Saturday, November 30, 2019

MARGALI MALAI-12

  మార్గళి మాలై-12
 *******************

  పన్నెండవ పాశురం
  ******************



 కనైత్తిళం గత్తెరుమై కన్రు క్కిరంగి
 నినైత్తు ములై వళియే నిన్రుపాల్ శోర
 ననైత్తు ఇల్లం శేర్కాక్కుం నర్చెల్వన్ తంగాయ్
 పనిత్తలై వీళనిన్ వాశల్ కడైపత్తి
 శినత్తినాల్ తెన్నిలంగై క్కోమునై చ్చెత్త
 మనత్తుక్కు ఇనియానై ప్పాడవుం నీవాయ్ తిరవాయ్
 ఇనిత్తాన్ ఎళుందిరాయ్ ఈ తెన్న పేరు రక్కం
 అనైత్తు ఇల్లత్తారుం అరిందు ఏలోరెంబావాయ్.


   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
  ************************


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ గోదారంగనాధుల అనుగ్రహము అనవరతము

  పాడిగేదెలు పిలుచుచున్నవి పాలనీయగ దూడలకును
 పాడి కాదిది పనిని వదిలి కన్నడిని మీ అన్న కూడుట

 శిరముల వర్షించిన క్షీరము చిత్తడిని చేసినది నేలను
 గగనము వర్షించు హిమము తడుపుతున్నది గోపికలను

 రామబాణము తాకినంతనే రమ్యమైనది లంకద్వీపము
 రామ నామము సాగుచున్నది రక్షయైనది గోకులమును

 చూడవమ్మ మేము నీకై చూరు కిందనే ఉన్నాము
 తరలి వచ్చినది తల్లి మనకై,తానొక గోపికయై

 పాశురములను పాడుకొనుచు పాశములన్నిటిని విడిచి
 నప్పిన్నాయ్ తిరుప్పావాయ్ కు రారాదో ఓ సుధామసోదరి!

 మహాద్భుతమైన ఈ పాశురములో మహిషి నామమును స్వీకరించిన పట్తమహిషి, మనకు ఆజ్ఞ-అనుజ్ఞ స్వభావమును,నిత్యకైంకర్య-విశేష కైంకర్య స్థానములను, అవ్యాజకరుణతో నిండి యున్న గేదెల మాతృప్రేమను-తల్లిని దరిచేరలేక యున్న మూతికి చిక్కము కట్టి,తాళ్లతో బంధించియున్న దూడల పరిస్థితిని,వానిని తలచినంతనె చేపుకొనిన శిరముల క్షిప్ర ప్రసాదత్వమును,శిరముల విశ్లేషణ విశేషములను,పరీవాహములై ప్రవహించుచున్న పాలు,పాలతో తడిసిన చిత్తడి నేలను స్పర్శించిన గోపికలు ప్రకటించిన శ్రీరామావతార విశేషములు,లంకద్వీప మను మన దేహ విసేషములు ,వానిని సంస్కరించు మాధవుని సఖుడైన గోపిక అన్న గొప్పతనమును తెలియచేస్తు,గోపికను మేల్కొలిపినది


  భవంతునిచే నిర్దేశింపబడిన కైకంర్య విధానము ఆజ్ఞ.భక్తుడే మనఃపూర్వకముగా ఏ ఫలితమును ఆశించకుండా తనకు తాను తన్మయముతో చేయు కైంకర్యము అనుజ్ఞ. అనుజ్ఞ కైంకర్యము సమయ సందర్భములను పట్టి ఒక్కొక్కసారి నిత్య కైంకర్యముగాము-మరొక్కసారి విశేష కైంకర్యముగాను ప్రకటింపబడుతుంది. ఉదాహరణకు  రామాయణములోని లక్ష్మణుడు
అరణ్యవాస సమయమున తన నిత్య విధులకు బదులుగా (నిద్రాహారములను విడిచి)శ్రీరామ సంరక్షణనే తన కైంకర్యముగా మలచుకొనినాడు.అదే విధముగా (శ్రీమాన్ తిరుప్పణ్యాళ్వారులు గా భావించే) ఈ గోపిక అన్న కూడ తన నిత్య కైంకర్యమైన పాలుపితుకుట మాని,విశేష కైంకర్యమైన స్వామి ప్రభల సేవకు వెళ్లినాడు.ముగిసిన తరువాత యధావిధిగా నిత్యకైంకర్యములు చేస్తాడు.


 ఇప్పుడు గేదెల మాతృవాత్సల్యము-దూడల అసహాయత చెప్పబడినది.దూడలు తమ మూతులను చిక్కములతోను,తమను రాటకును బంధించబడియున్నవి.అవి కదలలేవు.క్షీరములను తాగలేవు.అదే విధముగా చేతనులు అని పిలువబడు మనము సంసార బంధములను చిక్కములో చిక్కుకొని,కదల లేని స్థితిలో నున్నవారము.తగిన ఉపాయమును గ్రహించలేక ఉన్న వారము.ఏ విధముగా గేదెలు తమ పిల్లకై శిరములను చేపి క్షీర ధారలను వర్షించుచున్నవో,అదేవిధముగా ఆచార్యులు తమ జ్ఞాన ధారలను వర్షించు చున్నారు. అదియే గోపికలై పడుతున్న హిమమను (మంచు) చల్లని ఆశీర్వచనామృతము.

 శిరములు కేవలము గేదెల శరీరావయమేనా? లేక నిక్షిప్త పరమార్థములా?

 నాలుగు వేదములు,శృతి-స్మృతి-పురాణ-ప్రబంధములు,ధర్మార్థకామమోక్షములు,
 శ్రీ భాష్యము-గీతా భాష్యము-భగవత్ విషయములు-రహస్యములుగా,మన పెద్దలు గుర్తించారు.



 వానిక్షీరముతో తడిసిన చిత్తడి నేలను తాకిన గోపికల భాగ్యమేమని వర్ణించగలను? కనుకనే వారు శ్రీరామ వైభవమును పొందిన లంకద్వీపమును,శ్రీరామ నామముతో కీర్తింపబడిన గోకులమును తత్త్వ దర్శినులై ప్రస్తుతించ గలిగినారు.లంకద్వీపము అంటే ఏమిటి?  శిరములు కేవలము గేదెల శరీరావయమేనా? లేక నిక్షిప్త పరమార్థములా?

 నాలుగు వేదములు,శృతి-స్మృతి-పురాణ-ప్రబంధములు,ధర్మార్థకామమోక్షములు,
 శ్రీ భాష్యము-గీతా భాష్యము-భగవత్ విషయములు-రహస్యములుగా,మన పెద్దలు గుర్తించారు.



 వానిక్షీరముతో తడిసిన చిత్తడి నేలను తాకిన గోపికల భాగ్యమేమని వర్ణించగలను? కనుకనే వారు శ్రీరామ వైభవమును పొందిన లంకద్వీపమును,శ్రీరామ నామముతో కీర్తింపబడిన గోకులమును తత్త్వ దర్శినులై ప్రస్తుతించ గలిగినారు.లంకద్వీపము అంటే ఏమిటి? మన శరీరమే? శిరములు కేవలము గేదెల శరీరావయమేనా? లేక నిక్షిప్త పరమార్థములా?

 నాలుగు వేదములు,శృతి-స్మృతి-పురాణ-ప్రబంధములు,ధర్మార్థకామమోక్షములు,
 శ్రీ భాష్యము-గీతా భాష్యము-భగవత్ విషయములు-రహస్యములుగా,మన పెద్దలు గుర్తించారు.



 వానిక్షీరముతో తడిసిన చిత్తడి నేలను తాకిన గోపికల భాగ్యమేమని వర్ణించగలను? కనుకనే వారు శ్రీరామ వైభవమును పొందిన లంకద్వీపమును,శ్రీరామ నామముతో కీర్తింపబడిన గోకులమును తత్త్వ దర్శినులై ప్రస్తుతించ గలిగినారు.లంకద్వీపము అంటే ఏమిటి?  మన శరీరమే? ఇంకేమిటి?

 అందుకనే గోపికలు నమమ నేను కాదు ఇవన్నీ నేను కాదు అని అనవరతము గుర్తుచేసుకొను ఆధ్యాత్మిక చూరు క్రింద నిలబడినారు.


వనదుర్గము-జల దుర్గము-గిరి దుర్గము అను మూడు దుర్గములతో సంసారసాగరమున మునిగియున్న ద్వీపము.బాహ్య శరీరము వనదుర్గము-లోపల జరుగు రక్తప్రసరణ విధానమే జలదుర్గము.కదిలే-కదలలేని-కదిలే కదలని ఎముకల సమాహారమే గిరిదుర్గము.దీనిని పది ఇంద్రియములను పదితలల మనసు అను అసురుడు బుధ్ధిని చేరనీయక
పాలించుచున్నాడు.వానిని కూలదోయకలవాడు రమ్యమైన రాముడు అని తెలిసియు ఉలక-పలుక తలుపు తీయకనున్నావు.సంకీర్తములతో స్వామిని అర్చించి పర ను పొందుద మని గోదమ్మను కూడి వచ్చిన గోపికల పిలుతో.జాగరూకయై,వేరొక గోపికను మేల్కొలుపుటకు తల్లిని అనుసరిస్తూ,బయలుదేరినది నత్త్చెల్వం తంగచ్చి.


 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)



వనదుర్గము-జల దుర్గము-గిరి దుర్గము అను మూడు దుర్గములతో సంసారసాగరమున మునిగియున్న ద్వీపము.బాహ్య శరీరము వనదుర్గము-లోపల జరుగు రక్తప్రసరణ విధానమే జలదుర్గము.కదిలే-కదలలేని-కదిలే కదలని ఎముకల సమాహారమే గిరిదుర్గము.దీనిని పది ఇంద్రియములను పదితలల మనసు అను అసురుడు బుధ్ధిని చేరనీయక
పాలించుచున్నాడు.వానిని కూలదోయకలవాడు రమ్యమైన రాముడు అని తెలిసియు ఉలక-పలుక తలుపు తీయకనున్నావు.సంకీర్తములతో స్వామిని అర్చించి పర ను పొందుద మని గోదమ్మను కూడి వచ్చిన గోపికల పిలుతో.జాగరూకయై,వేరొక గోపికను మేల్కొలుపుటకు తల్లిని అనుసరిస్తూ,బయలుదేరినది నత్త్చెల్వం తంగచ్చి.


 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)








.






MARGALI MALAI-11


   మార్గళి మాలై-11
   *************


  పదకొండవ పాశురం
  ***************

కత్తుక్కరవై క్కలుంగళ్ పలకరందు
శెత్తార్ తిరల్ అళియచ్చెన్రు శెరుచ్చెయ్యుం
కుత్త మొన్రిల్లాద కోవలర్ తం పొర్కిడియే
పుత్తు అరవు అల్గుల్ ! పునమయిలే! పోదరాయ్
శుత్తత్తు ట్టోళిమార్ ఎల్లారుం వందు నిన్
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్పాడ పేర్పాడ
శిత్తాదే పేశాదే శెల్వ ప్పెణ్డాట్టి ! నీ
ఎత్తుక్కు ఉరంగు పొరుళ్ ఏలో రెంబావాయ్.

  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో

 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.


 గోపాలుని రేపల్లెలో గోసంపద పుష్కలము
 ప్రతివారు బలవంతులె దరిచేరలేదు వైరము

 పుట్టలోని పామువలె ,పురివిప్పిన  నెమలివలె
 ఓ భాగ్యశాలి!నిదురవీడి బయటకు రావమ్మా


 స్నేహితులు-బంధువులు నీ ఇంటికి వచ్చినాము
 నీలమేఘశ్యాముని,  నెనరుల కీర్తిస్తున్నాము

 వీడలేని నీ నిదురను కూడిన కారణమేమి?
 తరలివచ్చినది తల్లి, తానొకగోపికయై


 పాశురములు పాడుతు పాశములన్నింటిని విడిచి
 నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో ! ఓ బంగరు మొలక!

 గోదమ్మ ఈ పాశురములో గోకులమున గల స్వధర్మ పరిపాలన-స్వధర్మ పరిరక్షణ అను రెండు విషయములను ప్రస్తావించుచున్నది.గోపబాలురు పుష్కల గోసంపద కలవారు.గోవుల పాలు పితుకుటలో నేర్పరులు (బుధ్ధి బలురు.) అంతే కాదు వారికి కీడును తలపెట్టిన శత్రువుల పైన తామే దండెత్తి వారిని ఓడించి,దరిచేరనీయని వారు.(భుజ బలురు.) ఇది వాచ్యార్థము.


  "గో" శబ్దమునకు వాక్కు-వేదము అను అర్థమును పెద్దలు నిర్వచిస్తారు.
"కత్తుక్కుక్కరలై క్కలుంగళ్" చిన్నదూడలు గల ఆవులు అనగా వేదాంగములు గల వేదములు.అవి
ఏమిచేస్తున్నాయంటే పలకరందు పాలను పుష్కలముగా వర్షిస్తున్నాయి.ధర్మమును సోదాహరణముగా వివరిస్తున్నాయి.ఎవరికి? పాలను పితుకు నేర్పు వంటి నేర్పుగల జ్ఞానమును సముపార్జించుకొను వారికి.ఆచార్యులకి.


 ఆచార్యులు ఎటువంటి వారు? ధర్మమునకు గ్లానిని తలపెట్టు వారి వద్దకు నాస్తికులకు-
దుష్ప్రచారకులకు బుధ్ధిచెప్పువారు.ఏ విధముగా తమకు తామే గుర్తించి,కుహనా సంస్కారుల వద్దకు తామే వెళ్ళి వారి అజ్ఞానమును చర్చల ద్వారా వివిధ కార్యక్రమముల ద్వారా విశద పరచు వారు.

 అంతటి విశిష్ట గోకులమున జన్మించిన అపురూప లావణ్యవతి బంగరు తీగ గా పిలువబడు నేటి గోపెమ్మ.ఏమా లావణ్యము?


 గోదమ్మ ఆమె లావణ్యమును "కోవలర్ తు పూర్కడియే" అని సంబోదిస్తూ,పుత్తు అరవు అల్గుల్ అన్నది పుట్తలో ముడుచుకొని ఉన్న పాముగా కీర్తించినది.అంతే ఏమిటి?

 పాము తన శరీరమును చిన్నగా చుట్టుకొని,బుసలు కొట్టకుండా పుట్తలో ముడుచుకొని ఉన్నది.ఇది అహంకార రాహిత్య సూచకము.అదే విధముగా పరగత "సర్వస్య శరణాగతిని" కోరిన ఈ గోపిక ఆచార్య జ్ఞాన
ప్రవచనములను పుట్టలో ,అహంకారమును వీడి
అభ్యాసమును చేయుచున్నది.అదియును కదలక-పలుకక.నిశ్చలముగా .

 అదే గోపిక నీలమేఘశ్యాముని కీర్తనలను నీలిమబ్బును చూసినపుడు ఆనందపారవశ్యయై (పునమయిలే)పురివిప్పిన నెమలి వలె సంతోషముతో నాట్యమాడుతుంది.చేతనత్వము-అచేతనత్వము గురువుల ఉపదేశములపై-నింగిలోని నీలి మబ్బుపై అధారపడి యున్నది. అంటే అహంకార-మమకారములకు
త్యజించినది.స్వామి సర్వస్య శరణాగతిని పొందినది.

  బయట నున్న గోపికలు ఓ! భగవదనుభవ సంపన్నురాలా! నీ బంధువులము స్నేహితులము నీ వాకిట ముందు నిలబడి నీలమేఘ శ్యాముని నెనరులతో-పరమ ప్రీతితో కీర్తిస్తున్నాము.నిన్ను నిద్రాసక్తురాలిని చేసిన దానిని విడిచివేసి,మాతో పాటు నోమునకు రమ్మని వేడుకొనగా,గోపిక బహిర్ముఖియై,వేరొక గోపికను మేల్కొలుపుటకు అమ్మను అనుసరిస్తూ,వెళుతోంది.


 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)




 



margaLi maalai-10


  మార్గళి మాలై-10
*****************


    పదవ పాశురము
   ******************
 నోత్తు చ్చువర్క్కం పుగుగిన్ర అమ్మనాయ్
 మాత్తముం తారారో వాశల్ తిరవాదార్?
 నాత్తత్తుళాయ్ ముడి   నారాయణన్ నమ్మాల్
 పోత్త  ప్పరై తరుం పుణ్ణియనాల్ పండు ఒరునాళ్
 కూత్తత్తిన్ వాయ్ వీళంద కుంబకరణనుం
 తోత్తు మునక్కే పెరుం  తుయిల్ తాన్ తందానో?
 ఆత్త అనందలు డైయాయ్! అరుంగలమే!
 తేత్తమాయ్ వందు తిర ఏలోరెంబావాయ్!

