Friday, December 18, 2020

ALO REMBAAVAAY-06




 


   ఆరవ  పాశురం.

   *************



 పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్ళరయన్ కోయిలిల్



 వెళ్ళై  విళి శంగిన్ పేరరవం  కేట్టిలైయో?




 పిళ్ళాయ్! ఎళుందిరాయ్! పేయ్ ములై నంజుండు

 కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి



 వెళ్ళత్తరవిల్ తుయిల్ అమంద విత్తినై

 ఉళ్ళత్తు కొండు ముని వర్గళుం యోగి గళుం



 మెళ్ళ ఎళుందు అరి ఎన్న పేరరవం



 ఉళ్ళంపుగుందు కుళిరేలో రెంబావాయ్.






   వినరో భాగ్యము విష్ణుకథ

   వెన్నుబలమిదియే విష్ణుకథ.



   గోదమ్మ రెండవ పాశురములో,

 

 తీక్కరళై సెన్రుదోం-అని శ్రవణేంద్రియ నిషిధ్ధ పనిని తెలిపినది.ఈ పాశురములో శ్రవణ భక్తిని ప్రస్తావిస్తూ,దాని సత్ఫలములను సాక్షాత్కరిస్తున్నది.




 పరీక్షిత్తును పరమపదమునకు చేర్చినది శ్రవణభక్తియే కద.



  అమ్మఈ పాశురములో మూడు శబ్ద సంకేతములను పెరుమాళ్ సేవకు పిలుపుగా మనకు పరిచయము చేయుచున్నది.



 మొదటిది-

 పుళ్ళుం-పక్షులు.

 అవి ఎటువంటివి అంటే,



   అనుష్ఠానము-అనుగ్రహము అను రెండు రెక్కలు కలిగిన జ్ఞానులు-పరమ హంసలు.



    అవి ఏమిచేస్తున్నాయంటే,



 శిళాంబి-కిచకిచ శబ్దములను చేస్తున్నాయి.



   భగవద్విషయములను ముచ్చటించుకుంటూన్నయి.అవి కలిసి ముచ్చటించుకొనుటకు సాయంత్రము వరకు అవకాశము దొరకదని ఉదయముననే ప్రారంభించాయి.



 కణ్-చూడు.



   తల్లి ఎవరిని చూడమంటున్నది?



పిళ్ళాయ్- ఓ బాల! 



  బాల అంటే గ్రహణ-ధారణ-పోషక శక్తివంతురాలు.





 పిళ్ళాయ్-ఎళుందిరాయ్



  ఓ బాల! మేలుకో.



   పక్షులను చూడు-వాటి సంభాషణను విను.



  రెండవది-



   పుళ్ళరయన్-పక్షిరాజు.



     గరుత్మంతునిచే సేవింపబడు స్వామి



కోయిలిల్-కోవెల నుండి వినబడుతున్నది.



  వెళ్ళై-సత్వగుణ శోభితమైన



  విళి శంగిన్-తెల్లని శంఖము చేయుచున్న,



   పేరరవం-ప్రణవనాదము-ఓంకారము



 కేట్టిలయో? -వినబడలేదా/వినలేదా?



 ఒక్కసారి నీలోని నిన్ను చూడు,



   స్వామి దర్శనమిస్తాడు.ఎక్కడనున్నట్లు?



  వెళ్ళల్-పాలకడలిలో

    

 దేనిమీద?



  అరవిల్-ఆదిశేషుని శయ్యగా మలచుకొని,





 తుయల్ మంద-యోగ నిద్రలో నున్నట్లు.



  పాలకడలిపై-శేషతల్పమున....



 మళ్ళీ బాహ్యమునకు మనలను తెస్తున్నది గోదమ్మ.



 పిళ్ళాయ్ కణ్- ఓ బాలా! చూడు. 



   ఎవరిని?




  ముని వర్గగళ్-మునుల సమూహములు.



   మననము చేయుచు మహదానందములో నుండువారు.



  యోగిగళ్-యాగములను నిర్వహిస్తు స్వామి అనుగ్రహపాత్రులైన యోగీశ్వరులు.



  మొదటిది మానసికము.



  రెండవది మానసికముతో కూడిన కాయకము-వాచకము.



   వారు స్వామిని తమ కన్నులలో దాచుకొని ధ్యానిస్తున్నారు.స్వామికి కష్టము కలుగునని వారు తమ కన్నులను మెల్లగ తెరుస్తున్నారు.



 అమ్మ మెల్ల ఎళుందు అని కీర్తిస్తున్నది.
.బహిర్ముఖులైన తరువాత ,



 అరి ఎన్ర పేర రవం-హరి నామస్మరణమును బిగ్గరగా చేస్తున్నారు.



 అంతర్ముఖములోని నిశ్శబ్దము-బహిర్ముఖములో శబ్దము రెండును స్వామి వైభవమే.



 గోపిక తాదాత్మ్యమును తరలించ   దలచి,గోదమ్మ పూతన -శకటాసుర సంహారములను సంకీర్తనము చేస్తున్నది.



  పెయ్ములై-పూతన స్తన్యము( లోని విషమును),


  ననె-విషమును

  చుండు-త్రాగేసాడు.



  నంజుండు-విషమును-విషపు ఆలోచనలను తొలగించివేసాడు.





 ఇప్పుడు అంతా అద్భుతమే-అమృతత్వమే.



 కళ్ళక్ చెగడం-కపటపు బండి /చక్రము.



   కాలోచ్చి-స్వామి కాలిస్పర్శచే,



   కలక్కళియన్-కాలగర్భములో కలిసిపోయినది.

 స్వామి,

 విత్తినాయ్-సకలమునకు-సమస్తమునకు మూలబీజము,



 స్వామి లీలాశ్రవణముతో 





   సంతుష్టాంతరంగయైన గోపికను తమతో కలుపుకొని వెళుచున్న గోదమ్మ చేతిని పట్టుకుని మన అడుగులను కదుపుదాము.



  ఆండాళ్ తిరువడిగళే శరణం. 













 

 



   







 

 


   


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...