదరిక్ కణ్ణినాయ్"
-అని సంబోధించినది.
1. ఈమె కన్నులు పద్మములవలె జ్ఞానసంకేతములై వానిలో పూర్తిగా పరమాత్మను నింపుకున్నవి.స్వామి రూపమును అనుభవించుచున్నవి.నామమును కీర్తించుచున్నవి.గుణ వైభవమును అర్థము చేసుకొనుచున్నవి.పూర్తిగా తమకే సొంతము చేసుకొనుచున్నవి.
ఏవిధముగా అంటే,
2. ఈమె కన్నులు లేడి కన్నుల వంటివి.అతి శీఘ్రముగా చలించకలిగినవి.ఒకవేళ స్వామి తనను వీడి అటు-ఇటు కదలచూసినను నేత్రములు వేగముగా కదులుతూ సాగిపోనీయుట లేదు.
ఆ హరిణేక్షణ హరిని తన కన్నులలో బంధించి ఏమిచేయుచున్నదంటే,
3. ఆ గోపిక కన్నులు తుమ్మెదల వంటివి కనుక ఆమె తన నేత్రములతో శ్రీకృష్ణుని మధురామృతమును తనివి తీరా గ్రోలుతూ ( తానొక్కతియె గ్రోలుతూ) తమకమును వీడక తన్మయ స్థితులో నుండి,కన్నులను తెరువకున్నది.
కనుకనే తోటి చెలులు/గోపికలు ఇవి,
నన్నానాళ్-పవిత్రమైన రోజులు,
తెల్లవారుచున్నదను సంకేతముగా,
పుళ్ళుం శిలంబిన-పక్షులు కూయుచున్నవి చూడు ,లేచి,
కుళ్ళక్-కుళరక్-కుడైందే-నీరాడాదే,
చల్లని యమునా జలములలో మునిగి,స్నానమాచరించి,మాతోనోమునకు రామ్మా అని మేము నిన్ను మేల్కొలుపుచున్నను, నీవు,
పళ్ళిక్ కిడత్తియో-పానుపును వీడలేకయున్నావు.నీవు నిజముగా నిద్రించుట లేదని మాకు తెలుసు.
కళ్ళం తవిరిందు-కావాలని నిద్రను నటిస్తున్నావు అని గోపికలు అనగానే,
గోదమ్మ గోపికలోని స్వార్థనైజమును తొలగించాలని రామాయణములోని " శబరి" ఔన్నత్యమును వివరించినదట.నిస్స్వార్థముగా ఎన్నో యుగములు శ్రీరామునికై వేచిన శబరి స్వామి తన దగ్గరకు వచ్చిన సమయమున పండ్లను ఆరగింపు చేసి తిరిగిపంపించివేసినది కాని తన దగ్గరనే ఉండిపొమ్మని కోరలేదు.జగత్కళ్యాణమూర్తిని జగములన్నీ పొందవలెను కాని మనము మాత్రమేకాదు అని,వీరు స్వామి కళ్యాణగుణగణములలో స్నానమాడాలనుకొనుచున్నారు.వారి ముచ్చటను మనమందరము కలిసి వ్రతముగా నెరవేర్చుకొందామంటు ఆ గోపికను తమతో నోమునకు తీసుకుని వెళ్ళుచున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మనముకూడ మన అడుగులను కదుపుదాము.
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
.
Thursday, December 24, 2020
ALO REMBAVAY-12
Monday, December 21, 2020
ALO REMBAAVAAY-11
పదకొండవ పాశురము.
***********************
కట్రుక్కరవై కణంగళ్ పలకరందు
శెట్రార్తిరళలియం శెన్రు శెరుచ్చెయ్యుం
కుట్రం ఒన్రిల్లాద కోవలరం పొర్కిడియె
పుట్రు రవల్గున్ పునమయిలే పోదారాయ్
శుట్రుత్తు తోళీమార్ ఎల్లారుం వందు నిన్
మూట్రం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
శిట్రాదే-పేశాదే సెల్వ పెండాట్టి, నీ
ఎట్రుక్కు ఉరంగుం పొరుళేలో రెంబావాయ్.
నమో భగవతే శిఖి పింఛాయ నమః.