  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
**************************

 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 నోము ఫలముగా సువర్గసంగములో నున్నావో
 తలుపుగడియ తీయవు, బదులైన పలుకవు

 తులసిమాల పరిమళములు స్వామిజాడలైనవిలే
 ఏదో ఒకనాడు, మాకు ఫలమును అందించునులే

 మృత్యువాత పడిన ఆ కుంభకర్ణుని మొద్దునిద్ర
 నిన్ను చేరినదా ఏమి? అన్నిటిని మరచినావు

 తత్తరపాటును వీడి, తలుపుతీయ రావమ్మా
 తరలివచ్చినది తల్లి, తానొక గోపికయై

 పాశురములు పాడుకొనుచు పాశములన్నిటిని విడిచి
 "నప్పిన్నాయ్ తిరుప్పావైకు రారాదో!  ఓ భూషణమా.!



"తిరుపళ్ళి ఎళుచ్చి " పాశురములలో ఐదవ గోపికను గోదమ్మ అమ్మన్నాయ్ అంటు మేల్కొలుపుతోంది.బాహ్యమునకు ఈమె నివాసము శ్రీకృష్ణుని  ఇంటి పక్క ఇల్లు.ఎప్పుడు స్వామి తనను చూడాలన్నా,తాను స్వామిని చూడాలన్న అడ్డుగోడను దూకి వెళ్ళి ఆనందించేవారట.స్వామితో అత్యంత సాన్నిహిత్యము కలది కనుక స్వామిని ( అమ్మణ్ణాయ్.)అని సంబోధిస్తున్నది.గోదమ్మ.

తొమ్మిదవ పాశురములోని గోపిక అంతఃపురములో అత్యంత విభవముతో నున్నను వాటిని స్వీకరించక కృష్ణభావ తాదాత్మ్యములో నున్నది.ఆమె మేడ మీద ఉన్నది.ఏమిటా మేడ?

 అన్నిటి కన్నా ఎత్తైన స్థానములో నుండి వస్తువులు స్వరూప-సమర్థతలను తెలియచేయునది.గోపికల పిలుపులకు మేల్కొనలేదని  మేల్కాంచుటకు అత్త, సంకీర్తనమును చేయమని ఉపాయమును చెప్పినది. ఇది దేహ సంబంధ జ్ఞానము.

  ఇప్పటి పాశురములో గోదమ్మ దైవ సంబంధ జ్ఞానమును మనకు పరియచయము చేస్తున్నది.పర కై ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాము
 కదా!

  "వాశల్ తిరవాదార్" తలుపు గడియ తీయమంటున్నారు బయటనున్న గోపికలు.ఫలితము లేదు.కనీసము "మాత్తాముం తారారో" మాటైన పలుకవమ్మా అంటున్నారు.గదిలోపలి నుండి సర్వగంధ శోభితుడు ధరించిన తులసి పరిమళములు బయటకు వ్యాపిస్తు స్వామి ఉనికిని తెలియచేస్తున్నాయంటున్నారు గోపికలు.కాని బదులు రాలేదు లోపటి నుంచి.


 ఈ గోపికను మేల్కొలుపుతు గోదమ్మ మూడు విషయములను ప్రస్తావించినది.

 మొదటిది జీవాత్మ-పరమాత్మ అలౌకిక మిథునము.దానికి గుర్తుగా"నాత్తత్తుళాయ్
" తులసిమాలల పరిమళములను గోపికలు గుర్తించినారు."సర్వ గంధ స్వామి" పాదములు వేద గంధము తోను,చేతులు పెదవులు నాద గంధము తోను,ఉరము కస్తురి గంధము తోను అపురూపముగా పరిఢవిల్లుచున్నవి.


 ఆ సుగంధములు స్వామి నిర్హేతుక కృపాకటాక్షములు.దానికి నిదర్శనమే "సకలేంద్రియ నివృత్తి "అను మన గోపిక నిద్ర.స్వామికి స్వామి వైభవమునకు వ్యత్యాసములేదు.పక్క ఇల్లు అన్నారు కదా.పరస్పరము పరమానందముతో ఉన్నారు.గోపికలతో బయటకు వెళ్ళుట ఆమె ఉన్న స్థితి కన్న చాలా చిన్నది.


 "పోత్త  ప్పరై తరుం పుణ్ణియనాల్ పండు ఒరునాళ్' అని,




బయటి వారు స్వామి గుణగణములను కీర్తిస్తున్నారు.అవి పరమానంద భరితములు.తలుపు తీస్తే కీర్తనము
ఆగిపోతుంది కనుక అంతర్ముఖియైన  గోపిక పుణ్యకీర్తి-పుణ్యలబ్ధ-పుణ్య శ్రవణ కీర్తనమును ఆస్వాదిస్తున్నది.



 ఇంతలో ప్రవేశించాడు  "కూత్తత్తిన్ వాయ్"మృత్యువు నోటబడిన కుంభకర్ణుడు తన మొద్దు నిద్దురను ఆమెకిచ్చి.ఆ మాట వినబడగానే గోపిక బహిర్ముఖియైనది."తేత్తమాయ్ వందు"
 తత్తర పాటుతో బయటకు రాబోతున్న సమయమున గోపికలు ఆమెఉన్న స్థితిని హెచ్చరించి సావధానముగా భక్తి సమర్పణమునకు రమ్మన్నారు.

 ఎవరీ కుంభకర్ణుడు? అతని నిద్ర పరమార్థమేమిటి? ద్రవిడ సంప్రదాయానుసారము-కుంభము కుండ నుండి పుట్టిన వాడు అగస్త్య మహర్షి.రూపము కురుచ-శక్తులు ఘనము.ఈయన మూడు కార్యములను జగత్కళ్యాణమునకు చేసినాడు.మొదటిది వింధ్య పర్వతమును నకు వినయమును నేర్పెను.రెండవది (జ్ఞాన) సముద్రమును అవపోసన పట్టెను.వాతాపిని (అసురత్వమును) అంతమొందించెను. అనవరతము భగవత్తత్త్వముతో రమించుటయే ఆయన పోవు నిద్ర.త్వమేవాహం అను పధ్ధతి.

 మన గోపిక కూడ సద్గుణభూయిష్ట కనుక ఆమెను వ్రత నిర్వాహకురాలిని  చేసినది . గోదమ్మ వేరొక గోపికను మేలుకొలుపుటకుతల్లి బయలుదేరినది.


 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం)












MARGALI MALAI-09


  మార్గళి మాలై-09
  **************

  తొమ్మిదవ పాశురం
  ***************

 తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియె
 తూపం,కమళ త్తుయిల్ అణై మేల్ కణ్ వళరుం
 మామాన్! మగళే! మణికదం తాళ్ తిరవాయ్
 మామీర్! అవళై ఎళుప్పీరో! ఉన్ మగళ్ తాన్
 ఊమైయో? అన్రిచ్చెవిడో? అనందలో?
 ఏమన్ పెరున్ తుయిల్ మందిరపట్టాళో?
 "మామయన్-మాదవన్-వైకుందన్" ఎన్రెన్రు
 నామం పలవుం నవిన్రు ఏలోరెంబావాయ్.

 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.

 అత్తరు వాసనల గదిలో మెత్తటి పరుపులమీద
 మొద్దునిద్ర శాపమైన ముద్దుగుమ్మ మేలుకో

 మణిదీపముల మేడలో, మనసున దాచిన వానితో
 మమేకమై మము మరచిన మరదలా మేలుకో

 ఓ అత్తా! నీ కూతురు ఎంతకీ లేవదు సోమరియా??
 చెవిటిదా ? మూగదా ? మంత్ర ప్రభావితమైనదా?

 హరినామ కీర్తనమే అసలైన మందు తనకు
 తల్లి తానె తరలి వచ్చె తానొక గోపికయై

 పాశురములు పాడుతు, పాశములన్నిటిని వదిలి
 నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో! ఓ మామ కూతురా!

 గోదమ్మ ఈపాశురములో మామన్ మగళే-మామీర్ అంటు దేహ బంధుత్వమును మనకు పరిచయము చేస్తు,ప్రస్తావించుచున్నది.

 శరీర దోషములైన,ఇంద్రియ లోపములైన మూగతనము-చెవిటి తనము-గుడ్డితనమును అవి ఏ యే పరిస్థితులలో గుణ-దోషములుగాభావింపబడునో వివరించుచున్నది.

 " మననాత్ త్రాయతే ఇతి మంత్రః"   ద్రష్టత్వపు    గుణ-దోష పరిణామ పరిస్థితులను తెలియచేస్తున్నది.


 ( భగవత్ శ్రీమాన్ రామానుజాచార్యులుగా ఈ గోపిక తత్త్వమును గుర్తించి ఆరాధిస్తారు.ఆండాల్ తల్లి సాక్షాత్తు భూదేవి ఆమెను సోదరిగా భావించి వివాహ సమయమున సారెను పంపి ధన్యుడైన ఆచార్యుడు. ఆచార్యుని అనుగ్రహమును పొంది,తన జ్ఞానచక్షువును మరింత విస్తృతముచేసుకొని అలౌకికానందనుభవములో ఉండుట మామకూతురి నిద్ర.)

 మనకు ఈ పాశురములో రెండు విధములైన గోపికా స్వభావము అవగతమగుతుంది.లోపల
 నిదురిస్తున్న గోపిక  సూర్యుని దగ్గరకు మనము   వెళ్ళగలమా?
-ఆయననే తన కిరణములతో మనలను అనుగ్రహించవలెను కాని అను భావనతో ఉంటుంది.అదేవిధముగా పరమాత్మ మన దగ్గరకు తానే రావలెను గాని సర్వాంతర్యామి అయినస్వామిని ఎక్కడున్నాడని మనము వెతుకుతు పోగలము అను సిధ్ధాంతముతో తన మందిరములోనే ఆలోచిస్తూ ఉంటుంది.ఇది పరగత ఆశ్రయము.శాశ్వత్వము దీని   లక్షణము.


  ఆమెను మేల్కొలుపుచున్న గోపికలు మనమే స్వామిని   వెతుకుతు
 వెళ్లి,సంకీర్తించి,సఫలులము కావలెనన్న సిధ్ధాంతముతో నున్నవారు.వారు స్వగతాశ్రయులు.వీరిది స్వామి నుండి వరములను స్వీకరించవలెనను మానసికస్థితి.సాక్షాత్తు స్వామి తమను అనుగ్రహిస్తానన్నప్పుడు వారు స్వామిని   కోరుకోలేరు
.వీరు పొందుచున్న అనుగ్రహము తాత్కాలికము.

   తాత్కాలిక అనుగ్రహమును మించిన శాశ్వతానుగ్రహమును పొందవలెనన్న మణిమయ తలుగు గడియ వేసి,తలుపును మూసియున్నది. అది తెరుచుటకు ఆచార్య రూపమున ఉన్న ఆ గోపిక బాహ్యస్మృతిని పొంది వారిని సంస్కరించవలెను.

ఈ గోపిక నిదురుస్తున్న భవనము తూ-పరిశుధ్ధమైన మణులతో నిర్మించబడిన మేడ.ఇది వాచ్యార్థము.ఈ మణిమయ భవనమును వస్తురూపముగా భావిస్తే దశేంద్రియ నిర్మిత మానవశరీరము.కర్త పరముగా భావిస్తే పరమాత్ముడు.వెలిగించిన దీపములు వేదములు.పరమాత్మ శుభగుణములు.ఆచార్యులు.వేదాంగములు. సుగంధ పరిమళములను వ్యాపింపచేయు అగరుధూపములు.భగవద్భావము. మేడ-భాగవతులు ప్రకాశించుచున్న మణిదీపములు-వారి అనుగ్రహ సందేశములు సుగంధ ధూపములు.ఇవి పొగను వ్యాపింపచేయని(తమస్సును) జ్ఞాన వాహినులు.

 మన గోపిక ఆచార్యుని అనుగ్రహమును పొందినది కనుక బాహ్యమునవర్ణించిన భోగ్య వస్తువులైన మణిమేడ,అందులో వెలుగున్న మణిదీపములు,సుగంధ పరిమళముల వైపునకు ఆకర్షింప బడుట లేదు.ఆమె వీటిని తోసిబుచ్చి ఆత్మానందమును అనుభవించుచున్నది.మనము సంసారమునందున్నను దీనిని ఒక పరికరముగా మలచుకొని సాయుజ్యము అందిపుచ్చుకొన వలెను


  ఇంద్రియ   లోపములుగా భావింపబడు చెవిటి తనము-మూగతనము-గుడ్ది తనము వాచ్యార్థములు.చెడు అనవద్దు-వినవద్దు-కనవద్దు అని భావిస్తే అవిగుణములు.

  మంత్ర ప్రభావితురాలు కనుకనే చేష్టలుడిగి ,సమాధానమునీయకున్నది.వాచ్యార్థము.ఆచార్యులు ఏ మంత్రమును ఉపదేశము చేసినారో అసలయిన దానిలో (బ్రహ్మములో) రమించుచున్నది.అ ఆనందాను భవమును అందరితో పంచుకొనుటకై బహిర్ముఖియై,వేరొక గోపికను మేల్కొలుపుటకు అమ్మతో నడువసాగినది.


 (ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.)





 







.
.


MARGALI MALAI-08


  మర్గళి మాలై-08
  ******************

  ఎనిమిదో పాశురము
  ***************



కీళ్వానం వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు
 మేయ్ వాన్పరందన కాణ్! మిక్కుళై పిళ్ళైగళుం
 పోవాన్ పోగిన్రారై ప్పోగామల్ కాత్తు ఉన్నై
 క్కూవువాన్ వందు నిన్రోం కోదుకుల ముడియై
 పావాయ్! ఎళుందిరాయ్ పాడిపరై కొండు
 మావాయ్ పిళిందానై మల్లరై మాట్టియ
 దేవాదిదేవనై చ్చెన్రు నాం శేవిత్తాల్
 ఆవావెన్రు ఆరాయందు అరుళ్ ఏలోరెంబావాయ్.

 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
 *************************



శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 తూరుపు చీకట్లు తొలగి తెల్లవారినది నేడు
 గేదెలు చిన్నమేతకై  పయనమైనవి చూడు

పూజకు వెళుతున్నవారిని నీకొరకై నిలిపినాము
నిన్ను తోడ్కొని పోవగ అందరము వచ్చినాము

ముష్టిక-చాణూరులను మట్టుబెట్టిన స్వామి
పావన సంకీర్తనముతో పావాయ్ మేలుకో

వచ్చేసారా మీరు  అను దేవాదిదేవుని కొలువ
తరలివచ్చినది తల్లి తానొక గోపికయై


 పాశురములు పాడుచు,పాశములన్నింటిని వదిలి
 నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో!ఓ మానిని.


  ఆరు_ఏడు పాశురములలో నిదురించు గోపికలను మేల్కొలుపుటకు శ్రవణమును.ఈ పాశురములోని గోపిక భగవదర్శన కుతూహలము కలది.తానును పరమాత్మయు పరస్పర అధీనులుగా భావించునది.(శ్రీమాన్ పేయ్ ఆళ్వారుగా భావిస్తారు.) చతుర గోపికను మేల్కొలుపుటకు అమ్మ దృశ్య ఉపకరణమును ప్రస్తావించు,.గోదమ్మ చెప్పిన-చూపిన గురుతులకు పరధర్మ-ధర్మిత్వమును ఆరోపించి,చతురతతో చమత్కరించినది ఈ నాటి గోపిక.

 గోదమ్మ "కీళ్వానుం వెళ్లెన్రు" అంటూ తూరుపు దిక్కు చీకట్లను తరిమివేసి తెల్లదనపు కాంతులతో నున్నది చూడు అనగానే,

  చతుర గోపిక ఆ ప్రకాశము ఉషోదయమునది కాదని వ్రతమునకు సంసిధ్ధులగుచున్న గోపికల ఉత్సాహ ముఖవర్చస్సుగా సమర్థించినది.

  రెండవ దృశ్యమైన "ఎరుమై "గేదెలు శిరువీడు-చిన్న మేతకు వెళ్ళుచున్నవనినది,కనుక ఆ ప్రదేశమంతయు నల్లగా మారినది చూడు అని గోదమ్మ అనగానే,

  నేను నమ్మను.ఆ నల్లరంగు మేతకు వెళ్ళుచున్న గేదెలది కాదు.మీ ముఖవర్చస్సు తెల్లగా ప్రకాశిస్తున్న చోట ముందున్న చీకటికదిలి వేరొక చోటకు పయనించు  చున్నదనెను.

 గేదెలు ఎక్కడికి వెళ్ళాయి? అంటే చిన్న మేతకు.కొద్ది సమయమునకే అవి తిరిగి ఇంటికి వచ్చేస్తాయి.తమోగుణము పరాశ్రయతత్త్వము కలది.స్వతంత్రముగా ఎక్కువ సేపు ఉండలేదు.కనుక అది తిరిగి వచ్చి నిన్ను చేరేలోపున త్వరగా మేల్కొని వ్రతమునకు పోదాము అన్న అంతరార్థము.

   "పోవాన్ పోగిన్రారై ప్పోగామల్ కాత్తు" గోపకాంతలు ఉత్సాహముతో వ్రతమునకు వెల్లుచుండగా నీ కొరకు   వారిని   ,పోనీయకుండా నిలిపి,నిన్ను మేల్కొలుపుటకు వచ్చాం అన్నారట.

