Thursday, February 29, 2024

ADITYAHRDAYAM-SLOKAM-20


 


 




 ఆదిత్యహృదయము-శ్లోకము-20


 ***********************


 ప్రార్థన


 *******


 "జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం


  హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం


  అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్య మూర్తిం


  సకలభువనవంద్యం భాస్కరం  తం నమామి."




  పూర్వరంగము


  ***********


 పూర్వ శ్లోకమును "తప్త-చామీకరాభాయ వహ్నియేవిశ్వకర్మిణే"అంటూ పరమాత్మను ప్రస్తుతిస్తుంది.


 చామీ కరము-బంగారు కిరణము.ఆ బంగారు కిరణము మేరుపర్వతమును పరమాత్మ స్పృశించుటచే ఏర్పడినది.

.ఆ బం గారు కిరణము స్వామి అనుగ్రహమే.

 వేడిచే-వెలుగుచే తప్తమైనది/కాల్చబడినది.అంటే ఇతర లోహ ధాతువులను సైతము విడదీయలేంతగా తనలో కలుపుకొనిన బంగారపుకొండ స్వామి స్పర్శచే దోషములను ఆవిరిరూపములో/ద్రవరూపములో కరిగించుకుని/తొలగించుకుని,తప్తము చేసికొని,పుటమై,మేలిమిముద్దగా ప్రకాశిస్తున్నది.ఇది వాచకము.



  జీవుల ఉపాధి/దేహము మేరుపర్వతమే..అది మంచి-చెడులను విడదీయలేనంతగా తనలో కలుపుకుని సందిగ్ధములో ఉంది.స్వామి తన కరుణ  అనే అగ్నితో దానికి పుటము వేసి శాశ్వతమైన-ఆత్మను-అశాశ్వతమైన ఉపాధిని వేరుచేసి  ప్రకాశింపచేయుచున్నాడు.అదియే కదా,


 న ఛిందంతి  శస్త్రాణి-న దహతి అన్న ఆత్మ వివేక సారము.


  పూర్వశ్లోకము కృతఘ్నఘ్నాయ అన్న ప్రళయసంకేతికమైన పదముతో ముగిసినది.దానికొనసాగింపుగా,ప్రస్తుత శ్లోకము,ప్రారంభమగుతున్నది,


 నాశయత్యేష వైభూతం అన్న పదముతో,ప్రళయ తరువాత స్థితికి సూచనగా.




 శ్లోకము


 ******


 " నాశయత్యేష వైభూతం తదేవ సృజతిప్రభుః


   పాయత్యేష-తపత్యేష-వర్షత్యేష గభస్థిభిః"


  


   భూతము అనగాజీవి.అది యే ఉపాధి యైననుకావచ్చును.పరమాత్మ ఆ ఉపాధుల సమస్తమును మొదట నశింపచేస్తాడట.




 తదేవ-తత్-ఏవ .తిరిగిమొత్తముగా దానిని,ఏ ఒక్క చిన్న విశేషమును వదలకుండా సృజతి.సృష్టిస్తాడు.






 తిరిగి సృష్టిస్తాడు.


   తనయొక్క కాంతులతో/ప్రభలతో .


    ఇది సారాంశము.ఏ విధముగా సంహార-సృష్టి విధానమును నిర్వహిస్తున్నాడు అన్నది వివరణ.మూడు పనులక్రమముగా చేస్తూ,

 పాయత్యేష-తపత్యేష-వర్షత్యేష అన్నవి ఆ క్రియాపదములు.




 వివరణకు ముందు సహాయకారిగా ఒక చిన్న విషయమును ప్రస్తావించుకుందాము.




 అరటిచెట్టు గెలవేసినది-వెంటనే దానిని నరికి వేశారు.కాని పిలకను/దుంపను మాత్రము ఉంచారు.


 ఈ విధానమే పాయత్యేష.పారత్యేష కంటే ఉత్తమమైనది పాయత్యేష  అన్న పదము శిక్షిస్తున్నట్లుగా అనిపించే రక్షణము.పారయత్యేష-ఒడ్దునకు చేర్చుట.పాయత్యేష అనగా తిరిగి సంసారమనే  సాగరములోనికి ప్రవేశపెదతాడు.


 ఏవిధముగా అంతే,


 1.పాయత్యేష-నశింపచేస్తూ-సృజింపచేస్తూ.


    ఏ విధముగా సృజింపచేస్తున్నాడు అంటే,


 నరికివేయబడిన అరటిచెట్టు దుంప/మూలము భూమిలోనే ఉంచాడు.దానిని,


2. తన ఘర్మసర్జన  కిరణములను ప్రసరింపచేసి,వేడినికలిగించి,మొక్కగా మారుటకు అనుకూల స్థితిని ఏర్పరిచి,


    ఇప్పుడు,  మొక్క ప్రస్పుటముగా కనబడుతోంది.కాని అదిపెద్దదై తిరిగి గెలవేయగలగాలి.అందుకు జలము అవసరము.


3.వర్షత్యేష- ఎదుగుచున్నమొక్కకు ఆహారమును అందించుటకు/పత్రహరితమును సమకూర్చుకొనుటకు అనుకూలమైన కిరణ ప్రసారముచేస్తూనే,జలసర్జన కిరణములను ప్రవేశింపచేస్తాడు వర్ష రూపములో.




 అవి అరటిచెట్టు ఎదిగి పూవుపూసి,గెలవేసి అనేకానేక అరటిపండ్లను,అరటి దూటను,పూవును మనకు అందిస్తుంది.




   అంటే,రశ్మిభావను కలిగినపరమాత్మ సముద్యంతుడై తేజసామపి తేజస్వి యై,


 సహస్ర రశ్ముడై,తనకరములతో/కిరణములతో పంచభూతములను కార్యనిర్వహణ  శక్తులను చేసి,భగ భగ మనుచు,గభ గభ వ్యాపిస్తూ ఆదాన-ప్రదానకుడై,ఇచ్చి-పుచ్చుకుంటూ ,


 ప్రాణానాం  ఆయతనం భవతి గా సంస్కృతములోను,


"సద్గుణ ప్రాప్తి యే  సద్గతి ప్రాప్తి "అని వివరిస్తూ,తెలుగులో,




 " చుట్టము పక్కముం గురువు చూపును-ప్రాపును-గాపును-జ్ఞానజ్యోతియున్"  అని తెలుగులో ప్రస్తుతించుచున్న వేళ,


 " తం సూర్యం  ప్రణమామ్యహం."





 



Wednesday, February 28, 2024

ADITYAHRDAYAM-SLOKAM-19


  




 ఆదిత్యహృదయం-శ్లోకము-19


 ********************


 ప్రార్థన


 ****


 "జయతు జయతు సూర్యం సప్త లోకైకదీపం


  హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాసం


  అరుణకిరణ గంయం ఆదిం ఆదిత్యమూర్తిం


  సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."




 పూర్వ రంగము


 **********


 పరంజ్యోతి  యైన పరమాత్మ తమమును-హిమమును-శత్రువులను-కృతఘ్నతను  సంపూర్ణముగా నాశనము చేసి ,నిర్ద్వంద్వ స్థితిని ప్రకటించినాడు అని చెప్పిన అగస్త్యభగవానుడు పునః సృష్టిని చేయుచు,నిరంజనుదైన స్వామి సర్వమలినములను హరించివేసి,రోచిష్ముడై,  పుటము వేసిన అగ్నివంటి వర్ణముతో ,కన్నులముందు కనపడుతూ,కిరణములనే కరములతో ,పంచకృత్య భారమును వహించు వహ్ని వలె,


"తప్తంచకర-తప్తచామీకరుడై-ఆ భా-సమస్తమును ప్రకాశవంతము చేస్తున్నాడు అంటూ,అగ్నిద్యోతక స్వరూప సూర్యనారాయణుని సంకీర్తిస్తున్నాడు.


 శ్లోకము


 *****


 "తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే


  నమః తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే" 


  విఘ్నేశ్వరనుగా విశ్లేషింపబడిన పరమాత్మ వటపత్రసాయియై, తదుపరి పునః సృష్టిని ప్రారంభిస్తున్నాడు.జలమయములైన జగములు తిరిగి తమతమ రూపములను ప్రకటింపచేసుకొను శక్తిని రుచుల ద్వారా/కాంతులద్వారా పొందగలుగుతున్నాయి.


  ఇదే విషయమును "దుర్గాసూక్తం గా ' పేరుగాంచిన ఆదిత్యసూక్తము,


 " ఓం "


 జాతవేదసే సునవా మసోమ మరాతి యతో నిదహాతి వేదః


 సనః పరుషదయతి "దుర్గాణివిశ్వా నావేవ సింధుం దురితాత్ యగ్నిః'


 దుర్గాణి దాతలేని సుడిగుండములు కల సంసారమనే సముద్రమును దాటించకల నావవు నీవు .ఓపరమాత్మ సోమరసమును/సర్వస్య శరణాగతి అను భక్తిభావనమును నీకు సమర్పిస్తు,మమ్ములను రక్షించమని వేడుకుంటున్నాము.



  ఓ జాతవేద-ఎనిమిది అగ్ని స్వరూపములలో ఒకతై,మా ఉపాధులలో ప్రవేశించి,మమ్ములను అంతః యజ్ఞ సన్నద్ధులను చేయుచున్న పరమాత్మ నీకు నమస్కారములు.


   యజ్ఞ రూపముగా నిన్ను ప్రార్థించగల కరుణను ప్రసాదించు నీవు,


 " తామగ్ని వర్ణాం తపసాంజ్వలంతీం


   వైరోచనీ కర్మఫలేషు జుస్ట్వాం


  "దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే "


    స్తుతరసి తరసే నమః."


  స్వామి/ మాతా! నీవి అగ్నివర్నముతో జాజ్వల్యమానముగా దర్శనమిస్తున్నావు.


 విస్తరించిన రోచిస్సులతో మాకర్మఫలములను హరింపచేస్తున్నావు.


 దుర్గ్మాదేవీం -జగన్మాత అనిఒక అర్థము.


 ఛేదించలేని కషటములను తొలగించు శక్తి అని మరొక అన్వయము.



 ఓ దివ్య ప్రకాశమా!నేను నీ శరణాగతినై నన్ను తరింపచేయమని వేడుకుంటున్నాను.


 పుటము వేసిన బంగారు కిరణములనే  కరములతో సర్వత్ర వ్యాపిస్తూ,రక్షణభారమునుమోస్తున్న/వహిస్తున్న వహ్ని రూపునకు లోకసాక్షికి,/


 లోక సాక్షిని,




 " నమః సవిత్రే జగదేకచక్షుసే


   జగతః ప్రసూతి స్థితి నాశ హేతవే


   త్రయీ మయాయ త్రిగుణాత్మధారిణే


   విరించినారాయణ శంకరాత్మనే '


 అని సంస్కృత భాష ,సన్నుతిస్తుంటే,




 


  పగటికి బీజమున్ తిమిర బాధక మక్షికి నంజనంబు ము


  క్తిగవిని, "ముజ్జగాలఁ దగు దీపము లొక్కటియైన ముద్ద" వా


  న గురియు హేతు "వబ్ధి రశనారసపానము పెద్దచెంబు "పే


  ర్మి గలుగు సూర్యమండలము మీకునుఁ గోరిక లిచ్చుగావుతన్.




 ఓ సూర్యభగవానుడ! నీవు పగటి ప్రకటనమునకు విత్తనము.చీకటికి బాధాకరము.కంటికి చల్లదనమునందించు కాటుకవు.అన్నింటికంటే అపురూపము, 


 "ముజ్జగాలదగు దీపములొక్కటియైన ముద్ద"సముద్రజలపానముచేయు పెద్ద చెంబు"


 పేరిమి/మనందరిపై ప్రేమకలిగిన సూర్యమందలమును సంకీర్తించుచున్నవేళ,


 "తం  సూర్యం ప్రణమామ్యహం."


 


Tuesday, February 27, 2024

ADITYAHRDAYAM-SLOKAM-18


 


 




   ఆదిత్యహృదయం-శ్లోకము-18


   ************************


  ప్రార్థన


  *******


 " జయతు జయతు సూర్యం  సప్తలోకైకదీపం


   హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం


   అరుణ కిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం


   సకలభువనవంద్యం  భాస్కరం తం నమామి."




  పూర్వరంగము


  ***********


 "మమయోనిః మహత్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం


  సంభవః సర్వభూతానాం-అంటూ ,


 ఇక్కడ యోని శబ్దము మూలకారణముగా అన్వయించుకోవాలి.


 ఇది స్థూల విశ్వరచనకు మూలకారణము పరమాత్మ.



  ఆ పరమాత్మ సూక్ష్మముగా ,


 "సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశం ఉపజాయతే-ఇది ఉపాధికి సంకేతము అన్న భగవద్గీతా  సారమును తెలియచేసిన అగస్త్యభగవానుడు,త్రిగుణముల ప్రభావమును ప్రస్తుత శ్లోకములో వివరిస్తున్నారు.


  ఒకవిధముగా చెప్పాలంటే పరమాత్మ "విఘ్నేశ్వర " కరుణావిశేషములే ప్రస్తుత శ్లోకము.


 శ్లోకము


 ******


 " తమోఘ్నాయ-హిమఘ్నాయ-శత్రుఘ్నాయ-అమితాత్మనే


   కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః" 


   శ్లోక భావమును గ్రహించుటకు  సహాయకారకముగా పూర్వశ్లోకములలో ప్రయోగించిన కొన్ని పదములను ప్రస్తుత శ్లోకముతో సంధాన పరచుకుందాము.


 "రశ్మిమంతం-సముద్యంతం" దేవాసుర నమస్కృతం." 


   స్వామి తనకిరణ కాంతులను సంపూర్తిగా ప్రసరింపచేస్తూ దేవ-అసురులచే నమస్కరింపబడుతున్నాడు.


 తరలుతున్న చీకటి వెలుగుతో కలిసిపోయి నమస్కరిస్తున్నది.


  వచ్చిన వెలుగు చీకటిని తనలో కలుపుకుని నమస్కరిస్తున్నది.