*************************
కోవలరం పొర్కడియె-గోకులపు బంగరుతీగె/ ఓ గోపిక,
మీ గోకులములోని గోపాలురు అతిబలపరాక్రమవంతులు.తమకు తాము శత్రుస్థావరములను/బలమును గుర్తించి,వారిపై దండెత్తి మట్టుపెట్టువారు.అంతః శత్రువులకు సైతము అదేగతి.
వారి పరాక్రమ ప్రదర్శన కేవలము శత్రువులమీదనే.
శెట్రాల్-శత్రువుల
తిరళ్-బలపరాక్రమములను తెలిసికొని
శెరుచ్చెయ్యం-తామే వారిపై దండెత్తి,
అరళియం-మట్టుపెట్టి వచ్చువారు.
మిగతా సమయములలో వారు గోపోషణమను స్వధర్మవృత్తిని/సత్వగుణను కలిగియున్నవారు.
మన గోకులములోని గోవులు కూడ గోవిందుని వీక్షిస్తూ,వేణుగానమును వింటూ,స్పర్శను అనుభవ్స్తూ,గుంపులుగుంపులుగా పెరుగుతూ,అందమైన లేగదూడలను కలిగి,తమకు తామె పుష్కలముగా క్షీరమును అనుగ్రహిస్తున్నవి.పితుకకున్నను అధికముగా (అనుగ్రహమును) వర్షించుచున్నవి.
కణంగళ్-సమూహములు/గో సమూహములు
కట్రుక్కరవై-లేగదూడలను కలిగియున్నవై,
పలకరందు-తమకు తామె పుష్కలముగా పాలను ఇచ్చుచున్నవి.
ఇది ఆచార్యులు చేతనులపై తమకు తాముగా అందించు అనుగ్రహము.
మన గోపికను గోదమ్మ,
పుట్రు-పుట్టలో
అల్గుల్-చుట్లతో చుట్టుకొనియున్న
అరవ్-పాముగా కీర్తించినది.(కుండలినీశక్తి)
శ్రీకృష్ణ తాదాత్మ్యములో,బాహ్యమునుండి మనసనే పుట్టలోనికి ప్రవేశించి,తన శక్తుల పరిమాణమును,పరాక్రమమును నిక్షితము చేసుకొని,నిద్రానముగా నున్న ఓ తల్లి,మేలుకొని మాతో వ్రతమును చేయుటకు రమ్ము.
ఎందుకంటే నీవు నీలిమేఘమనే నీలమేఘశ్యాముని చూచిసంతోషముతో,పురివిప్పి నాట్యమాడు వనమయూరివి.
నీవు నాట్యమును చేయునప్పుడు వనములో చుట్టునున్న విషక్రిములు దూరముగా విసిరివేయబడుచున్నవికదా/విషయవాసనలు పటాపంచలమగుచున్నవి కదా.
నీకై మేము ఎల్లారం వందు-అందరము వచ్చినాము.కనుక
పోదరాయ్-బహిర్ముఖురాలివి కావమ్మ.
అందరము అంటే,
శూట్రత్తు-బంధువులము
తోళిమార్-మిత్రులము
ఏమిచేస్తువచ్చామంటే-
ముగిల్-వణ్నన్-నీలమేఘశ్యాముని
పేర్-పాడి-కీర్స్తు
ఎల్లారం వందు-అందరము వచ్చాము.
ఎవరా బంధువులు?
పరమాత్మ సేవాబంధమున్నవారు.
ఏమిటా మిత్రత్వము?
స్వామిపాదసేవా మిత్రత్వము.
కీర్తిస్తు వచ్చి ప్రవేశించాము.ఎక్కడికి?
నిన్-ముట్రం-పుగుందు-నీ ఇంటి ముంగిటి లోనికి ప్రవేశించాము.
బహిర్ముఖమును వీడి అంతర్ముఖులను చేయవమ్మా.అందులకు నీవు బహిర్ముఖురాలివి కావాలి, కాని తల్లి నీవు,
శిత్తాదే-పేశాదే-ఉలుకకున్నావు-పలుకకున్నావు.
నీ-నీయొక్క,
ఉరంగు-నిద్రకు/ధ్యానమునకు,
పొరుల్-ధ్యేయము,
ఎట్రుక్కు-కారణము
మాకు తెలియకున్నది.