 ఇప్పుడు లోపలి గోపిక తన దగ్గరికి వచ్చిన గోపికలతో ఎక్కడికి వెళ్ళాలి? ఏమి చేయాలి? ఏమి ప్రయోజనము? చెప్పండి అని అడిగినదట.

   గోపిక తమతో తీసుకొని వెళ్ళవలెనని ,వారు కేశిని చంపిన వానిని,ముష్టియుధ్ధములో చాణూర-ముష్టికాసురను భంజించిన వానిని పాడి-కీర్తించి,"పరై  కొండు"  పర ను తీసుకుందాము.అన్నారట.
అహంకార-మమకారములు-ఆరాట-పోరాటములు,సుఖ-దుఖములను ద్వంద్వములే ఈ చాణూర-ముష్టికాసురులు.
           .ఇక్కడ వారిది నిశ్చయ భక్తి కనుక స్వామి ఇస్తాడో ఇవ్వడో అను సందేహము లేదు.స్వామి దగ్గర నుండి తమకు తామే" కొండు" తెచ్చుకోగలరు అన్నారు.

,తానును తల్లితో గోష్టికి వెళ్లదలచుకొన్న చతుర గోపికను కలుపుకొని,వేరొక గోపికను మేల్కొలుపుటకు గోదమ్మ తరలుచున్నది.

  ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)






Friday, November 29, 2019

MARGALi-07


   మార్ఘలి మాలై07
   ***************

   ఏడవ పాశురం
   ************

 కీశు కీశెన్రు ఎంగుం ఆనైచ్చాత్తం కలందు
 పేశిన పేచ్చరవం కేట్టిలైయో? పేయ్ పెణ్ణే!
 కాశుం పిరప్పుం కలగల ప్పక్కై పేర్తు
 వాశ నరుం కుళల్ ఆయ్ చ్చియర్ మత్తినాల్
 ఓశై పడుత్త త్తయిర్ అరవం కేట్టిలైయో?
 నాయగపెణ్ణ్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి
 కేశవనై పాడవుం నీకేట్టే కిడత్తియో?
 లేశముడయాయ్! తిర్ ఏలోరెంబావాయ్.

 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
************************


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 భరద్వాజ పక్షుల సత్సంగములు వినబడుటలేద
 భావతాదాత్మతతో బాహ్యము విడనాడినావు

 చల్లచిలుకు గొల్లల కవ్వడి సవ్వడులు వినలేద
 నల్లనయ్యా తలపులో తలమునకలవుతున్నావు

 నీ తలుపు సందునుండి ప్రసరించు నీ మోము కాంతి
 మా కేశవ స్మరణమును ప్రతిబింబిస్తున్నది

 నాయికవై మా అందరికి,నారాయణ మహిమ పంచు
 తల్లి తానె తరలి వచ్చె తానొక గోపికయై

 పాశురములు పాడుచు,పాశములన్నింటిని విడిచి
 నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో?ఓ నాయికా! .


 " ఏకమేవం బ్రహ్మం న అద్వితీయము" అను పరమార్థమును గోదమ్మ భరద్వాజ పక్షులు-చల్ల చిలుకు భామలు -గోపిక ముఖ తేజస్సు అను మూడు విషయములను ఉపకరణములుగా మలచి మనలను చైతన్యవంతులను చేయుచున్నది.

  ఏ విషయమునకైన స్పందించకున్న లేక సందేహమును వెలిబుచ్చకున్న ఆ విషమును వారు పూర్తిగా అర్థము చేసికొనిన వారైనా కావచ్చును లేదా ఏమాత్రమును అర్థము కాని వారైనను కావచ్చును.

ఆరవ పాశురములో పుళ్ళుం అని పక్షులను సామాన్యవాచ్యముగా వాని ధ్వనులను అర్థగ్రహణ దుర్లభముగా ప్రస్తావించినది.అది శ్రవణ భక్తి మొదటి దశ అని అనుకొన్నాము.ఈ పాశురములో గోదమ్మ వాటిని "ఆనైచ్చాతం" భరద్వాజ పక్షులు అను విశేష నామధారులు గాను,అవి అన్ని ఒకచోట అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ తత్త్వముగాను,అంతటను వ్యాపించి యున్నప్పటికిని కలిసి ఏక కాలమున ధ్వనించు శృతి-స్మృతి విచారణముగా ప్రత్యేకించి చెప్పినది.
  పూర్వము భరద్వాజ ముని బ్రహ్మాండ విశేషములను అధ్యయనము చేయగోరి భగవానునిచే రెండు పూర్ణ జన్మల 200 సంవత్సరముల ఆయుర్దాయమును పొందినాడట.అయినను తాను నేర్చుకొన్నది పరమాత్మ రచనలోని పరమాణువు మాత్రమే నని,దాని కన్న పరమాత్మ మూలతత్త్వమైన బ్రహ్మమును తెలిసికొనుట పరమానంద భరితమని గ్రహించినాడట.భగవంతుని సేవకన్న భగవద్భక్తుల సేవభాగ్యమును గొప్పదిగా భావించేవాడట.అందులకు నిదర్శనముగా తన దగ్గరకు వచ్చిన శ్రీరాముని కన్న భరతుని సేవించి మిక్కిలి ఆనందపడినాడట.

" బ్రహ్మము అంటే ఏమిటి? అని మనలను మనము ప్రశ్నించుకుంటే ప్రళయకాలమునందు దేనిలో మనము నామరూపరహితులమై దాగి ఉంటామో,ప్రస్తుత కాలములలో నామరూపరహితముగా ఏది మనలో దాగి ఉంటుందో అదేబ్రహ్మము అన్న విషయము కొంచకొంచముగా అర్థమవుతుంటుంది.అవియే బ్రహ్మము యొక్క స్థూల-సూక్ష్మ రూపములను విషయము తెలుస్తుంటుంది."






  భారద్వాజ పక్షులు "బ్రహ్మమును అనుసరించు" అని తెలియచేయువిధానమే "కీశుకీశు" అను అనుకరణ శబ్దములు. నిరాకర నిర్గుణ పరబ్రహ్మమును అను తెలియ చేయు
నాదములు.


 జ్ఞానశృతి-రైకుల కథ.జ్ఞానశృతి చేసిన అన్నదాన ఫలిత తేజము ఆకసమున వ్యాపించి యున్న సమయమున ఒక భరద్వాజ పక్షి తన జంట పక్షితో అటువైపు వెళ్లవద్దు ప్రమాదము అని చెప్పగానే మరొక భరద్వాజము రైకుని బ్రహ్మత్వమును తెలియచేసి శృతజ్ఞానిని సంస్కరించినది.




   పరిధిని దాటిన భావము కాని పనికాని పిచ్చిగా గుర్తించుట లోక సహజము.(శ్రీమాన్ కులశేఖర ఆళ్వారులుగా కీర్తించబడే )ఈ గోపిక భ్రాంతి మోహితురాలై,గోపికల పిలుపునకు సమాధానమును ఇచ్చుటలేదు.భారద్వాజ పక్షుల వృత్తాంతమునమును వినినదో లేదో అని గోదమ్మ పిచ్చి పిల్లా భగవద్గుణామృతపానమను భ్రాంతిలో (పిచ్చిలో) ఉన్న దానా మేల్కొను.తెల్లవారినదనుటకు నీకు ఇంకొక ఉదాహరణమును చెబుతాము అంటున్నారు గోపికలు.

 ఏవిధముగా భరద్వాజ పక్షులు అన్ని కలిసి అంతట వ్యాపించి ఏక కాలమున కీశు కీశు అను నిర్దిష్ట ధ్వనినిచేస్తున్నాయో,అదేవిధముగా గోకులములోని గొల్లెతలు శుచులై-సుముఖులై నిత్యకృత్యమైన చల్ల చిలుకుట అను పనిని క్షీరసాగర మథనమంత పవిత్రముగా భావించి చేయుచున్నారట.అప్పుడు మూడు ప్రదేశముల నుండి ధ్వనులు త్రికరణశుధ్ధములై హరి నామమును కీర్తిస్తున్నవా అన్నట్లుండెనట.

కృష్ణ  పరిష్వంగమును పొందిన గోవుల క్షీరము  లభించిన పెరుగు చిలుకుటకు  వారు పట్టుకున్న "మత్తి" కవ్వము సాక్షాత్తు స్వామి వలె కనిపిస్తు వారిని చేతులు చాచి ముందుకు రమ్మని కవ్విస్తున్నదట.కట్టిన తాడు చటుక్కున జారిపోతుందేమనని గట్టిగా పట్టుకొని చల్లచిలుకుతున్న సమయమున వారి మనస్సు తమ యెదపై నున్న "కాశొ-పిరప్పులు" మంగళసూత్రములు మంగళధ్వనులను చేస్తు మైమరచుచున్నవట.చాచిన చేతుల కంకణములుకాయకర్మకు ప్రతీకలై కణ్ణా-కణ్ణ-కణ్ణాఅంటున్నవట.కవ్వపుచప్పుడు వాక్కుతో జతకలిపి వాని వైభవమునవర్ణించుచున్నదట.
."మనో వాక్కాయ కర్మలు అతిపవిత్రరూపమును దాలిచి చేయుచున్న"

కైంకర్య  సవ్వడి(మత్తినాల్ ఓశై)వారి కేశము ముడిని విడదీసి వాని నుండి వచ్చు సుగంధ పరిమళములను(వాశనరుం కుళల్) రేపల్లెనంతా వ్యాపింపచేస్తున్నదట.

ఇది వాచ్యార్థమైనప్పటికి అంతరార్థము యోగులు-జ్ఞానులు గొల్లెతలు చేతులు చాచినట్లు తమ అపారకరుణను అందించుటకు చేతులనువిశాలముగా చాచినట్లున్నది.ఆ మూడు సవ్వడులు వేద-వేదాంత రహస్యములను ప్రీతితో వెల్లడించునట్లున్నది.తద్వారా వారినుండి జాలువారిన జ్ఞానధారలు వడివడిగా రేపల్లెను అంతటను సుసంపన్నము చేసిన పరిమళము వలె శోభిల్లుచున్నది.


.

గోదమ్మ ఈ పాశురములో నిదురిస్తున్న గోపికను " పేయ్ పెణ్ణా" భ్రాంతిలో ఉన్నదానా అని మొదట సంబోధించినది. ఆమె పిచ్చిదని గోపికలు భ్రమపడినారు.భ్రాంతి పడినారు.కాని నిజమునకు ఆమె,

 దివ్య తేజోరాశి " నడిపించగల సామర్థ్యము కలది.నాయకుని కూతురు.కనుక "నయతి ఇతి నాయికా"గోదమ్మ ఆమెను నిద్ర లేపుతు రెండవసారి "

"నాయగన్ పెణ్ణ్ పిళ్ళాయ్"" అంటూ నువ్వేమా నాయికవు అని తెలిపినది. మరియొక విశేషమేటంటే సంకీర్తనలో స్వామిని నారాయణుడు-కేశవుడు)  సర్వజీవులకు ఆధారమైన నారాయణుడు,"కేశి" అను అసురుని సమ్హరించి క్లేశములను తొలగించిన కేశవుడు  అని నామములతో కీర్తించు టచే నామసంకీర్తనము నూతనత్వమును సంతరించుకున్నది.నామ సంకీర్తనమును చేస్తూ గోదమ్మ ఈ గోపికను నాయకురాలిని చేసి గోష్టికి వేరొక గోపికను మేల్కొలుపుటకు బయలు దేరుచున్నది.


 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం..)




.

MARGALI MALAI-06


     మార్గళి మాలై-06
    *******************

   ఆరవ పాశురం
   *************

 పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్ళ్రైయన్ కోయిలల్
 వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో?
 పిళ్ళాయ్ ఎళుందిరాయ్! పేయ్ మాలై నంజుండు
 కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
 వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
 ఉళ్ళత్తు కొండు మునివర్గళుం యోగిగళుం
 మెళ్ళ ఎరందుకళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
 వెళ్ళత్తరవిల్ తు ఏలోరెంబావాయ్.

 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.

 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ గోదా రంగనాథుని అనుగ్రహము అనవరతము

 పక్షులు కిలకిలరవముల  ప్రస్తుతించు చున్నవి
 పక్షిరాజు శంఖము మార్మ్రోగుచున్నది.విను

 చక్కదనపు పూతనను పాలుతావి సంహరించె
 చీకటిభావపు శకటుని కాలదన్ని నేలగూల్చె

 యోగులు-మునులు మెల్లగ బహిర్ముఖులైనారు
 యోగీశ్వరుని సుస్వరముల కీర్తించుచున్నారు

 స్వామి-సేవక తత్త్వము,తెలిసికొన  మేలుకో
 తల్లి తానె తరలివచ్చె తానొక గోపికయై

 పాశురములు పాడుకుంటూ,పాశములన్నింటిని వదిలి
 నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో ? ఓ బాలిక!.!

  ఆరవ పాశురము నుండి పదిహేనవ పాశురము వరకు మనము విభిన్నదశలలో నున్న గోపకాంతలను చూస్తాము.తన్మయ నిద్రలో పరవశించుచు తలుపులోపల నున్నవారు కొందరయితే,తమో నిద్రను వీడి భగవత్ సందర్శన-సాంగత్య-సాయుజ్యమును పొందుటకు తహతహలాడుచు,లోపలిగోపికలో నిద్రాణమైయున్న విశిష్ట శక్తులను జాగరూకము చేసి,జగత్కళ్యాణము గావింపవలెనన్న కోరిక కలవారు.అంతే కాదు ఆమెను మార్గదర్శకురాలిని చేసి,తాము అనుసరిస్తూ,వ్రతమును సఫలము చేసికొన దలచినవారు.


  వీరిలో ఎవరు ఎక్కువ భక్తికలవారో నిశ్చయించుట కష్టము.నిద్రిస్తున్నవారిది పారవశ్యము.మేల్కొలుపు వారిది ప్రాప్తి త్వరిత్వము.అందరును భగవదనుగ్రహమును పొందినవారే-బాంధవ్య విముక్తులే.

  గోదమ్మ ఈ పాశురమును " పుళ్ళుం శిలంబినకాణ్" అని పక్షుల కూతలతో ప్రారంభించినది.శ్రవణభక్తి మొదటిదశను మనకు పరిచయము చేస్తున్నది.ఏదో వినిపిస్తున్నది గాని శబ్ద స్పష్టత లేనిదానివలె నుండును.ఇది వాచ్యము.కాని ఇక్కడ పరిచయముచేయబడ్డ పక్షులు జ్ఞానులు.పరమహంసలు.అనుష్ఠానము-అనుగ్రహము అను రెండు రెక్కలు కలవారు.ౠషుల వాక్కులే పక్షుల కూతలు.వారు ఆకాశములోనికి ఆ-అంతట-కాశము-వెలుగు కల చోటికి వెళ్ళుచున్నారు.మూలతత్త్వ దర్శనమునకు సిధ్ధమగువారు.

 ఈ విషయమును తల్లి "పిళ్ళాయ్" అని సంబోధిస్తూ చెప్పినది.ఓ చిన్నపిల్లా! ఓ బాలా అని.అంత పెద్ద విషయమును ఇంతచిన్న పిల్లకు అమ్మ చెబుతోంది.అంటే ఓ బాలా! గ్రహణము-ధారణము-పోషకము అను మూడు సద్గుణములు పుష్కలముగా నున్న దానా! ( శ్రీమాన్ పెరియాళ్వారునిగా భావిస్తారు.)

 పక్షికూతల గుర్తు చెప్పినా పిల్ల లేవలేదు కనుక ఈ సారి గోదమ్మ 'పుళ్ళరయిన్" పక్షిరాజ వాహనుడైన శ్రీకృష్ణుని తెల్లని శంఖరవమును చెప్పినది.స్వామి శంఖము "విళి శంగిన్" తెల్లనైన సత్వగుణము కలది.కారణము లేని కదనమునకు కాలుదువ్వదు.అంతే కాదు.ఆ శంఖము ఇప్పుడు "పేరరవం" పెద్ద ధ్వనిని చేయుచున్నది.ఏమిటా పెద్దధ్వని.బాహ్యమునకు భక్తుల స్వామి నామస్మరణ.ఆంతర్యము ఎవ్వరుని ఇంతగొప్పదని లెక్కించలేని ప్రణవము.దానిని" కేట్టిలైయో? వినలేదా అని అడుగుతున్నది.

  తాదాత్మ్యములో నున్న గోపిక స్పందించని కారణమున ఈ సారి యోగుల మునుల హరినామమును సూచించినది.మననముచేయుచు ఆనందమును అనుభవించువారు మునులైతే.కైంకర్య రూపమున ఆత్మానందమును అనుభవించువారు యోగులు.వారు తమ మనసులలో వేదవృక్షబీజమైన స్వామిని భద్రపరచుకొన్నవారు.(ఉళ్ళత్తు కొండు).వారు తాము చటుక్కున కళ్ళు తెరిస్తే తమ కనులలో నున్న స్వామికి కష్టము కలుగునని మెల్లగా కన్నులు తెరిచి,మెళ్ళ ఎరందు,ఎదురుగ నీలమేఘశ్యాముని లీలా మానుషరూపుని చూస్తూ,ఆనందమును పట్టలేక బిగ్గరగ హరి-హరి అని సంకీర్తిస్తున్నారు.(అరిఎన్ర పేరరవం)

 పూతన జీవితహర-శకటాసుర భంజన అని కీర్తిస్తున్నారు స్వామిని.

