సౌందర్య లహరి-10


   సౌందర్య లహరి-10

  పరమ పావనమైన  నీ పాదరజకణము
  పతిత పలకమైన  పరమాత్మ స్వరూపము

  గురుభక్తిని చాటలేని  గుణహీనపు చంద్రుడు
  గణపతిని గేలిచేసి  శాపమొందిన చంద్రుడు

  చవితిని అపనిందలని  పేరుమోసిన చంద్రుడు
  గ్రహణమున పౌర్ణమైన కానరాని చంద్రుడు

  మనసుతో పోల్చబడు చంచలపు  చంద్రుడు
  వంకరలు అన్ని తొలగి అష్టమి కళలతో

  అమ్మ సిగను అతిశయముగ అలరారు చంద్రుడు
  పరిపరి విధములుగా  పూజలందుకునుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.