Friday, October 14, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-11(SIVAANAMDALAHARI)


 శ్లో : వటుర్వా గేహీ వా యతిర్-అపి జటీ వా తదితరో

నరో వా యః కశ్చిద్-భవతు భవ కిం తేన భవతి

యదీయం హృత్-పద్మం యది భవ-అధీనం పశు-పతే

తదీయ:-త్వం శంభో భవసి భవ భారం వహసి      11


గభీరే కాసారే శ్లోకములో హృత్పద్మ సమర్పనమును గురించి,దానికి ఏ ఉపాధియైననౌ అర్హతగలిగినదే అని వివరించిన ఆదిశంకరులు,ప్రస్తుత శ్లోకములో నరత్వమును-మానవ ఉపాధియొక్క నాలుగు దశలను ప్రత్యేకించి వివరిస్తున్నారు.వాటిలో ఏ ఆశ్రమములో ఉన్నప్పటికిని ఈశ్వరానుగ్రహమునకు పాత్రులే అని వివరిస్తున్నారు. ఎందుకంటే, యదీయం హృత్పద్మం తవదధీనం కనుక హేశంభో! భవభారంచ తదీయం వహసి నా భారమును మోయువాడవు నీవు కనుక నా ఉపాధి బ్రహ్మచర్యములోనున్న,గృహస్థుగా నున్నను,వానప్రస్థములో నున్నను,సన్యాసిగా నున్నను ప్రతిబంధకము కాదు. యః కశ్చి-నేను ఉన్న ఆశ్రమము ఏదియైననునీమీది అపారమైన భక్తి నన్ను విచలితము కానీయదు,


 ఆత్మానాం గిరిజపతే-మనసునిండా పరమేశా నీవు నిండియున్నప్పుడు,

అనన్యః చింత...యోగక్షేమ వహామ్యహం.అన్నట్లుగా ,నా భవభారమును మోయుటకు,పరిహరించుటకు నీ అనుగ్రహము సంసిద్ధముగా నున్న వేళ నాకేల ఇతర చింతలు?

 ప్రస్తుత స్లోకములో,భవ-భవతి-భవసి-భవత్-కిం భవతి?-భవభారం-భవామ్యహం అంటూ భవ సబ్దము అనేకమార్లు ప్రస్తావించబడినది.

 భు-ధాతువునుండి ప్రకటింపబడిన భవ శబ్దము మనకు పరతత్త్వము యొక్క ప్రకటనమును అనేకవిధములుగా చేయుచున్నది.

 ప్రతి కదలికల పుట్టుక పరమాత్మయే.

ప్రతి జీవిలోని పరిణామ దశలు పరమాత్మ కదలికయే.కాలగతులు-ఋతుధర్మములు-స్థావరజంగమములు అన్నీ పరమాత్మ ప్రకటనరూపములే.వాటన్నిటికిని మూలమైఅ పరమాత్మ అనుగ్రహము మనదైననాడు ప్రతిమార్పు గురించి కలవరపడవలసిన పని లేదు.


 ఎందరో మహానుభావులు భక్తులు వివిధ ఆశ్రమములో ఉన్నప్పుడు 

ప్రహ్లాదుడు,ధ్రువుడు,మార్కండేయుడు,అంబరీషుడు,సౌనకాదిమునులు ఇలా ఎన్నెన్నో ఉదాహరనములను ప్రస్తావించినారు.

 నాకిక్కడ భగవంతుడే తాను వామనమూర్తిగా,బ్రహ్మచారియై,గృషథుగా శ్రీకృఇష్ణ పరమాత్మునిగా,వానప్రస్థునిగా శ్రీరామచంద్రునిగా,బాలునిగా,బాలికగా,యువతిగా,యువకునిగా,నడివయస్కునిగా,వృద్ధునిగా వివధదశలలో తనను తాను ప్రకటించుకొనుచు జీవులను ఉద్ధరిస్తున్నాడనిపిస్తున్నది.

నా అభిప్రాయము తప్పయిన నన్ను మన్నించెదరుగాక.

 సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...