"పేయ్ మాలై నంజుండు"
 తమోగుణుడైన కంసుని పంపున కృష్ణుని తన పాలిచ్చి చంపుటకు వచ్చినది పూతన.అయినప్పటికిని అజామిళుని వలె హరి సాయుజ్యమును పొందినది.మన అజ్ఞానమే పూతన.కామరూపియై (బాహ్యాడంబరలు మెచ్చు) గోపాలుని సమీపించినది.స్తన్యమునిచ్చి స్వామిచే సంస్కరించబడినది.

"కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి"



" శ" అనగా సుఖము."కట" అనగా ఆటంకము.పరమానందమునకు ఆటంకమును కలిగించునది శకటము.అదే మన శరీరము.ఇంద్రియనిగ్రహము లేక ఇబ్బందులను కలిగించును.మనోరథములతో రథమును సరిగా నడువనీయని అసురీ గుణమును నిర్మూలించిన స్వామిని కీర్తించుచున్నారనగానే,గోపిక బహిర్ముఖత్వమును పొంది ఆండాళ్ తల్లిని అనుసరించ సాగినది.,ఆ గోపికను తమతో కలుపుకొనిగోష్ఠికై,వేరొక గోపికను నిద్రలేపుటకు గోదమ్మ వెళుతున్నది.

 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.




MARGALI MAALAI-05


 మార్గళి మాలై-05
 ****************

  ఐదవ పాశురం
 ***************

మాయనై మన్ను వడమదురై మైందనై
తుయపెరునీర్ యమునై యరైవరై
 ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తుమలర్ తూవి  త్తుళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదరువా నిన్రనవుం
తీయనిల్ తూశాగుం శెప్పు ఏలోరెంబావాయ్.

 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
************************

 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 యమున దాటి వచ్చినాడు ఉత్తర మధురకు వాడు
 యశోదా నందనుడు లీలా మానుష రూపుడు

 పదునాలుగు భువనంబుల కట్లను విప్పువాడు
 పసిబాలునిగ రోటికి కట్టుబడిపోయినాడు

 దామోదరుడైనాడు  తామర కన్నులవాడు
 పాహి-పాహి అనగానే పాపాలు పారతోలేస్తాడు

 మనసారా స్మరియిస్తూ పరిమళ పువ్వులు చల్లగ
 తరలివచ్చినది తల్లి తానొక గోపికయై

 పాశురములు పాడుకొనుచు పాశములన్నిటిని విడిచి
 నప్పిన్నాయ్ తిరుప్పావైకు రారాదో !గోపికలారా.!



గోదమ్మ ఈ పాశురమును "మాయనై"మన్ను వడమదురై-మైందనై" అని ప్రారంభించినది.మైందనై-రాజుగా-బాలునిగా-రక్షకుడిగా-బలవంతుడిగా -నాయకుడిగా-సౌదర్యభూషితుడిగా అనేక రూపములతో చేష్ఠలతో మాయావి ఉన్నాడు.ఎక్కడ?అని గోపికలు ప్రశ్నించగా మన్ను వడమదురై లో అంటే,స్వామితోశాశ్వతసంబంధముగల
 ఉత్తర మధురలో,పవిత్ర జలపూరితమైన యమునకు రేవుగా ఉన్నాడట. .స్వామి అనుగ్రహ బధ్ధుడు అన్న విషయమును వివరించుతు దామోదరనామ వైభవమును కీర్తించినది గోదమ్మ.

"తూయోమాయ్ వందునాం" త్రికరణ శుధ్ధులై రండి.దేనికి అంటే తుమలర్ పరిశుధ్ధ పుష్పములను తీసుకొని,వాయినాల్ పాడి-నోరార కీర్తిస్తూ,మనత్తినాల్ శిందిక్క మనసారా స్మరిస్తూ,తుమలర్ తూవివళదు-స్వామిపై పూవులు చల్లుదాము అంటున్నది తల్లి.

 ఈ పాశురములో తల్లి మధురను-యమునను-మాతృగర్భ ప్రకాశమును స్తుతించినది. .ఇది వాచ్యార్థము.

 " మాయావై" అన్న పదము స్వామి మూలతత్త్వమును-దాని బహుముఖ ప్రజ్ఞను సంకేతిస్తుంది.తల్లిగర్భమును ప్రకాశింపచేశాడు కన్నడు.మంత్ర గర్భులైన ఆచార్యులు మంత్రమును ప్రకాశవంతముచేస్తారు.అందరికి దాని వైభవమును అందచేస్తారు.

  .ఆచార్యులు మంత్రగర్భులై మంత్రమును ప్రకాశింపచేస్తారు.అంతే కాదు తమ అనుగ్రహమును ప్రసరించుటకు ఆగామి-సంచిత-ప్రారబ్దములనుండి మనలను సంస్కరించవలెనను బంధమునకు తమకు తాము కట్టబడి యుంటారట.వారు అనుగ్రహ బంధితులు.

   వారిసేవనము మన పాపరాశులను మాయము చేస్తుంది అన్నది తల్లి.

   ఇప్పుడు మనము రంగనాథ కరుణామృత సాగరములో గోదా అనుగ్రహమనే నావలో పర-వ్యూహ-విభవ-అంతర్యామి తత్త్వములను అధిగమించి,నారాయణనే నమక్కే అను అష్టాక్షరిని జపిస్తూ,హరి అను ద్వయ మంత్రమును మననము చేస్తూ,త్రిక్రమ వైభవమును చూస్తూ,మేఘములో దాగిన అంతర్యామి తత్త్వ దర్శనులమై,ఈ నాలుగు లక్షణములతో మధురలో నున చిన్ని కృష్ణుని మూల తత్త్వమును,దాని బహుముఖతవములను కొంచము కొంచముగా తెలుసుకుంటూ.శ్రీవ్రతాచరణమునకు అభిముఖులైనాము.ఇది మొదటి దశ.ఈ దశ నుండి రెండవ దశ యైన ఆశ్రయణత్వమును పూర్తిగా చేరుటకు మనలను దగ్గరుండి నడిపించగల వ్రతమును తమ అనుష్ఠాముతో-అనుగ్రహముతో చక్కగా నిర్వహించగల ఆళ్వారులు కావలెను.కాని వారు ఇప్పుడు గోపికా రూపధారులై భగవదనుభవమును వివిధరకములుగా అనుభవిస్తూ,ఆనందలోలులై ఉన్నారు.వారిని బహిర్ముఖులుగా మార్చి ఆధ్యాత్మికకు చేరువ కాగలుటయే ఈ పది గోపికల మేలుకొలుపుల ప్రహసనము.సంభాషణా మరంద పానీయము.భగవత్ తత్త్వమును పదివందికి పంచుటకు మనము రేపటి నుండి అత్యంత మనోహరమైన ఆ ఆళ్వారుల లీలా విశేషములను తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము.

  ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)



.



.












MARGALI MALAI-04


  మార్గళి మాలై-04
  **************

 నాల్గవ పాశురము
 *************

 ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కైకరవేల్
 ఆళియల్ పుక్కు ముగందు కొడార్ త్తేరి
 ఊరి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు
 పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్
 ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్రు అదిరిందు
 తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళ్ పోల్
 వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం
 మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై.

 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
*************************

  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
  శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.

  సముద్రగర్భపు నీటిని కడుపు నిండ త్రావి త్రేన్ చు
  కారుమబ్బు రూపములో గగనమునకు పయనించు

  పద్మనాభ చేతిచక్రకాంతి  వలె మెరుపులతో
  పెద్ద యుధ్ధపువేళ మ్రోగు శంఖము వలె ఉరుములతో

  రామబాణ వరుస వంటి రమ్యమైన జల్లులతో
  మార్గళి స్నానము చేయగ వరుణదేవ కనికరించు

 జగత్కళ్యాణమునకు జలసమృధ్ధినందించగా
 తల్లి తానె తరలివచ్చె  తానొక గోపికగా

  పాశురములు పాడుకొనుచు పాశములన్నింటిని విడిచి
  నప్పిన్నయ్ తిరుప్పావై కు రారాదో? ఓ గోపికలారా!


ఆళిమళై కణ్ణా!అను సంబోధనతో వరుణదేవుని ,వానిచే కర్తవ్య పాలనము చేయించుచున్న స్వామిని కీర్తిస్తున్నది.పర-వ్యూహ-విభవ-అంతర్యామి తత్త్వముగల అర్చామూర్తిని సంకీర్తించుచు వ్రతముచేయుటకు గోపికలను ఉన్ముఖులను చేయుచున్నది.తల్లి ఆచార్యుల జ్ఞానవృష్టిని ,వరుణదేవుని వానలతో బాహ్య-అంతరార్థములతో వివరించుచున్నది.మార్గళి స్నానమును చేయుటకు వర్షములను సమృధ్ధిగా కురిపించమని,మమ్ములను చిన్నబుచ్చనీయని నీ వితరణను ప్రదర్శించమని చెబుతున్నది.వరుణదేవుడు ఏ విధముగా సముద్రగర్భములోనికి ప్రవేశించి,కడుపునిండా నీటిని త్రావి,తేంచి,నల్లని మేఘముగా మారి,ఆకాశమువైపునకు పయనించి అమృతధారలను వర్షించుట,అదియును సుదర్శనచక్రపు కాంతి వంటి కాంతిగల మెరుపులతో,స్వామి పాంచజన్య శంఖనాదము వంటి ఉరుములతో,అంతే కాదు రామబాణ పరంపర వంటి జల్లులతో కురిసి అనుగ్రహహించమని వేడినది.ఇది వాచ్యార్థము.




( శ్రీమాన్ నమ్మాళ్వార్ ఇతర ఆచార్యులతో మనకు అందించిన జ్ఞానోపదేశమని శ్రీవైష్ణవులు విశ్వసిస్తారు. )



  ఆళ్వారులు (ఆచార్యులు) వరుణదేవుని వంటివారు.వారు భగవత్ గుణములనెడి జ్ఞాన సముద్రములో పూర్తిగా మునిగి,భగవత్తత్త్వను నీటిని నిశ్శేషముగా త్రాగి,నిరంతరము నీలమేఘశ్యామునితో రమించుట వలన నల్లగా స్వామి మేనిఛాయను పొందుతారట.ఎంతటి భాగ్యశాలురో కద.మేఘము గగనమునకు వెడలునట్లు వీరును ఆ-అంతట-కాశము-ప్రకాశవంతమైన మూలతత్త్వమున ప్రవేశించి,మనలను సంస్కరించుటకు జ్ఞానామృతధారలను వర్షించెదరు

స్వామి శంఖనాద ప్రణవ నాదము శేష-శేషి భావమునకు,శరమళై స్వరూప యాదాత్మ్య జ్ఞానమునకు సూచికలు.ఉపదేశములు-.వారి జ్ఞాన వాగ్వర్షము కాంతిని-విజ్ఞతను మెరుపు ఉరుముల వలె కలిగియుండును.తిరుగులేని రామబాణముల వరుస వలె అనవరతము అనుగ్రహించుచుండును అని అమ్మ పర-వ్యూహ-విభవ మైన ఆచార్య తత్త్వమును " ఆళిమళైకణ్ణా! అని ప్రస్తుతించినది."ముగందు కొడు" అని జ్ఞానమును పూర్తిగా సంగ్రహించిన వారిగా ప్రస్తుతించినది.వారి జ్ఞాన ధారలను"మగిళిందు పెయిదిడాయ్" ఆనందముగా వర్షించమని అభ్యర్థిస్తున్నది.లోక కళ్యాణమునకై గోదమ్మ తనను ఒక సామాన్య గోపికగా భావించుకొని మనందరకు వ్రతవిధానము అతి ముఖ్యమైన అనన్య శరణత్వమును అందించుచున్నది.



  (ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)



.



MARGALI MALAI-03

MAARGALI MAALAI-03

  మార్గళి మాలై-03
********************

 మూడవ పాశురం
 ***************

  ఓంగి ఉలిగళంద ఉత్తమన్ పేర్పాడి
  నాంగళ్ నంబావైక్కుచ్చాత్తి నీరాడినాల్
  తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మురి పెఉదు
  ఓంగు పెరుం శెన్నల్ ఊడు కయల్ ఉగళ్
  పూంగువళై ప్పోదిల్ పొరివండు కణ్పడుప్ప
  తేంగాదే పుక్కిరుందు శీర్తమాలై పత్తి
  వాంగక్కుడం నిరక్కుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
  నీంగాద శెల్వం నిరైందు ఏలో రెంబావాయ్.

   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
 **************************


  శ్రీకరము శుభకరము భవతరణము శ్రీవ్రతము
  శ్రీగోదారంగనాథుల అనుగ్రహము అనవరతము.

  పెరిగి లోకములను కొలిచిన పెరుమాళ్ సంకీర్తనలు
  కురిపించును నెలకు మూడువానలను కరువుతీర్చు

  పంటచేలు మింటితాకు పరమానందమును కూర్చు
  పడిలేచే చేపలతో సెలయేళ్ళు పరవశించు

  అందమైన పూలలో తుమ్మెదలు ఆదమరచి నిద్రించు
  సురభుల శిరముల క్షీరము సుభిక్షరూపమును దాల్చు

  శాశ్వతైశ్వర్యములు-శాంతిసౌభాగ్యముల నీయగ
  తరలివచ్చినది తల్లి తాను ఒక గోపికగా

  పాశురములు పాడుకొనుచు,పాశములన్నిటిని విడిచి
  నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో? గోపికలారా!


  " బ్రహ్మ కడిగిన పాదము-బ్రహ్మమురా నీ పాదము
    చెలగి వసుధ కొలిచిన నీపాదము" అని కీర్తించాడు అన్నమయ్య.

  స్వామి " ఓంగిఉలగలందన్ ఉత్తమన్" -పెరిగి తన పాదముతో భూమిని కొలిచిన స్వామి నీవుఉత్తముడవు అని కీర్తించినది.స్వామి ఎటువంటి దోషములు తాకలేనంత ఎత్తున ఉన్నాడన్నమాట.కనుకనే త్రివిక్రముడై తన పాదస్పర్శచే మూడులోకములను పవిత్రముచేయగలిగినాడు.పేర్పాడి -అటువంటి ఉత్తముని గుణగానము చేద్దామంటున్నది గోదమ్మ.

 తల్లి మొదటి పాశురములో అష్టాక్షరిని నారాయణన్ నమక్కే అంటూ,రెండవ పాశురములో ద్వయమంత్రమును (పరమన్)స్మరించి,మూడవ పాశురములో గీతాచార్యము లోని మమేక శరణం వ్రజ తత్త్వమును ప్రస్తావించి,తారకము-భోగ్యము-పోషకము అను మూడు విషయములు వివరించునది.ఆచార్య కుల సంబంధమును (త్రివిక్రమ తత్త్వమును) గోపికలుగా భావింపబడు మనకు పరిచయము చేసినది.





స్వామి నీవుమాదగ్గర లేకున్నను నీ నామము ఎప్పుడు మాతోనే ఉంటుంది.స్వామి నీ గుణవైభవమును కీర్తించగల శక్తిలేని వారము.కాని నీ గుణవైభవములు మమ్ములను కీర్తించకుండ ఉండనీయవు.అంతటి గొప్పవి.కనుక చదువు లేని మేము అతిశయమైన భక్తితో ఆలపిస్తాము.



  సిరి ఉరమున గల హరి సురులశ్రేయమును కోరి యాచకుడైనాడు.త్రివిక్రముడై బలి చక్రవర్తి అహమును పాతాళమునకు దించినాడు.అహంకారముతో కూడిన విహిత కర్మకు కూడ స్వామి పాదస్పర్శ అనుగ్రహించుట స్వామి స్వభావము.


  మంచి-చెడు,చిన్న-పెద్ద,పాప-పుణ్య అను భేదములు అధిగమించి,స్వామి పాదస్పర్శ చే సకలము పునీతమైనది.


 "తింగళ్ ముమ్మురి పెయిదు" అన్నది అమ్మ.నెలకు మూడువానలను పిలిచినది.ఏమిటా మూడు వానలు .బాహ్యమునకు జలసమృధ్ధి కరములైనప్పటికిని,వానిలో దాగిన విషయమేమిటి?

1.అనన్య భోగత్వము-అనన్య శరణత్వము-అనన్య రక్షకత్వము అను మూడు వానలు మనలను సత్వగుణ సంపన్నులను చేస్తుంది.

2.అకర ఉకార మకార మిళితమైన ప్రణవమును "ఓం" ను అమ్మ మూడు వానలుగా కీర్తిస్తున్నది.సస్వరూపమును దర్శింప చేస్తు,నిశ్చలభక్తి అనె ఏపుగా పండే పంటలకు ఎదురయే ఆటంకములను అధిగమింపచేసేవి ఆ వానలు.