సెల్వన్ పెండాట్టి-ఓ భాగ్యశాలిని,
లేచి,మాతో వ్రతమును జరిపించుటకు కదిలిరామ్మా, అంటూ,
ఆ గోపికను తమతో కలుపుకొని వెళ్ళుచున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మనము మన అడుగులను కదుపుదాము.
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
ALO REMBAAVAAY-10
పదవ పాశురము.
***************
నోట్రుం చువర్కం పుగుగిన్ర అమ్మణాయ్
మాట్రావుం తారారో వాసల్ తిరవాదార్
నాట్రా తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాళాల్
పోట్రా పరైతర్రుం పుణ్ణెయనాళ్ ఒండొరునాళ్
కూట్రత్తిన్ వాయ్ వీళ్దం కుంబకరణనుం
తోట్రుం ఉనక్కే పెరున్ తుయిల్ తాన్ తందానో
అట్ర అనందన్ ఉడయాయ్ అరుంగలమే
తేట్రమాయ్ వందు తిరవేలో రెంబోవాయ్.
పాదములలదుకున్నవి వేదగంధమును
పెదవులందించునుగద నాదగంధమును
నలువనందించిన నడుమున కమలగంధంబు
మెడమీడ నడయాడు తులసిగంధంబు
నిస్తులమైన నుదుటను కస్తురిగంధంబు
ఎన్నిగంధంబులు తన్ను బంధించుచున్నను
గోద పూమాలల గంధంబు మోదమందించుట
నిర్వివాదము ఆహా!.సర్వసుగంధునకు.
Friday, December 18, 2020
ALO REMBAVAY-09
తొమ్మిదవ పాశురం
***************
తూమణి మాడత్తు సుట్రుం విళక్కెళియ
తూపం,కమళ త్తుయిల్ అణై మేల్ కణ్ వళరుం
మామాన్! మగళే! మణికదవం తాళ్ తిరవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో! ఉన్ మగళ్ తాన్
ఊమైయో? అన్రి స్సెవిడో? అనందలో?
ఏమన్ పెరున్ తుయిల్ మందిరపట్టాళో?
మామా ఎన్ మాదవన్-వైకుందన్" ఎన్రెన్రు
నామం పలవుం నవిన్రు ఏలోరెంబావాయ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.
******************************
మా మాయన్-మహా మహిమాన్వితుడ
మాధవన్-మాధవా
వైకుందన్-వైకుంఠ వాసా
మా మాయన్-మహా మహిమాన్వితుడ
మాధవన్-మాధవా
వైకుందన్-వైకుంఠవాసా,అంటు
ఎన్రెన్రు-మరీ మరీ వినిపిస్తునది
హరినామ సంకీర్తనము.ఎక్కడ?
తూమణి-దోషరహితమైన మణులు పొదిగిన,
మాడత్తు-మేడ దగ్గర.
ఎవరు చేస్తున్నారు?బయట నున్న గోపికలు.
మణిమయకదవం తాళ్-మణిమయ తలుపు గడియపెట్టి ఉన్నది.దానిదగ్గర.
ఎందుకు చేస్తున్నారు-పెట్టి ఉన్న గడియను
గోపికను వచ్చి తెరువమని అభ్యర్థిస్తున్నారు.
తలుపు గడియ తీయమనవచ్చును కదా నేరుగా,
బయట నున్న గోపికలు స్వ గత ఆశ్రయణ భక్తి కలవారు.
అంటే తామే స్వామిని సేవించి స్వామిని ఆశ్రయించి పొందాలనుకునేవారు.
కాని వారికి విరుధ్ధమైన స్థితిలో ఉన్నతమైన ఉత్తమమైన పర-ఆశ్రయణ స్థితిలో నున్నది లోపల నున్న గోపిక.