 కాని ప్రస్తుత శ్లోకములో "దేవాయ" శబ్దమును వాల్మీకి మహర్షి ప్రయోగించారు.


 1.అదియును "తమోఘ్నాయ" శబ్దముతో.


 ఘ్న అన్న శబ్దమునకు తొలగించునది/నిర్మూలించునది/సంహరించునది.


 విఘ్న శబ్దమునకు విశేషమైన అడ్డంకిని/అవరోధమును/కార్య నిరోధమును కలిగించునది అని ఒక అర్థమైతే ,దానిని కలిగించి-తొలగించు ఈశ్వరశక్తియే విఘ్నేశ్వరుడు అని మనము కొలిచే ఆదిపూజ్య దైవము.


 తిమిర ఉన్మథన శంభో అన్న పూర్వశ్లోకములలోని పదము సైతము తమోఘ్నాయ అన్న దానికి సాపేక్షికమే అయినప్పటికిని అది ఉషోదయ సందర్భము.


  తమము సత్వ-రజో-తమో గుణములతో నొకటివానిని సృజించినవాడు త్రిగుణాత్మకుడు..




 " తమః అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం


   ప్రమాదాలస్యనిద్రాభిః తత్ నిబద్ధాని"




    కప్పబడిన (జ్ఞానమును) అజ్ఞానమే తమోగుణము.ఈ తమోగుణము



 ప్రమాదము-ఏమరుపాటును


 ఆలస్యము-అలసత్వము-సోమరితనమును


 నిద్ర-జడత్వమును


 మోహనం-మైమరుపును, తన ఉనికిని తాను గుర్తించకపోవుట అను లక్షణములను కలిగి,తన విచిత్ర చిత్తవృత్తులతో,శాశ్వతానందమైన చిత్ప్రకాశమును కాననీయదు.


 దానిని తొలగించివేయుటయే "తమో ఘ్బ్న" "కలిగించువాడు " తమోఘ్నాయ"


 స్త్రీమూర్తిగా  పరమాత్మను భావించుకుంటే,


 'భక్తహార్ద్ర తమో భేద భానుమత్ భానుసంతతిః"అంటున్నది లలితా రహస్య సహస్ర నామ స్తోత్రము.


 అదియును హృదయములో  సూర్యునివలె ప్రకాశిస్తూ,


 "హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతర దీపికా" అని తెలియచేయబడినది.


 తమము మనసునకు సంబంధించినదే,


2. హిమము ఉపాధికి/స్థూలమునకు సంబంధించినది.



 దీనినే పూర్వ శ్లోకములలోని "శిశిర నాశన" పదము నిర్వచించినది

.


 ఇక్కడ కిరణములు ప్రాణశక్తులు.అవి మనలోనుండి తరలిన నాడు మనశరీరము చల్లనై గడ్డకట్టుతుంది.స్థూలము సైతము స్తంభింపచేసే పరిణామమె "హిమము" దానిని ద్రవింపచేయు పరమాత్మ శక్తియే హిమ-ఘ్న,చేసేవాడు,హిమఘ్నాయ.


3.  శత్రు-ఘ్న మూడవపదము.


 ప్రథమ శ్లోకములోనే అగస్త్య భగవానుడు,


 "యేన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యతి" అని సర్వ ప్రతికూల శక్తులను ఘ్న చేయు ప్రజ్ఞయే "శత్రుఘ్న."




  సర్వశత్రు వినాశనమే /సర్వపాప ప్రశమనమే /సర్వదోష నివారనమే "శత్రు ఘ్న "దానిని కలిగించేవాడు శత్రుఘ్నాయ.

.


 పరమాత్మను అమ్మగా భావిస్తే "చిత్ ఏక రస రూపిణి"సూర్య భవానునిగా భావిస్తే,వేదవాక్యమైన,


 "ఏకం సత్ విప్రా బహుదా వదంతీఅన్న వాక్యవిశేషములే,అమితాత్మనే స్వామి ఏకత్వ-అనేకత్వ విశేష-సామాన్య ఆత్మతత్త్వమును నొక్కి వక్కాణిస్తున్నది.


 అది అర్థమయిన వేళ,


 "జ్యోతిర్గణానాంపతి-జ్యోతిషాంపతి" అని అభేదమును గ్రహించగలుగుతాము.


  కాని ఇప్పుడే వస్తున్నది చిక్కు.


 స్వామికృతఘ్నతను  సైతము  ఘ్న నశింపచేస్తాడంటున్నది శ్లోకము.


 ఏమిటా కృతఘ్నత ?స్వామి దానిని ఎలా నశింపచేస్తాడు?



  సమాధానము పరమాద్భుతము.

.


 యుగధర్మములను  అనుసరిస్తూ,గుణధర్మములను బానిసలమై,


 " ఊర్థ్వం గచ్ఛంతి సత్త్వస్థా


   మధ్యే తిష్ఠంతి రాజసా


   జఘన్యగుణ వృత్తిస్థా


   అథో గఛ్చంతి తామసాః"


  అన్న గీతసారముననుసరించి మనోవృత్తులు అంతకంతకు అథోపయనము చేస్తూ,చీకటిలోతుల     లోనికి చేరి, అందిస్తున్న చేయిని కాని,ఆశించే ఉద్ధరణమును  కాని పొందలేని స్థితి "కృతఘ్న  స్థితి" దానినుండి సమస్తమునకు విముక్తిని కలుగచేయుటయు వాదే "కృతఘ్న ఘ్నాయ"



  అంటే/అదే  'ప్రళ యస్థితి" సమస్తమును జలమయముచేసే స్థితి.దానిని కలిగించి పరమాత్మ దోషనివారణము చేసి 'పునః  సృష్టిని"ప్రారంభిస్తాడు.


   తల్లి అయితే దేవీ భాగవతములో చెప్పినట్లు"సర్వదేవాతాశ క్తులను"శివునిచిదగ్నిచే కుండములో ఆహుతులుగా చేసి.దోషహరణ ముచేసి తిరిగి నూతన శక్తిని ప్రసాదించుట కదా.



 పంచకృత్య నిర్వహనమును  అలతి అలతి పదములతో అందించిన అగస్త్యభగవానునికి నమస్కరిస్తూ,




  తం సూర్యం ప్రణమామ్యహం.





Monday, February 26, 2024

ADITYAHRDAYAM-SLOKAM-17


 



  ఆదిత్యహృదయం-శ్లోకము-17

  *********************

 ప్రార్థన

 ******

 "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం

  హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం

  అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం

  సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."


 పూర్వరంగము

 *********

   పరమాత్మ తన ఉగ్రత్వ-వీరత్వ సారంగత్వముతో సమస్తమును జాగృత పరచుచున్నాడన్న అగస్త్య భగవానుడు,


  ప్రస్తుత శ్లోకములో అదే ఉగ్రత్వ-వీరత్వ స్వభావమును మరింత తెలియచేస్తూ,

 "నిత్య-అనిత్య,సత్య-అసత్య జ్ఞానమును అందించుచున్నాడు." పరమార్థ ప్రకాశత్వ పరమార్థమే మనము తెలుసుకొనబోవు శ్లోక మర్మము.

 శ్లోకము

 *******

 "బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాదిత్యవర్చశే

  "భాస్వతే" సర్వభక్షాయ" రౌద్రాయ వపుషే నమః ."

  భాస్వతే-వర్చసే అను పదములప్రయోగము 

పరమాత్మ   ప్రకాశత్వక పరమార్థ విశేషణములు.తేజసామపి తేజస్వి అనుగ్రహమే భాస్వత్వము-వివశ్వంతము.విస్తారముగా కాంతిని వ్యాపింపచేయుట.


 1. ప్రస్తుత శ్లోక భావగ్రహణమునకు ముందుగా మనము ఒక్కసారి,స్తోత్రములోని ఇంతకుముందు చెప్పుకొనిన,

 " ఏష బ్రహ్మాచ-విష్ణుశ్చ-శివ-స్కంద-ప్రజాపతిః

   మహేంద్రో ధనదః కాల యమః సోమః అపాంపతిః" శ్లోకములో,

 పరమాత్మను,

 నీవే బ్రహ్మవు,

 నీవే విష్ణువు

 నీవే శివుడవు అంటూ,

 సృష్టి-స్థితి-సంహార కార్య నిర్వాహక శక్తుల సంకేత నామములుగా /గౌణ నామములుగా పేర్కొనినారు.

  ప్రస్తుత శ్లోకములో సైతము,

 "బ్రహ్మేశానాచ్యుతేశాయ-సూర్యాదిత్య వర్చసే' అంటూ,బ్రహ్మ-ఈశానుడు-అచ్యుతుడు-ఈశుడు-సూర్యుడు-ఆదిత్యుడు" అంటూ అవే గౌణనామములను తిరిగి/మరల ప్రయోగించారు.


  వారు-వీరు ఒక్కరేనా అయితే మరల పదములను ప్రయోగించటములోని మర్మమేమిటి? అన్న సందేహము మనకు కలుగవచ్చును.

 విశ్వరచనా ప్రారంభదశలో సృష్టి-స్థితి-సంహార నిమిత్తము నియమించిన శక్తులు వారు.

 కాని,ప్రస్తుత శ్లోకమును గమనిస్తే,

 మంత్రపుష్పములో చెప్పినట్లు,

 " ఈశానస్సర్వ విద్యానాం-ఈశ్వరః  సర్వ భూతానాం" (వీరత్వము-ఉగ్రత్వము)

   బ్రహ్మాదిపతిః బ్రహ్మణోధిపతిః బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం' "

  ఓ పరమాత్మ! నీవు,

 1.ఈశానుడను గౌణ నామముతో సర్వవిద్యలకు అధిపతిగా నున్నావు.

 2.ఈశ్వరుడు అన్న గౌణ నామముతో సర్వభూతములను సృష్టిస్తున్నావు.

 3.అచ్యుత అన్న గౌణ నామముతో చ్యుతి /నాశము లేకుండా కాపాడుతున్నావు.

 4.బ్రహ్మము/పరబ్రహ్మము గా నీవు,నీవు సృజించిన బ్రహ్మకు-బ్రహ్మజ్ఞులకు శాసకునిగా కొనియాడబడుతున్నావు అని స్పష్టపరుస్తున్నది.

 మొదటి బ్రహ్మ శబ్దము నియామకమును సూచిస్తే-ప్రస్తుత శ్లోకములోని "బ్రహ్మ శబ్దము" నిర్వహణను సన్నుతిస్తున్నది.

 కనుకనే  లింగాష్టకము ,

 "బ్రహ్మమురారి సురార్చిత లింగం

  నిర్మ భాసిత శోభిత లింగం" అని శ్లాఘిస్తున్నది.


  " రౌద్రాయ వపుషే నమః-సర్వ భక్షకాయ నమః"

  రక్షణము-శిక్షణము-తత్క్షణము -లక్షణము-భక్షణము అన్న పదములలో కేవలము మొదటి అక్షరము మాత్రమే భేదము.క్షణికము అన్న పదమును కూడ మనము వింటుంటాము.అనగా సమయము/ కాలము ఒకటిగానే ఉంటుంది.కాని అదే సమయము కొందరికి సంతోషమును-మరికొందరికి విచారము,కొందరికి జ్ఞానము-మరికొందరికి అజ్ఞానము కర్మఫలితములను బట్టి కలిగిస్తుంటుంది.పరమాత్మ కర్మల-కర్మఫలముల సారమును అందించుటయే ఈ సర్వభక్షకత్వము.

 పరమాత్మ రౌద్ర ఆకారుడై /రౌద్ర ఆలోచన పరుడై సర్వభక్షణమును చేస్తాడని వాచ్యార్థము.

  ఇదే అభిప్రాయమును రుద్రనమకము 11 వ అనువాకములో,

 " యే అన్నేషు వివిధ్యంతి-పాత్రేషు పిబతో జనాన్" అంటూ,

 రుద్రుడు అనేకానేక రుద్రులను ఉత్పన్నముచేసి,వారిని ఆహారములోనికి-జలములోనికి,వాయువు లోనికి,ప్రవేశింపచేసి,అనారోగ్యమును-అజ్ఞానమును,అనుచిత క్రియలను జరిపిస్తున్నాడని కీర్తిస్తున్నది.అది సర్వ భక్షకత్వము  కాదా మనము వాతావరణకాలుష్యము-జల ఆహార అపరిశుభ్రత అంటూ అనుకునేది.సైతము సర్వభక్షకత్వమే.


 పంచభూతములసమతౌల్యత  లోపిస్తే సంభవించే,వాయుకాలుష్యము,జలకాలుష్యము,దావాగ్ని-బడబాగ్ని-పిడుగులు పడటం,వడగాలులు-వరదలు,అంటువ్యాధులు ఇవన్నీ పరమాత్మ సర్వభక్షకత్వమే.


  మానవ పరముగా అన్వయించుకుంటే పరమాత్మ,


 మనశైశవ దసను భక్షించి-బాల్యమునిస్తాడు.

 బాల్యమును భక్షించి యవ్వనమునిస్తాడు

 యవ్వనమును భక్షించి వార్ధక్యమునిస్తాడు

 వార్థక్యమును సైతము భక్షించి, అయ్యో,

 కాల స్వరూపుడై,మనము తప్పించుకోలేని,

 కాలపాశమువేసి మరణమును ఇస్తాడు.

  ఓ జీవా ! మనలో జరుగుచున్న శారీరక-మానసిక మార్పులే గురువులై 

 మనలో నిత్యానిత్య-సత్యాసత్య జ్ఞానమును కలిగించుచున్నవేళ, 


 తం సూర్యం ప్రణమామ్యం.





1.



Sunday, February 25, 2024

ADITYAHRDAYAM-SLOKAM-16


 


 




 ఆదిత్యహృదయము-శ్లోకము-16


 **********************


 ప్రార్థన


 ********


 జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం


 హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం


 అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం


 సకలభువన వంద్యం  భాస్కరం తం నమామి.