3.పాలకులు-స్త్రీలు-బ్రహ్మజ్ఞానుల సత్ప్రవర్తనానుభవమును అమ్మ మూడు వానలుగా కీర్తించినది.



  స్వామి నీవు నడిచిన నేలను నెలకు మూడు వర్షములు కురియాలి నెలకు మూడు వానలు అను విషయము అనన్య భోగత్వము-అనన్య శరణత్వము-అనన్య రక్షణత్వము అను మూడు విషయములను గుర్తుచేస్తున్నది.బీడులు పడిన మన మనసు ఈ మూడు వానలతో తడిసి తాపమును తగ్గిస్తుంది..మేము మార్గళి స్నానమును చేయాలి.పంటచేలు మింటిని తాకాలి.వాటి మధ్యనున్న సెలయేళ్ళలో చేపలు సంతోషముతో గంతులేయాలి.కోనేటిలో పద్మములు విరగబూయాలి.వాటి మకరందమును ఆస్వాదిస్తూ తుమ్మెదలు మత్తుగా నిద్రించాలి.

 స్వామి గుణమనే తామరపువ్వులలోని అనుగ్రహమను మకరందము త్రాగి భక్తులను తుమ్మెదలు వీడి రాలేక యున్నవి.

 గోపాలా ! నీ విభవమనే సెలయేటిలో సామీప్య సంతోషమునందుచున్న చేపలవలె నిన్ను చూస్తు మమ్ము తుళ్ళనీ.

 అని ఆండాళ్ తల్లితో కూడిన గోపికలు స్వామిని కీర్తిస్తున్నారు.

 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)


Thursday, November 28, 2019

maargali maalai-02


   మార్గళి మాలై-02
  ****************

 రెండవ పాశురము
 ***************
 వైయత్తువాళ్వీర్గాళ్ నాముం నం పావైక్కు
 చ్చెయ్యుం కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
 పైయత్తు ఇన్ర పరమన్ అడిపాడి
 నెయ్యిణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
 మై ఇట్టు ఎళుదోం మలరిట్టునాం ముడియోం
 శెయ్యదన్ శెయ్యోం తీక్కురళై శ్శెన్రు ఓదోం
 ఐయయుం పిచ్చైయుం ఆందనయుం కైకాట్టి
 ఉయ్యుమారు ఎణ్ణి ఉగందు ఏలోరెంబావాయ్.

 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
 *************************


  శ్రీకరము శుభకరము భవతరణము శ్రీవ్రతము
  శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.

  పాలు-నెయ్యి తినుట మాని జిహ్వను జయిద్దాము
  పాలకడలి శేషశయనుని భక్తితో సేవిద్దాము

  కాటుక-పువ్వులు వద్దని దేహభ్రాంతి వీడుదాము
  కాయక-వాచక-మానస శుధ్ధితో వేడుదాము.

  నియమానుసారముగా నిషిధ్ధ కర్మలు వదిలేద్దాము
  సాధువులకు-పేదలకు భిక్షా సమర్పణలను చేద్దాము

  చెడు మాటలు మాటాడక-చెవిలోనికి రానీయకుమని
  తరలివచ్చినది తల్లి తానూ ఒక గోపికయై,



  పాశురములములు పాడుకొనుచు పాశములన్నిటిని విడిచి
 " నప్పిన్నాయ్ తిరుప్పావై" వ్రతమాచరింప రారో! ఓ గోపికలారా!

 ఈ పాశురమును గోదమ్మ "వైయత్తు వీళ్వారాళ్" అని ప్రారంభించినదిచీకటితో నిండియున్న ఈ భూమండలమందున్న వారైనను దాని దరిచరనీయక  సంతోషులై ఉన్నవారందరు వ్రతాచరణమునకు యోగ్యులన్నది అమ్మ.

.(పార్కడలుళ్) పాలకడలిలో శయనించు స్వామియే రక్షకుడు అను నిశ్చయజ్ఞానము కలది తల్లి కనుక "నాముం నం పావై" మనము కీర్తిస్తు చేస్తున్న వ్రతము ఎటువంటిదంటే స్వామి వైభవమును పెంపొందించునది.

        మొదటి పాశురములో అమ్మ గోపికలకు స్వామి అనుగ్రహమునకు ఏంచేయవలెనో ఉపాయము చెప్పినది.రెండవ పాశురములో వ్రతనియమములను వివరిస్తు చేయవలసిన పనులు-చేయ కూడని పనులను తెలియచేస్తున్నది.

 చేయవలసిన పనులులలో "నాట్కాలే నీరాడి"-అనగా బ్రహ్మీ ముహూర్తసమయముననే స్నానము చేయాలి.జలకము-కీర్తనము అతి ప్రధాన నియమములు.తెల్లవారక ముందే ఎందుకు అను సందేహము మనకు కలుగుతుంది.తెల్లవారుతూనే మనలోని సంసార బంధములు చుట్టుముట్టి సంసార సాగరములో మునకలు వేయిస్తాయి కనుక నల్లనయ్య మేనిచాయను పోలిన నల్లని సమయములో నల్లనయ్య గుణగానములను పవిత్రజలములో స్నానముచేస్తే తక్కిన విషయవాసనలు తామే దూరము జరుగుతాయి.

  రెండవ నియమము అర్హులైన వారికి "అయ్యయున్-పిచ్చయున్-ఆందనయున్" ఆచార్యులకు-పేదలకు-భాగవతులకు భిక్షస్వరూపముగా దానముల స్వరూపముగా పరమాత్మునిగా భావించి చేయవలెను.




  మూడవ చేయవలసిన పని స్వామి గుణగాన కీర్తనమును అనన్య శరణాగతితో కీర్తించవలెను.

  పరమాత్మ దివ్యవిభూతులను పదిమందితో కలిసి పంచుకొనవలెను.


   గోదా తెలిపిన చేయకూడని పనులు.జిహ్వ వ్యామోహము లేకుండుట.వారు గోపికలు.గో సంపద వారి మూలధనము.వారికి పరమాత్మ ఇచ్చిన సంపదను స్వామి కైంకర్యమునకు వినియోగించవలెనుప్రతిరోజు మిక్కిలి ఇష్టముగా తిను వానిని తినవద్దు.. పాలు-నెయ్యి తినక పవిత్ర నైవేద్యమును చేయుదుము.ధనవ్యామోహమును విడిచిపెట్టుదాము.

   దేహవ్యామోహమును కూడ వదిలివేద్దాము.కన్నులకు కాటుక-కొప్పులో పూవులను అలంకరించుకోవద్దు.బాహ్యసౌందర్యమును పట్టించుకోవద్దు.

   ధన వ్యామోహమును-దేహ వ్యామోహమును విడిచిపెట్టుటయే కాదు.

" శెయ్యాదన శెయ్యోం తీక్కురళై చ్చెందోదోం"



మనసును నియంత్రిస్తూ మాధవుని సేవించు ఈ పవిత్ర దినములలో కోరి వెళ్ళి కొండెములను చెప్పొద్దు.వినవద్దు.ఇంద్రియములను నియంత్రిద్దాము.

 పాలకడలికి వెళ్ళి శేషశయనముపై పవళించి యున్న స్వామిని కీర్తిద్దాము.కాదు కాదు స్వామి పాదపద్మములను కీర్తిస్తూ,పరమానందముతో స్వామిని పిలిచి,కాత్యాయినీ వ్రతమును చేసుకుందామని ఆండాళ్ తల్లి గోపికలను సిధ్ధపరచినది.

  ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)

 




  

Wednesday, November 27, 2019

margaLimaala01


    మార్గళి మాలై-01
   ****************


  మొదటి పాశురం.
  ***************

 మార్గళిత్తింగళ్ మది నిరైంద నన్నాళాల్
 నీరాడ ప్పోదువీర్! పోదుమినో నేరిళైయీర్
  శీర్మల్లుం ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్కాళ్
 కూర్వేల్ కొడున్ తొళిలన్ నందగోపన్ కుమరన్
 ఏరారంద కణ్ణి యశోదై ఇళం సింగం
 కార్మేని చ్చెంగణ్ కదిర్ మరియంపోల్ ముగత్తాన్
 నారాయణనే నమక్కే పరైదరువాన్
 పారోర్ పుగళప్పడిందు ఏలోరెంబావాయ్.

 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతొ

 *************************

  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
  శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.

  గోకులమున కురవసాగె మార్గళి పున్నమి వెన్నెల
  వేలాయుధుడై నందుడు  జాగరూకుడుగా ఉన్నాడు


   కాలము-సంకల్పము కలిసివచ్చిన వేళ "పర"కై
  నవవిధ భక్తిరూపములను నగలన్నింటిని ధరించి

  యమునలో జలకములాడగ  నందకిశోరుని పిలిచి
  తరలి వచ్చినది తల్లికరుణతో  తానొక గోపికయై,

  పాశురములములు పాడుకొనుచు పాశములన్నిటిని విడిచి
 " నప్పిన్నాయ్ తిరుప్పావై" వ్రతమాచరింప రారో! ఓ గోపికలారా!



 కోదై (పూలమాలిక) తల్లి నిర్హేతుక కృపాకటాక్ష ఆవిష్కరణమే "తిరుప్పావై" అను,సర్వస్య శరణాగతితో స్వామి సారూప్య-సామీప్య-సాయుజ్యములను వరమును(పర) అందించు ద్రవిడవేదము.దీనజనోధ్ధరణమునకై తల్లి తనను ఒక గోపికగా భావించుకొని,తోటి గోపికలను కలుపుకొని,భావనలో రేపల్లెగా భావించి,శ్రీవ్రతమును చేయించి,ఆ రంగనాథుని లోక కళ్యాణమునకై పరిణయమాడినది.

  గోపికలను తలకడిగితే మొలకడుగరు-మొలకడిగితే తలకడుగరు అని మన అజ్ఞానము తీర్మానిస్తే,వారి శృత పాండిత్యము దేహమును మొలతో,ఆత్మను తలగా భావించి,ఆత్మార్పణ సమయమున బాహ్యపు విచక్షణ అవసరమా మనని ప్రశ్నిస్తున్నట్లుగా అనిపిస్తుంది.వారి వినయశీలత వారి అర్హతను సందేహపరుస్తుంటే,తల్లి ,వారికి కాలౌచిత్యమును "నన్నానాళ్" అని ప్రస్తావించి మార్గళితింగళ్,తాము వ్రతముచేయుటకు స్వామి అనుగ్రహముగా-వారి అర్హతగా చెప్పినది.ఉత్తరాయణ పుణ్యకాలమునకుమార్గళి బ్రహ్మీ ముహూర్తమని,అంతే కాకుండా మనసు నిండా చంద్రుడు పూర్ణకళలతో వెన్నెలలు కురిపిస్తున్న సమయమని చెప్పింది.తల్లి ఆచార్యుల అనుగ్రహమును పూర్ణచంద్రకళలతో కురియుచున్న వెన్నెలగా కీర్తించినది.

 వ్రతము చేయుటకు దృఢనై సంకల్పమను (పోదువీర్) తప్ప కులము గోత్రము విద్య సంపద మొదలగునవు అర్హతలు కావు.వ్రతముచేస్తే ఫలితము ఉంటుందో-ఉండదో అన్న అనుమానము వద్దు.కన్ననికి ఏ ప్రమాదము రానీయకుండా వాడియై వేలాయుధమును ధరించి,నందుడు తిరుగు తుంటాడు అనగానే ఎక్కడ గోపికలకు కృష్ణ సౌర్యముపై నమ్మకము తగ్గుతుందేమో నని,కన్నడు కొదమ సింగమువంటివాడు.

 కృష్ణభావనలో లీనమైన తల్లి నారాయణనే అని సంబోధిస్తుంది.స్వామి పేరు చెప్పిన కంసుడు ఏమిచేస్తాడోనన్న భయముతో నట.ఎంతటి మధురభావన.

    నిశితముగా అమ్మదయ మనలను పరిశీలింపచేస్తే ఇక్కడ గోపికలు ధరించిన ఆభరణములు నవవిధభక్తి సంకేతములు.వారు తడుస్తున్న వెన్నెల జ్ఞానగుణ అనుగ్రహము.స్వామి గుణగణ నామసంకీర్తనములో స్వామి తమతో ఉన్నట్లుగా భావిస్తుండుట యమునలో మార్గళి స్నానము చేయుట.స్వామి కుసుమకోమల సుందరుడు.అంతే కాదు అసమ శూరుడు.శ్రీకృష్ణునితో ఆడిపాడుచున్న నందవ్రజము (శెల్వచ్చిరు       ) మిక్కిలి భాగ్యశాలురు..మనము అంధకారబంధురమైన ఆయ్పాడిలో(గోకులములో)నున్నవారము.స్వామి ధరించినట్లుగానే మనము ఒక ఆయుధమును ఈ చీకట్లను తొలగించుకొనుటకు ధరించుదాము.అది ఏమిటంటే ఈ పవిత్ర మార్గశీర్షమాసమున స్వామిని స్నాన-సంకీర్తన సౌగంధిక పుష్పమాల సమర్పణమును చేయు శ్రీవ్రతమను చేయు" దృఢ సంకల్పము".దానిని విడిచిపెట్టవద్దు.అంతేకాదు మన ఆభరణములు అలౌకికమైనవి.అత్యత ఆలంబననందించు నవవిధభక్తులు.వాటిని ధరించి మనము యమున స్నానమునకు వెళ్ళుచున్నప్పుడు,చంద్రుడ్రు జ్ఞానధారలను ( ఆచార్యుల అనుగ్రహ ధారలు)
కురిపిస్తున్నాడు.వాటిని ఆస్వాదిస్తు,ఆనందిద్దాము.జ్ఞాన సాగర
ములోనికి మనము దిగగలమా అను సందేహము వద్దు.ఆ గోదా తానే రేవు మెట్లగా మారి,మనలను చేయి పట్టుకొని,జ్ఞానసాగరములోనికి దింపుతుంది.తిరిగి మెల్లగ ఒడ్డునకు చేరుస్తుంది.శాంతి-క్షమ-సత్యము-ధర్మము అను పరిమళ పూలమాలలను అల్లటము నేర్పిస్తుంది.,పాశురములను పఠిస్తూ,పెరుమాళ్ళకుమాలలను సమర్పింప చేస్తుంది.

 అనంతకళ్యాణ గుణ శోభితుడైన రంగనాథుడు,(నమక్కే) భాగవతోత్తములను అనుగ్రహించువాడు.(పారోర్ పహళ్) శరణాగత రక్షకుడు.అంతేకాదు (పరై తరువాన్) పరమార్థమైన పరమును (వాయిద్యము కాదు-మోక్షము) అందించువాడు.కనుక ఓ గోపికలారా!తమోగుణమును వీడి తరలిరండి ఆ రంగనాథుని సేవకు అని తల్లి వారిని తనతో తోడ్కొని పోవుచున్నది.

( ఆండాళ్ దివ్య తిరువడిగళై శరణం.)

Friday, November 22, 2019

30

  నః ప్రయచ్చంతి సౌఖ్యం-30

  **********************

 భగవంతునిది హిమగిరి-భగవదంశది మహిమగిరి.



  " బ్రహ్మాండ వ్యాప్తదేహ భసితహిమరుచా భాసమానా భుజంగైః

    కంఠేకాలాః కప్ర్దా కలిత శశికలాశ్చండ కోదంద హస్తాః

    త్రక్య్షా  రుద్రాక్షమాలా స లలిత వపుషః శాంభవా "మూర్తిభేదాః

    రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవా " నః ప్రయచ్చంతి సౌఖ్యం."



 " ఓం కైలాసవాసినే నమః."





   " కేళీనాం సమూహం కైలం-కైలస్య ఆవాసం కైలాసం."



    సర్వాంతర్యామి  యైన స్వామి నివాసము చర్మచక్షువులకు హిమగిరి పర్వతశ్రేణులలోని కైలాసగిరి.ఇది స్వామి విభూతిమహిమ.కొంచము నిశితంగా పరిశీలిస్తే కైలాసము అను స్వామి నివాసమును ఇసుమంతయును దుఃఖ స్పర్శలేని పరమానందధామము.సృష్టి-స్థితి-సమ్హార-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్యములను పరమప్రీతితో పరమేశుడు ఎక్కడుండి తాను చేయునో అదియే కైలాసము.పార్వతీ-పరమేశ్వరుల పవిత్ర దర్శన ప్రసారమే అదే ప్రసాదమే కైలాసము.



 " నమో గిరిశాయచ-శిపివిష్టాయచ."



  భక్తరక్షణకై కైలాస పర్వతమున ఉమామహేశ్వరునిగా స్థిరముగానున్నరుద్రునకు నమస్కారము.గిరులనగా వాక్కులు అను మరొక అర్థమునకు అన్వయించుకొనినచే వాక్స్వరూపుడు వేదమయుడుగా రుద్రుని కీర్తించవచ్చును.



  " నమః స్లోక్యాయచ-అవసాన్యాయచ".

 వైదికమంత్రములు-వేదాంతము రెండును తానైన రుద్రునకు నమస్కారములు.





