Friday, October 14, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-10 (SIVAANAMDALAHARI)

 నరత్వం దేవత్వం నగ-వన-మృగత్వం మశకతా

పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది-జననమ్

సదా త్వత్-పాదాబ్జ-స్మరణ-పరమానంద-లహరీ

విహారాసక్తం చేద్-హృదయం-ఇహ కిం తేన వపుషా    10

ఆత్మనివేదనము గురించి పుష్పార్థం అంటూ మనకు తెలియచేసిన ఆదిశంకరులు,ప్రస్తుత శ్లోకములో స్మరణభక్తి విశేషములను వివరిస్తూ,ఉపాధి ఏ విధముగాను భక్తికి-భగవదనుగ్రహమునకు అడ్దురాదని,కావలిసినది పాప-పుణ్య ఫలములే యని మనకు వివరిస్తున్నారు.దానికి నిదర్శనముగా అనేకానేక ఉపాధులలో నున్నప్పటికిని,ముక్తిని పొందిన, నరత్వం-మానవ ఉపాధిని, దేవత్వం-దైవ ఉపాధిని, నగ మృగత్వం-కొండలలో చరించు మృగ ఉపాధి వన మృగత్వం-అడవులలో చరించు మృగ ఉపాధి సాధు జంతువులు-కౄరజంతువులు లేళ్ళు-పులులు మశకతం-దోమ ఉపాధి కీటత్వం-క్రిమి ఉపాధి విహగత్వం-పక్షి ఉపాధి అని చెపుతూ,శివా నిరంతరము నిన్ను స్మరిచగలిగినపుడు ఇహ కిం తేన వపుష- ఏ ఉపాధిలో నున్నప్పటికిని హృదయం విహారాసక్తం-మనసు నీ ధ్యానమనే ఆనందపు అలలతో పాటుగా తేలియాడుచున్నప్పుడు అంటూ ఆత్మతత్త్వమును అర్థము చేసుకొమ్మంటున్నారు.

"పుణ్యేన యాతి దేవత్వం-పాపేన నారకే తనుం ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం మానుషం"

బాహ్య ఉపాధులు అనేకములు.కాని వానిలో దాగిన మనసు యొక్క ఉద్దేశ్యము ఒకటే.అది తవ పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం.

 బాహ్య ఉపాధులు అనేకములు.కాని వానిలో దాగిన మనసు యొక్క ఉద్దేశ్యము ఒకటే.అది

 తవ పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం.

 నగత్వం-న గచ్ఛతీ నగం

కదలలేనిది.స్థూలసరీరముతో నా శరీరము చలించుటకు అశక్తము కావచ్చును.కాని నా మనసు అనవరతము నీ స్మరణముతో చలించగలినప్పుడు నాకు వచ్చిన లోటు ఏమిటి?

 నిలకడలేని మనసుతో నా కోటి/వనచర ఉపాధి గంతులు వేయుచు కొమ్మలపై ఎగురుచుండవచ్చును.నా ఉపాధితో పాటుగా నా మనసు సైతము నిన్ను స్మరిస్తున్నప్పడు నాకింకేవాలి విభో!

 దోమగా/క్రిమిగా నా ఉపాధి దాని ధర్మముననుసరించి అశుద్ధములపై వ్రాలుచు గడుపవచ్చును.కాని నా అంతరంగము శుద్ధమై నిన్ను స్మరించుచున్నప్పడు తక్కువేమిటి ?

 పశువుగా నా ఉపాధి ఉన్నప్పటికిని,పశ్యంతీ తవ...చూదగలుగుతుంది కాని ...

నా స్మరనము నిరతము నీదే అయినప్పుడు వచ్చిన లోటేమిటి ప్రభో!

 పక్షిగా నా ఉపాధి ఉన్నప్పటికిని,నా మనసు నీ అనవరత స్మరణముతో నిండిన 

 అని శంకరులు శివకృపాకటాక్షమును సాక్షాత్కరింపచేస్తున్నారు.

సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.




No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...