 పూర్వరంగము

 ***********

    సూర్యభగవానుని ఉదయాస్తమాన తూరుపు-పడమరదిక్కుల ప్రాశస్త్యమును, దినాధిపతిత్వమును-జ్ఞాన సంపత్తిని, పరమాత్మయొక్క,జయప్రదత్వమును-జయభద్రత్వమును స్తుతించిన అగస్త్యణగవానుడు,ప్రస్తుత శ్లోకములో ఉగ్ర/వీర స్వరూపమును,సారగ్రహణ స్వభావమును,మార్తండత్వమును(నాలుగు లక్షనములను) వివరించుచున్నారు.



 శ్లోకం

 ******


 " నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమోనమః


   నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమోనమః."


 ఉగ్రత్వమునకు-వీరత్వమునకు "నరసింహావతారమును " ప్రస్తావిస్తారు కొందరు ఉపాసకులు


.


 1.  సూర్యభగవానుడ-నీవు ఉగ్రుడవు-నీ ఉగ్రత్వమునకు నమస్కారములు.


 ఉగ్రత్వమంటే భయంకరముగా కనిపించటమా అనుకుంటే కాదు అని చెబుతున్నది సనాతనము.


 ఉత్ గ్రసతి  ఉగ్రం అంటున్నది సాహిత్యము.

 అన్నింటికిమించిన ఉన్నతస్థితి.అదియే పరమానందము/బ్రహ్మానందము.ఆ స్థితిని కలిగించువాడు ఉగ్రుడు

.కాదు కాదు,


 ఉత్కృష్టస్థితియే తానైన వాడు ఉగ్రుడు.ఇదే విషయమును రుద్రము సైతము,



 "నమః ఉగ్రాయచ-భీమాయచ" అని కీర్తిస్తున్నది.


  మనకంటే చాలా ఎత్తైన ఆకాశమునందుండి ,తనకిరణములచే మనలను అనుగ్రహించువాడు  ఉగ్రుడు.

.


 స్తంభమునుండి ప్రకటితమై  డింభకుని అనుగ్రహించిన వాడు ఉగ్రుడు

.


   తన శక్తిని తాపముగా మార్చి,సకల చేతనాచేతనములనుకార్యోన్ముఖులుగా మలచువాడు  ఉగ్రుడు.



  అంతర్యామిగా మనలో దాగి ప్రాణశక్తులను సమకూర్చువాడు ఉగ్రుడు.నమోనమః



2సూర్యభగవానుడ నీవువీరుడవు.నమోనమః


   ఉగ్రత్వము ఉపాధియైతే, సామూహికమైతే దానిని మరింత విశ్లేషించుటయే వీరత్వము.


  " వివిధం  ఈరయతి-ప్రేరయితి వీరం." 


 ఇంద్రియములను సమర్థవంతము చేయుట వీరము.


 ఉదాహరణ కు జలుబు చేసినప్పుడు మనము వాసనను పీల్చలేము. .కాని మనముక్కు మనదగ్గరేఉంటుండి.దానిలోని ఘ్రాణశక్తి వీరము.ముక్కును ఏర్పరుచుట (ఆకారము) ఉగ్రము.దానికి శ్వాస శక్తిని-ఆఘ్రణ శక్తిని అందించుట వీరము. 


   ఇదే విధముగా కోకిల మథుర గాత్రము,హంసలనడకలు,నెమలికినాట్యము,చిలుకకు పదములు ప్రత్యేకలే కదా.అవే వీరములు.


 మేథస్సును వ్యక్త పరచే ప్రక్రియయే  వీరము.


  ఇంద్రియ ప్రకాశకుడు వీరుడు.


 వేదమయుడు-వేదవిదుడు  వీరుడు.


 గరుత్మంతుడు వీరుడు.


 వినా ఈరతే-విష్ణుమూర్తి-పక్షివాహనుడు వీరుడు.


3.సూర్య భగవానుడు సారంగుడు.నమోనమః


   ' సారం  శీఘ్రం  గచ్ఛతి సారంగః"


   శీఘ్రముగా కదల/పరుగులు తీయగల సూర్యశక్తి/రశ్మిభావనము సారంగము.కొందరు లేడి యొక్క స్వభావముగా పరిగణిస్తారు.ఆ నామమును లేడికి వ్యవహరిస్తారు.పరమేశ్వరుడు సారంగధరుడు అని సంకీర్తిస్తారు.

.


 "సార గ్రహీత ఇతి సారంగ."


 సారమును గ్రహించకల శక్తియే సారంగము.


 భగవానుడు జలసారమును ఆవిరిగా గ్రహించి వర్షరూపములో శుభ్రపరచి అనుగ్రహిస్తాడు.ఇంద్రియముల సారములను గ్రహించి(నవవిధభక్తి రూపములో) బంధవిముక్తులను చేస్తాడు.


 కర్మల సారమును గ్రహించి-కర్మఫలితములను అనుభవించుటకు మనలను కాలము కొంతకాలము ధర్మముతోను-కొంతకాలము అధర్మముతోను జతకట్టిస్తుంది.మనలను తన సత్యమైన తోవ నుండి కొంతసమయము కలుపుకుంటూ-కొంత సమయము జారవిడుస్తూ ఉంటుంది.


  ఇదియే మనచే సారగ్రహణమును చేయించుట.ఆనిరంతర ఆవృత్తములలో(జగం మిథ్యా అన్న) ఉపాధి సత్యము/సారము ఎరుకపడుతుంది.




 ఖగోళము కాంతి సంవత్సరమని మనము భావించే సమయమును సౌరాగమనము/సారంగము అని అంటుంది.


 పద్మప్రబోధనాయ నమో నమః


 


  స్వామియొక్క  ఉగ్రత్వము-వీరత్వము-సారగత్వము ప్రత్యక్షముగా ముడుచుకొని యున్నపద్మములను వికసింపచేస్తుంది.అదియే అచేతనమైన జగత్తును జాగృతపరచు మార్తాండత్వము.పరోక్షము..


 అజ్ఞానమనే చీకటితో /తిమిరముతో ముకుళించుకు పోయిన జన్మచక్ర బంధితులకు ,జన్మరాహిత్యమును ప్రసాదించుటయే పద్మప్రబోధనము.


  బోధనము అనగా బుధ్ధిని వికసింపచేయుట.


 ప్ర బోధనము అనగా పూర్తిగా బుద్ధిని వికసింపచేయుట.



 ' యన్మండలం గూఢమతిప్రబోధం


   ధర్మస్యవృద్ధిం కురుతే జనానాం


   యత్ సర్వ పాపక్షయ కారణంచ


   పునాతుమాం తత్ సత్ వరేణ్యం".


      తం సూర్యం  ప్రణమామ్యహం.


 


Saturday, February 24, 2024

ADITYAHRDAYAM-SLOKAM-15


   ఆదిత్యహృదయం-శ్లోకం-15

  ***********************

 ప్రార్థన

 ******


 "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం

  తిమిర హిరణ పాప ద్వేష దుఃఖస్య నాసం

  అరుణ కిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం

  సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."

 పూర్వరంగము.

 ***********


 " తేజసామపి తేజస్వి"  మండల వాసియై  తన శక్తులచే నక్షత్రములను-తారలను-గ్రహములను-జ్యోతిర్గణములను 

నిర్మించి,వానిచే వెలువడుచున్న రశ్ములచే సకలభువన సాక్షియై,


 " ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కక్కడై  తోచుచు,

 ప్రస్తుత శ్లోకములో

  జయజయ ధ్వానములచే కీర్తింపబడుచున్నాడు.


 శ్లోకము

 ******

 " జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమోనమః

  నమోనమః సహస్రాంశో ఆదిత్యాయ నమోనమః"


   నమోనమః శబ్దమును మూడుసార్లు ప్రయోగించారు మహర్షి వాల్మీకి.కొంతమంది దీనిని పునరావృతముగా భావిస్తే త్రికరణములతో సమర్పించు నమస్కారముగా ఉపాసకులు భావిస్తారు.


 ప్రస్తుత శ్లోకము ఆదిమూర్తి యైన ఆదిత్యుని,

 1.జయప్రదునిగా

 2.జయభద్రునిగా

 3.సహస్రాంశునిగా

 4.హర్యశ్వనునిగా , పూజిస్తున్నది.


  హరితము పచ్చదనము అభిలషించు మనసును హర్యశ్వముగా,భావనచేస్తూ,అదియును అనేకానేకములు/సహస్రములు,పరమాత్మను ధ్యానిస్తే,జయములు ప్రాప్తిస్తాయి-ప్రాప్తించిన జయములు భద్రముగాఉంటాయి అంటూ,చతుర్విధ ఫలములైన/ధర్మార్థ కామమోక్షములను సంకేతిస్తారు.

  "యోగ-క్షేమం వహామి అహం' అంటుంది భగవద్గీత.

 " జయంతి అనేన ఇతి భక్తా సంసారేతి" జయాయా .నమామి.

 

1. తాను సృష్టించిన ప్రపంచ/సంసార దుఃఖములను దాటించి  (ప్లవంగ)సంసారసాగరమునకు ప్లవంగమై/పడవయై దాటించి,శాశ్వత ఆనంద ప్రాప్తిని కలిగించువాడు.జయభద్రుడు.

 జయాయ-జయభద్రాయ నమోనమః.

2.వేద మంత్రము చెప్పినట్లు,

 " భద్రం కరోభిః శృణుయాం దేవాం"

  సమస్తమునకు సత్వమునకు-సౌభాగ్యమునకు భద్రతను కలిగించువాడు ఆదిత్యుడు/జయప్రదుడు-జయభద్రుడు.

3.శ్రీరాముని పరముగా,

   జయుడు-విజయుడు

   భద్రుడు-సుభద్రుడు

   చండుడు-ప్రచండుడు

   ధాత-విధాత  స్వామి వికుంఠ ద్వారముల పరిరక్షకులు.

 జయ-విజయుల శాపమును తొలగించి,వారి వైకుంఠ ద్వారపాలక స్థానమును భద్రతగా నిలుపువాడు ఆదిత్యుడు.

4 తన రథ అశ్వములైన,

  " జయో జయశ్చ విజయ జితప్రాణో జితశృతిః

    మనోజవో-జితక్రోధో వాజినః సప్త కీర్తితః'

   తన ఏడు ప్రథాన కిరణ స్వరూపములుగా భాసిల్లే అశ్వముల నామధేయములతో,మనలను అనుగ్రహించువాడు ఆదిత్యుడు.

 జయాయ-జయభద్రాయ-హర్యశ్వాయ నమోనమః.

5హరితః-అశ్వః-హర్యశ్వః

  స్వామి రథ సప్తాశ్వములను నామములను ప్రకటించిన తరువాత వాటి స్వభావమును వివరిస్తున్నారు అగస్త్యభగవానుడు.

  హరిత-శుభప్రదములు-

  హరిత-పచ్చదనమును అందించునవి/పత్రహరితము

  హరిత--దోష హరనమును కలిగించు పరమాత్మ స్వభావము

  హరిత-శ్రీరామ చంద్రుని మేనిఛాయ/ఆశ్రిత వాత్సల్యము

  హరిత-స్థితికార్యమును నిర్వహించుసామర్థ్యము

  మిక్కిలి ముఖ్యమైన అన్వయము

 తాను స్థిరశక్తిగా /అంతర్యామిగా లోనుండి

 అశ్వభావనముతో/రశ్ములతో గమనమును చేయుచున్న ,

  హర్యశ్వాయ-నమోనమః.

     శ్రీరాముని పరముగా అన్వయించుకుంటే,

 హరి అనగా కోతి.హరి అనగా విష్ణువు.

 హరితానై-హరిని వాహనముగా కలిగిన(హనుమంతునికి వాహనసేవను అనుగ్రహించిన వాడు-కిష్కింథలో)


   జయాయ నమోనమః

   జయభద్రాయ నమోనమః

   హర్యశ్వాయ నమోనమః

   సహస్రాంశ నమోనమః

   ఆదిత్యాయ నమోనమః.

  అని నేలనాలుగు చెరగుల నమోవాకములతో కూడిన జయజయధ్వానములు మారుమ్రోగుచున్నవేళ,

 " తం సూర్యం  ప్రణమామ్యం."


  

 


Friday, February 23, 2024

ADITYAHRDAYAM-SLOKAM-14


 


 ఆదిత్యహృదయం-శ్లోకము-14

 *********************

 ప్రార్థన

 ********

"జయతు జయతు సూర్యం సప్త లోకైకదీపం

 హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం

 అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం

 సకలభువనవంద్యం భాస్కరం తం నమామి."


 పూర్వరంగము

 ***********

 ఏదీ అంటని ఆత్మస్వరూపమైన పరమాత్మ ఆదిత్యునిగా ఆకాశ నివాసియై,మండలము నుండి తన రశ్ములను భూమందలముపై 

ప్రసరింపచేయుటకు నక్షత్రములను-తారలను-గ్రహములను కొన్ని పరికరములను ఏర్పరచి,తాను అంతర్యామియై వానిలో ప్రవేశించి,పన్నెందు విభాగములుగా కాలమును,పది ఇంద్రియములు బుద్ధి-మనసు అను విభాగములను చేతనులలో ఏర్పాటుచేసిన విధానమును 

వివరించిన,అగస్త్య భగవానుడు "కవి" గా          స్వామి ప్రపంచ కల్పనాచాతుర్యమును కన్నులముందుంచిన తరువాత,

 ప్రస్తుత శ్లోకములో స్వామి ఉదయాస్తమాన ప్రక్రియను ప్రశంసిస్తున్నారు.


  శ్లోకము.

  *****

 " నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః

   జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః."


  తూరుపు దిక్కును తన రశ్ములచే ప్రకటింపచేసినసూర్యునకు నమస్కారములు.

 ( పశ్చిన దిక్కును చేరి మరొక ప్రదేశములో తన రశ్ములచే ఉదయిస్తూ తూరుపుదిక్కుగా ప్రకాశిస్తున్న) పశ్చిమ అద్రిపై వాలుచున్న  సూర్యునకు నమస్కారములు.


" దర్శయేత్- న దర్శయేత్ అన్నది వాస్తవము.

 న ఉదయతి-నాస్తమితి అన్నది సత్యము."