 " నమో హ్రదయ్యాయచ-నివేష్యాయచ."

 నివేషయముమంచునీరు.రుద్రా నీ లీలా విభూతిని నేనేమని వర్ణించగలను? సముద్ర మట్టానికి 21,778అడుగుల ఎత్తున టిబెట్ భూభాగములో నున్న హిమాలయ పర్వతశ్రేణులలో కైలసగిరి కన్నులపండుగ చేయుచున్నది.కైలాస పర్వతము నలువైపులా నాలుగు రూపాలతో,నాలుగు రంగులలో ఉంటుందట.ఒక వైపు సింహము,మరొల వైపు హయగ్రీవము,ఇంకొక వైపు ఏనుగు,మరొకవైపు నెమలి ఈశ్వర స్వరూపమునకు ప్రతీకలుగా ప్రసిధ్ధిపొందాయి.భౌగోళికులు కైలాసమును మధ్యస్థానముగాను, యోగశాస్త్రములో కైలాసగిరిని సహస్రార చక్రముగా పేర్కొంటారు. విష్ణు పురాన ప్రకారము కైలాస పర్వత నాలుగు ముఖములు  స్పటిక,హిరణ్య,కెంపు,నీలి వర్ణాలతో శివతత్త్వమును ప్రతిపాదిస్తు-ప్రకాశిస్తుంటుంది.కైలాస పర్వత మూలమున నున్నబ్రహ్మపుత్ర,సుట్లెజ్,సింధు మొదలగు నదులు నాలుగు వైపులా ప్రవహిస్తూ సస్యశ్యామలంగా సందర్శనమిస్తాయి.



  " ఓం నాద్యాయచ-వైశంపాయచ" నదులయందును,చిన్న సరస్సుల యందును ప్రకాశించుచున్న రుద్రునకు నమస్కారములు.



   ప్రపంచములో ఎవరు అధిరోహించని పర్వతము కైలాసగిరి.సాలగ్రామ మయమైన సదాశివుని నివాసమును అధిస్ఠించుట అపచారముగా హిందుమత విశ్వాసకులు భావిస్తారు.కొందరు ప్రయత్నించినప్పటికిని కృతకృత్యులు కాలేదు.



 " నమః కాట్యాచ-గహ్వరేష్ఠాయచ."



   ప్రవేశింపరాని పర్వతగుహలందున్న రుద్రునకు నమస్కారములు.



 జగమంతానిబిడీకృతమై యున్నది శివచైతన్యము.కైలాసగిరిని తండ్రిగాను,మానస సరోవరమును తల్లిగాను భావిస్తారు.కైలాస పర్వత పాదపీఠములోని మానస సరోవరము మహాద్భుతము.బ్రహ్మముహూర్తములో పరమేశ్వరుడు జ్యోతిరూపుడై దర్శనమిస్తాడని  నమ్ముతారు.బ్రహ్మ మానసమునుండి దీనిని సృజించినాడని నమ్ముతారు.ఎందరో ఋషులు,యోగులు ఇక్కడ స్నానముచేసి పునీతులవుతుంటారు.ఇక్కడిది దేవస్నానము.మనోబుధ్ధులను మలినరహితముచేయు మహేశ్వర కృపాకటాక్షములను మందాకిని స్నానము.



 " నమః కాట్యాయచ-నీప్యాయచ"



 కొద్దిపాటి నీరు ప్రవహించు చిన్నచిన్న కాలువలయందును,కొండల శిఖరములపై (కైలాసగిరుల) నుండి జారు మానస సరోవరమందున్న రుద్రునకు నమస్కారాము.హరహర మహాదేవ శంభోశంకర.



  ఇక భగదంశ-భగవంతుడున్న కొండ తమిళనాడు రాష్ట్రములోని తిరువన్నామలై నగర సమీపములో 2500 అడుగులేత్తులో అరుణవర్ణముతో ప్రకాశిస్తూ అరుణగిరిగా,శోనగిరిగా ప్రసిధ్ధిచెందిన అరుణాచలము.బ్రహ్మ విష్ణువులకు తనతత్త్వమునుతెలియచేసిన అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబ సహితుడై అలరారుచున్న ఆనందధామము.



  " దర్శనాత్ అబ్రసదసి

    జననాత్ కమలాలయే

    స్మరణాత్ అరుణాచలే

    కాశ్యాంత్ మరణాన్ ముక్తి"

 అని స్వయముగా పరమేశ్వరునిచే పలుకబడిన స్వయం ప్రకాశక లక్షణముకలది.



   "గిరిశ ప్రణిత కామ వర్షిన్" అని ఆర్యోక్తి.



 ఆద్యంత రహిత తేజోపుంజాలను సామాన్య చక్షువులు స్వీకరించలేవని పరమదయాళువైన పరమేశ్వరుడు కరుణాంతరంగుడై తేజోమయలింగమై విరాజిల్లుతున్నాడు.



 శివుడు మొట్టమొదట వ్యక్తముచేసిన రూపము జ్యోతిర్స్తంభము.ఈ సంఘటనలో బ్రహ్మవిష్ణులు సృష్టి-స్థితులకు పరిమితమయ్యారు.లయమగునది అనంత తత్త్వము.దానిని తెలియచేయునదే అరుణాచలము.అరునము అనగా వెలుగు అమ్మతత్త్వము.అచలము స్థాణువగు స్వమి తత్త్వము.అగ్నిస్తంభము స్వామి క్లుప్తమై అరుణగిరిగా దర్శనమిస్తుంది.ఇప్పటికిని అనుగ్రహపాత్రులకు గిరిమధ్యస్థానములో గోచరిస్తుందట.అరుణాచలము కృతయుగమున జ్యోతి రూపమునను,త్రేతాయుగమున పసిడి రూపముగను,ద్వాపర యుగమున రాగి రూపముగను,కలి యుగమున శిలారూపమునను వ్యక్తీకరింపబడుతోంది.



  అరుణాచలము రాశీభూతమైన జ్ఞానాగ్ని.ఇచ్చట అగ్నిలింగముగా ఆరాధింపబడుచున్న స్వామి,సామాన్యభక్తులను అనుగ్రహించుటకై,తన అగ్నికీలలను శిలలలో నిక్షిప్తముచేసి,స్థూల రూపముతో విరాజిల్లుచున్నాడు.



 " నమః అనిర్హతేభ్యః."

 సర్వపాపములను సంపూర్ణముగా పరిహరింపచేయువాడు సదాశివుడు.



 అరుణాచలము మూడు యోజనములవరకు గిరితేజస్సును అనుగ్రహిస్తుంటుంది.కనుక ఇక్కడ ఏ దీక్షానియమములు వర్తించవు.గౌతమముని పూజా విధానములను శివుని ఆనగా నిర్దేశించినాడని పెద్దలు చెబుతారు.కాలభైరవుడు క్షేత్రపాలకుడు.

ఇప్పచెట్టు స్థలవృక్షము.



 " వృక్షేభ్యో హరికేశేభ్యో నమో నమః".



  అరుణాచల గుహలో పరమశివుడు దక్షిణామూర్తి తత్త్వముతో తపోముద్రలో నున్నాడని భక్తుల విశ్వ్వాసము.కాని అక్కడికి ప్రవేశము నిషేధము.ఎంతో మంది ప్రయత్నించి విఫలురైనారట.



 " ఆసీనేభ్యో-శయానేభ్యశ్చవ నమో నమః."



  అరుణాచల ప్రవేశము పొందినవారెంత అనుగ్రహపాత్రులో.గిరిప్రదక్షిణము ఎంతో మంగళప్రదము.



 " నమ ఆశవేయచ-అజరాయచ."



  సర్వ ప్రపంచమును శీఘ్రముగా వ్యాపించినవాడును,గమనమున సమర్థుడగు రుద్రునకు నమస్కారము.



  శివమహిమ్నా స్తోత్రములో పుష్పదంతులవారు సెలవిచ్చినట్లు సరస్వతీదేవి సముద్రమును సిరాచేసికొని,పర్వతమును కలముచేసుకొని,భూమిని పత్రముగా మార్చుకొని శివమహిమలను సంపూర్నముగా వ్రాయుట అసాధ్యము.శివస్వరూపులు నా అజ్ఞానమును మన్నించెదరు గాక.



 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచశివ అరుణశివ."

 భగవాన్ శ్రీరమణుల పాదపద్మములకు నమస్కారములతో.



 కొండకు ప్రదక్షిణము శివునికి ప్రదక్షిణము.ప్రతి దిక్కు-ప్రతి మూల పరమేశ్వరానుగ్రహ పాత్రములు.రమణులవారు నన్ను మన్నించి ఆశీర్వదించెదరు గాక.మనో-వాక్కాయ-కర్మలు వారి స్మరణతో నిండి నన్ను అనుగ్రహించుగాక.ఇక్కడ భక్తులకు స్వామి ఎందరెందరినో ఎన్నోవిధములుగా సాక్షాత్కరించి సహాయపడిరి.కావ్యకంఠ గణపతి ముని భక్తిని లోకవిదితము చేయుటకై స్వామి తన రథమును ఆపి,గణపతిముని కరస్పర్శచే కదిలించెను. తన భక్తుల మనోరథములను నెరవేర్చు,



 " రథేభ్యో రథపతిభ్యశ్చవో నమో నమః."



 అరుణాచలేశుని దయతో చచ్చుబడ్ద భక్తుని కాళ్ళు చేవను సంపాదించుకొన్నవి.

 భక్తురాలు దివ్య సంగీతము వినగలిగినది.

 జట్కావాడి క్రూరత్వము నుండి వనిత రక్షింపబడినది.

 కొండల మధ్యలో బూట్లు చిరిగిన భక్తుని అశక్తతను తొలగించగ బూట్లు ఒకతనిచే కుట్టబడినవి.



 ఇలా ఎన్నో ఎన్నో ఎన్నో నక్షత్రములను లెక్కబెట్టగలమా? అరుణాచలేశుని మహిమలను గుర్తించగలమా?



  ఇచ్చటి భక్తులకు సాక్షాతు లక్ష్మీదేవియే వైద్యము చేస్తుందట. ఆహా ఎంతటి అదృష్టము



 అద్భుత అనుగ్రహములకు ఆలవాలమైన అరుణాచలేశుడు మనలను అనుగ్రహించు గాక.



   ఏక బిల్వం శివార్పణం.



  సర్వం పరమేశ్వరార్పణం. ఓం తత్ సత్.



















3

MARGABANDHUVU

  నః ప్రయచ్చంతి సౌఖ్యం-29

 ***********************

 భగవంతుడు-భగవదంశ ఇద్దరును మార్గబంధువులే
*******************************************



 " నమః సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమః."



  లేత పచ్చిగడ్డివలె ఎరుపు-పసుపు వర్ణముల కలబోతతో ప్రకాశించు,మార్గములకు అధిపతి యైన రుద్రునకు నమస్కారములు.



 జీవుల కర్మాచరణ ఫలితముగా వారిని,పునరావృత్తి సహిత,పునరావృత్తి రహిత,విదేహ ముక్తి మార్గములలోనడిపించ కరుణించు రుద్రస్వామికి నమస్కారములు.కొందరితో కఠినముగా ,మరి కొందరితో కరుణాసంద్రముగా కనికరిస్తూ వారి పాపకర్మలను భరింపచేస్తు,హరింపచేస్తు భవబంధవిముక్తులను చేయు శుభంకర! నమస్కారములు.
 ఆదిశంకరులే మనలను  ఆధ్యాత్మికామార్గమున నడిపించదలచి,అమూల్యమైన వరప్రసాదముగా శంకరునిగా,
  శంకరాచార్యులు 8వ శతాబ్దములో కాలడిలో,ఆర్యాంబ-శివగురువులకు శివాంశగా వైశాఖశుధ్ధ పంచమి,ఆరుద్రా నక్షత్ర సమయమున జన్మించారు.ప్రపంచలో రెండు అను తత్త్వము లేదని ,అంతా ఒకటే  అను అద్వైత సిధ్ధాంతమును ప్రతిపాదించినారు.



  " నమః సోభ్యాయచ-ప్రతిసర్యాయచ."



" న ద్వైతం సమస్తం ఏకం" అని భావించు భగవదంశ పుణ్య-పాప మిళితమైన మర్త్యలోకమున సామాన్య మానవునిగా ,మార్గబంధువుగా జన్మించుటకు కారణము వైదిక ధర్మ పునరుధ్ధరణమే.



 " నమో కపర్దినేచ-వ్యుప్త కేశాయచ." జటాధారి-ముండనకేశుడు రెండును తానైన రుద్రునకు నమస్కారములు.



  తల్లి అనుమతితో సన్యాసమును స్వీకరించి,గోవిందపాదుల వారిని గురువుగా భావించి,సేవించి,వారి అనుగ్రహమును పొందగలిగి ప్రసిద్ధ స్తోత్రములను జనబాహుళ్యమునకు చేరువచేయుచు,దివ్యతేజోమయుడై ప్రకాశించుచు,అనుచరులను అనుగ్రహించుచున్నారు ఆదిశంకరులు.ఏమి మన భాగ్యము.సర్వేశ్వరా సదా స్మరామి-మనసా భజామి.




 పూర్ణా నదిని మాతృపాదముల వద్దకు రప్పించగలిన మహానుభావుడు తత్త్వవిచారణలో అసంపూర్ణుడుగా అజ్ఞానియై ఆదిదేవుని అవమానించుటయా? అద్వైత సాంగత్యమును విడనాడుటయా? పరమేశ్వర తత్త్వమును ప్రత్యక్షముచేయు పవిత్ర సంకల్పము తప్ప వేరే పరమార్థము లేదు. పరమేశా! పాహి_పాహి.
 అమ్మ తన బిడ్డడు గురువై తనను సరిచేయు ఆనందమును అనుభవించుటకై ముద్దుగా ముద్దుగా ముద్దగా మాటలాడి పరవశించునో,అదేవిధముగా సాక్షాత్తు ఆ దేవదేవుడు తన దేహభ్రాంతిని చూపెడుతూ,ఆడే ఆటలుగాక ఇంకేమిటి?




 ఒకరోజు ఆదిశంకరులు గంగానదికి స్నానమునకై తమ శిష్యులతో నడచుచున్నారు.అదనుచూసుకొన్నాడు ఆ ఆదిదేవుడు.



 " నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవో నమః."

 మహిమాన్వితుడైనప్పటికిని మాదిగవానివలె ప్రకటింపబడ తలిచాడు.అదియును నాలుగు కుక్కలతో,మరియును సన్నటి దారిలో,తగులకుండ జరుగలేనంత విధముగా,

నమశ్శ్వభ్యః శ్శ్వపతిబ్యశ్చవో నమః.


,

  ఎంత మోసగాడివయ్యా శివా-నువ్వెంత వేషగాడివయ్యా శివా!

  సద్బ్రాహ్మణత్వమునకు సంకటస్థితిని  ఏర్పరచినాడు.  ఆ ఏలినవాడు.

    శివలీలలు-చిద్విలాసములు చింతింపవే ఓ మనసా!.



 " నమః స్రుత్యాయచ-పథ్యాయచ."

 సన్నని కాలిబాటలయందును-విశాలమైన మార్గములందును తిరుగాడు స్వామి నమస్సులు.



   " శ్రుతాయచ-శ్రుతసేనాయచ" వేదాంతమైన వాడు వేదములనువిడిచి ఉండగలడా?



   వేదమును తెలియచేయుటకు వచ్చిన వేదాంతుడు అదియే మాదిగవాడు మార్గమునకు ఆటంకముగా మారెను.మార్గబంధువా మహాదేవ నమోనమః.



 





 అంతా మిథ్య అన్నవిషయమును ఆకళింపుచేసుకోలేని భజగోవిందకర్త వాని బాహ్య రూపమును చూచి దారికి అడ్డుతొలగమనెను.తానా సనాతన సంప్రదాయములను గౌరవించు సద్బ్రాహ్మణుడు.తారసపడినవాడా తమస్సుతో నిండిన చండాలుడు పంచముడు.వానిని తాకక ముందునకు పోవు మార్గములేదు వాడు దారి ఇచ్చుటకు పక్కకు జరిగిన తన దారిన తాను వెళ్ళవచ్చుననుకొన్నాడు తొలగవలసినది తనలో అజ్ఞానమని  తలువని తాపసి.




  " నమః స్వపథ్యో జాగ్రద్భ్యశ్చవో నమో నమః."



   నిదురించునపుడు మెలకువతో నుండువాడు.మెలకువతో శరీరమున్నప్పుడు వివేకము నిదిరింపచేయుచు  తిరిగి   మేల్కొలుపు మహాదేవుడు,శంకరునిచే చండాలునిని గచ్ఛదూరం గచ్ఛదూరం అంటు,  మార్గము మధ్యనుండి తొలగి,తనకు దారినిమ్మనెను.