అంటే స్వామి తనకు తాను మెచ్చి వచ్చి ఆత్మానందస్థితిని అనుగ్రహిస్తే పరమాత్మతో మమేకమవుతు రమిస్తున్నది. అంతర్ముఖమై బాహ్యములకు బదులీయలేని స్థితిలో తన ఇంద్రియములను కట్టడి చేసినది.లోపలనున్న గోపిక ప్రపన్న. అనగా తమకు భగవంతుడే రక్షకుడు అని గట్టి నిశ్చయముతో నున్నది.బాహ్యములో జరుగుచున్న వికారములకు ఏ మాత్రమును చలించనిది.ఇంద్రియములను నిగ్రహించి నిరతర నిర్గుణ తత్త్వముతో మమేకమగుటయే ఆమె నిద్ర.దానినివీడుటకు ఆమె సుముఖముగా లేదు.
కనుక వీరు పిలిచినను మారు పలుకలేదు.
.తన తాదాత్మ్యమును వీడలేదు.
అప్పుడు గోపికలేమి చూశారు? ఏమి చేశారు?
ఆమె పక్కన కూర్చుని యున్న ఆమె తల్లిని చూస్తూ,
మామీర్-ఓ అత్తా
ఉన్మగళ్దాన్-నీ కూతురిని
ఎళుప్పీరో-మేలుకొలపండి అని అర్థించారు.
అత్త పిలిచినను ఆమె మేలుకొనలేదు.
దేహ సంబంధ-బాంధవ్యములకు ఆమె అతీతురాలు.కనుకనే పలుకలేదు.
సుట్రుం-చుట్టు
విళక్కెళియో-ప్రకాశిస్తున్న దీపములతో
కమళ-వ్యాపిస్తున్న
తూపం-ధూపపు సుగంధ పరిమళములతో
తుయినలై మేల్-తల్పము మీద
తూమణి మాదత్తు-మణిమయ మేడలో
కణ్వలదుం-నిదురిస్తున్న
ఉన్మగళ్దాన్-నీ కూతురిని
మామీర్-ఓ అత్తా
ఎళుప్పీరో-మేలుకొలుపు
అని అడుగుతున్నారు.
ఆ గోపిక దేహ సంబంధములను విస్మరించిన,బాహ్య సంపదలను తిరస్కరించిన స్థితిలో,అత్యంత ఆనందానుభూతిలో ఆ పరమాత్మునితో రమిస్తున్నది.
బయట నున్న చేతనుల (గోపికల)
అసహాయత అసహనముగా మారుతోంది.ఆమెపై
ఇంద్రియలోపములుగలదానిగా అభియోగములను ఆరోపిస్తున్నది
మళ్ళీ వారు అత్తతో,
ఉన్ మగళ్ దాన్- నీ కూతురు తాను
ఊమయో-మూగదా?
అన్రి-లేక
సెవిడో-చెవిటిదా?
అన్రి-లేక
అనందలో-అలిసినదా?
అన్రి-లేక
మందిర-మంత్రము వేయబడినదా?
అన్రి-లేక
పట్టాలో-బంధించి కావలిగా ఇక్కడ పెట్టబడినదా?
ఉలకటం లేదు/పలుకుట లేదు అని అంటున్న వారితో వారి మామీ ఒక ఉపాయమును సూచించినది.
ఎందుకంటే దివ్యగోపికారూపములో నున్న ఆళ్వారులు/ఆచార్యులుగా మారితేగాని,బహిర్ముఖులైతే గాని,తమ జ్ఞానమను దీపములతో,శాంతి సౌభాగ్యములను ధూపములతో సకలమును చక్కపరచవలెనన్న సదుద్దేశముతో చక్కటి ఉపాయమును అదే అదే,
హరినామ సంకీర్తనము తక్క అన్యము ఆమెను బహిర్ముఖురాలిని చేయలేదని చెప్పి వారిచే అత్యంత భక్తితో మాధవన్-వైకుంఠన్ అని సంకీర్తనమును మరీ-మరీ సర్వస్య శరణాగతితో సంకీర్తనమును చేయిస్తున్న వేళ గోపిక మేల్కొని వచ్చి తాళ్ తిరవాయ్ అనగానే -మణికదవపు -మణిమయ ద్వారపు గడియను తొలగించి,వీరితో కలిసి వ్రతమునకు బయలుదేరుచునది.వారితోపాటు మనము కూడ అమ్మ చేతిని పట్టుకుని మన అడుగులను కదుపుదాము.
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
.
.
ALO REMBAVAY-08
ALO REMBAVAY-07
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...