 వస్తుప్రపంచము అనుభవించునది వాస్తవము కాని అది సత్యము కాదు.



 మార్పు కలది వాస్తవము-మార్పు లేనిది సత్యము.


   పరమాత్మ ప్రకాశము తనచుట్టు తాను తిరుగుచుండు భూమి గ్రహణమును బట్టి దివారాత్రములు అన్నది వైజ్ఞానికము

.

 "స్వామి పగటిపూట అగ్ని నుండి తన శక్తిని స్వీకరించి,అస్తమాన సమయము నుండి ఉదయించు సమయము వరకు తిరిగి అగ్నిలో తన తేజస్సును నిక్షిప్త పరుస్తాడనికూడా భావిస్తారు."


 దాని ఫలితమే సౌరశక్తి రాత్రివేళల యందు  చంద్రకళల ద్వారా ఔషధ శక్తిని ఉత్పత్తి చేసుకుంటుంది.



 పరమాత్మ తన రశ్ములను పగటి పూట ఆహార ఉత్పత్తికి-రాత్రివేళల యందు ఔషధ ఉత్పత్తికి అనుగుణముగా అనుగ్రహిస్తుంటాడు."నమోస్తుతే."

  సనాతనము "గిరులు" అన్న పదమునకు వాక్కులు/వేదములు అనికూడ అన్వయిస్తుంటుంది.

  పూర్వాయ గిరయే-ఎప్పుడు పుట్టిందో చెప్పలేని,అపౌరుషేయములైన వేదములు/దివ్యశబ్దములు గిరులు.(ఆకాసమునకు శబ్దము తన్మాత్ర కనుక సహజమే.)


 వాక్కుల ద్వారాచేతనమైన లోకములు,మద్యాహ్న సమయమునకు కార్యరూపమును దాల్చి /గమనము చేసి /అస్తమాన సమయమునకు అద్రి (గమ్యమును) చేరుతాయి/అంటే,

 ప్రయత్నములు ఫలితములను పొందుతాయి.అనిచెబుతారు.

  అద్రి అగ్రస్థానము అన్న అర్థమును స్వీకరిస్తే ,

 ముముక్షువులు ముక్తపురుషులవుతారు.వారే 

 "జ్యోతిర్గణములు"వారికి ఆ స్థానమును/స్థితిని అందించు పరమాత్మ

 "జ్యోతిర్గణానాంపతి"

 ఇది ఒకభావనయైతే ఆకాశములోని ఉల్కలు-తోకచుక్కలు,పాలపుంతలు తదితర ఖగోళ ప్రకాసములు కూడ జ్యోతిర్గణములే.

  వేదములనే తూరుపు దిక్కున ఉదయొస్తున్న రశ్మిమంతుడు లోకానుగ్రహమునకై ఉపనిషత్తులనే (సులభగ్రాహ్యమనే ) బ్రహ్మజ్ఞానమును అందించుచున్నాడు.

 అలసతకు-విశ్రాంతి

 వేడిమికి-చల్లదనము

 ఆహారమునకు-ఆరోగ్యము

 అజ్ఞానమునకు-జ్ఞానము

   కలిగించుటయే దినాధిపతి అనుగ్రహము.

 దినము అంటే,

 

 అసతోమ- సత్ గమయ

 తమసోమ-జ్యోతిః గమయ

 మృత్యోర్మ-అమృతం గమయ

 పరమాత్మ నన్ను,

 

 అసత్యము నుండి(వాస్తవము) సత్యము వైపునకు

 తమసోమ-చీకటి నుండి(అజ్ఞానము)-జ్యోతివైపునకు (జ్ఞానము)

 మృత్యోర్మ-ఉపాధి నైజమునుండి-అమృతం గమయ

   అమృతత్త్వము వైపునకు,

 దినాధిపతివై నీ రశ్ముల అనుగ్రహముతో నడిపించుము,అని మనకు తెలియచేయుచున్నవేళ,

 "తం  సూర్యం ప్రణమామ్యహం."





 



Thursday, February 22, 2024

ADITYAHRDAYAM-SLOKAM-13

  


 ఆదిత్య హ్రదయం-శ్లోకం-13

 ***********************

  ప్రార్థన

  *********

 " జయతుజయతు సూర్యం సప్తలోకైకదీపం

   హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం

   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం

   సకల భువన వంద్యం  భాస్కరం తం నమామి."

  పూర్వరంగము

  **********

 ఆతపీ మందల మధ్యస్థునిగా పరమాత్మను ప్రశంస్తూ,స్వామి విశ్వరచనా దక్షతను ఉత్తర-దక్షిణ అయన మార్గ సంచారమును వివరించిన,మహర్షి,

  ప్రస్తుత శ్లోకములో స్వామివిశ్వర రచనా వైభవమును,తన పర-వ్యూహ-విభవ-అర్చా-అంతర్యామి స్వభావ మును లోకవిదితము చేయుచున్నారు.

 శ్లోకము

 *******

 'నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః

  తేజసామపి తేజస్వి "ద్వాదశాత్మం నమోస్తుతే".



  ప్రస్తుత శ్లోకము నమోస్తుతే ఓ ద్వాదశాత్మన్ అంటూ, సూర్యభగవానుడు తన శక్తులను పన్నెండు విభాగములుగా ఏర్పరచి /వ్యూహరచనను చేసి,తద్వారా తన విభవమే సమస్తముగా మలచి,వానిలో తాను అంతర్యామియై,ప్రత్యక్ష అర్చనమునకు అనుగ్రహిస్తూ,అర్చామూర్తియై ఆరాదహనలను అనునిత్యము గ్రహిస్తూ,మనలను అనుగ్రహిస్తున్నాడు.


 అనుసరిస్తూ,గ్రహించే అంతరిక్ష శరీరధారులే గ్రహములు.గోళాకారమును కలిగిన తొమ్మిది ముఖ్యగ్రహములు సూర్యలేక ఇతర నక్షత్ర కేంద్రకములుగా బరువును-గురుత్వాన్ని(ఆకర్షణ శక్తిని పొందుతూ,ఒక నిర్ణీత క్రమములో భ్రమిస్తూ,భూమి తన చుట్టు తాను తిరుగుతూ,సూర్యుని చుట్టు తిరుగుటకు సహాయపడుతుంటాయి.


 సామాన్య వ్యవహారములో,నక్షత్రములు-తారలు సమానార్థక పదములుగా వ్యవహరిస్తున్నప్పటికిని,ఖగోళ విజ్ఞానము,వాటి మధ్యనున్న భేదమును స్పష్టీకరించినది.

 అనేక నక్షత్రములున్నవని భావిస్తున్నప్పటికిని,అశ్వని-భరణిమొదలగు 27 నక్షత్రములు స్వయంప్రకాశములుగా ,

 'తేజాసామపి తేజస్వి" అని పరమాత్మను ప్రస్తుతిస్తున్నాయి.

  నక్షత్రము దివారాత్రములు ప్రకాశిస్తూనేఉంటాయి,కాని,

 తారల ప్రకాశము సూర్య ప్రకాశముచే కప్పివేయబడుతుంది.

 ఖగోళములో పరమాత్మ నక్షత్ర స్వరూపములలో-తారల స్వరూపములలో-గ్రహములస్వరూపములలో,అంతర్యామిగా ఉండిభువనభాండములను సమన్వయపరుస్తున్నాడు.

 సంవత్సర కాలములో మాసములు అను పన్నెండు విభాగములలో ప్రత్యేక సౌరశక్తి స్వరూపములే ద్వాదశాదిత్యులు.

 అవి ఒకదానికి మరొకటి అనుసంధానముగా తనచుట్టునున్న సహాయక శక్తులను మలచుకుంటూ సమర్థవంతముగా పాలించుచున్నవేళ,

 ' యన్మండలం జ్ఞానఘనం త్వ గణ్యం

   త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపం

   "సమస్త తేజోమయ దివ్యరూపం

    పునాతు మాం తత్ సత్ వరేణ్యం"

   

 " తం సూర్యంప్రణమామ్యహం."



    



Wednesday, February 21, 2024

ADITYAHRDAYAM-SLOKAM-12


  




   ఆదిత్యహృదయము-శ్లోకము-12


   **********************




   ప్రార్థన


   ******


 "జయతు జయతు సూర్యం- సప్తలోకైకదీపం


  హిరణ సమిత పాపద్వేష దుఃఖస్య నాశం


  అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యవర్ణం


  సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."


 పూర్వరంగము


 **********


 ఆకాశాధిపతి ప్లవంగము( దక్షిణదిశ వైపునకు)వలెదుముకుతూ,వేదవేద్యుడై,వేదపూజ్యుడై,కరుణ నిండిన కరిమబ్బులతో వర్షములను గురిపిస్తూ,జలములను సమృద్ధి పరచుచున్నాడన్న,అగస్త్యుడు,


 ప్రస్తుత శ్లోకములో సూర్యమండలమును సంకీర్తిస్తూ,పరమాత్మ పింగళ వర్ణుడై ఉత్తరాభిముఖుడై,ఉత్తర దిశగా తన గమనమును సాగిస్తూ,అనురక్తితో విశ్వ నిర్మాణమును స్థితి సంహారములను గావిస్తున్నాడో వివరిస్తున్నారు. అదియే మండల విన్యాసము.సామూహిక శక్తుల సమన్వయము.


 శ్లోకము


 ******


 " ఆతపీ మండలీ మృత్యుః పింగళః  సర్వ తాపనః


   కవిః విశ్వో మహాతేజః రక్త సర్వ భవోద్భవః."


  భవిష్యోత్తర పురాణము శ్రీకృష్ణార్జున సంవాదముగా,


 " యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం


   ఉత్పత్తి రక్ష ప్రళయ ప్రగల్భం


   యస్మిన్ జగత్ సంహర లేఖనంచ


   'పునాతుమాం తత్ సత్ వరేణ్యం"


 అంటూ ప్రస్తుతించింది.


   పరమాత్మను మాతృమూర్తిగా అన్వయించుకుంటే,


 'భాను మండల మధ్యస్థా భైరవి భగమాలిని ' అని ప్రస్తుతిస్తున్నది.


  


  మండలం  అంటే ఏమిటి?


 1."ఋగ్వేదము" పునారావృత్త పనివిభాగ నిర్మాణమును మండలం అని నిర్వచిస్తోంది.


 2. భౌగోళిక శాస్త్రము,


   దక్షిణ కక్ష్యనుండి  ఉత్తర కక్ష్యవైపునకు-ఉత్తర కక్ష్యనుండి దక్షిణకక్ష్య వైపునకు ఆవృత్తమగు 12 సూర్యశక్తుల సమన్వయము(ద్వాదశాదిత్యులు) మండలము అనిచెబుతుంది.


 3.రేఖాశాస్త్రము,


 దేవతాశక్తి నివాసమును కేంద్రీకరించు వృత్తాకార బింబమును మండలము అంటుంది.


 4.ఉపాసన పరముగా 40 రోజుల ఆధ్యాత్మిక పయనము మండలమని పరిగణించబడుతున్నది.


 5.స్థూలగా విశ్వము-సూక్ష్మముగా జ్ఞానము పొందిన మనసు "మండలములే."


 ప్రస్తుత శ్లోకము,


 "ఆతపీ మండల" అన్న శబ్దముతో ప్రారంభమగుతున్నది.


 ఆ-సమస్తాత్ అన్న అని అర్థముచేసుకుంటే,


 సర్వమును తపించచేసే ,ఘర్మ (స్వేదము) సర్జన కిరణ ప్రసరణ

 ప్రభావమే "ఆతపీ మందలం"


 ఉపాసన పరముగా అన్వయించుకుంటే,


 సకల తాపసుల తపశ్శక్తి కేంద్రమే "ఆతపీమండలము"


  వేద పరముగా అన్వయించుకుంటే ఛందోశాస్త్ర

 సమ్మేళనమే "ఆతపీ మందలము"




 " కవయః క్రాంతదర్శనః "అన్నది నానుడి..


 క్రాంతము అంటే మార్గమును.మార్గమునువేయువాడు/మార్గమును చూపువాడు కవి.


 పరమాత్మ సూర్యునిగా విశ్వమునకు సృష్టి -స్థితి-సంహారము అను పనులకు ఖగోళమునుండు-భూగోళము వరకు తనకిరణములను వ్యాపింపచేస్తూ,మార్గములను వేస్తున్నాడు.


 విశ్వం-విష్ణుం అంటూ తానే విశ్వమై తన రశ్ములను మార్గములద్వారా పరిపాలిస్తున్నాడు.


 కవులు అనగా మరొక అర్థము మంత్రములు.శబ్దమును సూక్ష్మీకరించి,మంత్రముగా మార్చి,ఆత్మజ్ఞానమును పొందుటకు మంత్రమను మార్గమును చూపుతున్నాడు కనుక పరమాత్మకవి.


 ప్రకృతి యొక్క జాగ్రదావస్థయే విశ్వము.దానిని దర్శించుతకు రశ్ములను మార్గములను చూపువాడు కనుక ఆదిత్యుడు 'కవి."

 పింగల శబ్దము,

 " అసౌ తామ్రౌ-అరుణౌ-పింగలః" అని వర్ణభావముతో ప్రస్తుతిస్తుంతే,

 నాడీ వ్యవస్థ ఇడ-పింగళ నాడిగా గౌరవిస్తుంది.


  మృత్యు శబ్దము సర్వతాపములను నశింపచేస్తున్నది/సర్వమును తపింపచేస్తున్నది.


 స్వామి పింగళ  వర్ణుడై సకలమును తపింపచేస్తాడు.పింగళ నాడియై సకలమును జీవింపచేస్తాడు.


 రక్త శబ్దము రాగమునకు/అనురాగమునకు ప్రతీక.


 సూర్య భగవానుడు రాగరంజితుడై సమస్తమును తాపమునుండి రక్షిస్తాడు.



 అనురాగముతో సర్వమును ఉద్భవింపచేస్తాడు సర్వ భవోద్భవుడు.


 మహా తేజస్సుతో విశ్వమును దర్శింపచేస్తాడు.


 సర్వమును అచేతనము చేస్తాడు.