 ఆ మాటలను విన్నపంచభూతేశ్వరుడైన  పంచముడు ఏ మాత్రము జంకకుండా తనను తొలగమన్న అజ్ఞానముతో,




 అయ్యా,

అయ్యా,సురాపాత్రలోను-సురగంగా పాత్రలోను ప్రతిబింబించే సూర్య బింబము ఒక్కటే అని పెద్దలు చెబుతుంటే విన్నాను (చూడగలిగినవారికి)




     అద్వైత సిధ్ధాంతకర్తా! ఆదిశంకరా! నాకొక చిన్న సందేహము.అదిపోయిందంటే దారికి అడ్డము తొలగుతాను.సెలవీయండి స్వామి అని ,

 జీవము నీవే కదా-బ్రోచే భారము నీదే కదా అని భగవంతుని స్తుతించుచు,


   మన ఇద్దరి శరీరములు పంచభూతాత్మకములు.జీవాత్మ-పరమాత్మ సంయోగములు.



      మన ఇద్దరి శరీరములలో    ఈశ్వరచైతన్యమే నిండియుండగా మీరు నన్ను తాకిన ఏవిధముగా మైలపడెదరు? శారీరకముగానా? మానసికముగానా? ఆధ్యాత్మికముగానా? సెలవీయగలరు  స్వామి అని, వినయముగా  వేడుకున్నాడు ఆచార్యునికి ఆచార్యుడై."గురుః బ్రహ్మ-గురుః విష్ణుః -గురుః దేవ మహేశ్వర"

 " నమః కూప్యాయచ-అవట్యాయచ."

 నూతులయందు,పల్లము స్థలములందు ప్రకాశించుచున్న రుద్రా! నా అజ్ఞానము అను లోతుబావి నుండి నన్ను పైకిలాగి,సరైనమార్గమును చూపించిన వాడు పండితుడైనను పంచముడైనను శివతత్త్వమును తెలియపరచినవాడే మనీషి. మహోన్నతమైన మనీషాపంచకము మానవాళికి అందచేసిన సమయమిది.



   " బ్రహ్మైవాహమిదం సకలం చిన్మాత్ర విస్తారితం

     సర్వం చైతదవిద్యయు త్రిగుణాయాసేషం మయా

     ఇత్థం యస్య దృఢామతిః సుఖతరే నిత్యేపరే నిర్మలే


     చాండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ.

    యద్యత్ కర్మ కరోమి సర్వమఖిలం శంభో తవారాధనం.






      అద్వైత సిద్ధాంతమును అవగతము చేసికొనిన,శ్రీ అప్పయ్య  దీక్షితులు విరించిపట్టణం వేలుపైన పరమేశుని,సదాశివుని  మార్గ బంధువుగా గుర్తించి,ప్రయాణ సమయమున   కీర్తించినది. ఈ స్తోత్రము.వివిధ శరీరములలో ఈ జీవి ప్రయాణములు అనంతములు.వాటిని సన్మార్గమున నడిపించమని వేడుకొనుటయే ఈ స్తోత్ర ప్రాశస్త్యము.



 దక్షునిచే శాపగ్రస్థుడై,కడలిని దాగినచంద్రుని శాపవిముక్తునిచేయుటయే కాక,తన సిగపూవుగా అలరారుటకు కారణుడైన పరమేశుని భజించు.



  క్షీరసాగర మథనమున హాలాహలమును త్రాగువేళ,సహాయకారులై ,తామును విషమును గ్రహించి,స్వామికి ఆభరణములై ప్రకాశించుటకు మార్గమును చూపిన నాగాభరణునికి నమస్కరించుచున్నాను.



   మార్గ ముడులను విడిపించి,సన్మార్గమును చేర్చు త్రినేత్రుని భజించు అదృష్టమును స్వామి అనుగ్రహించును గాక.



 భవానీ సమేతం- భజే మార్గ బంధుం

*********************************************



  శంభో శివా ప్రాపు నీవు

  దయా సింధో నా దారి చూపు



  శంభో మహాదేవ దేవా

  శివా శంభో మహదేవేశ శంభో

 ...........



  తరిమింది జాబిలిని శాపం

  తలదాచుకొమ్మంది కరుణా సముద్రం

  సిగపూవునే  చేసింది   మార్గం

  భవానీ సమేతం -భజే మార్గబంధుం..భజే మార్గబంధుం



  ............



  తాగినది విషజ్వాల సర్పం

  వెన్నంటి నడిచింది  హరుడే  సమస్తం

  ఆభరణమునే  చేసింది మార్గం

  భవానీ సమేతం-భజే మార్గబంధుం  భజే మార్గ బంధుం.



  ........



   తొలగినది భవబంధ పాశం

   కరుణించె నను కోటి సూర్యప్రకాశం

   మమేకమే  చేసినది మార్గం

   భవానీ సమేతం -భజే మార్గబంధుం  భజే మార్గ బంధుం.


 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.



   ( ఏక బిల్వం శివార్పణం)



      ( ఏక బిల్వం శివార్పణం.)

ADIYOGI.



  నః ప్రయచ్చంతి సౌఖ్యం-27

  *************************

  " సహస్ర సహస్రాది సంవత్సర పూర్వం
    నరజ్ఞాన ఉధ్ధరణాయ సమర్పితం
    ఆదియోగి నాద్యం సప్తర్షిభ్యో బోధితం
    అతి శ్రేష్ఠం ఇదం విశాలం విజ్ఞానం

    ఆదియోగి ప్రణమామ్యహం
 ఆదియోగి నమస్తుభ్యం ప్రసీద యోగేశ్వర.





  భగవంతుడు ఆదియోగి-భక్తుడు ఋషభ యును యోగియే.





 " యోగేశ్వరాయ మహాదేవాయ-త్రయంబకాయ త్రిపురాంతకాయ

   త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ

   సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.'

 "యుజ్" అనగా కలయిక.యుజనే సన్స్కృత ధాతువు నుండి యోగ/యోగము అను పదము ఏర్పడినది.యోగమనగా మన ఇంద్రియములను వశపరచుకుని,చిత్తమును ఈశ్వరుని యందు లయము చేయు ప్రక్రియ.జీవాత్మ పరమాత్మను తెలిసికొనుట.అభేదమును గుర్తించ గలుగుట ఈశ్వరానుగ్రహమను యోగము.

   జ్ఞాన సృంగ వృషభారూఢా ప్రచండం విశ్వేశ్వరం
   జటాజూటం భస్మాంగం ఆదియోగినం ప్రణమామ్యహం.

   మానవమేథస్సు నిద్రాణమై యున్న సమయమున జనులు ఒక వింత విషయమును గురించి ముచ్చటించుకొనసాగిరి.హిమాలయములను జ్ఞాన శిఖరములందు విబూదిరేఖలతో,జటలతో ఎద్దునెక్కి ఒక యోగి తిరుగుచున్నాడని నీవు ఎవరికి సంబంధించిన వాడవని ప్రశ్నించిన
 వారికి ,అతడు మందహాసముతో తనకు తానే పుట్టానని చెప్పుకుంటున్నాడని గుసగుసలు మొదలైనాయి.
  " ఓం నమో ప్రథమాయచ-మధ్యమాయచ"


 హిమాలయములందు సంచరించు యోగి దేవుడని కొందరు,,తనకు తానే సృజించుకొని సంచరించువాడని కొందరు,కొందరు సామాన్య మానవుడని తమ అభిప్రాయములను వెలిబుచ్చసాగారు.

 "పృథ్వీతేజోదకం వాయు వశీకృతం ఆకాశచ
  మహాభూతేశ్వరం దేవం ఆదియోగినం ప్రణమామ్యహం.

   ఎన్నో జన్మల పుణ్యఫలితముగా నిత్యానిత్య వస్తు విచక్షణ,స్థూల-సూక్ష్మ తత్త్వ వివరణ,జీవాత్మ-పరమాత్మ విచారమునము ఆసక్తికల ఎందరో మునులు-యోగులు-ౠషులు ఆ వ్యక్తి సంచార విచారమును తెలిసికొనగోరి,ఆ పవిత్ర పరమేశ్వరానుగ్రహ పాత్రత నందించు ప్రదేశమును నిష్కళంక మనస్కులై,నిరంతరము జపిస్తూ,దర్శనముకై వేచిచూస్తున్నారట.

     నిర్గుణం త్రిగుణ పరం రుద్రహర సదాశివం
     బంధపాశహరం దేవం ఆదియోగినం ప్రణమామ్యహం.

  బంధపాశము కొందరిని బంధించినది.వేచియుండలేక వెనుతిరిగి వెళ్ళిపోయారు.సప్తర్షులను మాత్రము బంధవిముక్తులను చేసినది.స్వామిని దర్శించుకోగలిగారు.ప్రస్తుతించారు.

 తమ మనసులలోని అంధకారమును తొలగించమని పరంజ్యోతిని ప్రాధేయపడ్డారు.వారి నిష్కల్మష ప్రార్థనను నిటలాక్షుడు అంగీకరించి,ఒక్కొకరికి ఒక్కొక్క ప్రత్యేక యోగ నైపుణ్యమును ఉపదేశించి,అనుగ్రహించాడట.Yఓగినాం పతయే నమః.


   దక్షిణాభిముఖస్థితం యోగవిజ్ఞాన మోక్షదం
   సప్తర్షిభిర్వందితం ఆదియోగినం ప్రణమామ్యహం.

     " నమః శంభవేచ-మయోభవేచ"



 ఇహపరములను ప్రసాదించు రుద్రునకు నమస్కారములు.



  హిమాలయ పర్వతముపై నందినాథుడను యోగి తన ఎనిమిది మంది శిష్యులను ధర్మ సంస్థాపనకై పంపించెనన్న వాదమును కలదు.



  '" నమో పూర్వజాయచ-పరజాయచ"





   పరమార్థమును బోధించిన పరమేశ్వరుడు తన అంశలతో భూలోకమున ఎందరో యోగులను ప్రసాదించినాడు.వారి దర్శనము స్మరణము సర్వపాపహరమనుటకు ఋషభయోగి మందరుడు-పింగళను పునీతులను చేసిన విధము పరమేశ్వర సంకల్పము.




    ' ప్రపంచముతో బంధము మోహము-పరమాత్మతో బంధము మోక్షము."



   అవంతీపురములోని మందారుడు సకలశాస్త్రపారంగతుడు.పింగళ అను వేశ్యాలోలుడు.ఒకరోజు వారి ఇంటికి అతిథిగా ఋషభముని వెడలెను. ఋషభయోగి స్కాంధపురాణములోని బ్రహ్మోత్తరఖండమునందు ప్రస్తావింపబడినాడు.

  నమః శివాయచ -శివతరాయచ"

 మిక్కిలి శుభములనందించు మూడు కన్నులవాని సంకల్పమన,మందర-పింగళ గృహమునకు అతిథిగా ఋషభయోగిని పంపాడు.


 " కైలాసగిరి ఉండి కాశికై-కాశికా పురి నుండి-ఈ దాసులకై-దయచేసినావయ హర హర-శివ శివ" అనుచు ఆప్యాయముగా ఆహ్వానించి,షోడశోపచారములను-స్తోత్రములతో జరిపించి,
అతిథిగా వచ్చిన యోగిని పరమ శివునిగా భావించి,అత్యంత భక్తిశ్రధ్ధలతో ఆరాధించి,ఆశీర్వాదనుగ్రహమును పొందకలిగినారు.శివప్రసాదమన మందరుడు
  పుణ్యఫలమునందుకొనుటకై, దశార్ణమహారాజునకు వజ్రబాహు నామముతో జన్మించెను.కథలో మలుపులు తిప్పి కాగల పనినిచేయుటయే కరుణాంతరంగుని లీల.వజ్రబాహు జననము ఇష్టములేని మిగిలినరాణులు సుమతిపై విషప్రయోగమునుచేసిరి.గరళకంఠుని ఘనత చాటగ, విషము వారిని తీవ్ర అనారోగ్యవంతులను చేసినది.దశార్నమహారాజు వారిని అరణ్యములో వదిలివేయమని ఆజ్ఞాపించెను.



  " నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమః."



    అరణ్యములలో దాగి వేచియుండి వారి పాపములను దోచుకొనవలెననుకొన్నాడు ఆ దొంగలకు దొంగ.నమస్కారములు.తస్కరాణాం పతయే నమః.స్వామి
" నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమః." ధనిక వైశ్యునిగా వారి వారిని తన దగ్గరకు తెచ్చుకున్నాడు.ఘోరము-అఘోరము రెండును తానైన స్వామి వారి పూర్వపాప క్షయమునకు కొడుకును కాలముచే కబళించచేసినాడు.కన్నతల్లి కన్నీరు మున్నీరుగా మారినది.దీనముతో దిక్కుతోచక నున్న సుమతిని సమీపించాడు ఋషభముని.
" ఆరాత్తే గోఘ్నా స్వామి నీ ఘోరరూపమును మాకు దూరముగానుంచుదవుగాక అని పరిపరివిధముల యోగిని ప్రార్థించినది పరమసాధ్విసుమతి.మృత్యుంజయుడైన స్వామి ఋషభయోగి బాలుని మృత్యుంజయుడిని చేసెను.



  " నమోబృహతేచ-వర్షీయతేచ".

 అకారముచే గొప్పవాడును గుణ
 సుసంపన్నుడును అయిన రుద్రుడు బాలునికి "శ్రీ శివకవచ స్తోత్రమును" ఉపదేశించి,ఆయుధములనొసగి ఆశీర్వదించి,లోక రక్షణకు సాగిపోయెను.



"అస్య శ్రీ శివకవచ స్తోత్రమహామంత్రస్య ఋషభయోగీశ్వర ఋషిః |

అనుష్టుప్ ఛందః |

శ్రీసాంబసదాశివో దేవతా |

ఓం బీజమ్ |

నమః శక్తిః |

శివాయేతి కీలకమ్ |

మమ సాంబసదాశివప్రీత్యర్థే జపే వినియోగః ||"



 అంబేశివమయముగా,భస్మీలంకృతుడైన భద్రాయువు  మగధరాజునకు బందీయైన తన తండ్రిని బంధవిముక్తుని చేసి,తాను భవబంధ విముక్తుడై భవుని ఆరాధనలో తరించెను.



   యోగిరూపుడైన త్రిలోచనుడు భద్రాయువును రక్షించినట్లు మనలనందరిని రక్షించునుగాక.



 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.



   ( ఏక బిల్వం శివార్పణం)



   ( ఏక బిల్వం శివార్పణం.)






























Thursday, November 21, 2019

basava

సకలదేవతా శివస్తుతి నః ప్రయచ్చంతి సౌఖ్యం.
 ***********************
 భగవంతుడు శరణాగత రక్షకుడు-భక్తుడు శరణుఘోషల ప్రియుడు.

 " నమో రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమః."

  ఎక్కుపెట్టబడిన వింటిచే భక్తుల శత్రువులను దుష్టులను సంహరించు,శరణాగత స్వామియైన రుద్రునకు నమస్కారములు.

  ఎందరో నర,కిన్నెర,యక్ష,గంధర్వ,సురాధిపులు మహేశుని శరణు కోరి,మాయామోహిత విముక్తులై,మాననీయులైనారు.శివుని మహిమలనువర్ణించుటకు వేయితలల ఆదిశేషునకే వశము కాలేదు,పిపీలకము వంటి నేనెంత?

నిర్హేతుక కృపయే నీ నిస్తుల నామవైభవముగా మారుచున్నవేళ,సదాశివుడు మనకొక అద్భుత లీలను వివరిస్తున్నాడు.

  క్షీరసాగర మథనములో చీకటి వెలుగుల చిద్విలాసముగా పసందైన వస్తువులు ప్రభవించిన తరువాత ప్రళయాగ్ని తానుగా ప్రభవించినహాలాహలము సకలదేవతలను కిం కర్తవ్యం? అను సందిగ్ధములో పడవేసినది.ఆర్త్రత్రాణ పరాయణుని ఆరాధనను చేయించినది.అద్భుతముకదా ఆ విభూతి పూతలవాని చేతలు.

  ****************

1. దేవదేవ త్రినేత్రాయ - శరణు శరణు మహేశ్వర
   జటామకుట కపర్ది - శరణు శరణు మహేశ్వర

2.భూత భేతాళ నాథాయ - శరణు శరణు మహేశ్వర
  రక్త పింగళ నేత్రాయ - శరణు శరణు మహేశ్వర

3.భైరవ ఊర్థ్వకేశాయ  - శరణు శరణు మహేశ్వర
  అగ్ని నేత్ర చంద్రమౌళి- శరణు శరణు మహేశ్వర.

4.బ్రహ్మ కపాల మాలాయ - శరణు శరణు మహేశ్వర
  బ్రహ్మాండ కాలాతీతాయ - శరణు శరణు మహేశ్వర

5.కరిగర్భ నివాసాయ -    శరణు శరణు మహేశ్వర
  కరి మస్తక పూజ్యాయ - శరణు శరణు మహేశ్వర

6.ప్రచండదందహస్తాయ - శరణు శరణు మహేశ్వర
  ప్రపంచ పూర్ణ వ్యాప్తాయ - శరణు శరణు మహేశ్వర.

