Friday, October 14, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-12(SIVAANAMDALAHARI)

 


శ్లో :  గుహాయాం గేహే వా బహి:-అపి వనే వా()ద్రి-శిఖరే

జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలమ్

సదా యస్యైవాంతఃకరణమ్-అపి శంబో తవ పదే

స్థితం చేద్-యోగో()సౌ పరమ-యోగీ సుఖీ 12

ఆదిశంకరులు అనన్యాశ్రయభక్తి మహిమను వివరిస్తూ,ఉపాధికాని,వయసు/ఆశ్రమముకాని ఆత్మాశ్రయభక్తికి అవరోధము కానేకాదను విషయమును మరింత స్పష్టము చేస్తు ప్రదేశములలో వైవిధ్యము సైతము సర్వాంతర్యామి అనుగ్రహమునకు అడ్దంకులు కానేకావనుచున్నారు. సర్వజ్ఞునకు సమయము-స్థలము నిరోధములు కావు అను అంశమును నొక్కి వక్కాణించుతు, కొండ గుహలలో నున్నగాని,స్వగృహములో నున్న గాని,వనములలో నున్నగాని,పర్వతశిఖరాగ్రమున నున్నగాని అంతేకాకుండా, జలములోగాని,అగ్నిలోగాని నున్నను స్వామి కరుణను పొందుటకు కంటకములు కావుకద శివా!

మాణిక్యవాచగర్ మనకు అందించిమ్న పెరియపురాణ కథలు అందులకు చక్కని నిదర్శనము. ఆదిశంకరులు మనకు యోగము గురించి,పరమయోగి ప్రసాదగుణమును గురించి ప్రస్తుత శ్లోకములో వివరిస్తున్నారు.ఒక విధముగా చెప్పాలంటే భిన్నత్వముగా మనకు గోచరించుదానిలో నిక్షిప్తముగా దాగిని ఏకతమును గుర్తించగలుగుటయే సాధన. మనలో నిరతము కదలాడుతూ,ప్రభావితము చేస్తుంటాయి మన చిత్తవృత్తులు.మనోభావములు త్రిగుణములను జతచేసుకుని,అరిషడ్వర్గముల అధీనమై అలుపెరుగక ఆటలాడుతుంటాయి. ఆ ప్రవృత్తులను నిరోధించగలుగుటయే యోగము/ వాటిని సంపూర్ణముగా-సర్వవేళలా నివృత్తించగల స్థితప్రజ్ఞులే పరమయోగులు. వారి పాదములందుంచబడిన జీవుని హృత్పద్మము అందించు సుఖానుభూతిని మించినది ఏదీలేదు.శివా నాకా యోగ్యతను ప్రసాదించుము.నాపరిసరజ్ఞానమును విస్మరించి,పరమేశ్వర పాదార్చనానుభూతిలో పరవశింపనీ


. సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...