 పంచకృత్యములకు తాను మార్గదర్శి,


 " బ్రహ్మజ్యోతి-శృతి నికర ఘనీభవుడైన ' ఆదిత్యుని అగస్త్యుడు ,రాముని ప్రార్థించుమని ఉపదేశించిన న వేళ,


 తం సూర్యం  ప్రణమామ్యహం.





  



Tuesday, February 20, 2024

ADITYAHRDAYAM-SLOKAM-11


  




 ఆదిత్యహృదయము-శ్లోకము-11


 ********************


 ప్రార్థన


 *******


 "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం


  హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం


  అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం


  సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."


 పూర్వరంగము

 *********



 పరమాత్మ హిరణ్యగర్భునిగా,తన తేజస్సుతో అగ్నిగర్భుడై,రవి యై తపమును కలిగిస్తూ,శిశిరమును తొలగిస్తున్నాడు.అంటే ఘర్మసర్జన కిరణములతో శబ్దస్వరూపునిగా ప్రకాశిస్తున్నాడన్న అగస్త్యుడు,


 ప్రస్తుత శ్లోకములో ఆ శబ్ద వైశిష్ట్యమును-జలతత్త్వమును-దక్షిణాపథ గమనమును ,విజ్ఞానప్రదాత్వమును స్పష్టముగా తెలియచేస్తున్నాడు.


 శ్లోకము


 *****


 " వ్యోమనాథః తమోభేది ఋగ్యజుసామ పారగః


   ఘనవృష్టిః అపాం మిత్రో  వింధ్యవీధి ప్లవంగమః"



  స్వామి వ్యోమ వాసియై తన రశ్ములచే చీకట్లను తొలగించువాడు.ఇది వాచికము.


  స్వామి ఆత్మస్వరూపియై తన జ్ఞానముచే అజ్ఞానమును పారద్రోలువాడు.


   స్వామి త్రయీమూర్తిం వేదం అన్న ఆర్యోక్తిని నిజముచేస్తూ ,సుప్రభాత సమయమున ఋగ్వేదముగాను

-మద్యాహ్న సమయమున యజుర్వేదముగాను -అస్తమాన సమయముబ సామవేదముగాను,మూడువేదములచే  సంస్తుతింపబడుతున్నాడు.


 వేదములను ద్రష్టించిన మహానుభావులున్నారు కాని సృష్టించినవారు లేరు.


 విత్ అను ధాతువు నుండి వేదము అను శబ్దము జ్ఞాన సూచికగా వెలువడినది.కనుక్జనే అవి అపౌరుషేయములు.స్వయంసిద్ధములు కనుక ఆమ్నాయములు.శ్రవణముచే అభ్యసించవలసినవి కనుక శ్రుతులు.


 ఋగ్వేదమునకు  -ఆయుర్వేదము ఉపవేదముగాను


 యజుర్వేదమునకు -ధనుర్వేదము ఉపవేదముగాను


 సామవేదమునకు-గాంధర్వ వేదము ఉపవేదముగాను కీర్తింపబడుతున్నాయి.


 ఆదిత్యుడు  ఆకాశనివాసి. ఆత్మ నివాసి.           ఆకాశమునకు శబ్దము గుణకము./తన్మాత్ర.


 ఆకాశనివాసి/ఏమీ అంటని  ఆత్మస్వరూపమైన ఆదిత్యుడు శబ్దప్రధానమైన వేదవేద్యుడు.ఆ దివ్యశబ్దములు మానవ కర్ణములు వినలేవు.మహా తపసంపన్నులు మాత్రమే దర్శిస్తూ-వినగలరు.కనుకనే అవి మహామంత్రములు.(గాయత్రీ మహా మంత్రము.)


 " ఆకాశం  శరీరం బ్రహ్మం" అన్నది ఆర్యోక్తి.

  ఆ-సమస్తాత్-కాశం-ప్రకాసం



   అది శబ్దబ్రహ్మ స్వరూపము కూడా.


 కనుకనే విష్ణుసహస్రనామ స్తోత్రము,


 'వేదో వేద విదవ్యంగో వేదాంతో వేదవిత్కవిః" అని శ్లాఘిస్తున్నది.


 " అనంతా  వై వేదాః" 


 వాటిని అర్థము చేసుకొనుటకు,ఇంద్రియజ్ఞానము సరిపోదు.


 ప్రత్యక్ష-అపరోక్ష-పరోక్ష జ్ఞానములు సరిపోవు.


 అథోక్షజ-అప్రాకృత విజ్ఞానమే వేదమును తెలిసికొనగలదు.


 


  మన ఇంద్రియములతో గ్రహించుతకు వీలుకానిది అథోక్షజ జ్ఞానము.


 పరమాత్మ అగోచరుడు కనుక అథోక్షజుడు.


 ప్రకృతికి అతీతుడు కనుక అప్రాకృతజ్ఞానులు మాత్రమే శబ్దమును-రూపమును గ్రహించగలరు.



 మొదటిపాదములో జ్ఞానభాస్కరుని దర్శింపచేసిన అగస్త్యమహాముని,రెండవ పాదములో,


 అపాం మిత్రునిగా/జలమునకు అథిపతిగా కీర్తించుచున్నాడు.


 ఘనవృష్టి అనగా గొప్పవర్షము/మేఘములనుండి వచ్చు జలసర్జన కిరణముల ప్రభావము.ఆదిత్యుని దక్షిణాయన పయనము.


  ఆదిత్యుడు,


 వియత్వీధిలో/వింధ్యవీధిలో ( ఆకాశవీధిని వింధ్యవీధి అనికూడ అంటారు)


 జలసమృద్ధిని ఏర్పరచుటకై,దక్షిణాయన కాలములో-దక్షిణాపథము వైపునకు,


 'నిమిషార్థే నైకేన ద్వేచ శతే-ద్వేచ సహస్రే"  -అంటూ,


 కనురెప్పవేయు సగకాలములో,


2200యోజనములవిస్తీర్ణమును -ప్లవంగము వలె (కోతివలె)దుముకుతు  విస్తరిస్తూ,జలసర్జన కిరణములను విస్తరింపచేస్తూ,       జలసమృద్ధిని కలిగిస్తాడు అని ఆదిత్యవైభవమును వినుతించుచున్న వేళ,


 " తం సూర్యం  ప్రణమామ్యహం."






Monday, February 19, 2024

ADITYAHRDAYAM-SLOKAM-10

  




   ఆదిత్యహృదయం-శ్లోకము-10


   ********************


 ప్రార్థన



 *****


" జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం


  హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం


  అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం


  సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."




  పూర్వరంగము


  ***********


 పరమాత్మ హరిత గుఋరములను-రథమును-సప్తశబ్ద ప్రాభవమును తెలియచేసిన అగస్త్యమహాముని,పరోక్షముగా మనకు-ప్రత్యక్షముగా రామచంద్రునికి,ప్రస్తుత శ్లోకములో ద్వంద్వ విభాగములను-శాశ్వతత్త్వమును వివరిస్తూ,స్వామి ఏ విధముగా తన ప్రచండత్వమును-ప్రసన్నత్వమును అనుగ్రహిస్తూ,లోకరక్షనము గావిస్తున్నాడో వివరిస్తున్నారు.


  ఋగ్వేదము-వాల్మీకి రామాయనము-ఆదిత్యహృదయము పరమాత్మ ప్రాభవమును మానవులకు అర్థమయ్యే విధముగా సులభతరము చేసి ,చైతన్యవంతము చేస్తున్నది.




 శ్లోకము


 ******


 " హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః


   అగ్నిగర్భో దితేపుత్రః శంఖః శిశిరనాసనః"


   రిగ్వేడము స్తుతించినట్లు పరమాత్మ,


1హిరణ్యగర్భుడు-అగ్నిగర్భుడు.


  ************************


  హితము-రమణీయము హిరణ్యము.ఇక్కడ హిరణ్యగర్భపదమును అంతః-బహిశ్చ యత్ సర్వం కింద భావిస్తే,


  " హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పటిరేక ఆసీత్"


 "హిరణ్యగర్భ సూక్తము-ఋగ్వేదము" 


  విశ్వము యొక్క బీజము పరమాత్మ.


  గోప్త్యతను సూచించు పదము గర్భము.అంటే,


 


 తనలో మనము-మనలో తాను


 ***************************


 ఇదియే బృహత్వము.పరమాత్మను మించినది ఏదీలేదు అనుకుంటే,


 బృంహణత్వము

 దానిలోని చైతన్యము "అగ్నిగర్భ" నామము.



 " అగ్నిమీలే పురోహితం యజ్ఞస్యదేవం ఋత్విజం

   అగ్నిః పూర్వేభిః ఋషిభిః లిద్యో నూతనైః ఉతా సదేవా ఏవా'" అగ్నిసూక్తము-ఋగ్వేదము.

 పరబ్రహ్మ నిత్యనూతనము-శాశ్వతము,






2.రెండవ విశేషము 


  ఆదిత్యుడు తన హిమసర్జనకిరణములతో శిశిరమును,


  ఘర్మ సర్జన కిరణములతో తాపమును కలిగిస్తాడు.


 అదియును తగినంత మోతాదులో/తగినంత సమయము వరకు.


 శిశిరము ఆయనే-శిశిరనాశకుడు ఆయనే


 తాపము ఆయనే-తాప నాసకుడు ఆయనే.


  ఆ దివ్య చైతన్యమే తనకు తానుగా హెచ్చుతగ్గులతో ప్రతి ఉదయము వెలుగు-వేడిని విస్తరింపచేయుచు,మధ్యాహ్న సమయములో మరింత ప్రచండుడై-అస్తమాన సమయమునకు ప్రసన్నత్వమును ప్రకటిస్తాడు.


3.భాస్కరో-రవిః/ప్రకాశము-ప్రణవము.


  ************************************


 తనకిరణములనే కరములతో భా  కాంతిని/జ్ఞానమును ప్రసాదించువాడు.


 తన నాదముతో ర రవమును వి విస్తారముగా చేయువాడు.అదియే కదా" వేదోత్పత్తి."


4.దితేపుత్రః-విభజింపబడిన శక్తులచే/రశ్ములచే పాలించువాడు.


 అదితే పుత్ర-ఆకాశమునుండి ప్రకటనమగు అఖండుడు.



5.శంఖః


  *******


  ఖ అను అక్షరం ఆకాశ్ అము అను అర్థమునే కాక లోతైనది/కనుగొనలేనిది అని అనుకుంటే,


 ప్రథ్వీ తత్త్వమునకు కూడ అన్వయిస్తుంది.


 దాని ఉదాహరనయే మనము జరిపించే,


 "శంఖ స్థాపనము" భూమినిలోతుగా తవ్వుట,ఆకాశపు లోతును అంచనా వేయుట అసాధ్యమే.


 ఆకాశమునుండి(లోపల నుండి-భూమి లోతునకు) తనకిరణములను ప్రసరింపచేస్తూ,శుభములనొసగువాడు " శంఖః"


 గొలుసు కట్టుగా చూస్తే,


 హిరణ్యగర్భ నుండి-అగ్నిగర్భ,


 అగ్నిగర్భనుండి-భాస్కర


 భాస్కర నుండి తపనః


 తపనః నుండి శిశిరః,మాంద్యమును తొలగించుటకై


 శిశిర నుండి శిశిర నాశనః,


 అన్నీ తానైన పరమాత్మ అన్నివేలలో అన్నీ స్వీకరిస్తూ సమస్తమునకు అనుకూలముగా మారుస్తూ,తగినంత అందిస్తూ,శుభకరుడగుచున్నవేళ,


 ' తం  సూర్యం  ప్రణమామ్యహం."


Sunday, February 18, 2024

ADITYAHRDAYAM-SLOKAM-09

 


  ఆదిత్యహృదయం-శ్లోకము-09

   *********************

 ప్రార్థన

 ******

 ' జయతు  జయతు సూర్యం-సర్వ లోకైకదీపం

   హిరణ సమిత పాపద్వేష దుఃఖస్యనాశం

   అరుణకిరణ గమ్యం ఆదిం  ఆదిత్యమూర్తిం

   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."


  పూర్వ రంగము

  ***********

  రశ్మిమంతుడు లోకరక్షణావిధానమునకై కొన్ని శక్తులను-వాటికి సహాయకారులగు మరికొన్ని బృందశక్తులను తన కిరణముల ద్వారా ప్రసరనముచేస్తూ,వాయు-వహ్ని రూపములతో తాను ప్రాణశక్తిగా ప్రకాశించుచున్నాడు.

  ప్రస్తుత శ్లోకము 'మరీచిమాన్" అన్న ,

 మారయతి యత్ మరీచి అంటు,సంహారము చేసే శక్తి మరీచి అని,అందులో శ్రేష్ఠుడు కనుక మరీచిమాన్ అంటూ సంహారకుడు కూడా సూరెయశక్తియే అని స్తుతిస్తున్నది.

 శ్లోకము.

 ******

 " హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిః మరీచిమాన్

   త్మిరః ఉన్మథనః శంభుః త్వష్టా మార్తాండ-అంశుమాన్"


   


  పరమాత్మ మార్తాండుడు.ఈ శబ్దమును రెండు విధములుగా అలంకారికులు అన్వయిస్తారు.

అదితి తన గర్భములో పెరుగుతున్న పరమాత్మను స్తుతిస్తూ,ఉపవాసాది నియమనిష్ఠల వలన,నీరసమైన వేళ,కశ్యపుడు ఆమెను నీ ఉపవాసములతో పిండమును చంపేస్తావా అనగానే పిండము నేలజారినదని,(అచేతనమైనదని) దానికి సమాధానముగా అదితి తన శిశువు మృతమును అమృతముచేయువాడే కానే,మృటుడు కాదని సమాధానపరచినదని చెబుతారు.ఇది కథనము.

  సర్వము సమానమైనవేళ (మృతమైనవేళ) పరమాత్మ రశ్మి భావనతో మార్తాండమైన ,

 అంశువులతో కిరణములతో సజీవులను చేస్తున్నాడు కనుక మార్తాండాంశుమాన్-నమో నమః.

 హరిత-అశ్వః-హరిదశ్వః

 ***************

 హరిదాగినదే హరితము.

