nela nela telugu vennela-telugu Association of North america Get link Facebook X Pinterest Email Other Apps - June 29, 2017 https://www.youtube.com/watch?v=in5SNAEnFgA Get link Facebook X Pinterest Email Other Apps Comments
AMBA VANDANAM-JAGADAMBA VANDABAM - August 15, 2019 వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాపనాశిని పావని పార్వతి వందనం. గులాబీలు గుబాళించు గుల్భములకు వందనం గణపూజిత గుణాతిశయ గౌరి వందనం. ముద్దు గణపయ్య కూర్చున్న ఊరువులకు వందనం ఎద్దునెక్కు శివునిరాణి గిరిజ వందనం. అఘరహిత తల్లి శుభ జఘనమునకు వందనం గిరితనయ విరిపూజిత దుర్గ వందనం. విదుషీమణి అలంకృత మణిమేఖలకు వందనం అఖిలాండపోషిణి ఆదిశక్తి అన్నపూర్ణ వందనం. భక్తానుగ్రహ హృదయారవిందమునకు వందనం శక్తిపీఠనిలయ శ్రీశైల భ్రమరాంబిక వందనం. సకలశాస్త్ర ధర శుభకర కంకణములకు వందనం పరిపాలిని శుభకారిణి గాయత్రి వందనం. త్రయంబక రాణి భవాని కంబుకంఠమునకు వందనం సృష్టి స్థితి లయ రూపిణి త్రిపుర సుందరి వందనం బుధ స్తుతుల విరాజిల్లు చుబుకమునకు వందనం లక్షణ రూపిణి సన్నుత కొళాపురి మహాలక్ష్మి వందనం బీజాక్షర పూరిత ఓ... Read more
DASAMAHAVIDYA-MATANGI - July 19, 2019 శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ వాణీం చతుర్బాహునీమ్ గీతం వాచక నాద నృత్య నిధి సంఘీభావ సంపూజనీమ్ మాతంగీమ్ హరితాం సుశోభి సుమతీమ్ మంత్రిత్వ సంచాలకీమ్! భావము: ఆశ్రయము (ఊతం) ఇచ్చి భద్రంగా చూసే విష్ణురూప (సుభద్ర) రుద్రకామినీ ఉచ్చిష్ట చండాలిని గా పేరుపొందావు. ఎరుపు వస్త్రములతో ఆభరణములతో కాంతివంతముగా కప్పుకున్న (సంపుటి) నాలుగు బాహువులు గల సరస్వతీ. నృత్య నాట్య సంగీత వాచకములకు నిధివి, ఐకమత్య బోధకురాలివి కడుపూజనీయురాలివి. ఓ మాతంగీ! ఆకుపచ్చ రంగులో శోభిల్లు బుద్ధిమంతురాలివి, ఆ లలితా మాతకు ప్రధాన మంత్రి గా సంచాలకము చేస్తున్నావు. నమస్కారములు! శ్రీ మాత్రే నమః ******************** " మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళా వతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్ప బాణ హస... Read more
KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS. - July 14, 2022 1. సుందరి సుమంగళి నిరంతరి దురంధరి జ్యోతిస్వరూపమే నీవు శుక్రవారమునాటి నీదివ్యదర్శనము కిల్బిషము కడతేర్చునమ్మా నీ పాద చింతనమే భవతాపహరణము భావనామాత్ర సంతుష్టవు జగమంత నీ మాయలో మునిగిన తరుణాన నేనేమని కీర్తించగలను నీ సొంత సంతతిని వేగమే రక్షించు బిరుదు నీకున్నదమ్మా శివ శివ మహేశ్వరి పరమనిలయేశ్వరిశిరోన్మణి మనోన్మణియు నీవే శాంకరి శుభంకరి యశోధరి పరాత్పరి అనాధరక్షకియు నీవే అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. **** 2. ముత్తైదువ మెట్టెలు పావనపాదముల ప్రకాశముల దండగొలుసు చీల మండలమున పచ్చ వైఢూర్యముల మువ్వల సవ్వడులును ముత్య ముక్కుపుడక రత్తన పతకములు హారములు కడుసుందరం గరళకంఠుని సతిగ మంగళముగ అలరారు తాళి ఘనము శరణన్న వినిపించు చెవులకు కమ్మలు కరుణకరముల కంకణములు జగములన్నింటికి వెలుగుతానైనది జనని నీ వదన మిహిర. అత్తి వరదుని చెల్లి శక్తి శివ రూపిణివి అథముడిని వర్ణింపగా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే *********** 3.నిన్ను నెరనమ్మి నీ పాదాలపై వాలి శరణుశరణన్నగాని తగదమ్మ నామీద కనికరమునే మరువ,తాత్సారమది యేలనో కఠినాత్మురాలవను విషయము తెలియక మనసార నమ్మినానే క్షిప్రప్రసాదినిగ దాసుని రక్షింప జాగు... Read more
Comments
Post a Comment