7.లీఅచూపు త్రిశూలాయలాయ - శరణు శరణు మహేశ్వర
  లీలా మానుష దేహాయ - శరణు శరణు మహేశ్వర

8.అష్టమూర్తి  యజ్ఞమూర్తి - శరణు శరణు మహేశ్వర
  దక్షయజ్ఞ వినాశాయ - శరణు శరణు మహేశ్వర

9.వేద వేదాంగ వక్త్రాయ  - శరణు శరణు మహేశ్వర
  వేద వేదాంత వేద్యాయ - శరణు శరణు మహేశ్వర

10.సకలసన్మంగళ విగ్రహాయ-  శరణు శరణు మహేశ్వర
   సకల దేవతాస్తుతాయ  - శరణు శరణు మహేశ్వర


     ఇది మహా పురాణాంతర్గత సకల దేవతా స్తుతి సకలాభీష్ట ప్రదం. సర్వమంగళ కరం. సదా శివ కృపాకటాక్ష కరం.


  తెల్లని కంఠముగల రుద్రునకు నమస్కారము.శరణాగత రక్షణార్థము,జగదోద్ధరణమునకై కాలకూట విషమును కంఠమునందు నిలుపుకొనిన నల్లని కంఠము గలరుద్రునకు నమస్కారము.

 " నమో నీలగ్రీవాయచ-శితికంఠాయచ."

భక్తుని విషయమునకొస్తే,

  శరణము శరణము శివా-శరణార్థిని శివా అని,

 అనిశము ఆ శివుని స్మరించి ధర్మమునకు గ్లాని సంభవించుచున్న సమయమున,నందివాహనుని ఆనగా , అనుగ్రహమును తోడ్కొనివచ్చిన ధన్యుడు బసవేశ్వరుడు.

  " నమో అపగల్భాయచ" మాతృగర్భమున శిశువుగా నున్న నందీశ్వరునకు నమస్కారములు


    కర్ణాటకములో హింగుళేశ్వరము అను పట్టణమున మండెగ మాదిరాజు అను గొప్ప పండితుడుండెను.మాదమాంబ అతని ధర్మపత్ని.ఈశ్వర సంకల్పముగా  నందినోము నోచుకొని,వరప్రభావముతో పండంటి బిడ్దకు జన్మనిచ్చింది.తల్లిగర్భములో బసవన్న మూడు సంవత్సరములున్నాడని పెద్దల అభిప్రాయము.కప్పడి సంగమేశ్వర ఆలయ సమీపమున నున్నఒకయోగి బాలుని దీవించి,బసవన్న అను పేరుపెట్టెను." సహస్రాక్షాయాచ"అనంత దర్శన శక్తి గల స్వామి బాలునకు అఖండ ఆశీర్వచనములనొసగి,లింగార్చన చేసిన ప్రసాదమును,బాలునకు ఆహారముగానిమ్మని,అన్యము వద్దని చెప్పి,అంతర్ధానమయ్యెను.

  " నమో బభ్లుశాయచ" వృషభవాహనమైన స్వామి కృపాకటాక్షములతో బసవడు బహుముఖప్రజ్ఞలతో దినదిన ప్రవర్థమానమగుచున్నాడు.

  శరణు శరణు శివా-శరణార్థిని నేను శివా.

 ఆ రోజులలో కులవ్యవస్థ కుమార్గమున పయనించుచు,కుత్సిత పధ్ధతులను అవలంభించసాగినది.మంచి-చెడు అని రెండు పద్ధతులుండవలసిన చోట అగ్రవర్నములు-అథమ వర్ణములను అను పధ్ధతి ఏర్పడినది.తత్ఫలితముగా కొందరి అజ్ఞానముచే చాలామంది అంటరానివారుగా పరిగణింపబడుతు,అన్యాయముగా శిక్షలను పొందుచున్నారు.ఆ విధముగా జరుగుచున్న దురాచారములలో ఉపనయనసంస్కారము,సద్వినియోగము అగుటలేదని,బ్రహ్మణాధిపత్యమును బలపరచుచున్నదని,దానిని వ్యతిరేకించినాడు బసవడు.

 " కులాలేభ్యో కర్మారేభ్యో నమోనమః." కుమ్మరి,కమ్మరి,జాలరి,బోయవాడు మున్నగువారి రూపములలోని రుద్రచైతన్యమునకు నమస్కారములు.

 శరణుశరణు శరణు శివా- శరణార్థిని నేను శివా.

 చుక్కలు బ్రహ్మము-సూర్యుడు బ్రహ్మము
 వాక్యము బ్రహ్మము-వార్థక్యము బ్రహ్మము

 బ్రహ్మము వేరు-భక్తివేరు అని తన తండ్రికి బోధించెను. మరియును,

 తండ్రీ నేను జన్మతః శివమంత్రోపదేశిని." ఓం నమః శివాయ." భస్మము-రుద్రాక్షలు నాయొక్క వేషము.సద్యోజాత-తత్పురుష-అహోర-ఈశానాది పంచముఖలింగ సేవనమే నా స్వభావము అని వివరించి,

  లింగము సంకేతముగా,శుభరూపము శివునిగా
  సృజనాత్మక తత్త్వముతో నిశ్చయముగ శుభములొసగు
  పశ్చిమాభిముఖుడు,పరమ కరుణాంత రంగుడు
  సద్యోజాత నామ శివుడు సకల  శుభములొసగు గాక.

 లింగము సంకేతముగా,గుణరహిత మూర్తిగా
 మేథ-జ్ఞాన తత్త్వములతో సకల విద్యలనొసగు
 "దక్షిణాభిముఖుడు" దక్షరాజు అల్లుడు
 అఘోరనామ శివుడు అఘములు తొలగించుగాక.

 లింగము సంకేతముగా,మాయను కప్పువాడుగా
 తిరోధాన తత్త్వముతో,పరిపాలన సాగిస్తూ
 తూరుపు ముఖాభిముఖుడు,మార్పులేవి లేనివాడు
 తత్పురుష నామ శివుడు పురుషార్థములిచ్చుగాక.

 లింగము సంకేతముగా,పంచకృత్యములైనాడుగా
 అనుగ్రహ తత్త్వముతో భువనైక సంపదలొసగు
 ఊర్థ్వముఖాభిముకుడు పరమార్థమైనవాడు
 "ఈశాన " నామ శివుడు ఈప్సితార్థమిచ్చుగాక.

లింగము సంకేతముగా,పంచకృత్యములైనాడుగా
 అనుగ్రహ తత్త్వముతో భువనైక సంపదలొసగు
 ఊర్థ్వముఖాభిముకుడు పరమార్థమైనవాడు
 "ఈశాన " నామ శివుడు ఈప్సితార్థమిచ్చుగాక.

"శివ దర్శనం న చింత నాశనం
పాద దర్శనం న పాప నాశనం
జంగమ దేవర స్మరణం జన్మ సార్థకం."
(ఏక బిల్వం శివార్పణం) అని వివరించుచున్న బసవని విషయ పరిజ్ఞానమునకు ముచ్చటపడి,మేనమామ తనకుమార్తెయైన గంగమాంబికనిచ్చి,కళ్యాణము గావించెను.

  గౌరీ కళ్యాణ వైభోగమే-బసవ కళ్యాణ సౌభాగ్యమే.

  బసవడు విభూతి-రుద్రాక్షమాల ధారియై కప్పడి సంగమేశ్వర దర్శనార్థము వెళ్ళుచుండగా ,తనను సమీపించిన వారికి శివతత్త్వమును బోధించసాగెను.ఒక్కడే రుద్రుడు.అన్యములేరెవరు అనుచు,శరణుకోరి వచ్చినవారిని రక్షించుటయే శివ సేవ యని,భక్తిని చాటుకొను విధము,భక్తుల బాగోగులను గమనించుటయే యని వివరించెను.శివునకు-శివ భక్తునకు భేదములేదని వివరించెను.ఎదుటపడినవారిలోని శివుని చూచుచు,శరణుశరణు శరణు శివా-శరణార్థిని నేను శివా అని శరణుఘోషలు చేయసాగెను బసవడు అత్యంత భక్తిశ్రద్ధలతో.

  శరణాగత రక్షకుడైన శంకరుడు బసవనికి మంత్రిత్వ బాధ్యతలను అప్పగించి,దేశపరిస్థితులను బాగుచేయదలిచాడు.బాధ్యతగా స్వీకరించాడు బసవడు." మంత్రిణాం పతయే నమః."


   మంత్రాంగ కర్తవ్య నిర్వహణను కడు నైపుణ్యముతో నిర్వహించుచున్నప్పటికిని,క్షణకాలమైనను శివసేవా కర్తవ్యమును విడనాడలేదు
     .శివభక్తులు వచ్చుచున్నదారులలో కస్తురి పరిమళములను జల్లించుట,జంగమదేవరలను జయజయ ధ్వానములజయధ్వానములఆహ్వానించి,పూజించి,ఆతిథ్యమునిచ్చి,సంతుష్టులను చేయుట,సదా శరణుఘోషను మార్మ్రోగించుట మరువలేదు. ముచ్చట పడిన మూడు కన్నులవాడు బసవని భక్తిని లోకవిదితముచేయాలనుకున్నాడు.

    " విశ్వతః పాణిపాదాబ్జం విశ్వతోక్షి శిరోవ్ముఖం
      జ్వలంతం విశ్వమావృత్య తేజోరాశిం శివం స్మరేత్."

   జాజ్వల్యమానమైన జంగమదేవుడై బసవని దగ్గరికి ఆతిథ్యమునకై వచ్చాడు.ఆనంద మానసముతో బసవడు,


  "ఎనగింత కిరియరిల్ల
   శివభక్తరి గింత హిరియ రిల్ల
   నిమ్మ పాదసాక్షి ఎన్న మనసాక్షి
   కూడల సంగమదేవ ఎంగదే దిబ్య."


   నాకన్న అల్పులు లేరు.శివభక్తులను మించి శ్రేష్ఠులు లేరు.నీ పాద సాక్షి.నా మనసు సాక్షి.కూదల సంగమదేవ నాకిదే దివ్యం." అని స్తుతిస్తూ,పూజిస్తూ,బంగరు గిన్నెలో అన్నము కలిపి స్వామి నోరుతెరిచి ప్రీతితో తింటుంటే,భక్తితో అందించసాగెను.చూసినవారు-భావించిన వారు ధన్యులు.అంధసస్పతికి అన్నమును కలిపి ముద్దలు చేసి ఆరగింపుచేయు బసవడు భాగ్యవంతుడు.


  అక్కడే ప్రారంభమైనది అసలుకథ.భృత్యాచార సంపన్నుడైన బసవని కృతకృత్యుని గావించిన నృత్యప్రియుని మనోహర లీల.అన్నమును మాయముచేసి,ఆహారమునకై నోరుతెరిచి,అన్నముపెట్టమను,అన్నపూర్ణేశ్వరుని హేల.అర్థాకలితో అతిథిని పంపరాదు.అన్నపదార్థములు అదృశ్యమైనవి..అయిననేమి? ఎంతమాత్రమును చింతించక,అన్న పాత్రలో ముడుచుకొని ఆహారముగా తానే పడుకున్నాడు బసవడు అర్పిత భావముతో.స్వామిముద్దకోసము నోరుతెరువగానే అప్రయత్నముగా నోటిలోనికి దూకాలని.ఎంతటి ధన్యతనొందినావురా నందీశ్వర.నమో నమః

  ధూర్జటిగారు కాళహస్తీశ్వర మహాత్మ్యలో పవి పుష్పంబగు అన్నరు.శివానుగ్రహము రాయిని వజ్రమును పువ్వుగా చేస్తుందట అనుభవించి  వ్రాసినది.

  బసవ అని భక్తితో అంటే చాలు గండ్రగొడ్డలి సౌగంధికమవుతుంది.
  బసవ అంటే చాలు అసమలోచనుడు ఆదుకుంటాడు.అదే జరిగినది.

  అపరదయాళువైన ఆ నందివాహనుడు నిజస్వరూపముతో ఎదుట నిలిచి చేయబోవు సంస్కరణలకు చేయూత తానౌతానని దీవించి,అదృశ్యుడైనాడు ఆ ఆనందలోలుడు.

 అదే కృపతో శరణార్థులను శరణుఘోష ప్రియులను ఆశీర్వదించును గాక.

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

 (ఏక బిల్వం శివార్పణం.)



Wednesday, November 20, 2019

falasritu.

  నః ప్రయచ్చంతి సౌఖ్యం-ఫలశృతి-శివోహం.
  ************************************

 " గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్ర
   త్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగా నోపునే
   దహనున్ కప్పగ జాలునే శలభ సంతానంబు నీ సేవచే
   సి,హతక్లేశులు కారుగాక జనములు శ్రీకాళహస్తీశ్వరా!

  అని పలికిన మహాకవి ధూర్జటి వాకు శివ శాసనము.


  ఎల్లవేళలా సర్వజీవులకు శివమును-శుభమును కలిగించే స్వభావము కలవాడు శివుడు.జ్యోతిర్మయ శివలింగము ఏకము-అనేకము రెండును తానై విశ్వములోని విశ్వేశ్వరత్వమును మనకు ద్యోతకమగునట్లు చేయుచున్నది.ఈశ్వరేతరము సృష్టిలో లేదను విషయమును తెలిసికొనుటయే ఈశ్వరానుగ్రహము.


  "అడుగడుగున గుడి ఉంది-అందరిలో గుడి ఉంది
   ఆ గుడిలో దీపముంది-అదియే దైవం."

   ఎంత అర్థవంతమైన పాట.

 " విశ్వేభ్యో-విశ్వపతిభ్య్శ్చవో నమో నమః."

  శివానుగ్రహమును తెలిసికొనుటకు ప్రయత్నించే ముందు మనము శివశబ్దము యొక్క గొప్పతనమును అర్థముచేసికొనుటకు ప్రయత్నిద్దాము .

 నమో శ్రుతాయచ-శ్రుత సారాయచ."

 శివ శబ్దముచేత శివ పంచాక్షరి,శివ పంచాక్షరి చేత రుద్రాధ్యాయము,రుద్రాధ్యాయము చేత,తైత్తరీయోపనిషత్తు,తైత్తరీయోపనిషత్తు చేత యజుర్వేదము శివనామ ప్రభావమునకు ఋజువుగా నిలిచినవి.
 నమః శివాయచ-శివతరాయచ.


 శ్రీమత్ శంకర విరచిత శివానంద లహరి,

 " స్తుతి శ్రుతం గర్తసదమ్యువానాం మృగన్న భీమ ముపహత్నుముగ్రం
   మృద్డా జరితే రుద్ర స్తవానో అన్యంతే అస్మన్ నివపస్తు సేనాః"

   అని కీర్తించుచున్నది.స్వామి రూపమును-స్వభావమును క్రోడీకరించినది.స్వామి లాలిత్యము రూపములోను,కాఠిన్యము స్వభావములోను వివరించుచున్నది.

  రూపమును స్వామి క్షీణలక్షణము కల (జరితే) నా శరీరములో కాలమును జయించి,యువకుని వలె,పరుగులు తీయు నా మనసనే లేడిని పట్టుకొని కూర్చున్నాడు.ఇంక నాకే కావలయును.అంతే కాదు,

 మిక్కిలి లోతైన గుహ వంటి నా హృదయములోం,లోపలికి ప్రవేశించుటకు ప్రయత్నించుచున్న నక్కలు-తోడేళ్ళు వంటి కర్మలపై,ఎగిరిదూకి,పట్టి కొట్టడానికి సిధ్ధముగా నున్నపూర్తి సంసిధ్ధతతో నుండగా ఇంక మనకేల విచారము.

 నమః ఉగ్రాయచ-భీమాయచా.

  మనలను మన అరిషడ్వర్గములను మనసులోనికి రానీయక వేటాడుచు,

 నమః ప్రతరాణయచ-ఉత్తరణాయచ" మన సంసారజలధిని నావయై దాటించి,మనలను తరింపచేయును గాక.

 ముక్కంటి కరుణను ముచ్చటించవలెనన్న ఒకటా రెండా-మూడా?లెక్కలేనన్ని.వాటిని శ్వస్వరూపులు స్వానుభముతో సదాశివసేవలో సందర్శించెదరు గాక.

  నా చిన్ని ప్రయత్నము లోపభూయిష్టమే అయినప్పటికిని,శివానుగ్రహమను పవిత్ర జలముచే ప్రోక్షణ చేయబడినది కావున సకల శుభముల నొసగు గాక.మనలను సన్మార్గమున నడుపు గాక.ప్రతి దానిలో పరమేశ్వరుని ప్రత్యక్షము చేయుగాక.

 మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః
 బాంధవా శ్శివభక్తాశ్చ స్వదేహో భువనత్రయం.

   సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.-స్వస్తి.

 గమనిక-శివ స్వరూపులైన వివిధ గుంపుల నిర్వాహకులు తమ గుంపులోనికి ప్రచురించుటకు అనుమతించినందులకు సర్వదా వారికి కృతజ్ఞురాలను.

  వీక్షకులైన శివస్వరూపులుతమ అభిప్రాయములను తెలియచేసినందులకు, నన్ను ప్రోత్సహించినందులకు నమోవాకములు.

 ఇప్పటికి విరామము తీసుకుంటూ,మీ సోదరి,నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...