 1.హరించు శక్తియే-హరి.

  చీకట్లను హరించునది-పాపములను హరించునది-అజ్ఞానమును హరించునది-మాంద్యమును/జడత్వమును హరించునది -హరితము.

 2 సప్తసప్తి

   *******

  ఇది  స్వామి వాహనము/ సూర్యరథము.ఏకచక్రము.ఏక ఆశ్వము.ఒకే ఆశ్వము ఏదుగా భావింపచేయునది.ఇది సంకేతికపదము.

1.కాంతి పరముగా-ఒకే వర్ణము సప్తవర్ణములుగా ప్రకటింపబడుట.

2.కాల పరముగా-ఒకే కాలము ఏడు వారములుగా పరిగణింపబడుట

3.ఒకే ఉపాధిలో-ఏడు ధాతువులు కలిసియుండుట.

 స్వామి సప్తాశ్వరూఢుడై,

 ఉన్మథనః-తొలగించుచున్నాడు/పారద్రోలుచున్నాడు,


4త్వష్టా-తొలచువాడు-మలచువాడు,చీకటివెలుగుల మిశ్రమము నుండి చీకట్లనుతొలగించి,వెలుగును ప్రకాశింపచేయువాడు,

 తిమిర-ఉన్మథనః-చీకట్లను పారద్రోలి,కాంతులను వెదజల్లుచున్నాడు కనుకశుభములను కలిగించుచున్నాడు-శంభునిగా ప్రస్తుతింపబడుతున్నాడు.

  కనుకనే,

"దీపం జ్యోయి పరబ్రహ్మ"

  అంటూ,పరంజ్యోతికి ప్రతీకగా దీపప్రజ్వలనమును చేసుకుంటున్నాము అని అగస్త్యమహాముని-రామచంద్రుని ప్రత్యక్షముగాను,మనకు పరోక్షముగాను వివరించువేళ,

 "తం సూర్యం ప్రణమామ్యహం." 

Saturday, February 17, 2024

ADITYAHRDAYAM-SLOKAMU-08


 


   ఆదిత్యహృదయం-శ్లోకము-08

   *******************

 ప్రార్థన

 *****

 "జయతు జయతు సూర్యం-సప్తలోకైదీపం

  హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం

  అరుణకిరనగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం

  సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."


  పూర్వరంగము

  *********


   పరమాత్మ రశ్మిభావనతో సముద్యంతుడై సకల చరాచరములను సృష్టించి-పోషించుటకు తన నుండి వివిధ శక్తివంతములైన కిరనములను ప్రసరింపచేస్తూ,వానికి సంకేత నామములను అనుగ్రహించి,మరికొన్ని సహాయక బృంద సక్తులను వాటికి ఏర్పరచి,తాను "వాయుర్వహ్ని ప్రజారూప" గా పరిఢవిల్లుతున్నాడన్న భగవాన్ అగస్త్యుడు,

  ప్రస్తుత శ్లోకములో ఏ విధముగా ,

 అంతర్బహిశ్చ యత్సర్వం వ్యాప నారాయణో హరిః అన్నట్లుగా హిరణ్యగర్భుడై విరాజిల్లుతూ,అనేకానేక దివ్యశక్తులను వెదజల్లుతున్నాడన్న అనుగ్రహమును అనేకానేక సాంకేతిక నామములో సంకీర్తిస్తున్నాడు.


 శ్లోకము

 ******

 "ఆదిత్య సవితా సూర్యః ఖగ పూషా గభస్తిమాన్

  సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా  దివాకరః."

  ప్రస్తుత శ్లోకము స్వామి అనుగ్రహిస్తున్న శక్తుల సామర్థ్యమునకు సంకేత నామములే.

 పరమాత్మ,

 1.ఆదిత్యుడు

 2.సవిత్రుడు

 3.సూర్యుడు

 4.ఖగుడు

 5.పూషుడు

 6.గభస్త్మానుడు

 7.సువర్ణసదృశుడు

 8భానుడు

 9.హిరణ్యరేతస్కుడు

 10.దివాకరుడు.

   అను పది నామములు పరమాత్మ తన కరములనే కిరనములతో ఏ విధముగా మనలను అనుగ్రహిస్తున్నాడో తెలియచేస్తున్నవి.


 సాంబుని అనుగ్రహించిన పరమాత్మ అనుగ్రహము మనందరిపై ప్రసరింపచేయమని ప్రార్థిస్తూ,

 త్వం మాతా-త్వంశరణం

 త్వం-పితా-త్వం రక్షణం అనిపిస్తున్నది.

 మాతాచ-పితాచ అనగా పితరో శబ్దముతో 

 'పితరో -విసువసాధ్య" శ్లోకములో సూచించారు.

 స్వామి,

1. ఆదిత్యుడు

    అనగా,

 అఖండుడు-ఆత్మస్వరూపుడు-ఆహారమును తాను తినుచు-మనచే తినిపించువాడు,ఆకాస స్వరూపుడు-ఆకాశగమనముకలవాడు-మొదలు తానైనవాడు.

  అఖండిదైన పరమాత్మ తన శక్తులను వర్గీకరించి,ఖండుడుగాను పరిపాలిస్తున్నాడు.అదేకదా,

 బ్రహ్మేశానాచ్త్యుత విభాగము.

  ఈ అనుగ్రహమునే,లక్ష్మీ అష్టోత్తరము,

 అదితై నమః-దితై నమః-దీప్తయి నమః అని ,బ్రహ్మ-విష్ణు-శివాత్మిక అని స్తుతిస్తున్నది.


2.సవిత్రుడు

  ******

 ప్రసవ లక్షణము కలవాడు సవిత్రుడు.సృష్ట్రచనా సమర్థుడు.

  అంతేకాదు 

 ఉత్సవ లక్షణము కలవాడు కూడ.తాను సృజించిన లోకములకు ఉత్కృష్ట స్థితిని కలిగించువాడు.

 సవ అనే శబ్దమునకు సృష్టి అన్న అర్థమే కాకుండా యజ్ఞము అనే అర్థమును అన్వయించుకుంటే

 యజ్ఞస్వరూపుడు.

 కనుకనే విష్ణుసహస్రం,

 యజ్ఞకర్త-యజ్ఞభోక్తా-యజమాన అని స్తుతిస్తున్నది.

 శ్రీసూక్తము అమ్మగా"ఈశ్వరీం సర్వభూతానాం' అని స్తుతిస్తున్నది.

 లలితసహస్రము-

 యజ్ఞప్రియా-యజ్ఞకర్తీ-యజమాన స్వరూపిణిగా

  సంకీర్తిస్తున్నది.

3.సూర్య

  ****

 సరతి గచ్ఛతి-సువతి ప్రేరయతి వా సూర్యః

 ప్రేరేపించువాడు-గమనము చేయువాడు సూర్యుడు.

 సూర్యామ్హిరణ్మయీం లక్ష్మీం

 జాతవేదో మ ఆవహ అని అమ్మభావము.

 కోటి సూర్య సమప్రభ/ప్రభుడు అయిన పరమాత్మరశ్ములు,

 'సూర్యాత్ భవంతిపర్జన్యః

   పర్జన్యాత్ అన్న సంభవః"

 అన్నము అన్న పదమునకు ఆహారము మాత్రమే కాదు,

  శరీరములు/ఉపాధులు అన్న అర్థమును గ్రహిస్తే సవిత్రుడు శరీర దాత.

4-ఖగ

   ****

 క అనగా ఆకాసము-గ అనగా గమనము.

 ఆదిత్యుడు,

5పూష

 ****

 పోషించువాడు.పోషకత్వమునకై ఆకాశగమనము చేస్తూ లోకములకు కావలిసినవి అందిస్తాడు.

కనుకనే ,

 ధనమగ్ని-ధనంవాయుః-ధనం సూర్యో అంటుమ్న్నది.

  మాఘమాస పాలకుదైన ఆదియుని పూషుడూనిపిలుస్తారు.మధ్యాహ్న సమయ సూర్యుని పూషుడు అనిపిలుస్తారు.

 6.గభస్త్మాన్

 ********

 ఖగుడు-పూషుడు అయిన పరమాత్మ తన గమన నైపుణ్యముతో జ్ఞానము-పోషకత్వమును అనుగ్రహిస్తున్నాడు.

 దీనినే శ్రీసూక్తము అమ్మగా భావిస్తూ,


 సూర్యాభాం శ్రియం ఈశ్వరీం అయిన తల్లి,

 "ఆదిత్యవర్ణే తపసోధిజాతో

  వనస్పతి స్తవ వృక్షోథ బిల్వః

  తస్య ఫలాని" అంటూ పూష స్వరూప-స్వభావములను కీర్తించింది.

 

8 సువర్నసదృశుడు

  హిరణ్య రేతస్కుడు.

 రేతస్సు అంటే సారము.తేజస్సు.సారమును గ్రహించితిరిగి అండించువాడుహిరణ్యరేతస్కుడు.సృష్టి కొనసాగింపుకు అనుకూల పరిస్థితులను ఏర్పరచువాడు.

 సువర్ణుడు-శుభకరమైన కిరణములు కలవాడు/రంగులు కలవాడు/అనుగ్రహము కలవాడు.

  కనుకనే శ్రీసూక్తము

" హిరణ్యవర్ణాం హరిణీం

  సువర్ణరజతస్రజాం" అంటూ స్తుతిని ప్రారంభించి,

 చంద్రమ్హిరణ్మయీం,హిరణ్య ప్రాకారం" అంటూ,

  హితము-రామణీయకతను కలిగించు హిరణ్య శబ్దముతో స్తుతించినది.

9.భాను

 భా ప్రకాశమును

 ను-ఉత్పత్తిచేయువాడు/రశ్ములను ప్రసరింపచేయువాడు

10.దివాకర


 దివి-స్వర్గము

 మానసిక-శారీరక పటిష్టతను-ప్రశాంతతను కలుగచేయు దివాకరుని అగస్త్య మహాముని ప్రస్తుతించుచున్న సమయమున,

  "తం  సూర్యంప్రణమామ్యహం."



Friday, February 16, 2024

ADITYAHRDAYAM-SLOKAMU-07


  




    ఆదిత్యహృదయం-శ్లోకం-07


    ********************


 ప్రార్థన


 ******


 " జయతు జయతు సూర్యంసప్తలోకైకదీపం


   హిరణసమిత పాప ద్వేషదుఃఖస్య నాశం


   అరుణకిరణ  గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం


   సకలభువన వంద్యం   భాస్కరం  తం నమామి."




  పూర్వరంగము


  ************


 అద్వితీయమైనపరమాత్మ "రశ్మిభావన"తో సముద్యంతుడై పునః సృష్టిని కావించి,పాలించుటకై,తన నుండి కొన్ని అద్భుతశక్తులను కిరణములగా  భూమిపైప్రసరింపచేయుచు వాటికి బ్రహ్మ-మహేశ్వర-విష్ణు-స్కంద ఇత్యాది నామములను ప్రసాదించినాడు.


  ప్రస్తుత శ్లోకములో ఉద్భవించిన ఆ శక్తులకు సహాయకారులుగా మరికొన్ని శక్తిబృందములను విస్తరించినాడు.


 వానికి వివిధ సార్థకనామములను-స్వభావములను ప్రకటించినారు.


  ఐతిహాసికపరముగా సమన్వయ కథనమున్నప్పటికిని మనకు వాటిని కార్యనిర్వహణశక్తులుగా/ప్రాణశక్తులుగా వైజ్ఞానిక శాస్త్రము వివిధశాఖలను అప్పగిస్తుంది.


  శ్లోకము


  *****


 " పితరో వసవ సాధ్యా యశ్వినో మరుతో మనుః


   వాయుర్వహ్ని"


ప్రజాప్రాణ  ఋతుకర్తా ప్రభాకరః"   


    ముఖ్యపదము"-వాయుర్వహ్ని ప్రజాప్రాణా"


 ప్రజలప్రాణశక్తులు-అగ్ని/చైతన్యము-వాయువు గాలి.


  పరమాత్మ అన్ని ఉపాధులలో అగ్నిస్వరూపముగా దాగి-దానిని ఉచ్చ్వాశ-నిశ్వాసములను వాయు ప్రక్రియ ద్వారా ప్రజల/సమూహముల ప్రాణశక్తులను నిర్వహిస్తూ,శైశవము -కౌమారము-యవ్వనము-వానప్రస్థము-వృద్ధాప్యము అను ఋతువులను ఏర్పరచుచున్నాడు.శిశిరము ఉపాధి సమాప్తి.



  స్థూలము సైతము సూర్య రశ్ములచే వివిధకార్యములు నిర్వహింపబడుతూ,


 వసంత-గ్రీష్మ,వర్ష,శరత్-హేమంత అను ప్రకృతికి వివిధ అవస్థలను కల్పించి,మహాప్రళయమను వివిధ ముగింపును తెస్తుంది.


 మహాప్రళయ సమయము వరకు పాలించేవారిని-ధర్మాచరణులను మనువులు అంటారు.వీరు బ్రహ్మ మానస పుత్రులుగా కీర్తింపబడుచున్నారు.

    మను శాస్త్రమును ప్రామాణికముగా స్వీకరిస్తారు.అల్లసాని పెద్దన "మనుచరిత్ర" అను ప్రబంధమును మనకు అందించారు.


 దీర్ఘకాల పరిపాలనా దక్షులు-విషయగ్రహణ శక్తి కలవారు-ధర్మపరాయణులు. వీరు.కల్పాంత ప్రళయము తరువాత తిరిగి సృష్టి జరిగినపుడు మనువు మారి పరిపాలనను కొనసాగిస్తాడు

.


 స్వాయంభువ  మనువు మొదటివాడు.ఇప్పుడు మనము ఏడవ మనవైన "వైవశ్వత మన్వంతరములో ఉన్నాము.



 అదేవిధముగా వాయుశక్తికి సహాయకార శక్తులుగా ఏడుగురు 'మరుత్తులు" అన్న నామముతో స్థూలములోను,ఉపాధులలోను సంచరిస్తూ ప్రాణశక్తికి దోహదపడుతుంటారు.




