Thursday, June 29, 2017

సౌందర్య లహరి-02


     సౌందర్య లహరి-02

    పరమ పావనమైన నీ పాదరజకణము
    పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

    అనంత కాలతత్త్వమే  కాళికా మాతగా
    అడ్దంకులు తొలగించు  బగళాముఖి తీరుగా

    అణువణువు నిక్షిప్తత ఛిన్నమస్త రేణుకగా
    క్రియాశక్తి రూపము  భువనేశ్వరి  పార్వతిగా

    చండాలక కన్యయైన శివరాణి  మాతంగిగా
    తార-ధూమవతి-షోడశి-తారణ విద్యా-అవిద్యా రూపాలుగా

    త్రిపుర సుందరి-భైరవి తత్త్వ ప్రకాశములుగా
   
 దశ మహా విద్యలు నా దిశా నిర్దేశము చేయుచున్న వేళ

    నీ మ్రోలనే  నున్న నా కేలు విడనాడకమ్మా,నా
    మానస విహారి! ఓ సౌందర్య లహరి.  

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...