Friday, December 18, 2020

ALO REMBAVAY-09


 తొమ్మిదవ పాశురం



***************


తూమణి మాడత్తు  సుట్రుం విళక్కెళియ


తూపం,కమళ త్తుయిల్ అణై మేల్ కణ్ వళరుం


మామాన్! మగళే! మణికదవం తాళ్ తిరవాయ్


మామీర్! అవళై ఎళుప్పీరో! ఉన్ మగళ్ తాన్


ఊమైయో? అన్రి  స్సెవిడో? అనందలో?


ఏమన్ పెరున్ తుయిల్ మందిరపట్టాళో?


మామా ఎన్ మాదవన్-వైకుందన్" ఎన్రెన్రు


నామం పలవుం నవిన్రు ఏలోరెంబావాయ్.


  ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.

  ******************************






 మా  మాయన్-మహా మహిమాన్వితుడ

 మాధవన్-మాధవా

 వైకుందన్-వైకుంఠ వాసా


 మా మాయన్-మహా మహిమాన్వితుడ

 మాధవన్-మాధవా

 వైకుందన్-వైకుంఠవాసా,అంటు 


  ఎన్రెన్రు-మరీ మరీ వినిపిస్తునది


   హరినామ సంకీర్తనము.ఎక్కడ?


  తూమణి-దోషరహితమైన మణులు పొదిగిన,


 మాడత్తు-మేడ దగ్గర.


 ఎవరు చేస్తున్నారు?బయట నున్న గోపికలు.



  మణిమయకదవం తాళ్-మణిమయ తలుపు గడియపెట్టి ఉన్నది.దానిదగ్గర.


 ఎందుకు చేస్తున్నారు-పెట్టి ఉన్న గడియను 


    గోపికను వచ్చి తెరువమని అభ్యర్థిస్తున్నారు.


 తలుపు గడియ తీయమనవచ్చును కదా నేరుగా,


 బయట నున్న గోపికలు స్వ గత ఆశ్రయణ భక్తి కలవారు. 


 అంటే తామే స్వామిని సేవించి స్వామిని ఆశ్రయించి పొందాలనుకునేవారు.


 కాని వారికి విరుధ్ధమైన స్థితిలో ఉన్నతమైన ఉత్తమమైన పర-ఆశ్రయణ స్థితిలో నున్నది లోపల నున్న గోపిక.


  అంటే స్వామి తనకు తాను మెచ్చి వచ్చి ఆత్మానందస్థితిని అనుగ్రహిస్తే పరమాత్మతో మమేకమవుతు రమిస్తున్నది. అంతర్ముఖమై బాహ్యములకు బదులీయలేని స్థితిలో తన ఇంద్రియములను కట్టడి చేసినది.లోపలనున్న గోపిక ప్రపన్న. అనగా తమకు భగవంతుడే రక్షకుడు అని గట్టి నిశ్చయముతో నున్నది.బాహ్యములో జరుగుచున్న వికారములకు ఏ మాత్రమును చలించనిది.ఇంద్రియములను నిగ్రహించి నిరతర నిర్గుణ తత్త్వముతో మమేకమగుటయే ఆమె నిద్ర.దానినివీడుటకు ఆమె సుముఖముగా లేదు.



  కనుక వీరు పిలిచినను మారు పలుకలేదు.

.తన తాదాత్మ్యమును వీడలేదు.


   అప్పుడు గోపికలేమి చూశారు? ఏమి చేశారు?


  ఆమె పక్కన కూర్చుని యున్న ఆమె తల్లిని చూస్తూ,


 మామీర్-ఓ అత్తా

 ఉన్మగళ్దాన్-నీ కూతురిని

 ఎళుప్పీరో-మేలుకొలపండి అని అర్థించారు.


  అత్త పిలిచినను ఆమె మేలుకొనలేదు.


  దేహ సంబంధ-బాంధవ్యములకు ఆమె అతీతురాలు.కనుకనే పలుకలేదు.




     

 సుట్రుం-చుట్టు

 విళక్కెళియో-ప్రకాశిస్తున్న దీపములతో

 కమళ-వ్యాపిస్తున్న

 తూపం-ధూపపు సుగంధ పరిమళములతో

 తుయినలై మేల్-తల్పము మీద

 తూమణి మాదత్తు-మణిమయ మేడలో

 కణ్వలదుం-నిదురిస్తున్న

 ఉన్మగళ్దాన్-నీ కూతురిని

 మామీర్-ఓ అత్తా

 ఎళుప్పీరో-మేలుకొలుపు 


 అని అడుగుతున్నారు.

 

 


 ఆ గోపిక దేహ సంబంధములను విస్మరించిన,బాహ్య సంపదలను తిరస్కరించిన స్థితిలో,అత్యంత ఆనందానుభూతిలో ఆ పరమాత్మునితో రమిస్తున్నది.



   బయట నున్న చేతనుల (గోపికల) 

అసహాయత అసహనముగా మారుతోంది.ఆమెపై

 ఇంద్రియలోపములుగలదానిగా అభియోగములను ఆరోపిస్తున్నది



    మళ్ళీ వారు అత్తతో,


 ఉన్ మగళ్ దాన్- నీ కూతురు తాను

 ఊమయో-మూగదా?

 అన్రి-లేక

 సెవిడో-చెవిటిదా?

 అన్రి-లేక

 అనందలో-అలిసినదా?

 అన్రి-లేక

 మందిర-మంత్రము వేయబడినదా?

 అన్రి-లేక

 పట్టాలో-బంధించి కావలిగా ఇక్కడ పెట్టబడినదా?


 ఉలకటం లేదు/పలుకుట లేదు అని అంటున్న వారితో వారి మామీ ఒక ఉపాయమును సూచించినది.



  ఎందుకంటే దివ్యగోపికారూపములో నున్న ఆళ్వారులు/ఆచార్యులుగా మారితేగాని,బహిర్ముఖులైతే గాని,తమ జ్ఞానమను దీపములతో,శాంతి సౌభాగ్యములను ధూపములతో సకలమును చక్కపరచవలెనన్న సదుద్దేశముతో చక్కటి ఉపాయమును అదే అదే,


హరినామ సంకీర్తనము తక్క అన్యము ఆమెను బహిర్ముఖురాలిని చేయలేదని చెప్పి వారిచే అత్యంత భక్తితో మాధవన్-వైకుంఠన్ అని సంకీర్తనమును మరీ-మరీ సర్వస్య శరణాగతితో సంకీర్తనమును చేయిస్తున్న వేళ గోపిక మేల్కొని వచ్చి తాళ్ తిరవాయ్ అనగానే -మణికదవపు -మణిమయ ద్వారపు గడియను తొలగించి,వీరితో కలిసి వ్రతమునకు బయలుదేరుచునది.వారితోపాటు మనము కూడ అమ్మ చేతిని పట్టుకుని మన అడుగులను కదుపుదాము.


 ఆండాళ్  దివ్య తిరువడిగళే శరణం.



  


  


                                   

.


 

 






  


                                   

.


 

 





  

                                   
.




  

                                   
.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...