  "ఆవహం అంటే వాయువు.


 ఆవహం-ప్రవాహం-సంవహం-ఉద్వహం-వివహం-పరివహం-వరవహం అని వీరి సంకేతిక నామములు.ఆవడు-ప్రవహుడు-సంవహుడు-ఉద్వహుడు-వివహుడు-పరివహుడు-వరవహుడు అని వ్యవహరిస్తారు.ఇంద్రునిచే ప్రహరింపబడిన పిండముయొక్క యొక్క ఏడుభాగములని,దితి ఇంద్రుని"మారుద-మారుద"కొట్టవద్దు-విఛ్చేద పరచవద్దు" అనిన కారణముగా మరుత్తులు అన్నారని చెబుతారు.



 మారుత సహాయక శక్తులు కనుక మరుత్తులు అంటారు.వీరు మేఘములో-వర్షములో-ఆకాశములో,సూర్యమందలములో-చంద్రమండలములో,నక్షత్రమండలములో,గ్రహమండలములో సప్తర్షి మందలములో సంచరిస్తుంటారట.మన శరీరములో పంచేంద్రియములలో,నాడీ మందలములో,జీర్ణవ్యవస్థలో ,రక్తప్రసరణములో,ప్రాణ  వ్యవస్థలో శక్తులుగా,కార్యనిర్వహణమును చేస్తుంటారు.



  స్థిర-చర శక్తులుగా"మాతాచ-పితాచ"తథా పితృ జనుక పితృదేవతా నామములతో స్థిర-చర/స్థావర-జంగమ శక్తులను ప్రసాదించే కిరనములను స్వామి ప్రసరింపచేస్తాడు.


  వసో సమృద్ధిః అన్నట్లు వివిధ సంపదలను ప్రాణులకు అందించుటకు మరికొన్ని కిరణముల గుంపు నిరంతరముగా శ్రమిస్తుంటుంది.


  ఆరోగ్యం  భాస్కరాదిత్యేత్ అన్న సూక్తిని అనుసరించి,అశ్వనీదేవతలను రెండు రోగనిర్థారణశక్తి-రోగ నిరోధకశక్తిగా పరిగణిస్తారు. ,


 నశక్యాన్-దస్త్రాన్ అన్న నామములతో కిరణరూపములో పనిచేస్తుంటాయి.


  మేథస్సును-సాధనను పెంచే సాఫల్యశక్తిని అనుగ్రహించే కిరణములే సాధ్యులు.ఇది వైజ్ఞానిక పారిభాష అయితే ఐతిహాసికకథనము-మన పూర్వీకులను పితృదేవతలుగా(విశ్వే దేవతలుగా) అష్టవసువులను గంగాపుత్రులుగా,మరుత్తులను దితిపుత్రులుగా,సాధ్యులను తపోసంపన్నులుగా,అశ్వనీదేవతలను సూర్యపుత్రులుగా,14 మంది మనువులులను బ్రహ్మ మానస పుత్రులుగా ,


 సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహ "పంచకృట్య నిర్వహము లో ప్రధాన శక్తులకు సహాయశక్తులుగా సన్నుతిస్తాయి.


 ఉపాసన దృష్టి కలవారు జలమును అర్ఘ్యప్రదా నముతో,వాయువును అజపా శ్వాసతో,అగ్నిని యజ్ఞకార్యములతో ,నేలను భూమిపూజలతో,నింగిన పండుగ విశేషములతో సేవిస్తూ,వానిలో దాగిన పరమాత్మను/శుద్ధ చైతన్యమును దర్శించి ధన్యులవుతారు అని అగస్త్యుడు రామచంద్రునికి కర్తవ్యోపదేశము చేయుచున్న తరుణమున,


 " తం  సూర్యం  ప్రణమామ్యహం."







Thursday, February 15, 2024

ADITYAHRDAYAM,-SLOKAM-07


 



    ఆదిత్యహృదయం-శ్లోకం-07

    ******************


  ప్రార్థన

  ****

 " జయతు జయతు సూర్యం  సప్తలోకైకదీపం

   హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం

   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం

   సకలభువన వంద్యం భాస్కరం  తం నమామి."



  పూర్వరంగము

  ***********

 స్వామి తన రశ్ములనే కరములతో తిరోధాన స్థితి నుండి పునఃసృషిని అనుగ్రహించినవేళ ఉత్పన్నమైన దేవాసురగణములచే నమస్కరింపబడుతున్నాడు.స్వామి రశ్మిభావనయే చైతన్యమును అనేకానేక విధములుగా ప్రకటింపచేస్తున్నది.

 ప్రస్తుతశ్లోకములో విస్తృతింపబడిన శక్తులు వివిధ  నామరూపములతో పరమాత్మ అనుగ్రహమును మరింత వివరిస్తున్నది.


 శ్లోకము

  *****

 " ఏష బ్రహ్మాశ్చ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతిః

   మహేంద్రో ధనదః కాలో  యమః సోమో హ్యపాంపతిః."

  ఏష అను సంబోధనము పరమాత్మ ఏకత్వమును-మహత్వమును -పోషణత్వమును సూచిస్తున్నది.

  శబ్దము,

 1.ధ్వని అర్థము

 2.శబ్ద  అర్థము

 3.గూఢ అర్థమును కలిగి ఉంటుంది.

   ఏష-ఇతడే

   ధ్వనినిబట్టి,

  మంచిచెడులను-తెలియచేస్తుంది.

  శబ్దమును బట్టి గౌరవమును సూచిస్తుంది.

  గూఢారథమును గ్రహించగలిగితే,


 " యతోవా ఇమానిభూతాని-జాయతే'

     ఎవని వలను జగములు సృష్టించబడి-సంరక్షించబడి-లయముచేయబడుతున్నాయో,ఏవనియందు దాచబడుతున్నాయో-తిరిగి ప్రకటింపబడుతున్నాయో ...అని "ఎష" శబ్దము ,

 బ్రహ్మైతడే

 శివుడు ఇతదే

 విష్ణువు ఇతడే

 స్కండుడు/గుహుడు (గుహ్యం స్తోత్రం)

 ఇంద్రుడుఇతడే

 ధనద/కుబేరుడు ఇతడే

 కాలస్వరూపము ఇతడే

 యముడు ఇతడే

 చంద్రుడు ఇతడే

 వరుణుడు ఇతడే అని,


 

   ప్రస్తుత శ్లోకము దిక్కుల ఆవిర్భావము-వాటి సంరక్షణము,దినములోని మూడు సంధ్యలు వాటి పాలకులు,స్వామికిరణములలోని విభిన్న కార్య నిర్వాహక శక్తులు వాటి సమన్వయము,పంచభూతముల ప్రాశస్త్యము వివరించుచున్నవి.


  మనము సాధారణముగా ఏ చిత్రకారుని ఉదాహరనకు( బాపుగారు ) గొప్ప/అద్భుత చిత్రకారుడు అని కీర్తిస్తాము కాని బాపుచేయి గొప్ప చిత్రీకరనచేయు సామర్థము కలది అనము.అదే విధముగా గొప్పగాయని/గాయకుడు అంటాము కాని గాత్రమును ప్రస్తావించము.నర్తకి అంటాము కాని భంగిమలను చెప్పము.ఎందుకంటే ఆ ఇంద్రియములకు శక్తినిచ్చి.దానిని ప్రకటింపచేసిన వ్యక్తిలో దాగినది ఆ  చైతన్యము కనుక.

  అదేవిధముగా మూలపరబ్రహ్మము తన శక్తులను వివిథ కిరణశక్తులుగా,వివిథ నామరూపములతో విశ్వపరిపాలనను నిర్వహిస్తున్నాడే తక్క అన్యము కాదు.

  ఈ శ్లోకములో మనము చెప్పుకొనుచున్న నామములు సంకేతిక/సార్థక నామము.

   పరమాత్మ  ఇంద్రియములే దేవతాశక్తులు.

 1.దిక్కులు

   ****

 ఇంద్రుడు తూరుపు దిక్కునకు అధిపతి.

 వరుణుడు పడమర దిక్కునకు అధిపతి

 కుబేరుడు ఉత్తర దిక్కునకు అధిపతి

 యముడు దక్షిణ దిక్కునకు అధిపతి.


  మహేంద్రో-ధనదః-యమః-హ్యపాంపపతి/వరుణుడు జలస్వరూపము.

  ఆ దిక్కులను రక్షించు/పరిపాలించు ప్రకటిత శక్తులు.

 2.త్రిసంధ్యలు.

   *********

 "ఉదయే బ్రహ్మణో -మధ్యాహ్నేతు మహేశ్వరః-అస్తమయం స్వయం విష్ణు

  త్రయీ మూర్తి దివాకరః"

 కిరణములు హిమసర్జన-అగ్నిసర్జన-జలసర్జన అని మూడు స్వభావములు కలవిగా విభజింపబడినవి.

 ప్రాతఃకాల ఉషసమయమున వివశ్వంతుడు బ్రహ్మయై,ఉదయమును సృష్టించువానిగా ప్రకాశించును.

 దానినే "రుద్రము" అసౌ తామ్రః అని కిరణ వర్ణముతో ప్రస్తుతిస్తుంది.

 మద్యాహ్న సమయమున అగ్నిసర్జన కిరణములు జగములను పోషిస్తాయి.వాటిని ప్రసరింపచేసే శక్తియే మహేశ్వరుడు.

  దానినే రుద్రము "అసౌ అరుణః' అని కీర్తిస్తుంది.

  అస్తమాన/సాయంకాలములో జలసర్జన కిరనములు జారుతుంటాయి.ఆ శక్తిపేరే మనము విష్ణుశ్చ అని/నారము అనగా నీరు వాసము గలవాడని/వరుణుడని కీర్తిస్తాము.


 ఆ సమయమును రుద్రము"అసౌ బభ్రు"అని కీర్తిస్తుంది.


 వీరే కాక మరికొన్నికిరనములు భూమిలోనికి ప్రవేశించి,

 లోహములను-చమురులను-ఖనిజములను-పంటలను-జలములను ఇలా ఎన్నెన్నో వనరులను తయారుచేస్తాయి.

3. కిందకు జారు స్వభావము కలవి కనుక వానిని

 స్కందుడు అంటాము.అంతే కాదు

4. విడివిడిగా ఉన్న పంచభూతములకు హద్దులను ఏర్పరచి నియమిస్తాయి కనుక యమ అని కూడా అంటారు.

5.  సూర్యకిరణములు రాత్రివేళ చంద్రుని శీతలత్వమునకు/వెన్నెలకు అనువైన శక్తిని ప్రసాదిస్తాయి.కనుక సోముడు.

 6.కాల స్వరూపము కనుక కాలుడు.

  ఈ పరిణామమునే ఋగ్వేదము,

 " ఇంద్ర-మిత్రం-వరుణం-అగ్నిం-ఆహురథోం-దివ్యం-స-సంపూర్ణో గురుత్మాన

 " ఏకం-" సత్ విప్రా బహుదా వదంతీ"

  విశేష ప్రజ్ఞానము కలవారు ఏకమైన పరమాత్మ శక్తులుగా అనేకమును దర్శించగలరని ,ఆదిత్యవైభవమును దర్శింపచేయు తరుణమున,


  తం సూర్యం  ప్రణమామ్యహం.



Wednesday, February 14, 2024

ADITYAHRDAYAM-SLOKAM-06

   ఆదిత్యహృదయము-శ్లోకము06

  ************************

 ప్రార్థన

 *****

 " జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం

    హిరణసమిత పాప ద్వేష దుఃఖస్యనాశం

   అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం

   సకలభువనవంద్యంభాస్కరం తం నమామి." 

   

    స్వామి రశ్ములు సర్వలోకములపై  సంపూర్ణముగా విస్తరించి, చైతన్యపరుస్తున్నాయన్న మహర్షి,ప్రస్తుత శ్లోకములోరశ్మిభావనను  విశదీకరిస్తున్నారు.

 నిద్రయనుస్వల్పకాలికలయము,ప్రళయము అను దీర్ఘకాలిక లయములను తదుపరిజాగృతమును తేజస్విగా (మూలబీజముగా)నిర్వహించు స్వామిని ప్రస్తుతిస్తున్నాడు.


   శ్లోకము

  *******

  " సర్వదేవాత్మకోహ్యేష  తేజస్వి రశ్మిభావనః

    ఏష దేవాం సురగణాంలోకాన్ పాతిగభస్తిభిః"

  స్వామి సర్వదేవతా అసురశక్తుల సమన్వితమైన లోకములను చైతన్యపరచుటకు మూలకారణమే "రశ్మి భావనము"

 రశ్మిభావనము అనగా,

 "లోకంబులు లోకేశుడు లోకస్థులు

  తెగినతుది నలోకంబగు పెంచీకటి

  అవ్వలనెవ్వండేకాకృతి ' పరమాత్మను సేవిస్తానన్నాడు బమ్మెర పోతనామాత్యుడు.

 

" న ఉదయితి-నాస్తమేతి: స్వల్పకాలిక లయ  (రేయిం-పగలు)దశ.కాలగమనములో ఆదిత్యునకు ఉదయాస్తమానములుండవు.

 కాని దీర్ఘకాలికలయ యందు లోకములు-లోకస్థులు కానరావు.అవి అసలున్నవోలేవో కూడా తెలియదు.సమస్త ప్రపంచము లుప్తమై-గుప్తమై పోతుంది.సకలము తనను తాను మరగుపరచుకొనిన మర్మస్థితి.

 నేను-నాది అన్న ద్వంద్వములు-త్రిగుణములు-చతుర్విధపురుషార్థములు-పంచభూతములు-అరిషడ్వర్గములు-సప్తలోకములు-అష్టదిక్కులు-నవగ్రహములు ,భూగోళ-ఖగోళములు తమ ఉనికిని ప్రకటింకొనగలిగిన స్థితిని స్వామి అనుగ్రహించుతయే "రశ్మిభావనము" పరమాత్మ తన సంకల్పముతోరశ్ములను వివశ్వము గావించి,ప్రాణశక్తుల కదలికతతో,

 ఏకము-అనేకమై -మనలను మమేకము చేయుటయే,తేజస్వి యొక్క సర్వదేవతామకము.

