Friday, December 18, 2020

ALO REMBAVAY-08




ఎనిమిదవ పాశురము.
*****************

  కీళ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు
  మేయాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైకళుం

  పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు
  కూవువాన్ వందునిన్రోం కోగులం ఉడయ

  పావాయ ఎళుందిరాయ్ పాడి పరై కొండు
  మావాయ్ పిళందనై మల్లనె మాట్రినాయ్

 దేవాదిదేవనై శెన్రునాం సేవిత్తాల్
 ఆవా వెన్రాయాండు అరుడేలో రెంబావాయ్.

   ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.



 దేవదిదేవనె-శ్రీకృష్ణ పరమాత్మను
 ఆవావెన్రు-త్రికరణ శుధ్ధితో
 శెన్రుదాం-చెన్నుమీర
 సేవిత్తాల్-సేవించుటకు

 పావాయ్-ఓ గోపికా
 ఎళుందిరాయ్-మేలుకో.

 ఈ గోపిక బహిర్ముఖమగుటకు సుముఖముగా లేదు.చతుర భాషిణి.కనుక తగిన సమాధానములతో తాత్సారముచేస్తూ,వారిని పంపించేయాలనుకుంది.

  అందుకే గోదమ్మ,
 కీళ్వానం వెళ్ళెన్రు- 
 వానం-ఆకాశము

  కీళ్వానం-తూరుపుదిక్కు,


   ఆకాశములోని తూరుపు దిక్కు తన నల్ల రంగును వీడి( తమోగుణమును) 

 వెళ్ళెన్రు-తెల్లబడినది/తెల్లవారినది.
 కణ్-చూడు అనగానే,

 లోపలనున్న గోపిక,

  ఆ ప్రకాశము తూరుపు దిక్కుది కాదని,వ్రతము చేయుటకు వెళ్ళుచున్న గోపికల ముఖవర్చస్సు అని పలికినది కాని తలుపు తీయలేదు.


  తెల్లవారినట్లు నమ్మలేదని గోదమ్మ వారికి చాలా సహజమైన చిరుమేతను/శిరువీడును చూడమంటున్నది.

 ఎరుమై-గేదెలు/పశువులు
 పరందన్-అటు-ఇటు వ్యాపించి,
 శిరువీడు-చిన్న మేతను
 మేయవాన్-మేస్తున్నాయి.

 ఆ ప్రదేశమంతా నల్లగా కనిపిస్తున్నది చూడు అనగానే,

 చమత్కారి గోపిక,

 అది శిరువీడు కాదని,ఇంకా తెల్లవారలేదని స్వామి వ్రతమునకై వేచియున్న గోపికల అప్పటి వదనముల దిగులు అని,అది వారి ఉత్సాహమును చూచి.అక్కడికి వెళ్ళి వ్యాపించినదని చెప్పి తిరిగి అంతర్ముఖమైనది.

   ఇక్కడ
 మనము ఒక చిన్న విషయమును ప్రస్తావించుకొందాము.నలుపురంగు-చీకటి-తమోగుణము పరాశ్రయములు కనుక అవి స్వతంత్రలేక ఎదో ఒక దానినాశ్రయించి ఉంటాయి.అది ఎక్కువ సేపు స్వతంత్రముగా ఉండలేదు.కనుక అది మనలను ఆశ్రయించక ముందే,సత్వగుణశోభితమైన తెలుపును/వెలుగును ఆశ్రయిద్దాము.

  అప్పుడు గోదమ్మ ,


  "కూవువాన్ వందు నిన్రోం"-

  వందు-నీ ఇంటికి వచ్చి.నిన్రోం-నిలబడి ఉండి నిన్ను
  కూవువాన్-పిలుచుచున్నాము.

  అంతే కాదు ఇక్కడికి వచ్చి నిన్ను పిలిచేముందు,

 మిక్కుళ్ళ-పిళ్ళైకళ్--ఎందరో గోపికలు 
వ్రతమును చేయు ప్రదేశమునకు,

 పోవాన్-చేరారు
 పోగిన్రారై-వెళ్ళుచున్నారు
 పోగామల్-వెళ్ళుటకు సిధ్ధమగుచున్నారు.

  మేము నీ కోసము వారిని

   కాత్తు-నివారించాము.

 వచ్చి నిలబడి నిన్ను పిలుచుచున్నాం.

కూవువాం వందు నిన్రోం-కూవువాం వందు నిన్రోం.

   కూవువాన్ వందు నిన్రోం అంటుంటే,

  నేను మీతోవస్తే మనకేమి ప్రయోజనము? అని ప్రశ్నించుచున్నది లోపలి గోపిక.


  స్వామి,

 మావాన్-అశ్వరూపమున వచ్చిన "కేశి" అను రాక్షసుని  సంహరించి,        కేశవ నామధారియైనాడు.

 అశ్వము మనసునకు ఇంద్రియములను ప్రతీక.విచక్షణతతో దానికి సంబంధము లేదు.పధ్ధతి లేకుండా-పరిమితి లేకుండా-పలుమార్గాలలో పరుగులు తీస్తుంది,దానిని నియంత్రింపచేసేవాడే కేశవుడు.

 కేశినే కాదు స్వామి మనసునే కాదు -శరీర
 బలముతో విర్రవీగు మల్లయుధ్ధ వీరులను(చాణూర-ముష్టికాసురులను) మట్టుపెట్టినాడు.

  మల్లనె మాట్రినాయ్-అవే అహంకార-మమకారములు.

  ఒకటి మానసిక దౌర్బల్యము.రెండవది శారీరక దౌర్బల్యము. వాటిని తొలగించే స్వామిని మనసార కీర్తిస్తే,స్వామి ప్రసన్నుడై,

 పఱను అనుగ్రహిస్తాడు.మనము దానిని తెచ్చుకుందాము.

 పఱ ఒక వాద్యవిశేషము/పరము.


 "పాడి పఱై కొండు" అంటూ చమత్కారి గోపికతో పాటుగా మనము అమ్మ చేతిని పట్టుకుని,
 మన అడుగులను కదుపుదాము.


   ఆండాళ్ తిరువడిగలే  శరణం.





 



 




 



 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...