   రశ్మి భావనము-సర్వదేవాత్మకునిచే సమస్త దేవ-అసుర గుణములతో కూడిన జంగమ స్థావరాదులను ప్రకటింపచేస్తున్నది.దైవాసుర సంపదను స్పష్టీకరిస్తున్నది.

  కొన్ని ఉపాధులు దైవగుణములను ఎక్కువగా-మరికొన్నిఉపాధులు అసురగుణములను ఎక్కువగా తమను ప్రేరేపిస్తుంటే-వాటిని కర్మలుగా మలచుకొని-ఫలితములను అనుభవిస్తుంటారు.

 ఇదే విషయము మనము రామ-రావణులలో గమనిస్తుంటాము.

 " అహంకారం-బలం-దర్పం కామం క్రొధంచ సంశ్రితామామాత్మపరదేహేషూ-అసుర గుణములుగాభగవానుడు గీతలోవివరించాడు.

 


  


 అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం


 దయాభూతేషు అని దైవీగుణములనుప్రస్తుతించినది భగవద్గీత.

  ఆలోచనపూరిత స్వభావము దైవీసంపద-ఆలోచనరహిత స్వభావము అసుర సంపద.రెండింటి సమన్వయే సమస్త లోకములు.తాను సృష్టించిన సమస్తమును తన ప్రకాసగమన లక్షణముతో పోషించుచున్న ఆదిత్యుని సేవింపుము అని స్తోత్రమును రామచంద్రునకు అగస్త్యుడు వివరించుచున్న తరుణమున,

 " తం  సూర్యంప్రణమామ్యహం."

 

Tuesday, February 13, 2024

ADITYAHRDAYAM-SLOKAM-05


 



   ఆదిత్య హృదయం-శ్లోకము-05

  ***********************


 ప్రార్థన


 ******


 " జయతు జయతు సూర్యం సప్త లోకైక దీపం


   హిరణ సమిత పాపద్వేష దుఃఖస్య నాశం


   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం


   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."


 


  పూర్వరంగము


  ***********


 స్తోత్ర పరిచయము-ఆత్మ స్వరూపము-అర్చనావిధానము-ఫలసిద్ధి మొదలగు విషయములను అగస్త్యమహర్షి  రామ చంద్రునకు/మనకు వివరించినారు.


   ఒక సిద్ధాంతము ప్రకారము ప్రస్తుత శ్లోకమును,


 "ఆదిత్యహృదయ స్తోత్ర" ప్రారంభశ్లోకముగా పరిగణిస్తారు.


  నిజమునకు ప్రస్తుత శ్లోకము,"పరమాత్మకు-ప్రపంచమునకు వారథి వంటిది.దీనిని ఆలంబన శ్లోకముగా కూడా భావిస్తారు.


  ఖగోళ సౌరశక్తిని భూగోళమునకు చేర్చు సహాయకారులు "కిరణములు" వాటి ప్రసక్తి ఈ శ్లోకమునుండి ప్రారంభమవుతుంది.



 శ్లోకము


 ******


 "రశ్మిమంతం-సముద్యంతం దేవాసుర నమస్కృతం


  పూజయస్య -వివశ్వంతం భాస్కరం-భువనేశ్వరం"


   తన కిరణములను పూర్తిగా విస్తరింపచేసి అంతకు ముందున్న చీకట్లను దాచివేసి దేవతలచే-అసురులచే నంస్కరింపబడుచున్న ,భువనేశ్వరుడైన భాస్కరుని ,



 ఓ రామా-పూజింపుము అని అగస్త్యుడు పలుకుచున్నారు.


  "స్వామి" వేటిద్వారా సర్వమును-సకలమును అనుగ్రహిస్తున్నాడో అవి "రశ్ములు" పూర్తిగా ఆవరించినచో అది మంతం లేక మయం.


  కనుకనే విష్ణుసహస్రనామ స్తోత్రము,


" ఓజస్తేజో ద్యుతిధరః(ప్రకాశమే రూపముగా కలవాడా) ప్రకాశాత్మా-ప్రతాపనః" అని


 పరమాత్మను ప్రకాశముగాను-ప్రచండుని గాను స్తుతిస్తున్నది.


 స్వామి రశ్ములను అన్నమయ్య సైతము, 


" కడలి ఏనుగు మీదు కాచు ఎండయు నొకటె


 పుడమి శునకము మీద పొలయు ఎండ  నొకటే అని సూర్య రశ్ముల  సర్వవ్యాపకత్వమును సన్నుతించినాడు.




 




 ఇప్పుడు కిరణములు అన్న శబ్దమును సమన్వయపరచుకుంటూ ,స్వామి జగద్రక్షణమును కీర్తిద్దాము.


 స్వామి భాస్కరుడు అంటున్నది ప్రస్తుత శ్లోకము.


 భాసించు-కాంతివంతమైన కరములు కలవాడు.


 కరుడు చేయగల చేతులు కలవాడు.


 " కరము" మిక్కిలి అన్న అర్థముతో అన్వయించుకుంటే మిక్కిలిగా  (తరిగిపోనంతగా)చేయువాడు,దివాకరుడు-దినకరుడు,అహస్కరుడు -పగటిని కలిగించువాడు.



 


  స్వామికరములు కాంతిమయములు కనుక రశ్ములు అనగా కాంతులు  అనికూడా అన్వయించుకోవచ్చును.



2.  రశ్ములు/కిరణములు అనగా వేదములు.


 అందుకే "మేలుకో శ్రీసూర్యనారాయణ-వేద పారాయణా" అని మనము వింటుంటాము.


 3. రశ్ములు అనగా ఇంద్రియములు.అచేతనములుగా నున్న


 ఇంద్రియములు సౌరకిరణ ప్రసరణముచే చైతన్యభరితములవుతాయి.కనుకనే,


4.  రశ్ములను "ప్రాణములు" అని కూడా అంటారు.


 అదే విషయమును "మంత్రపుష్పము"

 "తిర్యక్ ఊర్థ్వం అథః శాయీ రశ్మయత్ తస్య సంతతాః


  సం తాపయతి స్వం దేహం ఆపాద తల మస్తకః"




  అడ్దముగా-నిలువుగా-కిందగా అనేకనాడులతో నిర్మితమైన నాడీమండలము లోనికి తన రశ్ములను,శిరమునుండి-పాదము వరకు జ్వాలాయమానముగా ప్రవేశింపచేసి-వ్యాపింపచేస్తున్న ,ప్రత్యక్ష స్వామి,"సూర్యనారాయుణకు" నమస్కారములు.



5. రశ్ములు అంటే పంచభూతములు.వాటిని స్వామి తనకిరణములచే సమన్వయ పరుస్తు,సమర్థవంతముచేస్తున్న  పరమాత్మకు వందనములు.


 సమ్యక్ ఉదయతీతి-సముద్యంతం


 లోకాన్ క్రియా సుప్రవర్తం-సముద్యంతం.


 సంపూర్నముగా తన తేజస్సును విస్తరింపచేయుటకు సిద్ధపడుటయే -సముద్యంతం


 పూజయంతం -రామా ఆ తేజోమూర్తిని పూజింపుము.



 "పూజ" పునీత అర్చనము.ఇది నిత్యము-నైమిత్తికము అని,వ్యక్తిగతము-సామూహికము అని ,బాహ్యము-ఆంతరంగికము అనునవి వ్యవహారములో నున్నవి.పూ-సుమంగళి-తూరుపు దిక్కు.జ-జాజ్వల్యమానమగువేళ సేవింపుము.


 ఈ సందర్భములో,/కథనములో,


 రాముడు అను వ్యక్తి,రావణ సంహారనిమిత్తము,ఆంతరంగికముగా సూర్యభగవానుని పూజిస్తున్నాడు.ఇది  నైమిత్తిక పూజ.ఏకాంత సేవనము.


 కాని అదే రాముడు నిత్యకర్మగా,ఏ ప్రతిఫలమును కోరకుండా సూర్యభగవానుని,   తన ఇలవేలుపుగా,అర్ఘ్య సమర్పణముతో-నమస్కారములతో బాహ్యపూజను ఆచరించేవాడు.

 ఇది నిత్యపూజ. 


 రామా విజయమునకై వివశ్వంతుడు  విస్తరింపచేయుచున్న కిరణములతో అంతకు ముందున్న చీకట్లను కప్పివేయువానిని పూజింపుము అని హితము చెప్పువేళ,



 తం  సూర్యం  ప్రణమామ్యహం.



Monday, February 12, 2024

ADITYAHRDAYAM-SLOKAM04




 



   ఆదిత్యహృదయం-శ్లోకము-04

   *******************

 "జయతు జయతు సూర్యం  సప్తలోకైక దీపం

  హిరన సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం

  అరుణకిరన గమ్యం ఆదిమాదిత్య మూర్తిం

  సకల భువన వంద్యం భాస్కరంతమ్నమామి."



  పూర్వరంగము

  ***********

  పరిశ్రాంతుడై-చింతాక్రాంతుడైయున్న రామచంద్రునికి తక్షణ కర్తవ్యమును సూచించుతకై అభ్యాగతిగా వచ్చిన అగస్త్యమహాముని,

 రామా ద్రష్టుం/చూడు

 రామా-శృణుం-విను

 రామా -జపేత్-జపించు అంటూ కార్యోన్ముఖుని చేస్తున్నాడు.

  స్తోత్ర శీర్షికా సార్థకతను తెలియచేయునది ప్రస్తుత శ్లోకము.

 శ్లోకము

 *****

 " ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాసనం

   జయావహం జపేత్ నిత్యం అక్షయం -పరమం-శివం."



   అదిత్యుడు అంటే ఎవరు?

1. "వేదాహమేతం పురుషం మహాంతం

  ఆదిత్య వర్ణం తమపస్తు పారే"

    అని స్తుతిస్తున్నది పురుషసూక్తము.

  క్రియాశీలుడైన పరమాత్మ సమస్త శమస్త నామరూపములను ప్రకటింపచేసి తాను ప్రకాశిస్తూ వానియందు ప్రవేశించి,అరుణవర్ణముతో చీకట్లనుండి (పారే) దాటించివేస్తాడో వాడే ఆదిత్యుడు.అని నేను తెలుసుకుంటున్నాను అంటున్నది.



  రుద్ర నమకము సైతము,

  ధావతే సత్వానాం పథయే నమః అని తన భక్తుల ముందు తానుండి నడిపించువాడు,తన భక్తులను అనుసరిస్తూ అనుగ్రహించువానిగా పరమాత్మను స్తుతిస్తోంది.

2.న-దితి-రెండవదిలేనిది ఏకైకస్వరూపమునుండి ప్రకటింపబడువాడు ఆదిత్యుడు.

3.గుహ్యము-సనాతనము-పుణ్యము-సర్వశత్రునాశనము-జయము-పరము-అక్షయము-శివము -నిత్యము అను సర్వశుభలక్షణ స్తోత్రము ఇది.

   దీనిని జపేత్ నిత్యం-నిత్యము జపించినచో ఫలసిద్దికలుగును.

   జపము అంటే ఏమిటి?అన్న సందేహము కలిగినచో,

 " హస్తౌ నాభి సమాకృత్వా ప్రాతః సంధ్యా జపంచరేత్"అన్నది ఆర్యోకి.ముకుళింపచేసిన హస్తములను నాభిప్రదేశమునకు దగ్గరగా ఆంచి పెదవులు-నాలుక కదపకుండా నిశ్చలముగాచేసే మంత్రార్చనయే జపము అని అంటారు.

  తత్ఫలితముగా,

 "జ"కారో జన్మవిఛ్చేదః-"ప"కారో పాపనాసనం" అనికూడాంటారు.

  అంతే కాదు,

 " యజ్ఞానాం జపయజ్ఞోస్మి

   స్థావరాణాం హిమాలయః'
   ఆదిత్యారాధనమును మూడు వర్గములుగా పరిశీలిస్తే,
 సాంప్రదాయము-వైజ్ఞానికము-ఉపాసనము అయితే,

  అటువంటి జపమును నిత్యము అనుసరిస్తే(త్రికరణములతో)

 1.సర్వశత్రు వినాసనం-ప్రతికూలములను సమూలముగా నిర్మూలిస్తుంది.ఇక్కడ మూడు వర్గముల శత్రువులను మనము ప్రస్తావించుకుందాము.వారు,
 మనకథనములోని రామ-రావణులు
 సమరముచేయిస్తున్న రావణుని అంతః శత్రువులు
 వైజ్ఞానికమైన "మందేహులు"మనకు సూర్యకిరనముల అందనీయని వాతావరనకాలుష్యము(ఓజోను పొర సామర్థ్యమును అడ్డుకొనునవి).
 

 2 "పునాతు మాం తత్ సత్ వరేణ్యం" అంటున్నది సూర్యమందల స్తోత్రము.

 3 దోషములు తొలగినచిత్తము పునీతమవుతుంది.అదియే పుణ్యము.

 4.పుణ్యస్థితికి చేరిన మనసు 

 అజపామంత్రమును అనవరతము చేస్తూ (గాలి పీల్చుట-వదలుట)సోహం /నేనే నీవు-నీవే నేను అనే ఏకత్వ స్థితికిచేరుకుంటుండి.అదియే పరమం.

 5 పరమం పొందిన మనసు ,

  చతుర్విధ పురుషార్థములైన ధర్మ-అర్థ-కామ-మోక్షములను దాటితురీఊముచేరుతుంది.అదియే శివము.

6శివముగా మారిని చేతనుడు అక్షయ ఫలవంతుదవుతాడు.వానిస్థితికి గ్లాని ఉండదు.

7అట్టిస్థితి పరిమిత సమయముకాక నిత్యముగా/శాశ్వతముగా ఉంటుంది.

   అంతే,

 ఈ స్తోత్రరాజమునునిత్యముజపించిన జీవుడు జీవన్ముక్తుదగును అని రాముని స్తోత్రపఠనాసక్తునిగా,అగస్త్యమహామునిచేయుచున్న  తరుణములో 

   తంసూర్యం  ప్రణమామ్యహం.







TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...